
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం
పర్లాకిమిడి: తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను విషంతాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రెండో వార్డు పరలా వీధిలో నివాసముంటున్న శుభాషిస్ పాణిగ్రాహి బుధవారం ఉదయం ఏదో కారణం వలన తన కు మార్తె ప్రియదర్శినీ పాణిగ్రాహి (11), కుమారుడు బిజయానంద పాణిగ్రాహి (7)లకు విషం ఇచ్చాడు. అనంతరం తానుకూడా విషం సేవించాడు. వీరు మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో పో లీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా ఇంటిలో విషంతాగి అచేతనంగా నురగలు కక్కుతూ ముగ్గురూ పడి ఉండడం గమనించి స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించా రు. ప్రస్తుతం కుమారుడు బిజయనందన్ పాణిగ్రా హి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అ యితే తండ్రి శుభాషిస్, కూతురు ప్రియదర్శినీ ఆరో గ్యం విషమించడంతో బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. ఇంతకుముందు శుభాషిస్ భార్య కుటుంబ కలహాల వలన మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం