breaking news
Social Media
-
'కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే'
మంగళూరు: ఫ్రిడ్జ్, ఏసీ, ఆపిల్ ఐఫోన్, ల్యాప్‌టాప్, కారు, బైక్, వాషింగ్ మెషీన్, ఫర్నీచర్.. ఇలా నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులను ఈకాలంలో చాలా మంది ఈఎంఐ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. వాటి ఈఎంఐ గడువు తీరేలోపే వాటికి రిపేర్లు రావడమో, పాడవడమో, ఎవరో కొట్టేయడమో జరిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఆ బాధ పడొద్దనే ఉద్దేశంతో ఓ కారు యజమాని వినూత్న రీతిలో ఆలోచించారు.రోడ్లపై సర్రున దూసుకుపోయే వాహనదారుల్లో ఎవరైనా తన కారును ఢీకొడితే రిపేర్ల ఖర్చుల కోసం జేబుకు చిల్లు పడటం ఖాయమని భావించాడు. అనుకున్నదే తడవుగా కారుకు వెనకాల కొత్త తరహాలో బంపర్ స్టిక్కర్‌గా వినూత్న క్యాప్షన్ రాసి వెనకాల వచ్చే వాహనదారులందర్నీ ఆలోచనల్లో పడేశాడు. ‘‘నా కారును పొరపాటున ఢీకొట్టకండి. అసలే ఇది ఈఎంఐలో కొన్నా. అదింకా పూర్తవలేదు’’ అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ రాశారు.ఇది చూసి ‘కారు కష్టాలు’ అని కొందరు సానుభూతి వ్యక్తపరిస్తే మరికొందరేమో అతని సృజనాత్మకతను మెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తమ దారిలో వెళ్లిపోతున్నారు. ఇతనిలో ఎంతో హాస్యచతురత ఉందని లోలోపల పొగుడుతూనే మరోవైపు అతని నిజాయతీకి, విజ్ఞాపనకు ఫిదా అయిపోతున్నారు.కర్ణాటకలోని మంగళూరులో సర్క్యూట్ హౌస్ రోడ్డులో వెళ్తున్న ఒక తెలుపురంగు మారుతి సుజుకీ ఆల్టో కారుకు (Alto Car) సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే ఏకంగా 5.4 కోట్ల మంది ఈ వీడియోను ఆన్లైన్లో చూడడం విశేషం. 33.41 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. వేలాది మంది తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.ఎంత కష్టపడి కొనుకున్నాడో..‘‘కారు యజమాని తాను చెప్పదల్చుకున్న విషయాన్ని అత్యంత వైవిధ్యభరింతగా చెప్పారు’ అని ఒక నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఈఎంఐ (EMI) అనేది సగటు భారతీయుని జీవితంలో ఒక భాగమైపోయిందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఎంత కష్టపడి కొనుకున్నాడో. అందుకే కారంటే అతనికి అంత ప్రేమ’’ అని మరొకరు పోస్ట్ చేశారు.చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్‌కు 5 కోట్లు!అతిగొప్ప నినాదం ఇదే..‘‘ఈఎంఐ మంజూరుచేసిన బ్యాంక్‌కు ఇతను అసలు సిసలు నిఖార్సయిన కస్టమర్’ అని మరో నెటిజన్ (Netizen) వ్యాఖ్యానించారు. ‘‘గుంతల రోడ్డుపై వాయుకాలుష్యంలో కొట్టుకుపోతున్న నాకు ఎదురుగా ఈ క్యాప్షన్ ఎండాకాలంలో చల్లటి మజ్జిగలా హాయినిచ్చింది’’ అని ఇంకొకరు పోస్ట్‌చేశారు. ‘‘ఎన్నో బాధ్యతలున్న సగటు జీవి కారు ఇది’’, ‘‘కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే’’, ‘‘మోదం, ఖేదం కలబోత ఈ క్యాప్షన్’’ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు పోస్ట్లుపెట్టారు. View this post on Instagram A post shared by @bearys_in_dubai -
నువ్వా నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్
నటుడు శివాజీ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించాడు. హీరోయిన్ల దుస్తులు, ఆడవాళ్లు, అందం, చీర సాంప్రదాయం అంటూ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మహిళల వేషధారణపై తీవ్ర అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడాడు. మాటల్లో చెప్పలేనంతగా నోటి కొచ్చినట్టు రెచ్చిపోయాడు. దీనిపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళను ఒక మనిషిగా చూడలేని శివాజీ, వారి శరీరాలను ‘సామాను’గా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ,ఇతర సినీ సెలబ్రిటీలపై అభిమానం పేరుతో కొంతమంది ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటనపై పరోక్షంగా స్పందిస్తూ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై నటుడు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఒక ఈవెంట్‌కు వచ్చిన నటీమణులపై సభ్యత మరచి సంస్కార హీనంగా ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పాల్సిందిపోయి సెలబ్రిటీల వేషధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్దూరంగా నిలిచింది. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందటతినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న చందంగా అంటూ శివాజీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. పురుషాధిక్య భావజాలం, ఫ్యూడల్ మనస్తత్వంతో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. అరకొరా సినిమాలతో అల్లాడుతున్న శివాజీ బిగ్‌బాస్ సీజన్-7తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడనీ, అలా అనుకోకుండా అందివచ్చిన ఫేమ్‌తో వాపును చూసి బలుపు అని విర్రవీగుతున్నాడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా బూతుల పురాణంతో రెచ్చిపోయిన వైనాన్ని, హోస్ట్ నాగార్జున (Nagarjuna) గడ్డి పెట్టిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. బహిరంగ వేదికల మీద మహిళలపై హద్దూ పద్దు లేకుండా నోటికి ఎంత వస్తే మాట్లాడటం, పైగా ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటూ తెగింపు ప్రదర్శిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.గొంగట్లో తింటూసినిమాలో ఎక్స్పోజింగ్ చేయలేదా, వెర్రిమొర్రి డ్యాన్స్‌లు చేయలేదా, సినిమాలు లేక వాడి వీడి కాళ్లు పట్టుకుని నాలుగు అవకాశాలు రాగానే ఇలా నీతి సూక్తులు చెప్తున్నాడని మరి కొంతమంది మండి పడు తున్నారు. అసలు సంప్రదాయాల్ని, మహిళల గౌరవాన్ని మంటగలింపిందే సినిమాలు కదా అని గుర్తు చేస్తున్నారు. ఏమి అందంగా కనిపించారని అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై, వృద్ధ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, బహిరంగ వేదికలపై ఇలాంటి చెత్తను, మగ దురహంకారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భవిష్యత్తరాలకు ఏం సందేశమిస్తున్నావంటూ నిలదీస్తున్నారు. నీతి సూత్రాలు నీకు తగవు బాసూఅంతేకాదు ఎంతోమంది మహిళా నటులను వేధించిందీ, అవకాశాల కోసం వారిని లైంగికంగా వేధించిన నీ చరిత్ర మర్చిపోయావా దొరా? ఇపుడు నీతి సూక్తులు వల్లిస్తున్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మహిళలు వస్త్రాధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీపై ఇప్పటికే గాయని చిన్మయి, నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. -
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు!
కార్లూన్లతో పాపులర్ అయిన పిల్లల కామెడీషో నికెలోడియన్ లో నటించిన అలనాటి నటుడు ఇపుడు దీనమైన స్థితిలో కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో 36 ఏళ్ల టైలర్ చేజ్ కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్లు కనిపించడం అభిమానులలో, సహనటులలో ఆందోళన రేకెత్తించింది. తమకెంతో సుపరిచితమైన బాల నటుడిని ఇలా హృదయ విదారకమైన రీతిలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూడటం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బాల నటులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, మత్తుమందులు, మానసిక ఆరోగ్యం సవాళ్లపై చర్చకు దారి తీసింది. 2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్. లాస్ ఏంజిల్స్‌లోని రివర్‌సైడ్‌లో సెప్టెంబర్‌లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన లాస్ ఏంజిల్స్ రైడర్స్ పోలో షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ,మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం, అభిమానులు దిగ్భ్రాంతికి గురిచేసింది. అపుడు వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్‌కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్‌మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.మరోవైపు చేజ్ పరిస్థితి గురించి అతని మాజీ సహనటులు డెవాన్ వెర్క్హైజర్, లిండ్సే షా . డేనియల్ కర్టిస్ లీ కూడా నెడ్స్ డిక్లాసిఫైడ్ పాడ్‌కాస్ట్ సర్వైవల్ గైడ్ ఎపిసోడ్ సందర్భంగా బహిరంగంగా చర్చించారు. తమ సహనటుడి ప్రస్తుత పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. టైలర్‌కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశించారు. కాగా చేజ్ 1989 సెప్టెంబర్ 6 న అరిజోనాలో జన్మించాడు. 2000ల ప్రారంభంలో బాలనటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. 2004 నుండి 2007 వరకు ‘నెడ్స్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్’లో మార్టిన్ క్వెర్లీ పాత్రను పోషించాడు. వీటితోపాటు గుడ్ టైమ్ మాక్స్ (2007), ఎవ్రీబడీ హేట్స్ క్రిస్ (2005)లలో కూడా కనిపించాడు.ఇదీ చదవండి: రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ Former Nickelodeon child stars are having a rough one pic.twitter.com/qN95SrxOmJ— 𓅃 (@FalconryFinance) December 21, 2025 -
వాటే ట్రయల్ రూమ్..! ఆ వైబ్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్‌లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్‌లోని H&M స్టోర్‌లోని హైటెక్ ట్రయల్ రూమ్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్‌దేవా. చక్కటి మ్యూజిక్‌ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్‌ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్‌లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva) (చదవండి: ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..) -
ఈ సూర్యుడికి సడన్‌గా ఏమైంది?
ఈ సూర్యుడికి సడన్‌గా ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడి.. రంగుల కాంతి చుక్కలు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తూ కనిపించిన దృశ్యం.. వావ్ అనిపిస్తోంది. అయితే.. అది రెయిన్బో ఏమాత్రం కాదు. ఈ అద్భుత దృశ్యం కనిపించింది స్వీడన్ జామ్ట్లాండ్లో. శాస్త్రవేత్తలు దీనిని సన్ హాలో అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంతో ఇది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో.. అందునా శీతాకాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ హాలో ఏర్పడటానికి కారణం.. ఆకాశంలో 5–10 కి.మీ ఎత్తులో ఏర్పడే సిరస్ మేఘాలు. వీటిలో ఉండే చిన్న హెక్సగాన్ ఆకారపు మంచు స్ఫటికాలు సూర్యకిరణాలు తాకి 22 డిగ్రీల కోణంలో వంగిపోతాయి. అలా.. లక్షలాది కిరణాలు ఒకే విధంగా వంగి కలిసిపోవడం వల్ల సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుంది. అలా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ రంగులు బయటకు విస్తరిస్తూ ఇంద్రధనుస్సు వలె మెరుస్తాయి. అదే సమయంలో.. [07] A spectacular sun halo in Jämtland, Sweden.pic.twitter.com/YhLl9nF8nV— 𝘀𝗶𝘆𝗲𝗡𝗴𝗼 (@Mrsiyengo) December 21, 2025సన్ డాగ్స్/పార్హీలియా అనే ప్రకాశవంతమైన చుక్కలు సూర్యుడి రెండు వైపులా ఏర్పడి ఆకాశాన్ని అందంగా మార్చుతుంది. టాంగెంట్ ఆర్క్స్.. హాలో పైభాగంలో వంగిన కాంతి రేఖలు, సర్కంహొరిజాంటల్ ఆర్క్స్.. ఇంద్రధనుస్సు వలె అడ్డంగా కనిపించే కాంతి రేఖలు కూడా ఉంటాయి. సో.. ఇదేం మాయా జాలం కాదు, పూర్తిగా సైన్స్(ఫిజిక్స్). అయినా కూడా నెటిజన్స్ సూర్యుడికి ప్రకృతి తొడిగిన కిరీటం అని అభివర్ణిస్తున్నారు. హాలోకి.. ఇంద్రధనుస్సు బోలెడు తేడా ఉంది. ఇంద్రధనుస్సు వర్షపు నీటి బిందువుల వల్ల ఏర్పడుతుంది. కానీ హాలో మంచు స్ఫటికాల వల్ల ఏర్పడుతుంది. హాలోలు అర్కిటిక్ ప్రాంతాలు, స్కాండినేవియా, హిమాలయాలు వంటి చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో సిరస్ మేఘాలు ఏర్పడడం తక్కువ కాబట్టి చాలా అరుదుగా కనిపించొచ్చు. కొన్ని దేశాల సంస్కృతుల్లో సన్ హాలోను దైవ సంకేతంగా భావిస్తారు. మరికొన్ని దేశాల్లో శుభసూచకంగా చూస్తారు. చైనాలో మాత్రం వాతావరణ మార్పు సూచనగా చూస్తారు. హాలోలు కనిపించడం అంటే వాతావరణంలో తేమ పెరుగుతోందని.. త్వరలో వర్షం లేదంటే మంచు కురిసే అవకాశం ఉందని సంకేతాం అన్నమాట. సూర్యుడి విషయంలోనే కాదు.. చంద్రుడి విషయంలోనూ ఇలా జరుగుతుంది. సూర్యుడి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అదే విధంగా మంచు స్ఫటికాల వల్ల చంద్రుడి చుట్టూ ఇదే తరహాలో వలయం ఏర్పడుతుంది. -
జగనన్న బర్త్‌డే.. సోషల్ మీడియా షేక్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21, 2025). ఈ సందర్భంగా జననేతకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్‌గా ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్’ నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్‌ఫారమ్‌లలోనూ పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.వైఎస్ జగన్ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌లో ‘#HappyBirthdayYSJagan’, ‘#HBDYSJagan’, ‘Jagan Anna’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు గ్లోబల్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండింగ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విభాగంలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. Happy Birthday @ysjagan Anna 🫂🤍నీ నవ్వు వరం…నీ కోపం శాపం…నీ మాట శాసనం…నీ గెలుపు ప్రతి పేదవాడి ఇంటికి వెలుగు….#HappyBirthdayYSJagan pic.twitter.com/lXNmI8pGsE— FREDDY (@Fr9ddyy) December 20, 2025మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏపీవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది. ఇది కేవలం ఏపీకే పరిమితం కాలేదు. ఇటు తెలంగాణలోనూ జగన్ అభిమానులు ఆయన పుట్టిన రోజును ఒక వేడుకలా నిర్వహిస్తుండడం గమనార్హం.Jagan Anna Bday Massive Celebrations!🔥Bike Rally At HYDERBAD!#HappyBirthdayYSJagan pic.twitter.com/RVWIeoJqal— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 20, 2025 -
టీవీ డిబేట్లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో
ఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్ లైవ్ డిబేట్లో సహనాన్ని కోల్పోయారు. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై పిడిగుద్దులు కురిపించారు. అమర్ ఉజాలా లైవ్ డిబేట్ సందర్భంగా గందరగోళం జరిగింది. ఇది కాస్తా ముదిరి శారీరక ఘర్షణగా మారిపోయింది. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై దాడికి దిగారు. అవతలి వ్యక్తి దానిని ప్రతిఘటించి రామ్‌దేవ్‌ను స్టూడియో ఫ్లోర్‌పై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.హర్యానాలో ఇది ఫ్యామస్ అంటూ కొన్ని వ్యాయామాలు చేశారు రామ్‌దేవ్. ఆ తరువాత ఛాలెంజ్ అంటూ తోటి ప్యానలిస్ట్‌పై లంఘించారు. ఇలా కొద్ది క్షణాలు సాగిన తరువాత ఇది జోక్‌గానే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అతనికి శక్తిలేదు ఒప్పుకున్నాడు... అతనికోసం చప్పట్లు అంటూ అక్కడున్నవారిని ఉత్సాహపరచడంతో ఈ వివాదం సద్దు మణిగినట్టు అయింది. కాగా టెలివిజన్ చర్చల సమయంలో ఇలాంటి వింత ప్రవర్తనలతో రామ్‌దేవ్ ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా కమెంట్ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. వార్తా వేదికలు "కుస్తీ వేదికలు"గా మారాయని అనేక మంది వినియోగదారులు వ్యాఖ్యానించగా, ఛానెల్స్ చర్చల పేరుతో, "TRPల కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని మరికొందరు ఆరోపించారు. Leaving this here. pic.twitter.com/jyIilfWHkz— Piyush Rai (@Benarasiyaa) December 20, 2025 -
ఎయిరిండియా టికెట్‌కు రూ. 4 లక్షలు వెచ్చించా, ఫుడ్ వ్లాగర్ వింత అనుభవం
బిజినెస్క్లాస్లో దర్జాగా ప్రయాణించాలని చాలా విమాన ప్రయాణికులు ఆశపడతారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలలో లాంగ్ జర్నీ చేసేవారికి సౌకర్యవంతమైన సీట్లు చక్కటి ప్లేస్, ఆహారం ఇలా కొన్ని ప్రత్యేక సదుపాయాలుంటాయి. ఇది కేవలం సుదూర గమ్యస్థానాన్ని చేరుకోవడం గురించి మాత్రమే కాదు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోవంటి అల్ట్రా-లాంగ్ రూట్లలో సౌకర్యాలపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టికెట్ల ధర లక్షల్లో ఉంటుంది. అందులోనూ ఎయిరిండియా లాంటి విమానాలలో టికెట్ కోసం లక్షలు ఖర్చు చేసినప్పుడు, ఎవరైనా ప్రీమియం ఫీచర్స్‌నే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫుడ్ బ్లాగర్ తనకెదురైన చేదు అనుభవాన్ని గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.పాపులర్ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించింది. ఈ ప్రయాణంలో తనకెదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది తన యూట్యూబ్ వీడియోలో. ఈ జర్నీకి 10- 6 రేటింగ్ ఇచ్చింది. వరుసగా తన అనుభవానాలకు ఏకరువు పెట్టింది. తొలుగ ఫస్ట్ సీట్ అస్సలు బాగాలేదని, తరువాత రెండో సీట్లోకి మారినా కూడా పరిస్థితిలాగే ఉందని నిరాశను వ్యక్తం చేసింది. ఇందు కోసమా తాన టికెట్‌కు రూ. 4లక్షలకు ఖర్చు చేశానని వాపోయింది.విమానంలో ఆహారంపైకూడా పెదవి విరించింది. మంచి నిద్ర తరువాత బాగాతిందామని ఎదురుచూస్తే నిరాశే మిగిలిందనీ, మెయిన్ కోర్స్ తప్ప మిగతాది అస్సలు బాగాలేదని తెలిపింది. డెజర్ట్స్ అయితే దారణమని వ్యాఖ్యానించింది. అయితే డ్రింక్స్, షాంపైన్ మాత్రం బావున్నాయని చెప్పింది. అంతేకాదు తాను తినకపోవడం ఇదే మొదటిసారి అయిఉండాలని కూడా తెలిపింది. ఇక శుభ్రత మరొక బాధాకరమైన విషయమని పేర్కొంది. తన సీటుపై అక్షరాలా రెండు చచ్చిన ఈగల్ని చూశానని ఫిర్యాదు చేసింది. ఎందుకు? ఇలా అని ప్రశ్నించింది.అయితే దటీజ్ ఎయిరిండియా అంటూనే కంఫర్ట్ పరంగా, సీట్లు, సౌకర్యవంతంగా ఉన్నాయని ఆమె అంగీకరించింది. బాగా నిద్రపోయానని వెల్లడించింది. తనకు వేరే మార్గం లేదని, అందుకే ఈ ఎయిరిండియావిమానంలో ప్రయాణించానని తెలిపింది. కానీ ఇన్ని ఫిర్యాదులున్నప్పటికీ ఎయిరిండియా ప్రయాణం అనుకున్నదానికంటే బావుంది అంటూ కితాబివ్వడం విశేషం. అయితే ఈ ఆరోపణలపై ఎయిరిండియా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. -
పెళ్లిలో వధువు ల్యాప్‌టాప్ పట్టుకుని..
వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్ గౌరీ అగర్వాల్.ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్లో ఏఐలో బగ్ ప్రాబ్లమ్’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్‌టాప్ తీసుకొని క్రిటికల్ బగ్‌ను పది నిమిషాల్లో సాల్వ్ చేసింది గౌరీ అగర్వాల్.‘ఎక్స్’లో ఆమె తమ్ముడు మెహుల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ బోలెడు లైక్‌లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్‌ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్ (Gauri Agarwal) సోదరుడు మెహుల్.అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు గౌరీ అగర్వాల్‌కు జై కొట్టారు.కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్ పెట్టారు.‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. చదవండి: 20 ఏళ్లకే రీసైకిలింగ్ కింగ్..!People romanticize startups but it is a lot of work.This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.Not a photo op, parents yelled at both of us.When people ask why we won, I'll point to this. pic.twitter.com/ee3wTEYwXG— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025 -
ట్వీట్స్‌తో మోత మోగించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియాలో తన హవాను చాటుకున్నారు. ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్లతో టాప్‌లో నిలిచారు. ఎక్స్ లాంచ్ చేసిన కొత్త ఫీచర్ మోస్ట్ లైక్డ్ ప్రకారం ఆయన ట్వీట్లు ఇండియాలో ఎక్కువ లైక్స్ సాధించిన ట్వీట్ల జాబితాలో నిలిచాయి. దేశాల వారీగా ఫీచర్ ప్రధాని గత నెలలో భారతదేశంలో అత్యధికంగా లైక్ చేయబడిన పది ట్వీట్లలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్నారు. మరే పొలిటికల్ నేత పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.గత 30 రోజుల్లో వ్యక్తిగత దేశాలలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్లను హైలైట్ చేసే కొత్త ఫీచర్‌ను ఎక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వెలువడిన డేటా ప్రకారం, నరేంద్ర మోదీ హైయ్యస్ట్ ఎంగేజ్మెంట్ కంటెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా లైక్ చేయబడిన టాప్ పది ట్వీట్లలో ఎనిమిదింటిలో పీఎం మోదీ కావడం విశేషం. టాప్ టెన్‌లో మరే ఇతర రాజకీయనాయకుడు లేడు. మిగిలిన రెండు స్థానాల్లో రాజకీయేతర ఖాతాలున్నాయి. The Like Button Has a Clear FavouriteA significant moment in India’s digital journey, as X’s new 'Most-Liked' feature highlights content shared by PM @narendramodi among the nation’s most-liked posts, reflecting strong public engagement. Serving as Prime Minister of India since… pic.twitter.com/XLHXum9kG7— MyGovIndia (@mygovindia) December 19, 2025 దేశ-నిర్దిష్ట ర్యాంకింగ్ వినియోగదారులకు ఎంగేజ్ చేసిన టైం విండోలో అత్యధికంగా లైక్స్ సాధించిన ట్వీట్ల స్నాప్‌షాట్‌ను అందించడానికి ఎక్స్ ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, దౌత్యపరమైన సంభాషణలు, పర్యనటల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను షేర్ చేస్తూండటం మోదీని టాప్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భగవద్గీత రష్యన్ భాషా కాపీని మోదీ అందిస్తున్నట్లు చూపించిన పోస్ట్, ఈ నెలలో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. ఈ పోస్ట్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక గ్రంథంగా గీతను ప్రధాని అభివర్ణించారు. మోదీ అధ్యక్షుడు పుతిన్ న్యూఢిల్లీకి వచ్చినప్పుటి ట్వీట్ రెండో స్థానంలో ఉంది. అయితే వీటిన నిర్దిష్టంగా మోదీ ట్వీట్లకు ఖచ్చితమైన లైక్ కౌంట్లు లేదా రీచ్ వంటి వివరణాత్మక కొలమానాలను ఈ ఫీచర్ వివరించలేదు. -
ట్రాఫిక్.. గీఫిక్.. జాన్తా నై!
రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్ అంట రూట్స్.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్‌పాత్‌ల మీదికెళ్లి మోటార్ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్‌గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.-ఆరెం. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్‌ను తీసుకొచ్చింది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్ట్ లేదంటే రీల్‌కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్‌ట్యాగ్‌లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్‌స్టాలో 30 హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్‌ట్యాగ్‌లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్‌కు సంబంధించిన బ్యూటీ హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే.. ఆ కంటెంట్‌ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్‌ను పడితే ఆ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్‌ట్యాగ్‌లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్‌ట్యాగ్‌ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్‌లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్‌లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే మీ కంటెంట్‌ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్‌స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్‌గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్‌స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు. -
'అయ్ బాబోయ్ ఎంత పొడుగో'..!
అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025 (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
ఇది సక్సెస్ కాదు.. గిగ్ కార్మికుల గొడ్డు చాకిరీ!
క్విక్ కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న వైనంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిగ్ కార్మికుల ఇబ్బందులను ఇటీవల ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మధ్య వైరల్ అయిన ఒక వీడియోను ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తాజాగా పోస్ట్ చేశారు.ఇందులో బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ శ్రమ దోపిడీకి గురైన వైనాన్ని వివరించారు. రోజంతా దాదాపు 15 గంటలు గొడ్డులా కష్టపడి 28 ఆర్డర్లు డెలివరీలు చేస్తే అతనికి లభించింది కేవలం రూ .763 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తిన చద్దా.. "అధిక పని", "తక్కువ వేతనం"తో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేదని స్పష్టం చేశారు.‘ఇది గిగ్ ఎకానమీ విజయ గాథ కాదు.. డెలివరీ యాప్‌లు, వాటి అల్గోరిథంల వెనుక దాగి ఉన్న వ్యవస్థీకృత దోపిడీ’ అని అభివర్ణించిన చద్దా.. ప్రతి రోజూ లక్షలాది మంది కార్మికులు ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారో ఈ ఒక్క బ్లింకిట్ ఉదంతం తెలియజేస్తోందంటూ ట్వీట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు వేగంగా విస్తరించినప్పటికీ, కార్మికుల రక్షణ మాత్రం విస్మరణకు గురవుతోందన్నారు.రాఘవ్ చద్దా పోస్ట్ ‘ఎక్స్’లో విస్తృత చర్చకు దారితీసింది. కార్మిక చట్టాలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికుల పట్ల "క్రూరత్వం" నివారించడానికి 10 నిమిషాల డెలివరీ సేవలను నిషేధించాలని ఆప్ ఎంపీ గతంలోనే కోరారు. కఠినమైన సమయపాలనను చేరుకోవడానికి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.28 deliveries.15 hours of relentless work.₹763 earned.This is not a “gig economy success story”.This is systemic exploitation hidden behind apps & algorithms.I raised this issue in Parliament recently. Low pay, crushing targets, no job security, no dignity for gig… pic.twitter.com/gLwQbcE1iQ— Raghav Chadha (@raghav_chadha) December 16, 2025 -
విమానం రద్దు.. ప్రేమకు ఆకాశమే హద్దు..!
ఇటీవల ఇండిగో విమానాల రద్దు ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్. ఇండిగో ప్రయాణికుల తిప్పలు ఇక్కడ వర్ణనాతీతం. కొత్త పైలట్ విశ్రాంతి నియమాలు, షెడ్యూల్ ప్లానింగ్ లోపాలు, శీతాకాల రోస్టర్ ఒత్తిడి వల్లే ఈ భారీ రద్దులు జరిగాయి ఫలితంగా ప్రయాణికులకు అవస్థల తప్పలేదు. అయితే వీటితో ఇప్పడు ఒక సంఘటన వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వరుడు.. ఇండిగో విమానం రద్దుతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది కూడా పెళ్లి చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దైన విషయం తెలియడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని వధువుకి కూడా చేరవేశాడు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడు ఎక్కడో ఉన్నాడు.. వధువు కూడా వేరే చోట అంటే ఫ్లైట్ .జర్నీ చేసి వస్తే కానీ ముహూర్తానికి అందనంత దూరంలో ఉంది. ఒకవైపు పెళ్లి కొడుకులో టెన్షన్..మరొకవైపు పెళ్లి కూతురిలో అంతకుమించి ఆందోళన. ముహూర్తం సమయానికి పెళ్లి అవుద్దా.. లేదా అనే సందిగ్థంలో పడింది. అయితే వరుడ మాత్రం తన ప్రేమకు ఎల్లలు లేవని భావించాడు. అందుకే చార్టర్ ఫ్లైట్(ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం)లో వాలిపోయాడు. ఇంకేముంది కథ సుఖాంతమైంది.. వధువు అనందానికి హద్దుల్లేకుండా పోయింది. వరుడుకి ఘనస్వాగతం లభించింది.. వధువు తన డ్యాన్స్‌తో అలరించి కాబోయే భర్తకు ఘనంగా ఆహ్వానం పలికింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by The Must Media || Wedding Content Creators (@themustmedia) -
ఆ కారు నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..! వైరల్‌గా ఓ తండ్రి పోస్ట్..
కారు కొనడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు తీరనిక కల అని చెప్పొచ్చు. డేర్ చేసి కొత మొత్తం కట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్నా..ఆ డబ్బులన్నీ నెల నెల కట్టగలనా అనే భయం వెంటాడేస్తుంటుంది. అందుకే అంత మెంటల్ టెన్షన్ ఎందుకని..కారు కొనాలనే ఆలోచనే విరమించుకుంటా. కానీ ఈ వ్యక్తి ఆ సంశయాత్మక ధోరణి నుంచి బయటపడండని అంటున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఉంటే మరో ఆలోచన చేయకుండా ధైర్యంగా కారు కొనాలనే నిర్ణయానికి రావడం మంచిదని సూచిస్తున్నాడు కూడా. ఎందుకలా అంటున్నాడంటే..ప్రస్తుతం బయట కాలుష్యం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలుష్యం కోరల నుంచి తన బిడ్డ ఊపిరితిత్తుల పాడవ్వకుండా తాను కొన్న కారు ఎలా రక్షించింది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు రెడ్డిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. భారీ వాహనాలు, లారీ, ట్రక్కుల వెనుక ఉంటే ఏ రేంజ్లో పొగ దుమ్ము ఆవిరిస్తుందో చెప్పక్కర్లేదు. అలాంటప్పడు మనకు కారు చాలా సురక్షితం అని చెబుతున్నాడు. తాను గతవారమై రూ. 10 లక్షలు ఖరీదు చేసే మారుతి ఫ్రాంక్స్ కారుని రూ. 3లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, రూ. 7లక్షల లోన్‌పై తీసుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట అనవసరంగా లక్షలు చెల్లించి మరి ఇఎమ్ఐలో కారు కొన్నాని చాలా బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పన్వేల్ నాసిక్ మీదుగా తన ఏడాది కూతురు, భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడూ తన అభిప్రాయం మారిందట. తాను తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందట. తాను ఆ జర్నీలో కొన్ని డీజిల్ ట్రక్కుల మధ్య ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడట. అక్కడ దట్టమైన పొగ, దుమ్ము, కారు అద్దాలపై ఆవరించి అసలు బయట ఏమి కనిపించలేదట. కారు లోపల ఏసి ఆన్ అయ్యి ఉంది కాబట్టి తమకు అంత చికాకుగా అనిపించలేదట. ఒకవేళ్ల కారు కొనకపోయి ఉంటే ఈ ట్రాఫిక్‌లో బైక్ తన కుటుంబమంతా ఉండేది. అస్సలు ఆ కాలుష్య ఏడాది వయసున్న తన చిన్నారి ఊపరితిత్తులను ఎంతగా ప్రభావితం చేసేది అన్న ఆలోచన భయాందోళనకు తోను చేసిందట. దేవుడి దయవల్ల సరైన నిర్ణయం తీసుకునే కారుకొన్న లేదంటే అమ్మో ఈ భయానక కాలుష్యానికి మొత్తం కుటుంబమే అనారోగ్యం పాలయ్యేది అని రాసుకొచ్చాడు. అందుకే చెబుతున్నా..కారు కొనాలా వద్ద అన్న మీమాంసలో ఉన్న తమ లాంటి పేరెంట్స్ అంతా ప్రస్తుత కాలుష్య దృష్ట్యా డేరింగ్ నిర్ణయం తీసుకోండి. త్వరితగతిన కారు కొనండి అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు కారు అనేది లగ్గరీ కాదని మన పిల్లల పాలిట మొబైల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పేర్కొన్నారు. అలాగే ఖర్చు అని కాకుండా రక్షణను పరిగణలోకి తీసుకుని ధైర్యంగా కార కొనండని పిలుపునిచ్చాడు తన పోస్ట్‌లో. అయితే నెటిజన్లు అతని సూచనకు మద్దతివ్వడమే కాకుండా కారు రక్షణ, భద్రతా కూడా అది విస్మరించారు మీరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: వయసులో ఫిట్..పరుగులో హిట్..!) -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్‌కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్‌కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్‌పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్‌ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్‌ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్‌లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్‌ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్‌కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
మెస్సీ భాయ్.. మరి నీ లంగ్స్‌కు ఇన్సూరెన్స్ చేయించావా?
ఫుట్‌బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి.. 🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడుFans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025😓మెస్సీ తన కెరీర్లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో! 😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్‌ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు. కోల్‌కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్‌బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్‌కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్‌లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు. అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్‌లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్‌హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది. -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్‌గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్‌జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్‌కాస్టర్‌తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!
ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్‌లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఫిలిప్పీన్స్‌లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందుకే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్‌పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్లైన్లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. ICYMI: This is real courage.During a massive fire in Mandaue City, Cebu, Philippines, a woman refused to leave without her dogs.As flames spread, she climbed onto a ladder, threw each dog down to safety, then hung by her hands from the railing while firefighters climbed up to… pic.twitter.com/unDE6PcyUG— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) December 13, 2025 -
90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్నెస్ కోచ్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Dan Go | Fitness Coach (@coachdango)నడక వేగంఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.విశ్రాంతి హృదయ స్పందన రేటులో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్‌గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్షడాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయగలరు.బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్‌గా ఉన్నట్టు.ఒక మైలు పరుగు సమయంఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్నెస్తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్నెస్ స్థాయికి స్నాప్‌షాట్ లాంటిది. ఎంత ఫిట్‌గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.నోట్ : ఆరోగ్య , ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం. -
అర్థరాత్రి ఆటోలో ఒంటరి మహిళ : ఆ నోట్ చూసిందంతే!
అర్థరాత్రి రద్దీగా ఉండే నగరాల్లో కూడా అర్థరాత్రి మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే. క్యాబ్ సేవలు అందించే సంస్థలకు చెందిన ఆటో,క్యాబ్, బైక్ డ్రైవర్లు మర్యాదగానే ఉంటారు. అయినా కూడా సురక్షింగా గమ్య స్థానానికి చేరేదాకా మనసులో బెరుకు తప్పదు. తాజాగా బెంగళూరులో రాపిడో ఆటోలో అర్ధరాత్రి ఇంటికి ప్రయాణిస్తున్న ఒక మహిళకు అనుభవం నెట్టింట విశేషంగా నిలిచింది.రాత్రి 12 గంటలకు అర్థరాత్రి, ఒంటరిగా ఉన్నప్పటికీ తన ప్రయాణంలో తాను ధైర్యంగా గడిపిన క్షణం గురించి వివరించిన వీడియోను షేర్ చేసింది. నిజంగా ఆటోలు కనిపించిన ఒక నోట్‌ను ఆమెలోఆనందాశ్చర్యాల్ని నింపింది. వాహనం లోపల అతికించిన చేతితో రాసిన నోట్‌ను చూపించడానికి కెమెరాను అటు తిప్పింది. అక్కడ ఇలా ఉంది: "నేను ఒక తండ్రిని, సోదరుడుని కూడా. మీ భద్రత ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి."అని ఒక నోట్లో రాసి ఉండటం విశేషం. అంటే ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మనస్సుల్లో చెలరేగే భావాలను, భయాలను అర్థం చేసుకుని భయపడకండి.. నేనూ ఒక బిడ్డకు తండ్రినే, ఒక సోదరికి అన్నయ్యను కూడా..భయపడకుండా కూర్చోండి, నా వలన మీకెలాంటి ప్రమాదం ఉండదు అని ధైర్యం చెప్పడం బాగా ఆకట్టుకుంటోంది.ఇదీ చదవండి: చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త View this post on Instagram A post shared by Little Bengaluru Stories (@littlebengalurustories) ఈ వీడియోను లిటిల్ బెంగళూరు స్టోరీస్ "పీక్ బెంగళూరు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది . దీంతో నెటిజన్ల నుండి హృదయపూర్వక స్పందనలు వచ్చాయి. "గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు! ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం." ‘‘మేము కోరుకుంటున్నది , మనం చేయవలసినది ఇదే" అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చిన్ని చిన్న విషయాలు చాలు. నగరంలోని మహిళలకు అర్థరాత్రి ప్రయాణం సురక్షితంగా అనిపించేలా చేయడంలో సహాయపడతాయి’’ అని మరొకరు కామెంట్ చేశారు. శభాష్..భయ్యా..ఇలాంటి భరోసానే కావాల్సింది అంటూ మరికొందరు ఆటో డ్రైవర్‌ను కొనియాడారు. -
మృత్యువు అంచునుంచి..
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్, టల్లీ ఎయిర్ పోర్ట్.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్ ఆడ్రియన్ ఫెర్గూసన్ గుండె వేగం పెరిగింది. విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్ ఫెర్గూసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్ పారాచూట్ తాడు విమానం రెక్క ఫ్లాప్‌ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్‌ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్‌ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్లో పడిపోయాడు. అసాధారణ ధైర్యశాలికళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్ స్టెబిలైజర్’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్ ఫెర్గూసన్ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్ ఫెర్గూసన్ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యువుతో పోరాడాలి. ప్రాణం కాపాడిన కత్తిఆడ్రియన్ తన వద్ద ఉన్న చిన్న ’హుక్ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్‌లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్ తన ప్రధాన పారాచూట్‌ను తెరిచాడు. రిజర్వ్ పారాచూట్ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యాడు. మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది ప్రమాదంలో విమానం..ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్‌తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో, పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. A skydiver in Queensland Australia was left dangling thousands of metres in the air after their parachute caught on the plane’s tail. The dramatic footage was released by the Australian Transport Safety Bureau following an investigation into the incident. pic.twitter.com/ntXU6d8pAQ— Channel 4 News (@Channel4News) December 11, 2025శభాష్ ఫెర్గూసన్!ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్ ఆంగస్ మిచెల్ మాట్లాడుతూ, ‘హుక్ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్ పారాచూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు. పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా -
డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్‌కు!
ఎన్నో స్ఫూర్తిదాయకమైన స్టోరీలు చూస్తుంటాం. ఎంతవరకు ప్రేరణగా భావిస్తామో తెలియదు గానీ, మన కళ్లముందే డెవలప్ అవుతున్న వాళ్లను బొత్తిగా గమనించం. కనీసం వాళ్లను చూసినా.. సక్సెస్‌ని ఒడిసిపట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈవిద్యార్థి.జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒకప్పుడు బ్లింకిట్‌లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన ఉద్యోగి గురించి సోషల్ మీడియాలో ఎక్స్‌లో షేర్ చేశారు. ఆయన ఆ పోస్ట్‌లో విద్యార్థి దృఢ సంకల్పాన్ని, ఆహార సాంకేతికత పర్యావరణ వ్యవస్థ సృష్టించిన అవకాశాలను ప్రశంసించారు. గోయల్ తన పోస్ట్‌లో బ్లింకిట్ ఉద్యోగి అథర్వ్ సింగ్ తండ్రి మద్దతు లేకుండా విద్య, జీవన ఖర్చుల కోసం ఎలా నిధులను సమకూర్చుకుంటున్నాడో వివరించారు. ఇది చూశాక తాను ఏమి సంపాదించలేని సమయం చాలానే ఉంది కదా అని నా జీవితం ప్రశ్నిస్తున్నట్లు అనిపించిందని గోయల్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది బ్లింకిట్ నియామకం గురించి ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూశాకేనని అన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థి జీవితం దినదినాభి వృద్ది చెందుతూనే ఉందని పోస్ట్‌లో వెల్లడించారు గోయల్. ఒక పక్క కాలేజ్‌లో డిజైన్ కోర్సు చదువుతూ బ్లింకిట్‌లో డెలివరి బాయ్‌గా పని చేసిన ఆ అబ్బాయి ఇవాళ జొమాటో డిజైన్ బృందంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడంటూ ఆయన పోస్ట్‌ని ముగించారు. ఇది నిజంగా గ్రేట్ కదా..ఒకప్పుడు డెలివరీల చేసిన అబ్బాయే ..డిజైన్ చేసే స్థాయికి అంటే చాలా స్ఫూర్తిదాయకమైన జర్నీ కదూ ఇది. క్షణాల్లో వైరల్ అయిన ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు చాలా అమ్యూలమైన పాఠాన్ని అందించింది ఈ స్టోరీ అని కొందరూ, ఇలాంటి సక్సెస్ స్టోరీలు మనకు ఆకాశమే హద్దు అని అనిపించేలా చేస్తాయి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Stories like this make all of it absolutely worth it. pic.twitter.com/HMd1U3N8c7— Deepinder Goyal (@deepigoyal) December 11, 2025 (చదవండి: రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు) -
దీన్ని సివిక్ సెన్స్ అంటారా..రోడ్డుపై రచ్చ
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల్ని ఇండియాలో చాలామందివాహనదారులు అస్సలు లెక్క చేయరు.. ఫ్రీ లెఫ్ట్ వదిలేయండి.. దాన్ని ఆక్రమిస్తే జరిమానా అని స్వయంగా ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నా సరే అస్సలు పట్టించుకోరు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ముందుకు పోతారు. ట్రాఫిక్ని జాం చేస్తారు. మరికొంతమంది సోషల్ మీడియా, రీల్స్ పిచ్చోళ్లు ఉంటారు. మినిమం సివిక్ సెన్స్ పాటించకుండా రోడ్డు మధ్యలోనే షూటింగ్ లంటూ, పిచ్చి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తూ ఉంటారు. ఇపుడు రహదారిపై కనీస మర్యాద పాటించని జంట గురంచి తెలుసుకుందాం. వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది. హైవే మధ్యలో హాయిగా భోజనం తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పౌరుల రోడ్డు మర్యాదలు, భద్రతా అవగాహనపై కొత్త విమర్శలకు తావిస్తోంది.Civic sense is a rare luxury in India , something not everyone seems able to afford. Take this scene for example: a family has started cooking right in the middle of road , turning the area messy. Tell me honestly, is this acceptable? pic.twitter.com/Xytjpv2DlS— The Nalanda Index (@Nalanda_index) December 8, 2025నలంద ఇండెక్స్ ద్వారా X హ్యాండిల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో తమ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి వంట చేయడాన్ని చూడొచ్చు. సిలిండర్, వంటపాత్రలు, కూరగాయలు, కిరాణా సరుకులు సంచులను రోడ్డుపై చెల్లాచెదురుగా పడవేసిన వైనం నెట్టింట చర్చకు దారితీసింది.ఇండియాలో సివిక్ సెన్స్ అనేది చాలా అరుదు. ఉదాహరణకు ఇక్కడ చూడండి : ఒక కుటుంబం రోడ్డు మధ్యలో వంట మొదలు పెట్టేసింది. అక్కడంతా చిరాకు చేసి పడేసింది అని క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. అయితే ఇదే విషయంపై ఇలారోడ్డుపై వంట చేయడం, ప్రాణాలకు ప్రమాదం కదా ఆమెను ప్రశ్నిస్తే.. ఆ మహిళ ఎలాంటి సంకోచం లేకుండా ఇలా సమాధానం ఇచ్చింది “మేము రోడ్డు పక్కన వంట చేయకూడదని కూడా మాకు తెలుసు,కానీ అది రోడ్డు (ఎదురుగా ఉన్న లేన్ వైపు చూపిస్తూ) అని చెప్పింది. ఇది సర్వీసు రోడ్డు విశ్రాంతి ప్రాంతం. ఈ ప్లేస్ విశ్రాంతి, వంట కోసం ఉద్దేశించబడింది.” అని సమాధానం చెప్పింది తాపీగా చపాతీలు చేస్తూ. పక్కనే ఒక చిన్నారిని కూడా గమనించవచ్చు.ఈ వీడియో విభిన్న వాదనలకు ఆజ్యం పోసింది. ఇలాంటి వాళ్లని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి జరిమానా విధించాలి, ఇది ఆమోదయోగ్యం కాదు అని, ఇలా రోడ్డు వంట చేసుకొని తినడం ప్రజా స్థలాన్ని ఇతరులకు ఆరోగ్యం, భద్రతా సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఆ రహదారి గుండా ఏవాహనాలు పోవడం లేదు కదా, అందుకే ఆ జంట అలా చేసిందని మరికొందరు సమర్ధించారు. ఇలాంటి కుటుంబాలకు సరియైన స్థలాన్ని, సపోర్ట్ అందించాలని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. -
రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..
కొన్ని ఉద్యోగ ఆఫర్లు పిచ్చెక్కించేలా ఉంటాయి. ఆఫర్‌ని అంగికరించొచ్చా? వద్దా? అనే సందేహంలోకి నెట్టేస్తాయి. దాని వెనుక కాస్త ఇబ్బందుల తోపాటు, మన ప్రియమైన వాళ్లను వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. పోనీ రిస్క్ చేద్దామన్నా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? మన అనుకున్న వాళ్లే మనకు దూరమైపోతారా అనే బెంగ, గుబులు మొదలై.. నానా హైరానా పడుతుంటాం. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఈ శాస్త్రవేత్త. ఏ నిర్ణయం పాలుపోక నెటిజన్ల సలహా తీసుకుందామనే ఉద్దేశ్యంతో తన కథను షేర్ చేసుకున్నాడు ఈ పరిశోధకుడు.ఆ వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్‌లో తాను పర్యావరణ పరిశోధనలో పనిచేస్తున్నానని, తన కంపెనీ మెక్ముర్డో స్టేషన్లో ఆరు నెలల పరిశోధన కోసం అంటార్కిటికాకు వెళ్లాలనుకుంటున్నారా అని అడిగింది. ఆరు నెలల పరిశోధన కోసం ఏకంగా రూ. 1.3 కోట్లు చెల్లిస్తానని బంపరాఫర్ ఇచ్చింది. పైగా అంత మొత్తం రిటైర్మెంట్ టైంకి ఆహారం, గృహనిర్మాణం, విమానాలు, గేర్ పనులు అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి ఆ ఆఫర్ నాకెంతో నచ్చింది. అందులోనూ అంటార్కిటికాలో ఉండటం అంటే ఖర్చులు లేకుండా హాయిగా జీవించొచ్చు. మూడేళ్లు తన స్నేహితురాలితో కలిసి ఉన్నా, కానీ ఇప్పుడు సడెన్‌గా తనను వదిలి వెళ్లడం అన్న ఆలోచనే చాలా కష్టంగా ఉంది. ఇదేమి థ్రిల్లింగ్ ఫీల్లా అనిపించేది కూడా కాదని చెబుతున్నాడు. ఒకవేళ తాను ఆ ఆఫర్‌ని అంగీకరించినా.. కూడా ఆమె తనకు మద్దతిస్తుందని, కానీ అంతకాలం ఆమెకు దూరంగా ఉండటం అంటేనే మనసుకు చాలా కష్టంగా ఉందని వాపోయాడు. అదీగాక తన ప్రస్తుత ఆదాయ నికర విలువ రూ. 1.62 కోట్లు అని, ఆరు నెలల ఒప్పందం కారణంగా త్వరితగతిన రిటైర్మెంట్ తీసుకుని హాయిగా బతికేయొచ్చని చెబుతున్నాడు ఈ శాస్త్రవేత్త. అంతేగాదు జీతం మొత్తం కూడా నేరుగా బ్యాంకులోనే కంపెనీ చెల్లిస్తుంది కాబట్టి..ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఏకంగా ఆరు నెలలు ఒంటరిగా సైన్సు పరిశోధనలతో గడపాలి. సైన్సే లోకంగా గడిపాను గానీ..ఇలా ఒంటిరిగా అంకితమయ్యే అవకాశం కల్పిస్తుందని కలలో కూడా అనుకోలేదని చెబుతున్నాడు. అయితే ఈ ఆరు నెలల కాలం తన వ్యక్తిగత జీవితంపై తన రిలేషన్స్‌పై గట్టి ప్రభావం చూపి మళ్లీ ఒంటిరిగా మార్చేస్తుందేమోనని భయంగా ఉంది. అందువల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేది కాస్త చెప్పండి అంటూ తన బాధనంతా రాసుకొచ్చాడు ఈ పరిశోధకుడు పోస్ట్‌లో. అయితే నెటిజన్లు చాలామంది ఆ ఆఫర్‌ని ధైర్యంగా అంగీకరించండి, మీ స్నేహితురాలు పూర్తిగా మద్దతిస్తుందన్న నమ్మకం ఉంటే బేషుగ్గా నిర్ణయం తీసుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. పైగా పదవీవిరమణ సమయానికి ఇద్దరూ హాయిగా గడపొచ్చు. అలాగే జస్ట్ ఆరు నెలల కాలం పెద్ద ఎక్కువ సమయం ఎడబాటు కూడా కాదు. కాకపోతే గడ్డకట్టే ఆ అంటార్కిటిక్‌లో జీవన స్థితి ఎలా ఉంటుంది, తట్టుకోగలనా లేదా అనేదాని గురించి కూలంకషంగా తెలుసుకుని ముందుకు సాగండి ఆల్‌ద బెస్ట్ అని చెబుతూ పోస్టులు పెట్టారు.(చదవండి: Adarsh Hiremath: డ్రాపౌట్ టు బిలియనీర్) -
ఓర్నీ ఇదేంటిది..! అత్తారింటికి నవవధువే డ్రైవ్ చేసుకుంటూ..
పెళ్లిలో జరిగే ప్రతి తంతు అపురూపమైన క్షణం. ఆ వివాహ ఘట్టం అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతులు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే ఆ వధువు ఇలా చేసిందో ఏమో గానీ వరుడుకి నోట మాట లేకుండా చేసింది. అప్పుడే తనకు నచ్చినట్లుగానే అంతా చేయాల్సిందేనా అన్నట్లుగా నవ్వుతూ కళ్లప్పగించి చూశాడు. అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన లూధియానాలోని థార్‌లో చోటుచేసుకుంది. పెళ్లి తంతు అయిపోయింది. ఆ తర్వాత అప్పగింతలు వేళ వధువుని తీసుకొచ్చి తల్లిదండ్రులు కారు వెనకాల కూర్చొబెట్టి సాగనంపుతారు కామన్. పైగా వరుడు పెళ్లికొడుకు కాబట్టి అతన కూడా కారు డ్రైవ్ చేయడు. ఇది వివాహంలో సర్వసాధారణం. కానీ ఈమె మాత్రం తన అత్తారింటికి భర్తతో కలిసి తనే స్వయంగా కారు నడిపుతూ వెళ్లాలనకుందట. ఆ విషయం ముందే కాబోయే వరుడుకి చెప్పడంతో అతను కూడా సమ్మతించాడు. అంతేకాదు అక్కడ పెళ్లి మండపం వద్ద ఉన్న బంధువులు, సన్నిహితులు విస్తుపోయేలా నవవధువుని పెళ్లికొడుకే ఎత్తుకుని ఎస్యూవీ కారు వద్దకు తీసుకురాగ, ఆమె డ్రైవర్ సీటులో దర్జాగా కూర్చొంది. ప్యాసింజర్ సీటులో వరుడు కూర్చొని మనం ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి అని ఆమెకు నవ్వుతూ చెబుతున్నాడు. అంతేగాదు వరుడు దేవుడా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లు అని ప్రార్థించాడు కూడా. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా అవుతోంది. View this post on Instagram A post shared by Bhawni & Chirag (@chirag_ke_bhaw_badgye) (చదవండి: 50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!) -
షాకింగ్ వీడియో.. కారుపై విమానం క్రాష్ ల్యాండ్
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీ కొడితే ఎలా ఉంటుంది?.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు రోడ్డు మీద ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.Unbelievable scene on I-95, Florida:A landing aircraft clipped a car on the highway.FHP confirms the driver is safe with only minor injuries.pic.twitter.com/gDmWcmxUou— TRIDENT (@TridentxIN) December 10, 2025 -
బోరుగడ్డ అనిల్‌కుమార్ మా పార్టీ కాదు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్‌గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్సీపీ ఓ స్పష్టత ఇచ్చింది. -
విజయ్ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం
కరూర్ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్ వద్ద విజయ్ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్‌ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్‌షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.Isha Singh IPS: UT: 2021 Gets Promotion To SSP Rank. She brings a rare combination of legal expertise and enforcement experience to her role. Read: https://t.co/D9i27rqJBi@HMOIndia @PuducheryPolice @iamishasingh @RajeshwarS73 pic.twitter.com/szTgMDL0Xx— Witness In The Corridors (@witnesscorridor) September 1, 2025 ఇషాసింగ్(28) 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. 2021 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్‌గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు.தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025 -
అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్!
ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్ సిబ్బంది చేసిన నిర్వాకమే.పోలీస్ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.సోహన్ అనే ఇంటర్ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్‌గఢ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో.. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్ 5వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్ లేదు. చేజింగ్ లేదు. ఎలాంటి సీజ్‌లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్‌ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్ఐఆర్లో అతని అరెస్ట్‌కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.డిసెంబర్ 9వ తేదీన మాందసౌర్ జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్‌ను బస్సులోనే సివిల్ డ్రెస్‌లో ఉన్న పీఎస్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్ మొదలు ఏదీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్ వ్యవస్థలో హాట్ టాపిక్‌గా మారింది.నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో మానిఫులేషన్ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ये देश के सबसे अच्छे पुलिस स्टेशन में से एक की मल्हारगढ़ की पुलिस है, पिछले महीने गृहमंत्री अमित शाह ने ऐलान किया था, उसी थाने के कर्मचारी हैं एक छात्र को जबरन ड्रग्स तस्करी में फंसाने का आरोप है, हाईकोर्ट ने सवाल पूछे अब जाकर निलंबित हुए लेकिन छात्र को २ महीने जेल में रहना पड़ा! pic.twitter.com/tN3IT6fDpJ— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025 -
టీనేజర్ల డిజిట్రబుల్స్!
డిసెంబరు 10 బుధవారం సూర్యోదయం కాగానే, ఆ్రస్టేలియా చరిత్రలో తొలిసారిగా ఒక చట్టం అమల్లోకి రానుంది. దేశంలోని 16 ఏళ్ల లోపు యువతకు సోషల్ మీడియా తలుపులు మూసుకుపోతాయి. అయితే, ప్రపంచంలోనే ఈ తొలి నిషేధం, రిలే అలెన్ అనే 15 ఏళ్ల స్కూల్ బాయ్‌కి నిద్ర లేకుండా చేస్తోంది. దక్షిణ ఆ్రస్టేలియాలోని కేవలం 1,000 మంది జనాభా ఉన్న ’వుడిన్నా’ అనే చిన్న కమ్యూనిటీకి 5 కిలోమీటర్ల దూరంలో రిలే కుటుంబం నివసిస్తోంది. గొర్రెల ఫారంలో నివసించే ఈ కుర్రాడికి, దూరంగా ఉన్న స్నేహితులతో మాట్లాడడానికి సోషల్ మీడియానే ఏకైక మార్గం. బుధవారం అర్ధరాత్రి దాటితే, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సహాధ్యాయులతో ఎలా అందుబాటులో ఉండాలి?.. ఒక్క మీట నొక్కగానే.. తమ ప్రపంచం తెగిపోతుందనే భయం ఈ పల్లెటూరి పిల్లాడిని వెంటాడుతోంది. ఉల్లంఘిస్తే భారీ జరిమానా బుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఉన్నవారు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్‌చాట్, త్రెడ్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ తదితర ప్లాట్‌ఫాంలలో ఖాతాలను కలిగి ఉండకుండా చట్టం నిషేధిస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, ఆయా ప్లాట్‌ఫాంలపై 32.9 మిలియన్ల వరకు భారీ జరిమానాలు విధిస్తారు. ‘మెటా’.. ఇప్పటికే అనుమానిత యువకుల ఖాతాలను తొలగించడం ప్రారంభించింది. రిలేకు.. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ ఏ క్షణమైనా తనను తొలగిస్తారేమోనని భయపడుతున్నాడు. ఇదీ చదవండి: ఉల్లి, వెల్లుల్లి తెచ్చిన తంటా, 11 ఏళ్ల బంధానికి స్వస్తినా కొడుక్కి సాయం చేసేదే లేదు.. రిలే తల్లి, స్కూల్ టీచర్ అయిన సోనియా అలెన్ మాత్రం.. నిషేధాన్ని తప్పించుకోవడానికి తన కొడుక్కి సహాయం చేయనని స్పష్టం చేసింది. అయితే, ఇతర తల్లిదండ్రులు సహాయం చేస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో రిలే.. అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో మునిగితేలుతూ హోంవర్క్ చేయనందుకు, రెండు నెలలపాటు అతని సోషల్ మీడియాను ఆమె నిషేధించింది. ‘అప్పటినుంచే తన కొడుకు మరింత బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగించడం నేర్చుకున్నాడు’.. అని అలెన్ గుర్తు చేసుకుంది. ఏప్రిల్‌లో 16 సంవత్సరాలు నిండనున్న రిలే.. ఈ నిషేధం లక్ష్యాలను అర్థం చేసుకున్నానని, అయితే వాటిని సాధించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశాడు. చిన్న పిల్లలు నిద్రకు దూరం కాకుండా, రాత్రి 10 గంటల నుండి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తప్పనిసరిగా నిషేధించాలని సూచించాడు.హైకోర్టులో టీనేజర్ల పోరాటం రిలేకు.. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆగస్టులో 16 ఏళ్లు వచ్చే నోహ్ జోన్స్. మరో విద్యారి్థని మేసీ నైలాండ్లు ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. ఈ చట్టం అక్రమంగా 2.6 మిలియన్ల యువ ఆ్రస్టేలియన్ల రాజకీయ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును లాగేసుకుంటుందని వారు వాదిస్తున్నారు. కాగా, సోషల్ మీడియా వల్ల తమ పిల్లలకు కలుగుతున్న హానిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని ఆ్రస్టేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 140 మందికి పైగా అంతర్జాతీయ విద్యావేత్తలు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు రాసిన బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పునిషేధం దాటేస్తారు: నిపుణుల హెచ్చరిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అధ్యక్షుడు జాన్ రూడిక్.. ఈ నిషేధం అమలులోకి రాకుండా కోర్టు నిషేధాజ్ఞ కోసం ప్రయతి్నంచాలని భావించారు, కానీ న్యాయవాదుల సలహా మేరకు విరమించుకున్నారు. ఈ రాజ్యాంగ సవాలుపై పూర్తిస్థాయి విచారణ ఫిబ్రవరి చివరిలో జరగనుంది. పిల్లలు ఈ నిషేధాన్ని తప్పించుకోవడానికి వీపీఎన్‌లను ఉపయోగించి తమ స్థానాన్ని మార్చుకుంటారని ఆయన అంచనా వేశారు. ‘పిల్లలు దీన్ని తప్పించుకుంటారు, ఆ తర్వాత వారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా, మరింత ప్రమాదకరమైన ’అండర్‌గ్రౌండ్’ సోషల్ మీడియాను ఉపయోగిస్తారు’.. అని రూడిక్ హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ విపత్తు ముడివేసిన వైవాహిక బంధం..!
కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్‌లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్‌స్టోరీని పంచుకున్నారు. రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..2008లో వెంచువాన్లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్‌లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్‌కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్‌తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్ విధి ముడివేసిన బంధం..తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?) -
ఇండిగో సంక్షోభం : చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్
దేశవ్యాప్తంగా వరుసగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్లతో విమానయానరంగంలో గతంలో ఎన్నడూ చూడని తీవ్ర సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దవ్వడంతో ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి పిల్లాపాపలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అటు విమానాలు రద్దు, ఇటు సమయానికి రైళ్లు దొరక్క నానా కష్టాలపడుతున్నారు. దీనికి తోడు భరించ లేని ఆర్థిక భారం. చేతగానితనం, నిర్లక్ష్యంతోనే ముప్పుఇండిగో విమాన సర్వీసుల రద్దు, టికెట్ ధరల భారీ పెరుగుదలపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత గందర గోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేక పోవడపై ప్రయాణికులు మండిపడ్డారు. మరోవైపు మంత్రి అసమర్థత వల్లే ఈ సంక్షోభం నెలకొందని, విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు, విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇండిగో అంతర్గత సమస్యలపై మంత్రి స్పందించడంలో విఫలమయ్యారని, రెండు నెలల ముందే పైలట్ల సంఘం హెచ్చరించినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. అటు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ్యాయని విమర్శించారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లుకేంద్రమంత్రి వైఫల్యమా? ఇండిగో వైఫల్యమా? అనేదానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎయిర్‌లైన్స్ లోపాలను సరిదిద్దడానికి, నియంత్రించడానికి ఏర్పాటు చేసింది డీజీసీఏ (DGCA). మరి పైలట్ల పని గంటలు, విశ్రాంతిపై కచ్చితమైన మార్గనిర్దేశాలను ఇచ్చినప్పటికీ ఇండిగో ఎందుకు అమలు చేయలేదు. తీవ్ర సంక్షోభం వచ్చేదాకా ఎందుకు నియామకాలు చేపట్టలేదు. ఏ పైలట్ ఎన్ని గంటలు fly చేస్తున్నాడు అనే సమాచారం రియల్ టైంలో విమానశాఖ వద్ద ఉంటుంది. దీంతోపాటు ఏయే సంస్థ దగ్గర ఎంత మంది పైలట్స్ ఉన్నారో రెగ్యులేటరీ దగ్గర పూర్తి డేటా ఉంటుంది. ఇండిగోలో పైలట్ల కొరతనుగుర్తించడంలో అటు విమాన యాన శాఖ, ఇటు డీజీసీఏ వైఫల్యం, ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముందస్తు సమీక్షలు చేయని నిర్లక్ష్యం, పరిస్థితిని అంచనావేయడంలో ఘోర వైఫల్యమే ఇంతటి సంక్షోభానికి దారి తీసిందంటున్నారు. రామ్మోహన్ నాయుడు చేతగానితనంతోనే దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారిందని పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రి రామ్మోహన్ నాయుడుకి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ప్రయాణీకులకు ఇన్ని కష్టాలొచ్చేవి కావని మరికొంతమంది మండి పడుతున్నారు. కబుర్లే గానీ, పనితనం లేదు‘‘కుర్రాడికి కాళ్ళు ఎక్కడా భూమి మీద నిలవటం లేదు, ఇటువంటి స్ట్రోక్ అవసరం ఎంతైనా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చెయ్యటం స్పీచులు ఇచ్చినంత ఈజీ కాదు, మా బెజవాడ ఎయిర్‌పోర్ట్‌లో అతని పనితనం చూశాం, అప్పుడే అనుకున్నాను ఈ కుర్రాడు కబుర్లు బాగా చెబుతాడు కానీ పనిమంతుడు కాడు అని జీవితంలో ఎయిర్‌ఫోర్ట్‌లో మొహం చూడని వాళ్ళు అతన్ని తిడుతున్నారు అని పోస్టులు చూసాను, జీవితంలో విమానాశ్రాయం మొహం చూడని వాళ్ళు కూడా అతన్ని గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు’’ అని మూడు రోజులు నుంచి విమానాలు దొరక్క, ట్రెయిన్స్ దొరక్క భోపాల్ లో ఇరుక్కు పోయిన ప్రయాణికుడి ఆవేదన ఇది. రీఫండ్లు ఇస్తారు సరే, మా కష్టాల మాటేమిటి? మా ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారు? మానసిక క్షోభకు ఎవరు విలువ కడతారు అంటూ బాధిత ప్రయాణీకుల ప్రశ్నలకు రామ్మోహనాయుడి దగ్గర సమాధానం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో వందలామంది ప్రయాణీకుల సజీవ దహనమైన ఎయిరిండియా విషాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని ఘోరాలు జరగముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉంటే చర్యలు తీసుకుంటున్నాం.. సమీక్షిస్తున్నాం అని కేంద్ర మంత్రి ఊదర గొడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇండిగో విమానాల రద్దుకు ఫుల్ స్టాప్ పడలేదు. కొంతమంది రీఫండ్లు, లగేజీలు పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఇండిగో క్రమంలో స్థిరీకరణలోకి వస్తున్నాయంటూ ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. విమానయాన రంగాన్ని సంరక్షిస్తాం, ప్రయాణీకుల భద్రతను కాపాడతాం అంటూ, ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్న వైనాన్ని మనం చూడవచ్చు. -
హార్న్‌బిల్ ఫెస్టివల్..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!
నాగాలాండ్ రాష్ట్రంలో డిసెంబర్ రాగానే తొలివారం హార్న్‌బిల్ ఫెస్టివల్ మొదలైపోతుంటుంది. ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశీయలు తండోపతండాలు వస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగలలో ఉండే ఫుడ్ మెనూ చూస్తే నోరెళ్లబెడతారు. ఆ వంటకాలు చూసి..ఇవేం రెసిపీల్రా బాబు అని అనుకోకుండా ఉండలేదు. పాపం అలానే ఫీలయ్యాడు ఈ విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. నాగాలాండ్ హార్న్‌బిల్ ఫెస్టివల్ వివిధ రంగు రంగుల సంస్కృతుల సమాజాలు, సాంప్రదాయంతో శక్తిమంతంగా ఉంటాయి. నాగాలాండ్ కోహిమా నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిసామా హెరిటేజ్ విలేజ్‌లో జరిగే పది రోజుల కార్యక్రమం. ఈ పండుగ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ పండుగలో కనిపించే ప్రత్యేకమైన ఆహార వంటకాలు అత్యంత హైలెట్ అని చెప్పొచ్చు. యూకేకి చెందిన వ్లాగర్ అలెక్స్ వాండర్స్ ఈ వేడుకలో పాల్గొని అక్కడి రెస్టారెంట్‌లోని అసాధారణ ఫుడ్ మెనూ గురించి నెట్టింట వీడియో రూపంలో షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను భారతదేశంలోని హార్న్‌బిల్ ఫెస్టివల్లో ఉన్నానని పేర్కొన్నాడు. నా మొత్తం లైఫ్‌లో చూసి అత్యంత క్రేజీ మోనూలో ఇది ఒకటి. నాకు ఆ మెనూలో కనిపించిన 22 వంటకాలను చూసి నోటమాట రాలేదని అంటున్నాడు. బార్బెక్యూ పోర్క్, పోర్క్ ఇన్నార్డ్స్, అనిషితో పంది మాంసం, ఆక్సోన్తో పంది మాంసం, బియ్యం లేదా పరాఠాతో బటర్ చికెన్, బియ్యం లేదా పరాఠాతో దాల్ మఖానీ, చికెన్ లివర్ గిజార్డ్, డ్రై రోస్ట్డ్ ఫిష్, ఫిష్ పాంగ్సెన్, రొయ్యల టెంపురా మరియు మరిన్ని ఉన్నాయి. వ్లాగర్ దృష్టిని ఆకర్షించినవి నత్త, పట్టు పురుగు, మిడత, సాలీడు, వెనిసన్ (జింక మాంసం), పంది మాంసం, గేమ్ బర్డ్(మాంసం), పామ్ సివెట్ పిల్లి మాంసం వంటి వంటకాలు ఉన్నాయి. ఇలాంటివి తింటారా ఈ పండుగలో అని విస్తుపోయానంటున్నాడు యూకే వ్లాగర్. నెటిజన్లు మాత్రం మాదేశంలో విభిన్న సంస్కృతులకు నెలవు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిదానిలో స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.హార్న్‌బిల్ ఫెస్టివల్:హార్న్‌బిల్ ఫెస్టివల్ అనేది ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకునే వార్షిక పండుగ. ఈ పండుగ నాగాలాండ్‌లోని అన్ని జాతుల సమూహాలను సూచిస్తుంది. దీన్ని పండుగల పండుగ అని కూడా పిలుస్తారు. రంగురంగులుగా పెద్దగా ఉండే అటవీ పక్షిపేరు మీదుగా ఈ పండుగకు పేరు పెట్టారు. నాగాలాండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, అంతర్-జాతి పరస్పర చర్యను ప్రోత్సహించడానికి, అక్కడి ప్రభుత్వం డిసెంబర్ తొలివారంలో హార్న్‌బిల్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by Alex Wanders (@alexwandersyt) (చదవండి: ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!) -
16 ఏళ్ల వయసు.. ఆ తల్లిదండ్రుల గుండెకోత నుంచి పుట్టిందే ఇది!
ప్రపంచంలో.. మొట్టమొదటిసారిగా టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తోంది ఆస్ట్రేలియా. మరో రెండు రోజుల్లో (డిసెంబర్ 10) ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి రానుంది. ఈ దరిమిలా ప్రపంచమంతా ఇది ఎలా అమలు కానుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మిగతా దేశాలు తమ బాటలో పయనిస్తాయని తానేం ఆనుకోవడం లేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అంటున్నారు. అంతేకాదు.. తాము తీసుకున్నది పరిపూర్ణమైన నిర్ణయమేమీ కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సో.మీ. నిషేధంపై తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టత ఇచ్చారు. ‘‘ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకుంటే మీరు పొరపడినట్లే. సో.మీ. ప్రభావం వల్ల ప్రభావితమైన.. వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారు. ఇది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ.. సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసే చట్టం’’ అని అల్బనీస్ పేర్కొన్నారు. ..అలాగని మేం దీనిని పరిపూర్ణమైన నిర్ణయం అని అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు. ఈ చట్టంలో లోపాలున్నా ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అంటన్నారు. ఈ మేరకు పిల్లల భద్రతకు అవసరమైన అడుగుగా భావిస్తున్నాం అని అన్నారాయన. పిల్లల మానసిక ఆరోగ్యం .. భద్రత నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ నిర్ణయాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారా? అని అడగా.. అలా తాము భావించడం లేదని, అది ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఉంటుందని.. అయితే పాటిస్తే మాత్రం తప్పకుండా మేలే జరుగుతుందని అంటున్నారు. సోషల్ మీడియా వాడకానికి మినిమమ్ ఏజ్ (Online Safety Amendment Bill 2024)ను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే మొదటిసారి అమలు కాబోతోంది. దీని ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్(ట్విటర్) వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు($49.5 మిలియన్.. మన కరెన్సీలో రూ.4,500 కోట్ల దాకా జరిమానా) చెల్లించాల్సి వస్తుంది.తల్లిదండ్రుల బాధను విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అల్బనీస్ మరోమారు స్పష్టం చేశారు. పిల్లలను ఆన్లైన్ బులీయింగ్(వేధింపులు), హానికర కంటెంట్‌కు దూరంగా ఉంచడం.. తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్ ఉద్ఘాటించారు. స్క్రీన్లకు అతుక్కుపోకుండా.. పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి నిజజీవిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సవాళ్లు.. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని.. సంబంధిత డాక్యమెంట్లనూ పరిశీలిస్తామని సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లు చెబుతున్నాయి. అయితే.. అదెంత వరకు వీలవుతుందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN)లు వాడడమో.. లేదంటో ఫేక్ అకౌంట్లు వాడో నిబంధల్ని అతిక్రమించే అవకాశం లేదా? అనేది మున్ముందు తెలిసేది.రియాక్షన్లు ఇవిగో.. టీనేజర్ల సో.మీ. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం.. ఓ అతినియంత్రణేనని కొందరు ఆస్ట్రేలియన్ మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని యువత నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది టీనేజర్లు ఈ నిషేధం వల్ల ఆన్లైన్ బులీయింగ్, హానికర కంటెంట్ తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా చూస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం “ఇది బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు” అని.. అంటే పూర్తిగా మంచిదీ చెడిదీ అని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. -
క్యారెట్స్, ఆపిల్స్ తీసుకువెళ్లడం ఎంత పనైపాయే..! ఆ ఎలుగుబంటి..
సర్క్స్లోనూ, పార్క్‌ల్లోనూ జంతవులకు సంబంధించిన ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉన్నా..వాటిని కంట్రోల్ చేయలేం. అందువల్ల జంతువుల సంరక్షకులు ఆ విషయంలో బీకేర్ఫులగా ఉండాలి. లేదంటే ఈ కీపర్‌కి పట్టిన గతే పడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.అసలేం జరిగిందంటే..చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్జౌ సఫారీ పార్క్‌లో జంతువుల సర్కస్‌కి సంబంధించి లైవ్ ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల ఎలుగుబంటి జూ కీపర్‌పై దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. ఈ అనూహ్య ఘటనకు తేరుకుని అక్కడున్న మిగతా సిబ్బంది ఆ జూకీపర్‌ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు. కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఏదోలాగా జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించి..దాన్ని సెల్‌లోకి తరలించారు. అది జూకీపర్ సంచి నిండా యాపిల్స్, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసిందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే ఆ ఎలుగుబంటి దాడిలో సదరు జూకీపర్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదని, అలాగే ఆ ఎలుగుబంటి కూడా సురక్షితంగానే ఉందని జూ నిర్వాహకులు తెలిపారు. ఇక ఆ ఎలుగుబంటిని పబ్లిష్ షోల నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. కానీ నెటిజన్లు లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.A zoo handler was briefly attacked by a black bear during a performance at Hangzhou Safari Park. The worker is safe, the bear has been removed from public shows, and officials say smell of treats may have triggered the animal’s reaction. pic.twitter.com/qtI38aBV0B— Open Source Intel (@Osint613) December 7, 2025(చదవండి: షీస్ ఇండియా షో..) -
అమ్మ పుట్టినరోజుని పెళ్లిలా సెలబ్రేట్ చేశాడు..!
అమ్మ అంటేనే ఓ భావోద్వేగం. సృష్టికి ప్రతిరూపం, ప్రతక్ష దైవం అమ్మే..అలాంటి అమ్మ జన్మదినోత్సవాన్ని ఏ పిల్లలైన చక్కగా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. మహా అయితే కేక్ కటింగ్ లేదా ఆమెకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేయడమో చేస్తాం. కానీ ఈ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ల అమ్మ బర్త్‌డేని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేశాడంటే..అది పెళ్లా లేక మరేదైనా..అని ఫీల్ వస్తుంది.ఆ రేంజ్లో అదిరిపోయేలా సెలబ్రేట్ చేశాడు ఆ కుమారుడు. ఆ వేడుకకు వచ్చిన వారంతా గొప్ప కొడుకు అంటూ మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ కుమారుడే ఆకాశ్ మెహాతా. తన 60 ఏళ్ల తల్లి చేతనా మెహతా పుట్టిరోజుని ఎంత ఘనంగా సెలబ్రేట్ చేశాడంటే..ఏదో పెళ్లి వేడుక అనుకునేలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఆ వీడియో క్లిప్‌లో నాలుగు భాగాల గ్రాండ్ వేడుకలు కనిపిస్తాయి. ఇందులో భక్తి, సంగీతం, ఎడారి సఫారీ, తదితర పలు విలాసవంతమైన పార్టీలతో సన్నిహితులు, బంధువర్గం ఆశ్చర్యపోయేలా జరిపాడు. అందరూ ఇది పుట్టినరోజు వేడుకలా లేదు, ఏదో పెళ్లికి వచ్చినట్లుగా ఉంది మాకు అంటూ ఆకాశ్ మెహాతాను మెచ్చుకున్నారు. అంతేగాదు అందరికీ నీలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండును అని ప్రశంసించారు కూడా. అందుకు సంబంధించని వీడియోని ఆకాశ్ మెహతా షేర్ చేసతూ పోస్టులో ఇలా రాశారు. "నా ప్రాణ స్నేహితురాలికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మాటలకు మించి నిన్ను ప్రేమిస్తున్నా అంటూ హార్ట్ ఎమోజీలను జోడించారు". ఇక నెటిజన్లు సైతం ఆ వీడియోని చూసి..అందమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షంలు. బర్త్‌డేని ఓ గొప్ప వేడుకలా చేశారంటూ ఆకాశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a) (చదవండి: సుందర దృశ్యాలకు నెలవు..! మంచు కొండల్లో మరువలేని ప్రయాణం..) -
దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్‌చేస్తే..
ఫుడ్ రెస్టారెంట్ లేదా హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా శ్రమతో కూడిన పని. అభిరుచి లేదా ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ యువకుడు చక్కగా అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని కేవలం దోసెలు అమ్మడం చాలా తృణపాయంగా వదిలేశాడు. ఇదేం ఆసక్తి అనుకోకండి. ఆయన ఆరోగ్యకరమైన రీతీలో దోసెలను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడట. వినడానికి ఏంటిది అనిపించినా..? మరి.. అంత రిస్క్ తీసుకుని ఆ యువకుడు సక్సెస్ అయ్యాడా అంటే..జర్మన్లో అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగం చేసేవాడు మోహన్. స్కాలర్‌షిప్‌పై పారిస్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అధిక వేతనంతో కూడాన ఉద్యోగాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కాదనుకుని స్నేహితులతో కలిసి దోసె రెస్టారెంట్‌ని ప్రారంభించాలనుకున్నాడు. అది కూడా ఆరోగ్యకరమైన గ్లూటెన్ రహిత దోసెలను అందించాలనే లక్ష్యంతో ఆ టెక్ ఉద్యోగాలను వద్దనుకున్నానంటూ తన స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. అలాతాను 2023లో తన దోసెమా రెస్టారెంట్‌ని ప్రారంభించినట్లు తెలిపాడు. అతను సహా వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా రెస్టారెంట్ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆకస్మిక మార్పు చాలా కొత్తగా..ఇష్టంగా ఉన్నా..చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని కూడా వివరించాడు. బాగా అలసిపోయి, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నా..ఇష్టంతో చేసే పనిలో ఆ ఇబ్బందులు పెద్ద కష్టంగా అనిపించవని అంటున్నాడు. ఇవాళ తన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణేలో కూడా శాఖలు ఉన్నాయని వీడియోలో మోహన్ చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే అతడి తపన మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది, పైగా అతడిపై గౌరవం ఇంకా పెరిపోయింది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dosamaa (@dosamaa_in) (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..) -
శునక టెక్ సేవలు
ఇకముందు... ‘కుక్కలు ఏం చేస్తాయి?’ అనే ప్రశ్నకు– ‘ఇంటికి కాపలా కాస్తాయి’ అనే ఏకైక సమాధానం మాత్రమే వినిపించక΄ోవచ్చు. ‘ఇంకా ఎన్నో చేస్తాయి’ అని చెప్పవచ్చు. కుక్కలను మరింతగా ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరే... డాగోసోఫీ బటన్. గృహోపకరణాలను శునకం నియంత్రించడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. కుక్కలు తమ యజమానులకు మరిన్ని ఇంటి పనులలో సహాయం చేయడానికి వీలుగా యానిమల్–కంప్యూటర్ ఇంటరాక్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న అప్లికేషన్‌ను రిసీవర్లో ప్లగ్ చేయాలి. తద్వారా ఫ్యాన్ ఆన్‌చేయడం, లైట్ ఆఫ్ చేయడం... మొదలైన వాటికి డాగోసోఫీ బటన్ ఉపయోగపడుతుంది. నీలి, తెలుపు రంగులో ఉన్న డోగోసోఫీ బటన్‌ను శునకానికి కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ఈ బటన్ చాలా సున్నితంగా ఉంటుంది. కుక్క తన ముక్కుతో బటన్‌ను తట్టడంతో అది యాక్టివేట్ అవుతుంది. ఇలా చేయడానికి శునకానికి కొంత శిక్షణ అవసరం ‘డాగోసోఫీ ఈ పరికరాలను మాత్రమే, ఇంత సంఖ్యలో మాత్రమే నియంత్రిస్తుందనే పరిమితి లేదు. మీ సృజనాత్మకతతో ఎన్ని పరికరాలైనా నియంత్రించేలా శునకానికి శిక్షణ ఇవ్వవచ్చు’ అంటున్నారు డాగోసోఫీ రూపకర్తలు. (చదవండి: మలబద్ధకం నివారణ కోసం..! ఈట్ ఫ్రూట్) -
రావోయి మా ఇంటికీ... టీ ఉన్నది... గరం గరం ఫుడ్ ఉన్నది!
‘అతిథి దేవోభవ’ అనే మాటకు కేరాఫ్ అడ్రస్ మన దేశం. ఈ మాటను మరోసారి నిజం చేసే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అమెరికన్ వ్లోగర్ మాల్వీనా హిమాలయ ప్రాంలోని మారుమూల గ్రామానికి వెళ్లింది. ఎవరూ పరిచయం లేక΄ోయినా, ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు గొప్ప ఆతిథ్యం దొరికింది. తమకు వచ్చిన ఇంగ్లీష్‌లోనే... ‘ప్లీజ్ డ్రింక్ టీ’ అన్నారు. ‘ప్లీజ్ టేక్ ఫుడ్’ అన్నారు. వీడియోలో... మాల్వీనా ఒక వృద్ధురాలిని పలకరిస్తుంది. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువాత మాల్వీనా బయలు దేరేముందు ‘భోజనం చేసి వెళ్లు’ అని పట్టుబడుతూ ఆ బామ్మ ఒకటికి రెండుసార్లు అడగడం నెటిజనులను కదిలించింది. ‘భోజనం వద్దు టీ చాలు’ అని అడిగింది మాల్వీనా. ఆప్యాయత, అనురాగాల రుచుల ఆ టీ ఎన్ని కోట్లు పెడితే మాత్రం వస్తుంది? ఏమంటారు మాల్వీనా! View this post on Instagram A post shared by Malvina (@malvinaisland)(చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!
మనల్ని సంతోషపరచడానికి పెద్ద పెద్ద విజయాలే అక్కర్లేదు. చిన్న చిన్న సందర్భాలు కూడా కారణం అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్ ఉదాహరణ. మోడల్ నవ్య క్రిష్ణ తల్లిదండ్రులు తొలిసారిగా తమ కూతురి ఇమేజెస్‌ను బిల్‌బోర్డ్‌పై చూసి ఎంతో సంతోషించారు. నవ్య తల్లిదండ్రుల ఎక్స్ప్రెషన్లను ఈ వీడియో స్లోగా రికార్డ్ చేసింది. బిల్‌బోర్డ్‌పై కనిపించిన కూతురి ఫొటోగ్రాఫ్‌ని చూసి... ‘ఇది నిజమేనా? మన అమ్మాయేనా!!’ అన్నట్లుగా చూశారు. ఆ తరువాత వారి సంతోషానికి అవధి లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వారి రియాక్షన్ తాలూకు వీడియో క్లిప్ నెటిజనులకు తెగనచ్చేసింది. ‘నా చిత్రాలు ఎన్నో బిల్‌బోర్డ్‌లపై కనిపించినప్పటికీ... ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఒకింత గర్వంతో, ఆనందంతో మెరిసిపోయే వారి కళ్లు నాకు అపురూపం’ అని తన పోస్ట్‌లో రాసింది నవ్య క్రిష్ణ. ‘పిల్లలు విజయాలు సాధించినప్పుడు తల్లిదండ్రుల కళ్లలో కనిపించే మెరుపు వెల కట్టలేనిది!’ అని స్పందించారు ఒక యూజర్. View this post on Instagram A post shared by ssnuk (@scrollstopnewsuk) (చదవండి: Bhavitha Mandava: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..) -
విహారంలో పుస్తకం.. రీడింగ్ రిట్రీట్
సోషల్ మీడియా ఎంత కమ్ముకున్నా పుస్తకం పునరుత్థానం అవుతూనే ఉంది. పుస్తక పఠనానికి కొత్త దారులు పడుతున్నాయి. ఏదైనా మంచి చోటుకు విహారంగా వెళ్లి పుస్తకం చదువుకుంటూ కూచోవడం ట్రెండ్‌గా మారింది. దానినే ‘రీడింగ్ రిట్రీట్’ అంటున్నారు. ఒక్కరూ, లేదా కొద్దిమంది ఏదైనా చోటుకు వెళ్లి పుస్తకాలు చదువుకుంటూ రిలాక్స్ అవుతున్న ఈ ధోరణిపై వీకెండ్ కథనం.రోజూ పనులు, హడావిడి, తీరిక లేని శ్రమ, మొహం మొత్తే పరిసరాలు... వీటి మధ్య నుంచి పారిపోయి, ఎటైనా ఏకాంత ప్రదేశంలో హాయిగా వీకెండ్స్ గడపాలనిపిస్తుంది ఎవరికైనా. అలా గతంలో చేసే వారు. ఇప్పుడూ చేస్తున్నారు. అయితే అలా వెళ్లి సరదాగా తిరగడమో, పార్టీ చేసుకోవడమో, షాపింగ్ చేయడమో కాకుండా ఏ పనీ చేయకుండా పుస్తకాలు చదువుకుంటూ కూచోవాలనుకుంటున్నారు కొందరు. ప్రశాంతమైన చోటుకు వెళ్లి అంతే ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ గడపే ట్రెండ్ పేరు ‘రీడింగ్ రిట్రీట్’. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎంతోమంది పాఠకులను ఒకచోట చేరుస్తోంది. కొందరు ఆపరేటర్లు ప్రత్యేకంగా కొన్ని చోట్లను ఇందుకై తయారు చేసి మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చదువుకోండి అని కూడా ‘ప్యాకేజ్’లు ఆఫర్ చేస్తున్నారు. వాళ్లు పెట్టే తిండి తింటూ హాయిగా చదువుకుని తిరిగి ఇల్లు చేరడమేనన్నమాట.రీడింగ్ రిట్రీట్‌కు ఎందుకు వెళ్లాలి?ఆధునిక జీవితంలో వేగాన్ని తగ్గించడం అంత సులభం కాదు. రోజూ ఏదో పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు... ఇంకా చాలా చాలా. వీటి మధ్య తీరిగ్గా పుస్తకం చదివే అవకాశం దొరకదు. సెలవుల్లో అలాంటి ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. లేదా చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉండదు. తర్వాత చదువుదాం, తర్వాత చూద్దాం అని పుస్తక పఠనాన్ని వాయిదా వేస్తుంటారు. ఆ వాయిదాను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కొందరు ఈ రిట్రీట్ ధోరణిని తీసుకొచ్చారు.రీడింగ్ రిట్రీట్ ఎక్కడ అనుకూలం?నగర జీవితంలోని రణగొణధ్వనులకు దూరంగా ఎక్కడైనా రీడింగ్ రిట్రీట్ జరుపుకోవచ్చు. ఊరి చివరి ఖాళీ ప్రదేశాలు కావొచ్చు. ప్రశాంతమైన అటవీ మార్గాలు కావొచ్చు. ఎతై ్తన కొండలు, సముద్రతీరాలు కావొచ్చు. ఊరి సమీపంలోని రిసార్ట్లు కావొచ్చు. మీకు అనుకూలమైన ప్రదేశాలు దీనికి ముఖ్యం. ఎటొచ్చీ ఎక్కువగా జనం వచ్చే ప్రదేశాలు, సులభంగా పట్టణాలను చేరే ప్రాంతాలు లేకపోవడం మేలు. అలా ఉంటే మనసు మన మాట వినదు. కనీసం ఐదారు గంటలు అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనే చోటను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మధ్యలో భోజనం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంతం ఉండాలి. రీడింగ్ రిట్రీట్‌లో ఎంతమంది? ఈ రీడింగ్ రిట్రీట్‌లో ఇంతమంది ఉండాలన్న నిబంధనేమీ లేదు. ఇద్దరితో మొదలుకొని ఎంతమందైనా ఉండొచ్చు. అయితే వారంతా పాఠకులై ఉండాలి. మీరంతా కలిసి ఒకచోటును ఎంపిక చేసుకొని, అక్కడికి వెళ్లి, ఎవరి పుస్తకంలో వారు మునిగిపోవచ్చు. అయితే నిజంగా పఠనం మీద ఆసక్తి ఉన్నవారినే ఎంచుకోవడం ఉత్తమం. అప్పుడే మీకు ఇబ్బంది ఉండదు. ఇటీవల కాలంలో రీడింగ్ రిట్రీట్ను ఏర్పాటు చేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మీరంతా ఒక బృందంగా ఏర్పడి, వారిని సంప్రదిస్తే మీ సంఖ్య, అభిరుచికి తగ్గట్లు వారే ఓ ప్రాంతాన్ని సూచించి, అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇవి చేయడం తగదు→ పుస్తక పఠనంపై ఆసక్తి లేకుండా రీడింగ్ రిట్రీట్‌కు వెళ్లడం సరికాదు. దీనివల్ల పక్కవారి ఏకాగ్రతను దెబ్బతీసినట్లు అవుతుంది. → ఒక్కొక్కరు ఒక్కోరకమైన సాహిత్యాన్ని ఇష్టపడతారు. అక్కడికి వెళ్లాక ఈ విషయంలో ఎవరితోనూ వాదించకూడదు. → మీరు ఎన్ని పుస్తకాలు చదవగలరో అన్ని తీసుకెళ్లాలి. అక్కడికి వెళ్లాక పుస్తకాల కోసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు. లేదా వారి అనుమతితోనే వారి పుస్తకాలు తీసుకోవాలి. → అక్కడికి వెళ్లాక ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి వాడకూడదు. అది ఆ కార్యక్రమం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ ఆఫ్ చేయలేకపోతే సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. → ఇతరులతో వాదించడం, గట్టిగా చర్చించడం, ఇతరులు చదువుతున్న పుస్తకాలను హేళన చేయడం, పుస్తకంలోని అంశాలను ముందుగానే వివరించడం, వాటి గురించి తేలిగ్గా మాట్లాడటం అస్సలు చేయకూడదు. -
ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటి
సాధారణంగా తల్లిదండ్రులనో, తమ జీవిత భాగస్వాములనో జీవితంలో మొదటి సారి విమానం ఎక్కించి, వారికి చక్కటి అనుభవాన్ని అందించాలని చాలామంది కోరకుంటారు. కానీ తమ ఇంటిలో సహాయకులకు మరపురాని అనుభవాన్ని అందించేఘటనలు చాలా అరుదు. నటి అర్చన పూరన్ సింగ్ మంచిమనసును చాటుకున్న వైనం నెట్టింట ఆకర్షణీయంగా నిలుస్తోంది.నటి అర్చన పూరన్ సింగ్ ఇటీవల తన హౌస్ కీపర్ భాగ్యశ్రీకి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందించింది. ఆమెను మొట్టమొదటిసారి విమానంలో ప్రయాణించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.రాత్రిబాగా నిద్రపోయి భాగ్యశ్రీ పనికి లేటుగా రావడం,విమానాశ్రయంలో భోజనం కోసం ఆగినప్పుడు, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే మూవీలోని జోక్‌లు మొదలు, విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా తన సీట్ బెల్ట్ బిగించుకోవడానికి సహాయం చేయమని అర్చన భాగ్యశ్రీ పక్కన ఉన్న ప్రయాణికుడిని అడగడం, నేను వేసుకున్నా అని భాగ్యశ్రీ చెప్పడం, సూట్ కేస్ మిస్ అయిందనే జోకులతో పాటు ఎన్నో సన్నివేశాలు ఈ వీడియోలో చూడవచ్చు. టేక్ ఆఫ్ అప్పుడు కొద్దిగా భయమేసింది అందరూ నా వైపే చూశారు. కానీ ఒక్కసారి విమానం ఆకాశంలోకి ఎగిరాక మేఘాల్లో తేలినట్టు ఉంది అంటూ భాగ్యశ్రీ తన ప్రయాణ అనుభవంపై ఉత్సాహంగా మాట్లాడింది. -
రోడ్డుపై రాయి.. రూ.5 వేల ధర ఎలా పలికిందంటే..!
రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు. టాలెంట్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా ఓ రాయిని అద్భతమైన వస్తువుగా తీర్చిదిద్ది ప్రశంసలందుకోవడమే కాదు వేలల్లో డబ్బుని కూడా ఆర్జించాడు. ఢిల్లీకి చెందిన ఒక యువకుడు రాయిని ఇంటి అలంకరణకు ఉపకరంగా ఉండే వస్తువుగా మార్చాడు. అతడి నైపుణ్యానికి అంతా విస్తుపోయారు కూడా. రోడ్డుమీద పడి ఉన్న రాయిని అద్భుతమైన గడియారంగా మార్చాడు. రాయి చివరి అంచులను పాలిష్ చేసి అందంగా మార్చాడు. గడియారం సూదిని అటాచ్ చేసేందుకు, ఇతర పరికరాలను సెట్ చేసేందుకు రంధ్రాలు చేశాడు. అలాగే ఆకర్షణీయంగా కనిపించేలా పెయింట్ వేశాడు. చివరగా సూది, బ్యాటరీ చొప్పించి.. రాతితో రూపుదిద్దుకున్న ఫంక్షనల్ గడియారాన్ని డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆ గడియారాన్ని పలువురికి చూపించినా..ఎవరూ ప్రశంసించలేదు, కొనేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. దాంతో మరికొన్ని మార్పులు చేసి అమ్మకానికి పెట్టగా కూడా పరిస్థితి అలానే ఉంది. దాంతో ఆ యువకుడి గడియారంతో రోడ్డుపై నిలబడి అమ్మేందుకు ప్రయత్నించగా..చాలామంది రూ. 460కి అడగారు. మరి అలా అడగటం నచ్చక..ఇది రాయితో తానే స్వయంగా చేతితో చేసిన గడియారం అని చెబుతుంటాడు. అది విని ఆసక్తిగా ఒక వ్యక్తి ఆ యువకుడి వద్దకు వచ్చి ధర ఎంత అని అడగగా రూ. 5 వేలు అని చెప్పగానే మారుమాట్లడకుండా డబ్బు చెల్లించి మరి ఆ గడియారాన్ని కొనుగోలు చేశాడు. అంతేగాదు ఆ రాయిని సేకరించడం దగ్గర నుంచి గడియారంగా మార్చడం వరకు మొత్తం తతంగాన్ని రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji) (చదవండి: వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!) -
వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!
సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు. సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్ ఈ పెళ్లి వేడుకలో సడెన్‌గా మైక్ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్‌లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shaadi Reelz | Wedding Content Creator (@shaadireelz) (చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్‌గా హర్ష్ గోయెంకా పోస్ట్) -
పేరు మార్చేసుకున్న ఇండిగో?!
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది కూడా. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈతరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా హాస్యస్పదంగా చేసిన పోస్ట్ హాట్‌టాపిక్ మారింది.ఆ పోస్ట్‌లో వరసగా నాలుగో రోజున కూడా విమాన సర్వీసులు అంతరాయం కొనసాగుతుండగా, గోయెంకా ఎయిర్‌లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగతున్న విమాన సర్వీసులు అంతరాయం నేపథ్యంలో తమ ఎయర్‌లైన్స్ పేరు మార్పు అంటూ.. “ఇట్ డిడ్న్'ట్ గో”, అని సరదాగా ఇలా పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లో ఈ పోస్ట్వైరల్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు ఈ జోక్‌ను మన నిరాశను ప్రతిబింబిస్తుందని చెప్పడం విశేషం. భారతదేశంలోని అతిపెద్ద విమానాయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టిక్కెట్ల ధరల అమాంతం పెరిగేందుకు కారణమైంది. ఇక గోయెంకా చేసిన పోస్ట్ విమానాల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కకుపోయిన ప్రయాణికులను ఎంతాగానో ఆకట్టుకుంది. నెటిజన్లంతా "ఇండిగో ఇండిగో నుంచి ఇట్ డిడ్ డిట్ గోకు వెళ్లడం క్రేజీగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తదుపరి అప్డేట్ పేరు మార్పు కాదని ఆశిస్తునన్నాం అలాగే ఇక ఈ ఆలస్యం కొనసాగదని ఆశిస్తున్నాం అని పోస్టులు పెట్టారు. కానీ కొంతమంది విమాన చరిత్రలోనే ఇంతలా విమాన సర్వీసుల రద్దు అనేది భలే ట్విస్టింగ్‌గా ఉన్నా..బహుశా లోగో కూడా రీబ్రాండ్ కోరుకుంటుందేమో అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ విమాన సర్వీసులు అంతరాయం పూర్తిగే తగ్గే వరకు గోయెంకా పోస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది కాబోలు.Name change announced…. pic.twitter.com/Pd3JJiE6CG— Harsh Goenka (@hvgoenka) December 5, 2025 (చదవండి: ఏఐ చాట్‌బాట్‌తో జర జాగ్రత్తోయ్..!) -
రెండున్నర నెలల భారత్ పర్యటనలో గమనించింది ఇదే..!
అమెరికా భారత్ మధ్య సాంస్కృతిపరంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా ఎంతలా ఆ వ్యత్సాసం ఉంటుదనేది తెలియదు. అయితే ఇటీవల భారత్‌లో గడిపి వెళ్లిన ఇద్దరు పిల్లలు తల్లి ఆ విభిన్నతను క్షుణ్ణంగా గమనించి మరీ నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటో తెలిస్తే మాత్రం ఇంత తేడా ఉందా ఇరు దేశాల మధ్య అనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. రెండున్నర నెలల పర్యటన కోసం కుటుంబంతో సహా భారత పర్యటన వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి అన్నా హాకెన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనకు రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుగానీ, వాస్తవికంగా అదెలా అనేది స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఈపర్యటనలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటూ ఆ ఇరుదేశాల వ్యత్యాస జాబితా గురించి వివరించింది. ఆమె గమనించి తొమ్మది తేడాలు ఏంటంటే..హాంకింగ్: అమెరికాలో హాంకింగ్ అంటే వేరే అర్థం వస్తుంది, కానీ భారతదేశంలో, హాంకింగ్ అంటే, "హాయ్, నేను ఇక్కడ ఉన్నాను, చూడండి, ధన్యవాదాలు". అని అర్థం. మాటిమాటికి గట్టిగా అరుస్తు మాట్లాడతారని అర్థం.ఆహారం: అమెరికాలో, కారం అంటే తేలికపాటి వేడి అని అర్థం. కానీ భారతదేశంలో, కారం అంటే కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీయులకు.ప్రజలు: యూఎస్ఏ మనం ఉన్నట్లు ఎవ్వరూ గుర్తించరు, పైగా గమనించనట్లు నటిస్తారు. అదే భారత్‌లో అవతలి వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే కుతుహలం ఎక్కువ.చెత్త: USAలో చెత్త డబ్బాల్లో చెత్త ఉంటే భారతదేశం దీని గురించి స్పష్టంగా చెప్పలేము. అది ప్రాంతం బట్టి మారిపోతుంటుంది.కార్లు: యూఎస్‌లో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారు. కానీ భారతదేశంలో బయట నుంచి వచ్చేవారికి అర్థంకానీ గందరగోళంగా కనిపిస్తుంది.వాతావరణం: అమెరికా - శీతాకాలం, వసంతకాలం, వేసవి, చాలా ప్రదేశాలలో శరదృతువు; భారతదేశం: వేడి అది కూడా ఆశ్చర్యకరమైన రేంజ్లో అదనపు వేడి ఉంటుంది.మతం: అమెరికా - ఎక్కువగా కాథలిక్ చర్చిలు, నిశ్శబ్ద సమావేశాలు; భారతదేశం: ప్రతిచోటా దేవాలయాలు, నగరాలను ఆక్రమించే పండుగలు.స్థోమత: యూఎస్‌లో ప్రతీది ఖరీదైనది, కానీ భారత్‌లో పర్లేదు, నిర్వహించగలం.కుటుంబం: అమెరికా - ఒకే కుటుంబ జీవనం; భారతదేశం - ఒకే చోట బహుళ తరాలు చూడొచ్చు. ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు.."మా దేశానికి అపరిచిత వ్యక్తే అయినా..మీరు చాలా క్షుణ్ణంగా వ్యత్యాసాలను గమనించారు . చాలా గ్రేట్." అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Anna Haakenson | Adventure Family Travel (@wanderlust.haaks) (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్‌కు..!) -
‘బ్రేక్‌ఫాస్ట్ రారాజు’.. ఇంటర్నెట్లో ఆసక్తికర యుద్ధం
ఆహారం.. కేవలం ఆకలిని తీర్చుకునే పదార్థమే కాదు.. జీవితం, సంస్కృతి,చరిత్రల ప్రతిబింబం. ప్రపంచంలోని ప్రతి మూలనా ఆహారం ఒక భాషగా పరిణమించింది. తరతరాలుగా అందిన ఆహార కథలు సంప్రదాయాలను తెలియజేస్తాయి. పండుగలలో కుటుంబంతో పాటు పంచుకునే విస్తృతమైన విందుల నుండి, రోడ్ల పక్కన దొరికే అల్పాహారం వరకు.. మనం తినే ప్రతి వంటకం ఆ ప్రదేశపు గుర్తింపును,చరిత్రను తెలియజేస్తుంది. ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లను అధిగమిస్తూ బెంగళూరు ‘ఉత్తమ ఆహార నగరం’గా నిలిచింది. నెట్టింట మరో యుద్ధానికి దారి తీసింది.స్కాటిష్ కంటెంట్ సృష్టికర్త హ్యూ ఆన్లైన్లో ‘హ్యూ అబ్రాడ్’గా పేరొందారు. తన ఆహార రుచుల పరిశోధన తరువాత ఆయన బెంగళూరుకు పట్టంకట్టారు. బెంగళూరులో లభ్యమయ్యే అల్పాహారాలలో ముఖ్యంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల క్లాసిక్ కలయిక, తన హృదయాన్ని దోచుకుందని హ్యూ ఆనందంగా తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యూ భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాల మీదుగా వారాల తరబడి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలతో పాటు బెంగళూరులను సందర్శించారు. అల్టిమేట్ ఫుడ్ సిటీ?భారతదేశ పర్యటన ముగించుకున్న ఆయన పాకిస్తాన్‌కు కూడా వెళ్లారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఈ రెండు దేశాల ఆహారాన్ని పోల్చుతూ నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్లో, ఒక అభిమాని భారతదేశంలో ‘అల్టిమేట్ ఫుడ్ సిటీ’ ఏదని అడిగారు. దీనికి సమాధానంగా హ్యూ.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార పర్యాటక ప్రాంతాలను పక్కన పెట్టి, బెంగళూరు పేరును వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరులో లభ్యమైన అల్పాహారానికి ఫిదా అయిన ఆయన అల్టిమేట్ ఫుడ్ సిటీ కిరీటం బెంగళూరుకే దక్కుతుందన్నారు. అక్కడ తాను తాగిన ఫిల్టర్ కాఫీ, తిన్న దోసెలు, ఇడ్లీలు మరో ప్రపంచాన్ని చూపించాయని ఆయన అన్నారు. తన ఈ ప్రయాణంలో బెంగళూరులోనే తాను ఆహారాన్ని అమితంగా ఆస్వాదించానని స్పష్టం చేశారు.గుర్తుకొస్తే చాలు..దోసె వేసే తీరును, రుచిని ఆయన వర్ణిస్తూ ‘దోసెలు.. గ్లాస్ మాదిరిగా పారదర్శకంగా క్రిస్పీగా ఉంటాయి’ అని వివరించారు. అదేవిధంగా ఇడ్లీలు నోటిలో పెట్టుకోగానే కరిగిపోతాయని అభివర్ణించారు. ఆ వంటకాల గురించి ఆలోచిస్తుంటే మళ్లీ ఆకలిని పెరుగుతున్నదన్నారు. హ్యూ ఆహార తీర్పు వెలువడిన వెంటనే ఆన్లైన్లో అది చర్చకు దారితీసింది. బెంగళూరులో నివసించే కొందరు ఉత్తర భారతీయులతో సహా పలువరు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు అల్పాహారం విషయంలో బెంగళూరు టాప్‌లో ఉంటుందని అంగీకరించారు. ఉత్తర భారతీయులు గరంగరంఒక యూజర్ తాను బెంగళూరులో నివసిస్తున్న ఉత్తర భారతీయుడినని.. దోసె, ఇడ్లీలు ఉత్తమ అల్పాహారం అని నేను అంగీకరిస్తున్నానని రాశారు. మరికొందరు ఈ వ్లాగర్ అందించిన తీర్పు కేవలం అల్పాహారం వరకే పరిమితమని రాశారు. ఆహార ప్రియులైన మరికొందరు హ్యూను భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఆహార కేంద్రాలను సందర్శంచాలని కోరారు. మరొక యూజర్ మీరు దేశవ్యాప్తంగా ఇతర ఆహారాలను కూడా ప్రయత్నించాలని, అల్పాహారం ఆధారంగా ఇలా చెప్పడం తప్పని హ్యూకు సూచించారు. మరొకరు.. పంజాబ్, యూపీలను మినహాయించి ఈ వ్యక్తి ఆహారంపై వీడియో చేశాడని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.హైదరాబాద్, ఢిల్లీ..మరో వినియోగదారు ఉత్తమ ఆహార నగరాలుగా లక్నో, హైదరాబాద్‌లను పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే హ్యూ అక్కడి కరాచీని తనకు ఇష్టమైన ఆహార నగరంగా ఎంచుకున్నారు. భారతదేశంలో బెంగళూరుకు కిరీటాన్ని పెట్టిన ఆయన ఢిల్లీని కూడా ప్రశంసించారు. అక్కడ లభ్యమైన జిలేబీ, రబ్డీని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ అంతిమంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల కలయికతో బెంగళూరు అత్యుత్తమ ఆహార అనుభూతిని అందించిన నగరంగా నిలిచిందని హ్యూ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Pakistan: అప్పు కోసం విమానయాన సంస్థ బేరం -
కంటెంట్ క్రియేటర్ అవ్వడం కోసం..రూ. 15 కోట్ల కంపెనీని అమ్మేశాడు..!
వెల్సెటిల్ అయ్యాక మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి..చక్కగా ఆర్జింగ్, సత్కారాలు, రివార్డులు పొంది కూడా మళ్లీ నచ్చిన కెరీర్ కోసం మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెడుతున్నానని చెబుతున్నాడు. వామ్మో అందుకు ఎంత ఓపిక కావలిరా బాబు అనిపిస్తోంద కదూ..!. మరి ఇంతకీ ఈ వ్యక్తి దేని కోసం ఇలా అంటే..హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ ధావన్ సక్సెస్‌కి సరికొత్త అర్థమిచ్చేలా తన కథను నెట్టింట పంచుకున్నాడు. “ఇదిగో నా కథ“ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. తనది సాధారణ విజయగాధ కాదంటూ తన ప్రస్థానం మొదలైన విధానం గురించి వివరించాడు. తాను చిన్నప్పుడూ బేకరీలకు సాస్‌లను అమ్మడం ప్రారంభించానని, పెద్దయ్యాక రిటైల్ స్టోర్‌లో పనిచేశానని చెప్పుకొచ్చాడు. అక్కడ తాను రాక్లలో చొక్కాలను మడతపెట్టి శుభ్రం చేసేవాడనని చెప్పుకొచ్చాడు. తర్వాత జీఈలో తన తొలి కార్పొరేట్ జీతం చూడగానే..ప్రపంచంపైన ఉన్నట్లు ఫీలయ్యానంటూ తాను సాధించిన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదని, సరిగ్గా ఆ సమయంలోనే తల్లిని కోల్పోయానని తెలిపాడు. అలా 18 ఏళ్లు వచ్చేటప్పటికీ ఎంఎన్సీలో పనిచేశానిట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రూ. 40 వేల రుణంతో హైదరాబాద్‌లో వాట్స్ ఇన్ ఏ నేమ్‌ను ప్రారంభించి..ఏకంగా 15 కోట్ల కంపెనీగా మార్చాడు. దాదాపు వంద ప్లస్ బ్రాండ్లు, అవార్డులు మంచి గుర్తింపు అందుకున్నానంటూ తన కథను చెప్పుకొచ్చాడు. అంతేగాదు 30 ఏళ్లకే మెర్సిడేజ్ కారు కొని తన కలను సాకారం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం దాన్ని అమ్మేసి మారుతి కారుతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను ప్రారంభించిన అన్ని కంపెనీలను అమ్మేశానని కూడా వెల్లడించాడు. అయితే తాను ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఇలా చేయలేదని, కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలనిపించి ఇలా చేశానని చెబుతున్నాడు. 39 ఏళ్ల వయసులో ఉన్న తాను కంటెంట్ క్రియేటర్‌గా కొత్తగా తన కెరీర్‌ని మొదలు పెట్టాలనుకుంటున్నా అందుకే ఇలా చేశానంటూ తన సక్సెస్ స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు గ్రేట్ ఎచివ్‌మెంట్స్ అని ప్రశంసించారు. అంతేగాదు మీ మళ్లీ కెరీర్‌ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న మీ ధైర్యం అసామాన్యమైనదని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.ఎవరీ రాజీవ్ ధావన్?ధావన్ తన పోస్ట్‌లో ఎనిమిదవ తరగతి ఫెయిల్యూర్, పది తర్వాత చదువు మానేసినట్లు చెప్పుకొచ్చాడు. కొంతకాలం తర్వాత తన చదువుని తిరిగి పూర్తిచేసినట్లు తెలిపాడు. అతని లింక్డ్ఇన్ ప్రకారం.. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: అద్భుతమైన కెరీర్ ట్రాక్ రికార్డు..! ఒకరు యుద్ధ భూమిలో, మరొకరు ఇన్విస్టిగేషన్లో..) -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్‌కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'మెహ్మాన్' అంటూ.. భారతీయుల మనసులను గెలుపొందాడు..!
కొన్ని వైరల్ వీడియోలు గొప్ప సందేశాన్ని, అద్భుతమైన ప్రేమను వ్యక్తం చేస్తాయి. అలాంటి అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయ ట్రావెల్ వ్లాగర్ కైలాష్ మీనా భారతీయ సందర్శకులు పట్ల సంస్కృతిని ప్రతిబింబించే సంభాషణను రికార్డు చేశాడు. ఆ వీడియోలో అఫ్గనిస్తాన్‌లోని జ్యైస్ కార్ట్ వద్ద కైలాష్ ఒక గ్లాసు దానిమ్మ రసం ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.ఆ తర్వాత డబ్బు చెల్లించబోతుంటే..విక్రేత మర్యాదగా నవ్వి డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. పైగా "మెహ్మాన్" అనే పదాన్ని పునరావృతం చేస్తాడు. అంటే మీరు మా అతిథి అని అర్థం. అంతేగాదు సమీపంలో నిలబడి ఉన్న ఒక స్థానిక వ్యక్తి "ఇండియా మెహ్మాన్ హై" అని గట్టిగా చెబుతూ భావోద్వేగం వ్యక్తం చేస్తాడు. ముఖ్యంగా భారతీయ ప్రయాణికుల పట్ల చూపిన ఆప్యాయతను గురించి వీడియోలో నొక్కి చెప్పడం స్పష్టంగా చూడొచ్చు. అందుకు ముగ్దుడై ఈ ట్రావెల్ వ్లాగర్ ఈ దేశం ఆతిథ్యాన్ని గుర్తిస్తూ "యే హై ఆఫ్ఘనిస్తాన్ కి మెహ్మన్నవాజీ" అని అంటాడు. అంతేగాదు తాను అఫ్గాన్ అంతటా చాలా ప్రదేశాల్లో ఈ స్థాయి ఆతిథ్యాన్నే చూశానని, మళ్లీ ఈ దేశాన్ని సందర్శించాలనుకుంటున్నా అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాదు అఫ్గాన్ దేశం ఆతిథ్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kailash Meena (@theindotrekker) (చదవండి: జేఈఈ ప్రిపరేషన్ నుంచి రాష్ట్రపతి మెడల్ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..) -
ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటూ తన అభిమానులను చైతన్యపరుస్తుంటారు. ఈసారి అలానే సరికొత్త ప్రేరణాత్మక స్టోరీతో ముందుకొచ్చారు. ఈసారి గ్రామాలకు స్ఫూర్తిని కలిగించే కథను షేర్ చేశారు. ఆ గ్రామం స్మార్ట్ డెవలప్మెంట్కి ఫిదా అవ్వతూ నెట్టింట ఎలా ఆ గ్రామం అభ్యున్నతి వైపుకి అడుగులు వేస్తూ సరికొత్త మార్పుకి బీజం వేసిందో వివరించారు. డెవలప్మెంట్ అనగానే డబ్బు, మౌలిక సదుపాయాలు ఉంటేనే సాధ్యం అనుకుంటే పొరపాటే అంటున్నారు మహీంద్రా. మరీ ఈ గ్రామం ఎలా ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచిందో తెలుసుకుందామా..!మహారాష్ట్రలోని టాడోబో నేషనల్ పార్క్ సమీపంలోని సతారా నెవార్ అనే గ్రామం ఆనంద్ మహాంద్రా మనసుని దోచుకుంది. క్రమశిక్షణకు, స్థిరమైన జీవన విధానానికి ఈ గ్రామం చక్కని రోల్ మోడల్ అంటూ ఆ గ్రామం విశిష్టత గురించి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు అర్థవంతమైన మార్పు అనేది గొప్ప నాయకత్వం, సాముహిక శక్తి నుంచి వస్తుందనేందుకు ఈ గ్రామమే ఒక ఉదాహరణ అని నొక్కి చెప్పారు.ఒకప్పుడూ ఈ సతారా నెవార్ గ్రామం ఇతర గ్రామాల మాదిరిగానే పరిశభ్రంగా లేక, వనరుల కొరతతో అధ్వాన్నంగా ఉండేది. అయితే స్థానిక నాయకుడు గజానన్ ఐదేళ్ల పాటు ఆచరణాత్మకమైన సంస్కరణల ప్రణాళికలు అమలయ్యేలా ప్రజలందర్నీ ఒప్పించి.. ఆ మార్గంలో ముందుండి నడిపించారు. ఈ గ్రామంలో మొత్తం ప్రజలకు అవసరమయ్యే ఉచిత వేడి నీటి వ్యవస్థ ఉంది. అది కూడా సౌరశక్తితో. అంతేగాదు నీటి ఏటీఎం కార్డుతో యాక్సెస్ అయ్యే కమ్యూనిటీ ఆర్ఓ వ్యవస్థ ఉంది. దీని సాయంతో శుద్ధి చేసిన తాగునీరు, అలాగే ప్రతి ఇంట్లో మీటర్‌తో కనెక్ట్ అయిన నీటి కుళాయిలు ఉన్నాయి. అలాగే ఓపెన్ డ్రెయిన్ వ్యవస్థను తొలగించారు. ప్రతి సాయంత్రం వీధులు చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే వీధి దీపాలు సైతం సౌరశక్తితో వెలుగుతాయి. అంతేగాదు ఎవ్వరైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడితే గనుక రూ. 500ల దాక జరిమాన విధించబుడుతుంది. ఇది అన్ని వయసులన వారికి వర్తిస్తుందట. ఇక్కడి పిల్లలు సైతం పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారట. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు అది మన గర్వానికి కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారట. గ్రామస్తులు ప్రతి సౌకర్యాన్ని అందరూ కలిసి నిర్వహిస్తారు, అందుకు కావాల్సిన నిధులను వారే సమకూర్చుకుంటారట. అలా సమాజ అభివృద్ధిలో పాలుపంచుకునేవారికే ఇక్కడి సౌకర్యాలను వినియోగించుకునే హక్కుని కలిగి ఉంటారట. ఇది వాళ్లంతా ఏర్పరుచుకున్న నియమం అట. ఇక్కడ పిల్లల కోసం చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఈ గ్రంథాలయంలోనే పెద్దలు కూడా సమావేశమై టీవి చూస్తూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే వెసులుబాటు కూడా ఉండటం విశేషంమార్పుకు సరైన పాఠం ఇది..ఇంతింత బడ్జెట్ కేటాయింపులతో గొప్ప మార్పు రాదని ఈ గ్రామం ప్రూ చేసిందంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు జల్లు కురిపించారు. సరైన నాయకత్వం, ఐక్యత, క్రమశిక్షణతో అసలైన అభివృద్ధి సాధ్యమని ఈ గ్రామం చెబుతోంది పైగా మోడల్ గ్రామీణ అభివృద్ధికి కార్యచరణ ఇలా ఉండాలని తన చేతలతో చెప్పకనే చెప్పింది ఈ గ్రామం. సాముహిక బాధ్యత, క్రమశిక్షణా గొప్ప ఆవిష్కరణలకు మూలస్థంభమవ్వడమే గాక జీవితాలను సైతం మారుస్తుందని ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రాThis clip has been doing the rounds.I paused to check if it was too good to be true.It isn’t.What it captures is a quiet success story in our own backyard.A village that has become a role model, not just for cleanliness or sustainability or shared amenities, but for an… pic.twitter.com/PK0HHRwBam— anand mahindra (@anandmahindra) December 1, 2025చదవండి: ‘జయ హో’..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..! -
చిట్టితల్లిపై వైఎస్ జగన్ ప్రేమ.. నెట్టింట వైరల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమ నెట్టింటకు చేరింది. గన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్‌ను చూసేందకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చారు. ఆ బాలిక చెప్పు కాలి నుంచి జారిపోయింది. అది గమనించిన వైఎస్ జగన్ ఆమె చెప్పును అందించి.. ఆ చిన్నారిని ఆప్యాయంగా స్పృశించారు. తద్వారా పిల్లల పట్ల తనకు ఉండే ఆప్యాయతను మరోసారి ప్రదర్శించారు. అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో ఆ క్షణాలను బంధించగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. Man of Simplicity – YS Jagan ✨🙏💙 pic.twitter.com/KqxTnqpEvP— Johny Kaki (@johny_kaki) December 2, 2025 -
‘జయ హో’..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..!
మన సైనికులు తీవ్రమైన వాతావరణంలో సరిహద్దులలో విధులు నిర్వహిస్తుంటారు. ఎత్తైన ప్రాంతాలలో, ప్రాణాంతకమైన మంచు తుఫానులు, హింస పెట్టే గాలులను భరిస్తూ విధులు నిర్వహిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆనందాన్ని వెదుక్కుంటారు. దీనికి తాజా ఉదాహరణ... ఆర్మీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో.ఈ వైరల్ వీడియోలో...మంచుతో కప్పబడిన ప్రాంతంలో సైనికులు క్రికెట్ ఆడుతుంటారు. మంచుముద్దలను క్రికెట్ బాల్స్‌గా ఉపయోగించి ఎంజాయ్ చేస్తుంటారు. ఎముకలు కొరికే చలిలో కూడా సైనికుల క్రీడానందం నెటిజనులను ఆకట్టుకుంది.పులిలాంటి చలి కూడా వీరి సంతోషం ముందు తోక ముడవక తప్పదు కదా! ఈ వీడియో క్లిప్ నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘జయ హో’ అన్నారు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్. ‘ఆ సైనికులు ఎవరూ మనకు తెలియదు. అలాంటి వారు మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశసరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. వారి గురించి సర్థించడమే మనం చేయగలిగింది’ అని ఒక నెటిజనుడు స్పందించాడు. View this post on Instagram A post shared by The Asian Chronicle (@theasianchronicle) (చదవండి: పర్ఫెక్ట్ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా..? సాక్షాత్తు ఐఐటీ ప్రొఫెసర్) -
బిజీ బ్యాంకులోకి అనుకోని అతిథి!
అదొక బిజీ బ్యాంకు. నిత్యం కస్టమర్ల వెయింటింగ్తో.. సిబ్బంది పిచ్చాపాటి కబుర్లతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బ్యాంకుకు అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు టేబుల్స్, బీరువాలు.. కనిపించినదానిపైకల్లా పైకి ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు.. అతిజాగ్రత్తగా ఆ అతిథిని బయటకు పంపించేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో దాటియా థారెట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓ పాము చొరబడింది. కానీ, ఎప్పుడు జరిగిందనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Snake in Punjab National Bank (PNB) Branch in Tharet, Datia near Gwalior, Madhya Pradesh. Work disrupted, staff in Panic!! @pnbindia pic.twitter.com/8wpiC1yHRQ— Hellobanker (@Hellobanker_in) November 29, 2025 -
ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్
పేరెంటింగ్‌కు సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్... ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్ అనధికారికంగా కొత్త పేరెంటింగ్ మాన్యువల్‌గా మారింది. పేరెంటింగ్‌కు సంబంధించిన సలహాల కోసం పెద్దలు, ఇరుగు పొరుగువారు, వైద్యులు, పుస్తకాల మీద ఆధారపడడం అనేది ఒక విధానం. దీనికి భిన్నంగా ఆన్లైన్ దారిలో వెళ్లడమే ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్.శిశువుకు పాలివ్వడం నుంచి పిల్లలను స్కూలుకు పంపడం వరకు పేరెంటింగ్‌కు సంబంధించి ఆన్లైన్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనసులోని సందేహాన్ని టైప్ చేస్తే చాలు సెకన్ల వ్యవధిలో వందలాది వీడియోలు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ ప్రత్యేకత ఏమిటంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది.బేబీఫుడ్, రెండు సంవత్సరాల పిల్లలకు కలర్‌ఫుల్ ప్లేట్స్, సూటబుల్ డయపర్స్... మొదలైన ఎన్నో విభాగాల ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ‘గతంలో పేరెంటింగ్‌కు సంబంధించి సందేహాలు, సమస్యలు, సవాళ్లు కుటుంబ పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం పేరెంట్స్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి సలహాల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. సోషల్ మీడియా విస్తృతస్థాయిలో పేరెంటింగ్ విధానాలను పరిచయం చేయడంతో, చిన్న కుటుంబాల వారు పేరెంటింగ్‌కు సంబంధించిన సలహాల కోసం సోషల్‌మీడియాపై ఆధారపడుతున్నారు. ట్రెండ్ సంగతి ఎలా ఉన్నా, నిజంగా ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ తల్లిదండ్రులకు సహాయపడుతుందా? లేక ఒత్తిడిని పెంచుతుందా?‘కంటెంట్‌లో కొంత భాగం పరిశోధన ఆధారితమైనప్పటికీ, ఎక్కువ శాతం ట్రెండ్ ఆధారితమైనది. పేరెంటింగ్‌కు సంబంధించి సలహాలు, సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, పర్సనలైజ్డ్ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్‌కు ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ సమానం కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్ శిశువు చరిత్ర, స్వభావం, ఆహార అలవాట్లు, ఆరోగ్య అవసరాలు తల్లిదండ్రుల మానసిక పరిస్థితులను అంచనా వేయదు’ అంటున్నారు నిపుణులు. -
జడ్జి‘మెంటల్స్’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట
సోషల్ మీడియా వచ్చిన తరువాత మనుషుల్లోని అపరిచితుడు అనేక రూపాల్లో బయటపడుతున్నాడు. ప్రతీ వాడూ జడ్జి‘మెంటల్’ అయిపోతాడు. పెచ్చుమీరుతున్న ఆన్లైన్ ట్రోల్స్ గురించి తలుచుకున్నపుడు ఇలాంటి ఆలోచనే వస్తుంది ఎవరికైనా. పెళ్లి చేసుకున్నా,విడాకులు తీసుకున్నా, తమ అభిప్రాయాల్ని ప్రకటించుకున్నా...వేధింపులే..నోటికొచ్చినట్టు కామెంట్స్ రాసేయడమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు, మనోభావాలు ఇవేవీ పట్టించుకోరు. వచ్చామా? కమెంట్ చేశామా..వికృతం అనందం పొందామా? అంతే.. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన జంట మాత్రం తమను అవమానించిన ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు.11 ఏళ్ల ప్రేమ తరువాత మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రేమ జంట రిషబ్, సోనాలి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి సంబంధించినఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి, ఆన్లైన్లో పిచ్చి పిచ్చి కామెంట్లతో వారిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని దూరం చేశారు. రిషబ్ షేర్వానీలో ప్రకాశవంతమైన గులాబీ రంగు శాలువా సఫాతో మెరిసిపోగా, మెజెంటా లెహంగాలో సోనాలీ చాలా అందంగా కనిపించారు. అయితే వరుడు నల్లగా ఉన్నాడంటూ నోరు పారేసుకున్నాడు."బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం," అని ఒకరు, డబ్బు కోసమే ఈ పెళ్లి అని మరొకరు వ్యాఖ్యానించారు. "దీదీ, ఇలా చేయడం అవసరమా అని ఒకరు, బహుశా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టుందని మరో యూజర్ ఎగతాళి చేశారు. ఈ ట్రోలింగ్ తీవ్ర కావడంతో, పోస్ట్ 30 లక్షలకు పైగా వీక్షణలను దాటేసింది. అయితే ఈ ట్రోలింగ్‌ను కలర్-షేమింగ్‌ను వ్యతిరేకిస్తూ, వారి నిజమైన ప్రేమకు, అనురాగానికి మంచి మద్దతు కూడా లభించడం ఊరటనిచ్చే అంశం.ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ట్రోలర్స్‌కు కొత్త జంట సమాధానంమామధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకు ముగిసింది. వాళ్లు ఏమన్నా మాకేమీ బాధలేదు. ఈ క్షణాన్నిమేము అస్వాదిస్తున్నామని సోనాలి ట్రోలర్స్‌ను తిప్పి కొట్టింది. రిషబ్ కూడా అదే విధంగా స్పందించారు. సోనాలిని పెళ్లాడే క్షణాలకోసం 2014 నుంచి ఎదురు చూస్తున్నానని, ఆమెను పెళ్లికూతురుగా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోవడం తన తరం కాలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉద్యోగం పుకార్లను ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కానీ నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. ఇపుడు నాకు మంచి ఆదాయమే ఉంది. కానీ నాకు ఏమీ లేనప్పుడే ఆమె నన్ను ప్రేమించింది, నా కాలేజీ రోజుల నుంచే నా శరీర రంగు, ఆకారం కంటే. ఆమె నన్ను నన్నుగానే ఇష్టపడింది. నాకు వెన్ను దన్నుగా నిలిచింది...వాళ్ల కమెంట్స్ అస్సలు పట్టించుకోను అని అన్నారు. అలాగే రిషబ్ తన చర్మం రంగు కారణంగా జీవితాంతం వివక్షను ఎదుర్కొన్నా అంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా.. నమ్మకమే పునాదిగా నిలబడిన ప్రేమను పరస్పర విశ్వాసం, అనురాగాలతో రిషబ్-సోనాలి కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగిపోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. -
సినిమా రేంజ్లో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజల్..! నెటిజన్ల ప్రశంసల జల్లు
పార్థ్ మానియార్ అనే భారతీయ వ్యక్తి న్యూయార్క్‌లోని టైమ్ స్కేర్‌లో తన భాగస్వామికి చేసిన ప్రపోజల్ సినిమాని తలపించే రోమాంటిక్ సన్నివేశం అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. బిజీ బిజీగా ఉండే టైమ్ స్కేర్కాస్తా మూవీ సెట్‌గా మారిపోయింది. అక్కడొక వ్యక్తి తన గర్లఫ్రెండ్‌కి ప్రపోజల్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా అక్కడ బాలీవుడమూవీ షూటింగ్ జరుగుతుందా అనే ఫీల్ కలుగుతంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ మూవీ కుచ్ కుచ్ హోతా హైలో కోయి మిల్ గయా అనే పాటకు పురుషుల, అమ్మాయిల బృందంతో హీరో రేంజ్లో డ్యాన్స్‌లు చేస్తూ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాడు. మొదట దాన్ని చూసి అయోమయంగా చూస్తుండిపోతుంది అతడి స్నేహితురాలు, ఆ తర్వాత తన అక్కా చెల్లెళ్లను తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తూ కనపించడంతో విస్తుపోతుంది. అతడి ప్రపోజ్ చేసిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాదు నెటిజన్లు మనసును కూడా దోచుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Parth Maniar (@theteacoder) (చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ) -
సామూహిక వివాహాల్లోనే తాళి కట్టిన సీఎం కొడుకు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన చిన్న కొడుకు అభిమన్యు వివాహాన్ని నిరాడంబరంగా చేశారు. ఈ క్రమంలో అదే వేదికపై మరో 21 జంటలకు వివాహం జరిపించి.. యువతులకు పెళ్లి సారె సైతం అందించారాయన. మోహన్ యాదవ్ చిన్న కొడుకు అభిమన్యు డాక్టర్. వధువు ఇషితా పటేల్ కూడా వైద్యురాలే. ఈ ఇద్దరు ఆదివారం తన నియోజకవర్గం ఉజ్జయిని(సౌత్) క్షిప్రా నది తీరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల కార్యక్రమంలో ఒక్కటయ్యారు. పెళ్లి కొడుకులంతా గుర్రాలపై ఉరేగింపుగా రాగా.. పెళ్లి కూతుళ్లు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా మండపానికి వచ్చారు. ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, బాబాలు, అతికొద్ది మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి హాజరైన వీఐపీలకు అక్కడికి వచ్చిన జనాలతో కలిపే భోజనాలు వడ్డించారు. అభిమన్యు-ఇషితలకు బాబా రామ్‌దేవ్ ఆశీర్వాదం.. చిత్రంలో సీఎం మోహన్ యాదవ్ కూడా(కుడి చివర)మిగిలిన జంటలకు కన్యాదాన సామాగ్రి, ఇంటి కానుకలు, మొత్తం వివాహ ఖర్చుతో సహా మొత్తం బాధ్యతను యాదవ్ కుటుంబమే భరించింది. దీనికి తోడు.. ఖరైదీన గిప్ట్‌లు తీసుకురావొద్దంటూ ముందుగానే అందరికీ సమాచారం అందించారు. పాతిక వేల మంది దాకా వివాహానికి హాజరు కాగా.. దగ్గర్లోని ఆలయానికి వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చూసుకున్నారు. వివాహాల పేరిట అర్భాటాలకు పోయి ఖర్చులు చేసే బదులు ఇలా వివాహాలు జరిగితే మంచిదని.. ప్రధానమంత్రి చెప్పినట్లుగా పెళ్లిళ్లు సాధారణంగా జరగాలని, ఇలాంటి వివాహాలు సమానత్వానికి ప్రతీకని సీఎం మోహన్ యాదవ్ సందేశం ఇస్తున్నారు. ఇలాంటి వేదికలతో తన వివాహం జరగడం మరింత సంతోషాన్ని ఇస్తోందంటూ అభిమన్యు చెబుతున్నాడు. వివాహానికి హాజరైన జంటల్లో వివిధ వర్గాల(SC, ST) జంటలు ఉండడంతో సామాజిక సమానత్వం, సామరస్యానికి మోహన్ యాదవ్ నిదర్శనంగా నిలిచారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. सादगी हो तो मोहन यादव जैसी 🔥आज मध्यप्रदेश के मुख्यमंत्री मोहन यादव जी ने ऐसा काम कर दिया, जिसकी चर्चा पूरे देश में होगी।👉 मोहन यादव जी अपने बेटे अभिमन्यु यादव—जो खुद डॉक्टर हैं—की शादी सामूहिक विवाह सम्मेलन में करा रहे हैं।👉 एक तरफ पिता पूरे सूबे के मुख्यमंत्री, दूसरी… pic.twitter.com/AaCeA2b3eO— Aniket Yadav (@teamaniketyadav) December 1, 2025 He is a CM! He could've easily afforded spending crores on his son's wedding to make it a grand political show. But CM .@DrMohanYadav51 chose to get his son married in सामुहिक विवाह ceremony in presence of sadhus & saints to bless every couple.A powerful message to society.👏 pic.twitter.com/CccDmFg0Sq— BhikuMhatre (@MumbaichaDon) December 1, 2025 -
ఏఐ కాదురా అబ్బీ.. ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా
అరేయ్.. అది ఏఐ ఎడిటింగ్ ఏమో రా!. కావాలంటే జాగ్రత్తగా చూడు.. అంటూ ఫలనా వీడియోను, ఫొటోను ఉద్దేశిస్తూ కామెంట్లు పెరిగిపోతున్న రోజులివి. చివరికి ఫ్యాక్ట్‌చెక్ సైట్లు సైతం వాటిని నిర్ధారించడంలో తడబడుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నెట్టింట వైరల్ అవుతున్న ఓ బామ్మ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పెద్దావిడ వయసు 75 ఏళ్ల దాకా ఉంటుంది. కానీ, డ్యాన్స్‌లో మాత్రం దుమ్మురేపేసింది. దీంతో అది ఏఐనేమో అని పలువురు భ్రమ పడ్డారు. అయితే నెటిజన్ల పుణ్యమాని అది ఏఐ వీడియో కాదని.. ఆమె నిజంగానే చితక్కొట్టేసిందని తెలుస్తోంది(Viral Didi). ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఆల్‌టైం హిట్స్‌లో ఒకటైన దో ఘూంట్ పిలా దే సఖియా(Do Ghoont pila de saqiya) పాటకు ఆమె వేసిన స్టెప్పులకు అక్కడున్నవాళ్లే కాదు.. నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అందునా ఉల్టాఫల్టా వేసిన స్టెప్పుకు కచ్చితంగా ఓ.. వేసుకోవాల్సిందే. ఆమెకు ఇంకా వయసు అయిపోలేదని.. ఏ మాత్రం జోష్ తగ్గకుండా వేసిన స్టెప్పులను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by 5 churrets 🚬 (@5_churrets)భక్తి గీతాల స్పెషలిస్ట్ నరేంద్ర చంచల్ పాడిన ఈ పాట కాలా సూరజ్(1985) చిత్రంలోనిది. దేశ్ గౌతమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో శత్రుఘ్న సిన్హా, సులక్షణ పండిట్, రాకేష్ రోషన్, అంజాద్ ఖాన్, అరుణా ఇరానీ.. తదితరులు ప్రధాన తారాగణం. -
అసలే ట్రాఫిక్, రోడ్డుపై అనుకోని అతిధి, వైరల్ వీడియో
సాక్షి,ముంబై: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలోంచి బైటికి వచ్చిన ఒక పులి రోడ్డుమీది తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు బెంబేలెత్తిపోయారు. చంద్రపూర్-మొహర్లి రోడ్డులోని తడోబా సమీపంలో కనిపించిన ఈ దృశ్యం పలువురిన్ని ఆశ్చర్యపర్చింది. సఫారీలలో కూడా కనిపించని ఈ దృశ్యాన్ని చూసి ఆహా ఏమి అదృష్టం అనుకుంటూ పులిని చూసి మురిసిపోయారు. ఈ సంఘటన తడోబా టైగర్ రిజర్వ్‌లోని బఫర్ జోన్లో జరిగిందీ సంఘటన.ఆకాష్ ఆలం అనే స్థానిక యువకుడు ఈ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వైరల్ వీడియో ప్రకారం తడోబా టైగర్ రిజర్వ్ పార్క్ నుండి రోడ్డుమీదకు వచ్చింది. ఒక పులి రోడ్డు మధ్యలో కూర్చుని ఉండటం వల్ల రెండు వైపులా చాలా గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. అయినా తమ కళ్ల ముందు పులి రోడ్డుపై చాలా సేపు ఉన్న దృశ్యాన్ని చూసి బాటసారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.నడి రోడ్డుపై దర్జాగా కూర్చున్న పులి వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు కూడా స్పందించారు. చంద్రపూర్ నుండి మొహర్లికి వెళ్లే మార్గం ఈ అడవి గుండా వెళుతుంది. రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవులు ఉండటం మూలంగా తరచుగా జంతువుల కదలికలు మామూలు అంటున్నారు గ్రామస్తులు. ఉదయం, సాయంత్రం వేళల్లో జంతువులు రోడ్డు దగ్గర తరచుగా కనిపిస్తాయని చెప్పారు. రోడ్డుపై అకస్మాత్తుగా అడవి జంతువులు కనపడటం, మానుషులకు, వాటికి మధ్యఘర్షణలు జరుగుతాయట. దీంతోఅటవీ శాఖ ఆ అడవి గుండా వెళ్లేవారికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం, రాత్రివేళల్లో ఈ దారి వాడకాన్ని పరిమితం చేయాలని, అలాగే వేగాన్ని నియంత్రించాలని కోరింది. ముఖ్యంగా జంతువులు ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగించ వద్దని లేదా వారి వాహనాల నుండి దిగవద్దని కోరింది. -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్‌తో సంచలనం
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్‌ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్‌ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్‌గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్‌సెట్‌ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్‌ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్‌షహర్‌లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
‘ఒంటి మీద బంగారం ఉంటుంది.. నువ్వే ఉండవ్’
కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన మనిషి ఆయన. కానీ, బంగారం మీద మోజు ప్రాణం మీదకు తెచ్చింది. నెట్టింట గోల్డ్‌మ్యాన్‌గా వైరల్ అయిన ఆయనకు ఓ ముఠా నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రూ.5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడా వ్యక్తి. దీంతో ఈ బెదిరింపుల వ్యవహారం కలకలం రేపింది.రాజస్థాన్ చిత్తోర్‌గఢ్ వ్యాపారి కన్హయ్యలాల్ ఖటిక్‌కు గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ముఠా నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కోరినంతా డబ్బు ఇవ్వకుంటే బంగారం వేసుకునేందుకు ఉండవంటూ ఆ గ్యాంగ్ మెంబర్లు ఆయనకు దమ్కీ ఇచ్చారు. దీంతో ఆయన కోట్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. తొలుత ఓ నెంబర్ నుంచి మిస్డ్‌కాల్ వచ్చిందని, ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేసి బెదిరించారని ఆయన చెబుతున్నారు. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి బెదిరించారని పోలీసులకు తెలిపాడాయన. ఆ వ్యాపారమే మలుపు50 ఏళ్ల వయసున్న కన్హయ్య మొదట్లో తోపుడు బండి మీద గల్లీలు తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్మేవాడు. తర్వాత కశ్మీరీ ఆపిల్ వ్యాపారం చేసి లాభాలు అర్జించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి(దివంగత) అంటే అతనికి ఎంతో పిచ్చి. ఆయన సంగీతంలో వచ్చిన పాటలు వినడమే కాదు.. ఆయనలా బంగారం వేసుకుని తిరగడమూ అలవాటు చేసుకున్నాడు. అలా.. మెడలో ప్రస్తుతం సుమారు 3.5 కిలోల బంగారం ఒంటిపై ధరిస్తున్నాడు. ఆయనగారి గోల్డ్‌మ్యాన్ వేషాలు వైరల్ కావడంతో ‘గోల్డ్‌మాన్ ఆఫ్ చిత్తోర్‌గఢ్’ అనే పేరు ముద్రపడింది. మెడలో బంగారంతో చుట్టూ బౌన్సర్లతో బయట తిరుగుతూ హల్ చల్ చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన టీంతో వైరల్ చేయిస్తుంటాడు కన్హయ్యలాల్. అయితే ఆ షో ఆఫ్ వల్లే ఇప్పుడు బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారురోహిత్ గోదారా ఎవరు?బికనీర్‌కు చెందిన రోహిత్ గోదారా.. ఓ గ్యాంగ్‌స్టర్. వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజడంలో పేరుగాంచాడు. దేశంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 32 కేసులు ఉన్నాయి. అలాగే.. ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ రాజు దేహత్ హత్య కేసులో గోదారానే ప్రధాన నిందితుడు. 2022లో నకిలీ పాస్‌పోర్టు సాయంతో పవన్ కుమార్ అనే పేరు మీద దుబాయ్‌కి పారిపోయాడని అధికారులు చెబుతున్నాడు. ప్రస్తుతం అతను కెనడాలో ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి మరో వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ-17) స్పెషల్ ఎడిసోడ్‌కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం కేబీసీ షూట్లో కనిపించింది.पिता की तबीयत और शादी की उलझन के बीच, क्रिकेट स्टार Smriti Mandhana ने KBC 17 में नहीं दिखीं, स्मृति के पिता को आया था हार्ट अटैक। #SmritiMandhana #KBC #Mumbai #Viralvideo #SocialMedia #SmritiMandhanaFans #heartattack pic.twitter.com/o4VcAINz3E— Nedrick News Punjab (@NedrickP) November 27, 2025కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టుఈ ఎపిసోడ్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాట్స్‌మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది. భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్‌కాగా సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో స్మృతి-పలాష్ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది. తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్ ముచ్చల్ మోసం చేశాడన్న ఆరోపణలు, స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం, చాలామంది పలాష్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి. ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా -
అమెరికా మోజుతో 90 లక్షల ప్యాకేజీని కాలదన్ని..
విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు. అతడే అభిజయ్ అరోరా. భారత్‌కి చెందిన అభిజయ్ చక్కగా స్విట్జర్లాండ్‌లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్‌తో చదవాలనే డ్రీమ్‌తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్ లేకుండా హార్వర్డ్‌లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్ కూడా రాలేదు. తనకున్న జాబ్ నెట్వర్కింగ్ కూడా హెల్ప్ అవ్వలేదు. ఏ జాబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్ (యూట్యూబ్)లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్‌ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది. పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్ చేసుకున్నాడు అరోరా. ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్ జాబ్‌ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | Study Abroad | Careers | AI (@abhijayarora_) (చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే..!
ప్రకృతి ప్రసాదించిన సహజ పదార్థాలను ఉపయోగించి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు.ఫేషియల్ స్క్రబ్: ఒక టేబుల్ స్పూను చక్కెరలో ఆరు చుక్కల ఆలివ్ అయిల్ కాని కొబ్బరినూనె కాని కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. శీతకాలంలో మోచేతుల దగ్గర చర్మం గట్టిపడుతూంటుంది, ఇలాంటిచోట్ల కూడా ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. పాదాలకు కూడా ఇదే పద్ధతి.ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో అంతే మోతాదులో ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. చక్కెరకు బదులుగా ఉప్పు వాడినట్లయితే కొన్ని రకాల చర్మ సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.నైట్ క్రీమ్ఒక నిమ్మచెక్క రసం తీసి అందులో ఒక కప్పు పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి రాత్రంతా ఉంచుకోవాలి. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
ప్రియమైన కుమారుడికి మీ అమ్మ వ్రాయునది...
తన టీనేజ్ కుమారుడు అదేపనిగా ఫోన్లో మునిగివడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఆ తల్లిని బాగా బాధ పెట్టింది. మందలిస్తే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడింది. అయితే తన మనసులోని ఆవేదనను మాత్రం ఒక కాగితంపై పెట్టింది. ఆ కాగితం ఆమె నుంచి ఎలా మిస్ అయిందో తెలియదుగానీ ఇటు వెళ్లి అటు వెళ్లి సోషల్ మీడియాకు చేరింది.తన ఉత్తరంలో టీనేజర్ల మితిమీరిన స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ.చాలా స్కూల్స్‌లో మొబైల్ ఫోన్‌ను అనుమతించనప్పటికీ విద్యార్థులు వాటిని రహస్యంగా వాడుతున్నారు. అధిక స్క్రీన్ టైమ్ వలన వారి చదువు దెబ్బతింటుంది. చైనాకు చెందిన ఆ తల్లి ఉత్తరంపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ఇది చైనా తల్లి సమస్య మాత్రమే కాదు ఎన్నో దేశాలలోని తల్లుల సమస్య’ ‘ఆ తల్లి ఉత్తరాన్ని ఎన్నో దేశాల ప్రజలు చదివి ఉంటారు. ఆమె కుమారుడు కూడా చదివే ఉంటాడు. అతడు మారుతాడని ఆశిద్దాం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. (చదవండి: ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు) -
స్మృతి పెళ్లి వివాదం : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీత దర్శకుడు , చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్‌కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. ఈ పుకారపై గురించి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటో, బిర్వా షాకి ప్రపోజ్ చేసిన వడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 నాటి పోస్ట్‌లో మోకాళ్లపై వంగి అత్యంత రొమాంటిక్ వాతావరణంలో పలాష్ ఆమెకు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు.Palash Muchhal and his ex Birva Shah👀 pic.twitter.com/0nVRaia3CQ https://t.co/T8kNaz2REU— Mention Cricket (@MentionCricket) November 25, 2025 స్మృతిమంధానకు సోషల్ మీడియాలో సపోర్ట్మరికొన్ని గంటల్లో తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన వివాహం రద్దు కావడంతో అటు అభిమానులు, ఇటు సామాన్యం జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. పలాష్ ముచ్చల్ దారుణంగా ఆమెను మోసం చేశాడంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. మరోవైపు ధైర్యంగా ఉండు, స్మృతి.. మంచే జరిగింది. ఆ మోసగాడి గురించి ముందే తెలిసింది అంటూ ఎక్స్ ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికి సంబందించి మెన్షన్ క్రికెట్ అనే ట్విటర్ హ్యాండిల్లో అనేక పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారాయి. పుకార్లు నిజమే, పలాష్ నిజానికి స్మృతిని మోసం చేశాడన్న పోస్ట్‌కు భారీ స్పందన లభిస్తోంది.ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా >In 2019, Palash broke with his fiance. >Started dating to Smriti Mandhana,>Relationship with her for 6 years,>Got the fame,>Decided to marry for money,>Cheated on her just before wedding night.I wonder what smriti saw in him. pic.twitter.com/KCkTsk0x3v— `S.🚀 (@ThodaSaSanskari) November 25, 2025పాపం పాలక్మరోవైపు పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ పట్ల సానుభూతి వ్యక్తమౌతోంది. ఈ పుకార్లు నిజమైతే సొంత సోదరుడి వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఇండియాలో ఉత్తమ మహిళా నేపథ్య గాయకులలో ఒకరామె. పైగా పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి ఒక NGOను నడుతున్న మంచిమనసున్న అద్భుతమైన వ్యక్తి అంటూ పేర్కొనడం విశేషం.See this 👀👇🏻https://t.co/H5kpT5LcaV— Mention Cricket (@MentionCricket) November 25, 2025 -
ట్రాఫిక్ బంధనం నుంచి బయటపడేలా అదిరిపోయే ప్లాన్!
జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్ నెట్‌వర్క్‌ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన. ఎలా సహాయపడుతుందంటే.. ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్ లోక్ ముఖ్య ఉద్దేశం. భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు. ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్వర్క్”లా ఉంటుందన్నమాట. డీకన్జెషన్తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.ముంబై నగరం కోసం ఫడ్నవీస్ సర్కార్ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్‌కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది. -
త్వరలో రూ.5000 నోట్లు!.. స్పందించిన కేంద్రం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.5000 నోట్లను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.సోషల్ మీడియాలో రూ.5000 నోట్లకు సంబంధించి, వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఐదు వేలరూపాయల నోట్ల విషయంలో ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్ధిక అంశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. సామజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు స్పష్టం చేసింది.ప్రస్తుతం భారతదేశంలో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండువేల రూపాయల నోట్లను ఆర్బీఐ ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది.⚠️ सतर्क रहें ⚠️सोशल मीडिया पर दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक द्वारा ₹5000 के नए नोट जारी किए जाएंगे#PIBFactCheck✅ यह दावा #फर्जी है✅@RBI द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है✅ आधिकारिक वित्तीय जानकारी हेतु वेबसाइट https://t.co/e6gEcOvLu3 पर विजिट करें pic.twitter.com/EF82vaxMvE— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2025 -
ఈ యేటి మేటి నటులు : తోడుదొంగలు.. వైరల్ వీడియో
ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఆ ఆనందమే వేరు. వారికి తోడు ఏదైనా పెట్ ఉంటే ఇక ఆ సందడి రెట్టింపు అవుతుంది. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు చాలా స్నేహంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇళ్ళలో పెంచుకునే కక్కలు చిన్నారులను చాలా ప్రేమిస్తాయి. మరో విధంగా చెప్పాలంటే కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాపాయ ప్రమాదాలనుంచి కాపాడతాయి. పెట్స్‌తో కలిసి చిన్న పిల్లలు చేసే అల్లరి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించి ఒకఫ న్నీ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తూ అమ్మనుంచి దాక్కునేందుకు చాలా ఎత్తులు వేస్తూ ఉంటారు. వాటిల్లోముఖ్యమైనది దొంగచాటుగా, ఫోన్లలో ఆటలాడుకుంటూ, సరదా రీల్స్ చేస్తూ గడపుతూ ఉంటారు అదీ అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడుతూ. ఈ వీడియోలో చిన్నపిల్లాడికి తోడుదొంగలా నిలిచింది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇద్దరు ముసుగేసుకుని ఎంచక్కా ఫోన్ చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక మహిళ మీ యవ్వారం నాకు తెలుసులో అన్నట్టు వీళ్ల గదిలోకి తొంగి చూస్తుంది. అపుడు ఏమీ ఎరగనట్టు.. ఠక్కున ముసుగేసుకుని పడుకుంటారు. ఈ ఏడాది మేటి నటులు వీళ్లే అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియో 10లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. అదేంటో మీరు కూడా చూసి.. ఎంజాయ్ చేయండి మరి.! The best actors of the year. ❤️😂 pic.twitter.com/QyfWoKxBTG— The Figen (@TheFigen_) November 23, 2025 -
వివాహాల్లో సరికొత్త లగ్జరీ ట్రెండ్..! హ్యాంగోవర్ రాకుండా..
పెళ్లిళ్లలో అతిథులను కట్టిపడేసేలా ఆతిథ్యం ఇవ్వడం గురించి విని ఉంటారు గానీ ఇలాంటిది విని ఉండరు. ఏకంగా పెళ్లికి వెళ్లగానే అక్కడ కాస్త ఎక్కువ తిని, తాగి అలసిపోతాం కామన్. అలా అలసిపోయి హ్యాంగోవర్‌కి గురికాకుండా ఉండేలా అక్కడే ట్రీట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రెండ్ హవా వివాహాల్లో హైలెట్‌గా నిలవనుంది. వామ్మో ఇదేంటి ఆఖరికి వచ్చిన అతిథుల ఆరోగ్యం బాగోగుల కూడా అంటే తడిసిమోపుడవుతుందా కదా అంటారా..! అయినా సరే డోంట్ కేర్ అంటూ ..ఈ ట్రెండ్‌కే సై అంటోంది యువత.అలాంటి ట్రెండ్ న్యూడిల్లీలోని రాజౌరి గార్డెన్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన హెయిర్ క్లినిక్ కయాన్ ఆ పెళ్లికి వచ్చేసిన అతిధులకు ఐవీ బార్(క్లినిక్ మాదిరి సౌకర్యం) ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan) IV బార్ అంటే..విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి వాటిని నేరుగా సిరల్లోకి ఎక్కించేందుకు (IV ఇన్ఫ్యూషన్) వీలు కల్పించే ఒక క్లినిక్ లేదా సౌకర్యం. ఇది ఎందుకంటే పెళ్లికి విచ్చేసిన అతిధులు అక్కడ వడ్డించే భోజనం, ఆల్కహాల్ ఎక్కువగా లాగించేసి ఉత్సాహంతో ఆడిపాడి సందడి చేస్తారు. దాంతో కాసేపటికే అలిసిపోయి హ్యాంగోవర్ లేదా తలనొప్పితో బాధపడుతుంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఈ ఐవీ బార్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటి సాయంతో తలనొప్పి లేదా హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడే వాళ్లకు ఈ గ్లూటాతియోన్ షాట్లను అందిస్తారు. దీని వల్ల రీహ్రైడ్రైట్ అయ్యి..యాక్టివ్‌గా మారతారట. అలాగే పెళ్లిళ్లలో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారని ప్రస్తుతం ఈ ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలోఅవుతున్నారట. సదరు కయాన్ బృందానికి హ్యాంగోవర్ రాకుండా ఉండేలా చేయలేమని, కేవలం నిర్వహిస్తామని క్లియర్‌గా స్పష్టం చేసింది. పాపం ఆ పెళ్లిలో సర్వీస్ అందిస్తున్న ఐవీబార్ కయాన్ బృందానికి ఇప్పటికీ వందలకొద్ది ప్రశ్నలు వచ్చాయట ఆ హ్యంగోవర్ సమస్యపై. తాము ఆల్కహాల్ తాగొద్దు అని సలహ ఇవ్వలేం గానీ దానివల్ల వచ్చే హ్యాంగోవర్‌ని తగ్గించే ప్రయత్నం చేయగలమని సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదండోయ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఐవీ బార్ బృందాన్నే ఏర్పాటు చేస్తున్నారట. అంటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా పెళ్లిళ్లల్లో సేవలు కూడా అందించేస్తున్నారన్నమాట. ఆఖరికి హైడ్రేషన్ సేవ కూడా వచ్చేస్తోందన్నమాట. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమా? లేక అతిథుల పట్ల కేరింగ్నా తెలియని కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan)(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
భర్త మరణంతో ఆ రంగునే దరిచేరనివ్వలేదు..! కానీ కూతురు.
భర్తను కోల్పోయిన స్త్రీలు..ఒక్కసారిగా తమ జీవితంలోకి తొగ్గి చూసిన శూన్యం మాదిరిగా నిస్తారంగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. అది వారి వేషధారణలో సైతం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొందరూ ఆత్మవిశ్వాసంతో లేచి పుంజుకుంటారు. కొందరు సమాజం, కట్టుబాట్లకు తలొగ్గి తమ ఆశలను, కలల్ని చంపుకుని నిర్లిప్తంగా గడుపుతుంటారు. అలానే అన్నింటిని వదిలేసి..బతుకుతున్న ఆమె జీవితంలోకి మళ్లీ కాంతులు వచ్చేలా రంగులతో నింపింది కూతురు. సంతోషంగా ఇదివరకటి స్త్రీలా త్రుళ్లిపడుతూ ఉన్న ఆ దృశ్యం.. దూరమైన ఆమె భర్త సైతం ముచ్చటపడేలా అందంగా ఉంది.ప్రగతి అనే సోషల్ మీడియా వినియోగదారు నెట్టింట ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను వ్యక్తిగత విషయాలను పోస్ట్‌చేసే వ్యక్తిని కానని, ఈ రీల్ తన తల్లి కోసం అని పేర్కొంది. తన తల్లి నాన్న మరణంతో ఎరుపు రంగుకి పూర్తిగా దూరమైందని, ఎరుపు రంగు చీర గానీ డ్రెస్లుగానీ ధరించటమే మానేసిందని చెప్పుకొచ్చింది. అయితే తాను ఈసారి తన తల్లి కోసం ఎరుపు రంగు చీరను కొని, కట్టుకోమని ఫోర్స్ చేసినట్లు వెల్లడించి. అయితే ప్రగతి ఎంతో బతిమాలాడగా ఆమె ఒప్పుకుంది. అందువల్లే ఈ రీల్‌ని పోస్ట్చేశానని వివరణ ఇచ్చింది. ఎందుకంటే చాల ఏళ్ల తర్వాత ఎరుపు రంగు చీరలో తాను ఎలా ఉన్నానే అనేది గుర్తుండిపోవాలి, ఆ బాధకరమైన రోజులు కళ్లముందు కానరాకూడదని ఇలా చేశానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. ఆమె తాను కొన్న ఎరుపు రంగులో అద్భుతంగా కనిపించడమే కాదు..ఆమె చేసిన ర్యాంపు వాక్ కూడా అదుర్స్ అని సంబరపడింది. విచిత్రం ఏంటంటే ఆ వీడియోలో పక్కనే ఓ ఫోటోఫ్రేమలో ఉన్న ప్రగతి తండ్రి కూడా ఈ దృశ్యాన్ని సంతోషిస్తున్నాడేమా అన్నట్లుగా ఉంద . అంతేగాదు ఆ వీడియోలో చివరగా..అయినా స్వేచ్ఛను అనుమతి కింద పరిగణించకండి, ముఖ్యంగా మహిళలో విషయం అంటూ ప్రగతి విజ్ఞిప్తి చేయడం అందరీ హృదయాలను తాకింది. ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు..మళ్లీ ఆమె తనకిష్టమైన ఎరుపు రంగుని స్వీకరించాక ఎంత అందంగానో కనిపిస్తోంది అని మెచ్చుకుంటూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by PRAGATI (@pragatipatil440) (చదవండి: బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..) -
రీల్ ఎంత పని చేసింది రాములా!
సోషల్ మీడియా అల్గారిథం ఎప్పుడు ఎలా పని చేస్తుందో?.. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే పోస్టులు, వీడియోలు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెళ్లి కాబోతుందన్న సంబురంలో.. ముందు వెనకా ఆలోచించకుండా ఓ వీడియో తీసుకుని పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు ఇక్కడో వైద్యుడు. ఇక్కడి ఈ కింది వీడియోలో బనీయన్ మీద కిందపడి మరీ దొర్లుతూ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఓ డాక్టర్. ఆ పక్కనే ఒయలు ఒలకబోస్తోంది అతనికి కాబోయే భార్య. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎవరికేం నొప్పి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్యాన్స్ తన బెడ్రూంలో వేస్తే ఫర్వాలేదు. కానీ, ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. यूपी –शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025 ఆస్పత్రి గదిలో.. అదీ ఎమర్జెన్సీ డ్యూటీని ఎగ్గొట్టి మరీ తనకు కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు షామ్లీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ వకార్ సిద్ధిఖీ. ఈ వీడియో కాస్త నెట్టింట రీల్ రూపంలో వైరల్ అయ్యింది. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆఖరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో సిద్ధిఖీని వివరణ కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించి.. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయించారు. \బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్ సిద్ధిఖీ రెండేళ్ల కాంట్రాక్ట్ కింద ఆ ఆస్పత్రిలో చేరారని.. అతని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత కొనసాగుతున్నవేళ.. ఈ కాంట్రాక్ట్ డాక్టర్ చేసిన పని ప్రజాగ్రహానికి దారి తీసింది. -
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు. అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి. ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి. కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుటైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్‌లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్‌లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.చిరుతలు తరుముతున్న పులులువాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.చెరుకుతోటలు ఎందుకు మేలంటే?చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు. ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..:::సిమ్మాదిరప్పన్న -
భయానక రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరి కిందపడి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను వేగంలో ఉన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదం సందర్భంగా బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని గౌరా పడావ్లో ఓ బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడు. బైక్‌తో రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వేగంతో వస్తున్న కారు.. సదరు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో, ఒక్కసారిగా బైక్, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో బైకర్‌దే తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వారిని వాన్భూల్పుర నివాసితులుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. -
సొంత వదిననే పెళ్లాడాడు, ఎందుకో తెలుసా?
ఉత్తర ప్రదేశ్‌లో అరుదైన వివాహం పలువురిని ఆకట్టుకుంటోంది. అనుకోని ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు మరో జీవితాన్ని ప్రసాదించిన ఘటన నెట్టింట విశేషంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జరిగింది. యూపీకి చెందిన రాజేశ్ సింగ్ సోదరుడు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో తన సోదరుడితో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న వదిన వేదనను గమనించాడు. అలాగే చెట్టంత కొడుకును కోల్పోయిన తన తన కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది. ఇదే రాజేశ్‌ను ఆలోచింప చేసింది. అటు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వదినకు,ఇటు కుటుంబానికి ఊరట నివ్వాలని అనుకున్నాడు. వదినను పెళ్లి చేసుకోవాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబంతో చెప్పి, ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనిపై వారిబంధువులతో పాటు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. -
రైలు ఏసీ కోచ్‌లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్
కుటుంబాలతో కలిసి రైల్లో ప్రయాణించేటపుడు ఎక్కువ ఫుడ్‌ను ఆస్వాదిస్తాం. పులిహోర, దద్జోజనం, పూరీలు చికెన్, స్వీట్ పూరీలు, చపాతీలు, బిర్యానీ , టీ-కాఫీ వరకు రకరకాలుగా ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్లి, రైలు బోగీలో తింటూ ఉండే అదో ఆనందం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జర్నీలను బాగా ఎంజాయ్ చేస్తారు. మారు మాట్లాడకుండా, మారం చేయకుండా చక్కగా తింటారు. మరో విధంగా చెప్పాలంటే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. అయితే మరికొంతమంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే రైల్వే క్యాంటీన్లో ఆర్డర్ చేసకుంటాం. లేదంటే రైలు ఆగినపుడు ఆయా స్టేషన్లలో కొనుక్కుంటాం. కానీ మహారాష్ట్ర మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు. పదండి ఆ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏకంగా ఏసీ రైలు బోగీలోనే మ్యాగీ తయారు చేసింది. రైలు ఏసీ కంపార్ట్మెంట్లోని చార్జింగ్ సాకెట్లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి కెటిల్లో ఇన్స్టంట్ నూడుల్స్ ప్రిపేర్ చేసింది పైగా కెమెరాకు చక్కగాఫోటోలకు పోజులిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రైలులో మ్యాగీ వేడిగా వడ్డిస్తే తినడం బాగానే ఉంటుంది, కానీ సేఫ్టీ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మినిమం సెన్స్ లేదు, ఇలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అని కమెంట్ చేశారు. రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు. This is a major safety hazard and can cause fire endangering lives of all onboard. That's why we cannot have good things. Many will misuse the facilities and then be proud of it. Most lack civil sense. pic.twitter.com/JSRCpIXPW9— Backpacking Daku (@outofofficedaku) November 20, 2025"చాలా ఏళ్ల క్రితం, చెన్నై నుండి టాటానగర్‌కు రైలులో వెళుతుండగా, ఒక కుటుంబం పూజ చేసి అగర్ బత్తి, కర్పూరం వెలిగించింది. నేను వెంటనే టీసీకి ఫిర్యాదు చేశాను ఈ రోజుల్లో జనానికి బుద్ధి లేదు. ఇలాంటి పిచ్చి పనులు మానడం లేదు.’’ అంటూ గతంలో తనకు ఎదురైన అనభవాన్ని షేర్ చేశారొకరు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నంత మాత్రాని, మొత్తం ప్రయాణికుల ప్రాణాల్ని ఫణంగా పెట్టే పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. -
కెరీర్, వివాహం రెండు వేర్వేరు కాదు..! మరోసారి ఉపాసన పోస్ట్ దుమారం..
రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెనుదూమరం రేపుతున్నాయి. రోజురోజుకి ఆ వ్యాఖ్యలపై చర్చ తారస్థాయికి చేరిపోతోంది. సర్వత్రా తీవ్రస్థాయిలో ఆమె మాటల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె మహిళలు కూడా తమ కెరీర్లో దూసుకుపోవాలి, అదే ప్రగతి శీల అన్న కోణంలో చేసిన వ్యాఖ్యలు..నిపుణులు, వైద్యులను కలవరపరిచాయి. ఆమె యువతకు ఇచ్చిన సందేశం..అవాస్తవం, హానికరం అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్న దీనిపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ..యుంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇచ్చిన సందేశం చూశాం. అది మరువక మునుపే తాజాగా వైద్య నిపుణులు, ఐఐటీ-ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇంతకీ నిపుణులు, గ్రాడ్యుయేట్లు ఏం అంటున్నారంటే..ఢిల్లీ ఎయిమ్స్ వైద్యురాలు దత్తా వివాహం ఆశయానికి అడ్డంకి కాదని నొక్కి చెప్పారు. అన్ని విధాల మద్దతు ఇచ్చే భాగస్వామి ఉంటే..కెరీర్, పిల్లలు రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చని, అదేమంతా కష్టం కాదని అన్నారామె. ఉపాసన వ్యాఖ్యలు యువతను పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని ఫైర్ అయ్యారు. యుక్త వయసుని వృధా చేసుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అంతేగాదు తగిన వయసులో పెళ్లి చేసుకుంటే..పేరెంట్స్‌గా మారేందుకు, అలాగే తాతమామలకు కూడా సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తమ మనవళ్లు లేదా మనవడితో స్పెండ్ చేసే సమయం వారికి దొరుకుతుందని అన్నారు. అంతేగాదు ఉపాసన చిన్న వయసులో పెళ్లిచేసుకుందని, తర్వాత కెరీర్‌ని నిర్మించుకుందని అన్నారు. అందువల్ల ఆమె చెప్పిన సందేశం..సగటు యువతికి అత్యంత భినమైనదని అన్నారు. అయిన ధనవంతుల ఆలోచనలను ఎవ్వరూ గుడ్డిగా నమ్మోద్దని అన్నారు. అసలు మహిళలను సంపాదనకు ప్రాధాన్యత ఇవ్వమని, వివాహం, మాృతత్వం వంటి వాటిని వాయిదా వేయమని సూచించకూడదు. కెరీర్లో బాగా సెటిల్ అవ్వడం..అంటే ఓపక్క వయసు దాటిపోయాక పిల్లలు కనాలనుకోడం కాదని, అలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. అలాగే ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకున్నంత మాత్రన కచ్చితంగా బిడ్డలు పుట్టేస్తారన్న గ్యారంటీ లేదని చాలా మంది వైద్యలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాదు ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు, పలువురు వైద్యులు ఉపాసన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని, ఇవి యువతకు ప్రమాదకరం అంటూ మండిపడ్డారు. మరికొందరు నిపుణులు నిజానికి వివాహం, కెరీర్ రెండిటిని డిఫరెంట్ ఛాయిస్‌లుగా చూడోద్దని సూచించారు. ఇది భార్యభర్తల బలోపేతమైన భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న అంశమని, ఆ విషయాన్ని ఉపాసన తెలుసుకోలేకపోయిందంటూ విమర్శించారు. ఇక ఉపాసన సైతం ఈ పోస్ట్‌లపై స్పందించారు. సరైన భాగస్వామి దొరికే వరకు వేచి చూడటం, పిల్లలను ఎప్పుడు కనాలి అనేదానిపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పువుతుందని ప్రశ్నించారామె. I too advise people to marry early—not out of duty or anything like that.Having kids early makes life easier and gives your parents as much time as possible to enjoy their grandchildren. https://t.co/Cjmead5UhA— Deepan Shanmugasundaram (@deepan_civileng) November 19, 2025 తన ఉద్దేశ్యం మరింతమంది మహిళలను శ్రామికశక్తిలోకి తీసుకురావాలని యజమానులకు పిలుపునిచ్చానే తప్ప ఇందులో ఎలాంటి అనుచిత సందేశం లేదని వివరణ ఇచ్చింది. అలాగే తన వ్యక్తిగత కారణాల వల్లే 29 ఏళ్ల వయసులో తన ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకున్నట్లు వివరించింది. తాను కేవలం వివాహానికి ముందు కెరీర్‌పై మహిళలు దృష్టిపెట్టి..ఆర్థిక స్వేచ్ఛ పొందాలనేది తన అభిప్రాయమని నర్మగర్భంగా చెప్పారామె. ఏదిఏమైన ఉపాసన వ్యాఖ్యలు సదుద్దేశ్యంతో చేసినప్పటికీ..అటు వైద్యనిపుణులు, ఇటు ఐఐటీ గ్రాడ్యుయేట్లు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవ్వడం గమనార్హం.(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
పురాతన శివాలయం : వందల సంఖ్యలో పాములు,వీడియో వైరల్
పవిత్ర కార్తీకమాసంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన ఒకటి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివాలయంలో ఉన్నట్టుండి కుప్పలుగా సర్పాలు కనిపించాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా వందల సంఖ్యలో తిరుగాడుతున్న దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది.చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!కృష్ణా జిల్లా నాగాయలంకలో రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నవంబరు 19న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతీ ఏటా కార్తీకమాసంలో ఇలా పాములు గుంపులుగా కనిపించడం తమకు అలవాటే అంటున్నారు స్థానికులు. కానీ ఈ ఏడాది వీటి సంఖ్య కాస్త ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదంతా ఆ కార్తీక దామోదరుడి మహిమే అంటూ ఆ శివయ్యకు మొక్కుకోవడం విశేషం. నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు🙏🏼🙏🏼నాగాయలంక కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నదిలో ఇలా పాములు కనిపించాయి.🙏🏼🙏🏼ఇవాళ సాయంత్రం కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం లో ఇలా కనిపిస్తాయి అంటున్నారు 🙏🏼🙏🏼 pic.twitter.com/rjZmi72VXb— Bhaskar Reddy (@chicagobachi) November 19, 2025 నోట్ :క్కడి భక్తుల నమ్మకం ఎలా ఉన్నా కొన్ని రకాల చేపలు పాముల్లా ఉంటాయి. వీటిని ఈల్స్ (Eels) అంటారు.ఘ ఈ స్నేక్ ఈల్స్ (Ophichthidae) కుటుంబానికి చెందినవి. ఇవి అచ్చం పాముల్లాగే పొడవుగా సన్నగా ఉంటాయి. మామూలు చేపల్లాగా కాకుండా చాలా సన్నగా, పొడవుగా ఉంటాయి. -
ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్‌కి మాటల్లేవ్ అంతే..
ఒక చిత్రం గీశాక..అది అద్దం ముందు మరో చిత్రంలా అగుపించడం అంటే మాములు టాలెంట్ కాదు. ఇలాంట నైపుణ్యాన్ని ఆప్టికల్ ఇల్యూషన్ అని పిలస్తారు. అలాంటి స్కిల్‌ని పుణికిపుచ్చుకున్నాడు 69 ఏళ్ల వ్యక్తి. ఎంత అద్భుతంగా ఇద్దరు వ్యక్తులను ఒక చిత్రంలో పొందుపరిచి..అద్దం చూపగానే మరొకరిలా కనిపిస్తుంది. నేరుగా చూస్తే..ఇంత టాలెంటా.. ? అని విస్తుపోవడం మనవంతు అవుతుంది. అంతలా అద్భుతంగా చిత్రిస్తాడు. అతడి ఆర్ట్ నైపుణ్యానికి మాటల్లేవ్ అంతే..! అనేయొచ్చు.అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అతడే అక్బర్ మోమిన్. గుజరాత్‌లోని సిధ్‌పూర్‌కు చెందిన అక్బర్ తన అద్భుతమైన.. భ్రమని కల్పించే చిత్రాలకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆయన్ను అంతా త్రీడీ ఆర్టిస్టు అని పిలుస్తారు. ఎందుకంటే చిత్రించిన ప్రతి బొమ్మ మరోలా ఏదో మాయ చేసినట్లుగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Bharatiya Gujju 🇮🇳 (@bharatiya.gujju)ఒక వ్యక్తి చిత్రపటం ముందు అద్దం పెట్టగానే మరొక వ్యక్తిని ప్రతిబింబిస్తుంది. కాస్త షాకింగ్‌కి గురిచేసే ఆర్ట్ ఇది. ఆయన పంచుకున్న వీడియో ఒకదానిలో రాముడి పెయింటింగ్ అద్దంలో హనుమాన్ జీగా కనిపిస్తుంది. అత్యంత నేచురుల్గా ఉండే ఆప్టికల్ ఇల్యూషన్ ఎవ్వరినైనా ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక మరో వీడియోలో ప్రధాని మోదీ చిత్రపటం ముందు అద్దం ఉంచగానే అమిత్‌షా కనిపిస్తారు. View this post on Instagram A post shared by Brightside of Bharat 🇮🇳 (@brightside.of.bharat)అక్కడ ఏదో మిరాకిల్ జరిగిందా అన్నట్లుగా.. ఒక ఇమేజ్ మరొలా కనిపిస్తుంది. 45 ఏళ్లుగా అక్బర్ ముంబైలో ఈ ఆర్ట్‌పై మంచి ప్రావీణ్య సంపాదించి..తన స్వస్థలానికి తిరిగి వచ్చి ఒక స్టూడియోను ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టూడియో ప్రతి వారాంతంలో కళాప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. అతని కళా నైపుణ్యం ఉమ్మడి సాంస్కృతిక స్ఫూర్తిని చాలా అందంగా సూచిస్తోంది. ప్రతి పెయింటింగ్ వెనుక మరో వ్యక్తిని దాచిపెడుతూ..ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులను చూసే విలక్షణమైన ఆర్ట్ ఇది. ఈ ఆర్ట్ సృజనాత్మకతకు, సాంకేతికత దూరదృషికి సంబంధించిన అసాధారణ స్కిల్. ఇంకెందుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోలపై ఓ లుక్ వేయండి మరి. (చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్
రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేగాదు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్లు కూడా మండిపడ్డారు. ఇదే తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సైతం ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పోస్టు పెట్టడంతో మరోసారి ఉపాసన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు..దానికి శ్రీధర్ వెంబూ ఏం కౌంటరిచ్చారు అంటే..ఉపాసన నవంబర్ 17 ఐఐటీ హైదరాబాద్‌కి వెళ్లి అక్కడ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఉపాసన అక్కడి అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే.. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. పైగా అమ్మాయిలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎగ్స్ (అండాలు)ను సేవ్ చేసి పెట్టుకోవడమే అని, దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని, ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది. తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది. పైగా అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెనుదూమారం రేపాయి. ఏం చెబుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అదే తరుణంలో జోహో ఫౌండర్ మాజీ సీఎం శ్రీధర్ వెంబు కూడా ఉపాసన్ పోస్ట్‌పై ఘాటుగా స్పందించారు. ఆయన ఉపాసన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనండి అని యువతకు పిలుపునిచ్చారు. ఇది మనం సమాజానికి, మన పూర్వికులకు అందించే జనాభా విధిగా పేర్కొన్నారు. తాను అదే విశ్వసిస్తానని కూడా చెప్పారు. తాను కలిసే ప్రతి యువ వ్యవస్థాపకుడికి ఇదే విషంయ చెబుతానని కూడా అన్నారు. అంతేగాదు పురుషులు మహిళలు ఇద్దరూ వివాహం చేసుకుని, 20 ఏళ్ల లోపు పిల్లలను కనాలని, దానిని వాయిదా వేయద్దని సూచించారు కూడా. వారు సమాజానికి, వారి స్వంత పూర్వీకుల పట్ల జనాభా విధిని నిర్వర్తించాలని నొక్కి చెప్పారు. ఈ భావన వింతగా, పాతకాలం మాటలులా అనిపించొచ్చు. కానీ ఈ ఆలోచన కచ్చితంగా ప్రతిధ్వనిస్తుందని నమ్ముతున్నా అంటూ ఉపాసన కొణిదెల పోస్ట్‌ని రీట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియో ఎక్స్‌లో పేర్కొన్నారు శరీధర్ వెంబు. కాగా, గత నెలలో ఉపాసన, రామ్‌చరణ్ తాము రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన శ్రీమంతం వేడుక వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. View this post on Instagram A post shared by Startups Talk India (@startupstalkindia) చదవండి: అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్ రైడ్..! -
Noge నోజ్.. అంటే ముక్కు!!
మన దేశంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా తెలియజేసే ఘటన ఇది. ఆంగ్ల భాషలో కనీస స్పెల్లింగులు కూడా రాకుండానే ప్రైమరీ స్కూల్లో ఓ టీచర్ పిల్లలకు పాఠాలు నేర్పుతూ పట్టుబడ్డాడు. పైగా అతగాడి టాలెంట్ దేశం మొత్తం వైరల్ వీడియో రూపంలో పాకింది. noge నోజ్ అంటే ముక్కు.. ఈఏఆర్ఈ(EARe) ఇయర్ అంటే చెవులు, ఐఈవై(Iey) ఐస్ అంటే కండ్లు.. ఇవి ఈయనగారు చెప్పే పాఠాలు. అంతేకాదు.. సండే, మండే.. కూడా తప్పుల తడకగానే రాస్తున్నారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. మదర్, ఫాదర్, బ్రదర్.. వీటికి ఈయనగారికి అసలు స్పెల్లింగులే రావట. ఛత్తీస్‌గఢ్ బలరామ్‌పూర్ జిల్లా మచాన్దండ్ కోగ్వర్లోని ప్రాథమిక పాఠశాలలో 42 మంది పిల్లలు ఉన్నారు. వీళ్లకు ఇద్దరు టీచర్లు. అందులో ఒకడైన అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టొప్పో గారి పాండిత్యమే ఇది. ఇది వైరల్ కావడంతో విద్యాశాఖ ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. 'Iey मतलब आंख, Noge मतलब नाक' सिखाने वाले टीचर का वीडियो वायरल, शिक्षा विभाग ने किया सस्पेंड https://t.co/3QfKQr4WFI#Chhattisgarh #CGNews #Ambikapur #English #Teacher pic.twitter.com/cGiollwCXo— NaiDunia (@Nai_Dunia) November 16, 2025ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ మధ్యే అకడమిక్ ఈయర్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా గుణవత్తా అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ కింద టీచర్లు లేని స్కూల్స్ ఇక మీదట ఉండకూడదని, ప్రతీ బడిలో కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలని, తమ పిల్లలకు సరిగా పాఠాలు బోధించని టీచర్లను తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితులు రావాలని.. ముఖమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఓ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఏమాత్రం అనుభవం లేని, చదువురాని వాళ్లను టీచర్లుగా నియమిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులోనూ ఈ తరహాలోనే అక్కడ ఓ ఘటన బయటపడింది. నెలకు రూ.70 వేల జీతం అందుకునే ఓ టీచర్ పిల్లలకు తప్పుగా పాఠాలు చెబుతూ విద్యాశాఖ అధికారులకు దొరికాడు. -
ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అలానే ఈసారి గురువు గొప్పతనాన్ని ఆవిష్కరించే వీడియోతో మన ముందుకొచ్చారు. ముందుండి గొప్పగా నడిపించే గురువు ఉంటే ఏ విద్యార్థి అయినా మహనీయుడు(రాలు) అవుతాడంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మహీంద్రా ఆ వీడియోలో ఉపాధ్యాయులు విద్యార్థిలోని ప్రతిభను ఎలా సానపెట్టి బయటకు తీసుకోస్తారో వివరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఒక చిన్నారి తన గురువుని అనుకరిస్తూ..అత్యంత అద్భుతంగా అభినయిస్తూ చేసిన డ్యాన్స్ అందరీ మనసులను దోచుకుంది. వావ్ ఏం బాగా చేసింది అనేలా..అత్యద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. తన గురువు తోపాటు కాలు కదిపిన ఆ చిన్నారి స్టెప్పులకు కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా చేస్తుంది. ఇంత అద్భుతంగా ఆ చిన్నారిని తీర్చిదిద్దిన ఆ గురువు ముందుగా ప్రశంసనీయడు అని మెచ్చుకున్నారు మహీంద్రా. ఉపాధ్యాయుడి శక్తిమంతమైన ప్రమేయం..విద్యార్థిని ఉన్నతంగా మార్చగలదు అనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ అని అన్నారు. విద్యార్థి ఆత్మవిశ్వాసంతో కనబర్చే ప్రతిభ..అతడి గురువు గైడెన్స్ ఏవిధంగా ఉందనేది చెప్పకనే చెబుతుందన్నారు. నిజమైన గురువులు చేతలతోనే గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతారు..వాళ్ల వల్లే అభివృద్ధి చెందాలనే కోరిక బలీయమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి అద్బుతంగా రాణించేలా చేసే ఉపాధ్యాయుల ఆశీర్వాదం లభిస్తే..వాళ్లకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అంటూ గురువు విశిష్టతను నొక్కి చెప్పారు మహీంద్రా.“The mediocre teacher tells. The good teacher explains.The superior teacher demonstrates.The great teacher inspires.”— William A. WardThis young lady is an absolute delight to watch. She radiates the pure joy of movement.But her Guru deserves equal praise: someone who not… pic.twitter.com/OWee7I1kaf— anand mahindra (@anandmahindra) November 15, 2025 (చదవండి: 1996లో బ్యాంక్ పాస్ బుక్ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..) -
1996లో బ్యాంక్ పాస్ బుక్ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..
ప్రస్తుత కాలంలోని బ్యాంక్ పాస్ బుక్‌లు గురించి తెలిసిందే. కానీ 1996ల టైంలో ఉండే పాస్‌బుక్ గురించి ఈ జనరేషన్‌కి అంతగా ఐడియా ఉండదు. నెటింట ఆ కాలం నాటి పాస్ బుక్ తెగ వైరల్‌గా మారింది. అది ఒక పెన్షన్ అందుకునే ఖాతాదారుడి పుస్తకం. అందులో సేవింగ్స్ చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వచ్చిన పెన్షన్ తక్కువే అయినా..ఎంత అద్భుతంగా డబ్బుని పొదుపు చేశారో చూస్తే..ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్‌గా తెలుస్తోంది.ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టంట తన తాత గారి 199ల నాటి ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాస్ బుక్‌ని వీడియో తీసి పోస్ట్చేశాడు. ఇప్పుడు ప్రతిది డిజిటల్‌గా మారిన తరుణంలో ఈ పాస్‌బుక్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాస్‌బుక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అండ్ బికనీర్ది. ఆ సమయంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇలా ఉండేవా ఆ బ్యాంక్బుక్ని చూడగానే అనిపిస్తుంది. వీడియోలో ఆ వ్యక్తి పాస్‌బుక్ డిజైన్, ఫోటో పేజీ, ఎంట్రీ పేజీ, తాతాగారి పెన్షన్ పొదుపు డబ్బు ఇలా ప్రతీది చూపిస్తాడు. తన తాత ఫోటో ఉన్న మొదటి పేజీ నుంచి పాస్ బుక్ ముద్రణ, కాగితం నాణ్యత, పాత కాలపు టెంప్లేట్..పెన్షన్, పొదుపు ఎంట్రీలతో సహా అన్నింటిని క్లియర్‌గా చూపిస్తాడు వీడియోలో. అందులో తాతగారి పెన్షన్ రూ. 5000 కాగా, పొదుపు రూ. 25 వేలకు చేరుకున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. అంతేగాదు ఆ బుక్ చివరి పేజీలో నిరంతర పెన్షన్, నగదు సర్టిఫికేట్ మొదలైన పదాలు చూడగానే అవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 80 సెకన్ల నిడివి గల ఈ వీడియో, చిన్నా పెద్దా ప్రతి ఎంట్రీని చేతితో రాసిన కాలం నాటి బ్యాంకింగ్ ప్రక్రియను గుర్తు చేస్తోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఆ కాలం నాటి పాస్బుక్ల ఫాంట్, ఇంక్, ప్రింట్ లుక్, చేతితో రాసిన ఎంట్రీలు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాయి అని కామెంట్లు చేస్తూపోస్టులు పెట్టారు. అంతేగాదు బ్రో ఈ అకౌంట్ ఇంకా యాక్టివ్గానే ఉందే అని ప్రశ్నించారు కూడా. View this post on Instagram A post shared by Govinnd Sinngh (@igovinnd) (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి) -
91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..
వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై చాలామంది ప్రముఖులు, ప్రజలు పలు రకాలుగా తవ వాదనలు వినిపించారు. పైగా అన్ని గంటలు ఆఫీస్‌లకే పరిమితమైతే..ఫ్యామీలీ సంగతేంటి అని పలువురు వాపోయారు కూడా. కానీ మనసుంటే అన్ని సాధ్యమే..అటు ఆరోగ్యం ఇటు ఫ్యామిలీ అన్నింటిని కూడా సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వాళ్లందర్నీ వెనక్కినెట్టి ఓల్డ్ ఏజ్‌లో ఏకంగా 12 గంటలు షిఫ్ట్‌లో పనిచేస్తూ విస్మయానికి గురిచేయడమే కాదు..ఆ వయసులో ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండి మరింత కంగుతినేలా చేశాడు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా వ్లాగర్ లైంగ్ అనే వ్యక్తికి సింగపూర్‌లో ఓ వృద్ధ కార్మికుడి తారసపడతాడు. అతడు బాత్రూంలను క్లీన్ చేసే వ్యక్తిగా గుర్తిస్తాడు. అతడికి దగ్గర దగ్గర 90 ఏళ్లుపైనే ఉంటాయి. లైంగ్ ఆ వృద్ధుడితో మాటలు కలుపుతాడు. మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించగా వృద్ధుడు చాలా బాగున్నానని సమాధానం ఇస్తాడు. ప్రతి రోజు మీ వర్క్ ఎలా సాగుతుందని అడగగా అతడు తన వయసు గురించి అగుడుతున్నాడని పొరబడి.. ఆ వృద్ధుడు తన వయసు 91 ఏళ్లు అని రిప్లై ఇస్తాడు. వెంటనే లాంగ్ తేరుకుని ..కాదు ఈ వయసులో ఇంకా పనిచేస్తున్నావు..అని ఆశ్చర్యపోతూ ఎన్ని గంటలు వరకు పనిచేస్తావని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి రాత్రి ఏడింటి వరకు పనిచేస్తానని, రోజుకు 12 గంటల షిఫ్ట్ అని వివరిస్తాడు. దాంతో వ్లాగర్ బాస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు, నీ ఫిట్నెస్ రహస్యం ఏంటి అని చాలా కుతుహలంగా అడుగుతాడు. దానికి అతడు సాధారణ భోజనమే తింటానని, అయితే వ్యాయమం మాత్రం తానెప్పుడూ చేయలేదని చెప్పుకొస్తాడు. అంతేగాదు వ్లాగర్ లైంగ్‌తో ఎప్పుడూ వ్యాయామం చేయవద్దు అని సలహ కూడా ఇస్తాడు. దాంతో లైంగ్ నవ్వుతూ..నువ్వు జీవితంలో ఎప్పుడూ వ్యాయామం చేయలేని గొప్ప మనిషివి అని వ్యాఖ్యానిస్తాడు. చివరగా అతడికి వీడ్కోలు పలుకుతూ.. భోజనం చేయమని కొంత డబ్బు ఇవ్వడమేగాక.. నువ్వు ఒక గొప్ప సైనికుడివి జాగ్రత్తగా ఉండు..కష్టపడి పనిచేస్తుండూ అని చెప్పి నిష్క్రమిస్తాడు. ఆ వీడియో హీరో మాధవన్‌ని సైతం కదిలించింది. మాధవన్ కూడా ఆ వీడియో క్లిప్‌ని రీషేర్ చేస్తూ..స్ఫూర్తిదాయకమైన వీడియో అంటూ ప్రశంసించాడు. ఇక నెటిజన్లు..ఈ వీడియో కన్నీళ్లు పెట్టించేస్తోంది. అతడు ఎల్లప్పుడూ ప్రజలతో సంభాషిస్తాడు, అందుకే ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ ఘటన వ్యాయామం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం కాదని, ఆనందమే కీలంగా అని ప్రూవ్ చేసింది. అందువల్లే అతను సంతోషంగా అన్ని గంటలు పనిచేస్తున్నాడంటూ ఆ వృద్ధ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Jaden Laing (@jadentysonlaing) (చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..) -
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్‌లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు. -
బుజ్జి కుక్కపిల్లను భలే కాపాడారు!
‘ఎంత మంచి మనసు’ అని ఘనంగా చెప్పుకోవడానికి కోటానుకోట్లు దానం చేయకపోయినా ఫరవాలేదు. మనకు తోచినంతలో ఏ మంచి పని (Good Work) చేసినా సరిపోతుంది అని చెప్పే సంఘటన ఇది.చెన్నైలో ఒక కుక్కపిల్ల (puppy) గొయ్యిలో పడింది. ఆ గొయ్యి దగ్గర నిస్సహాయంగా నిల్చొని ఏడుపు గొంతుతో అరుస్తోంది తల్లి కుక్క. ఆ అరుపులు విన్న ఒక పోలీసు గొయ్యి నుంచి కుక్కపిల్లను రక్షించాడు. తల్లి కళ్లలో సంతోషం నింపాడు.‘రోడ్డు మీద మనిషి పడిపోతే కూడా ఎవరి దారిన వారు వెళుతున్న ఈ రోజుల్లో ఆ వ్యక్తి గొప్ప మనసుతో కుక్కపిల్లను రక్షించడం గొప్ప విషయం’‘మానవత్వం (humanity) మృగ్యమైపోతుంది అని నిరాశపడే రోజుల్లో ఇలాంటి మంచి పనుల గురించి వింటున్నప్పుడు ఆశాదీపాలు వెలుగుతాయి’... ఇలాంటి కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు. చదవండి: చాట్‌జీపీటీ వరుడు వచ్చాడు! View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) -
వాడే నాకు కరెక్ట్ : చాట్‌జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్‌జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్‌కాస్టింగ్‌తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్‌జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్‌ని క్లాస్‌గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్‌కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్‌లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్‌లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్' -
ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?
నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్‌గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్‌కు "Will Run" అనే నెంబర్ ప్లేట్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ తీసి వైరల్ చేశాడు. ఈ పోస్ట్‌ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. Ft. Catch me if u can @CPPuneCity @PuneCityTraffic @nachiket1982 pic.twitter.com/wBnEIJMPLq— NitishK (@nitipune007) November 11, 2025 We can, and we will…Just a matter of time.Watch this space for updates! #ChallengeAccepted https://t.co/DyezD3Yn8U— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025కొన్ని గంటల్లోనే రాహిల్‌ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్‌గా, వీడియో పోస్ట్ చేసింది అతని స్నేహితుడు నితీష్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. Street’s not the place to play, boy!We always keep our promises. 😉Turns out the guy wasn't elusive enough. Played dangerous games, won dangerous prizes.#NoConsolationPrize#ChallengeCompleted#ElusionEndsHere#CaughtYou#AlwaysForPunekars#PunePolice@CPPuneCity https://t.co/zAoMI5Yld6 pic.twitter.com/mlAGVvz4ro— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్‌లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమకు.. ఆస్ట్రేలియన్ డ్రైవర్ ఫిదా..!
సాధారణ మనుషుల ఉండే కొందరూ దగ్గర అపార జ్ఞానం ఉంటుంది. వాళ్లని పలకిరిస్తే లేదా మాట కలిపితే గానీ మనకు తెలియదు. మంచి మనసు అనేది విద్య, డబ్బు, హోదా వల్ల వస్తుందనుకుంటే పొరపాటే అని ఆయా వ్యక్తులు తారసపడగానే అర్థమవుతుంది. అలాంటి అపురూపమైన భావోద్వేగ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..విదేశీ పర్యాటుకులు మన సుందర నగరాలకు ఆతిధ్యానికి వస్తుంటారనే విషయం తెలిసిందే. అలానే ఆస్ట్రేలియాకు చెందిన విల్ స్ట్రోల్స్ మన భారతదేశంలోని నగరాలను వీక్షిస్తూ..ఓ ఆటోలో ప్రయాణించాడు. ఆ ఆటో డ్రైవర్‌తో కాసేపు మాటలు కలిపాడు. ఆ డ్రైవర్ అతడిని చూసి మీరు ఆస్ట్రేలియన్ నుంచి వచ్చారా..?అని ఆంగ్లంలో చాలా చక్కగా ప్రశ్నిస్తాడు. అందుకు విల్ అవునని సమాధానం ఇవ్వడం తోపాటు అంతలా సులభంగా అతడిని ఆస్ట్రేలియన్ అని ఎలా గెస్ చేయగలిగాడో కూడా వివరిస్తాడు. తాను ఆస్ట్రేలియాకు వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు చెఫ్‌గా పనిచేశానని అంటాడు. వెంటనే విల్ అయితే మీరు ప్రస్తుతం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అందుకు డ్రైవర్ భలే అద్భుతంగా మాట్లాడాడు. అవి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన గొప్ప జీవిత పాఠాలు. ఇంతకీ ఆ డ్రేవర్ ఏమన్నాడంటే..తాను ఆనందంగా జీవించే వ్యక్తినని సగర్వంగా చెప్పాడు. తాను డబ్బు మనిషిని కానని, జీవితానికి డబ్బు అవసరమే కానీ, డబ్బే జీవితం కాదు. అని చాలా చక్కగా చెబుతాడు. అతడి ఆంగ్ల వాక్ చాతుర్యానికి సదరు ఆస్ట్రేలియన్ విల్ అబ్బురపడతాడు. అంతేగాదు మంచి చాయ్ తాగుతారా తీసుకెళ్తాను అంటూ మంచి ఆఫర్ కూడా ఇస్తాడు ఆ డ్రైవర్. విల్ అతడి సహృదయతకు ఇప్రెస్ అయ్యి అందుకు అంగీకరిస్తాడు. వెంటనే డ్రైవర్ తనకు ఎంతో ఇష్టమైన చాయ్ కేఫ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ టీ సర్వ్ చేసే వ్యక్తి కూడా చక్కగా ఆంగ్లంలో మాట్లాడి విల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఇక ఆ టీ చెఫ్ కూడా తాను స్పెషల్‌గా తయారు చేసి టీ అని కాసింత గర్వంగా చెబుతాడు. ఆ తర్వాత ఆటో డ్రేవర్ ఆ ఆస్ట్రేలియన్ నివాసి విల్ని తన గమ్యస్థానానికి చేర్చగానే ..అతడు ఇంతలా తనకోసం కష్టపడినందుకు ఈ డబ్బులు తీసుకోవాల్సిందే అంటూ చేతిలో కొంత మొత్తం పెట్టి మరి వెళ్లిపోతాడు.అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయగానే..అంతా ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమ అదుర్స్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడమే కాదు ఇవాల్టి గొప్ప జీవిత పాఠం.."జీవితానికి డబ్బు అవసరం అంతే డబ్బే జీవితం కాదు". అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by India Flipside (@india_flipside) (చదవండి: భాగ్యనగరంలో లెర్న్ విత్ భీమ్..!) -
పెళ్లి వేడుకలో కిరణ్ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!
ఆనందానికి వయసుతో సంబంధమే లేదు. అందులోనూ సంతోషభరితమైన సమయాల్లో మనసులోని భావోద్వేగాన్ని చాలామంది డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందుకు చిన్న పెద్ద అతీతం కాదు. అలానే ఇక్కడ ఇద్దరు దిగ్గజ మహిళలు చిన్న పిల్లలా మారిపోయి ఎలా స్టెప్పులు వేశారో చూడండి. వారి నృత్యం చూస్తే..పదిల పరుచుకునే మధుర క్షణాలను మధురమైన జ్ఞాపకంగా ఎలా మలుచుకోవాలో చెబుతున్నట్లు ఉంది.ఇన్ఫోసిస్ ఫౌండేసన్ చైర్పర్సన్,రాజ్యసభ సభ్యురాలు, సుధామూర్తి, పిల్లల రచయిత్రి, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాలు ఒక వివాహ వేడుకలో ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారంటే.. ఆ వేడుక ఒక్కసారిగా కన్నుల పండుగగా మారిపోయింది. డెబైల వయసులో చాలా ఉత్సాహభరితంగా నృత్యం చేసి అక్కడి వాతావరణాన్నే ఆహ్లాదభరితంగా మార్చేశారు ఈ శక్తిమంతమైన దిగ్గజాలు. ధోల్ బీట్లకు అందంగా నృత్యం ఈ వివాహ వేడుకకు వచ్చిన అతిధులందరి మనసులను దోచుకున్నారు. కేవలం కెరీర్ పరంగానే గాదు ఎంజాయ్ చేయడంలోనూ మాకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా చిందులేశారు ఆ ఇద్దరూ. అందుకు సంబంధిచిన వీడియోని రాజకీయ నాయకుడు, వ్యవస్థాపకుడు అనిల్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. దశాబ్దాలుగా ఈ ఇద్దరు మహిళలు వృత్తిపరమైన విజయాల తోపాటు దాతృత్వం, తెలివితేటల పరంగా అందరికీ ప్రీతిపాత్రమైన వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ అరుదైన ఘటనతో మరోసారి ఇద్దరి పేరు మారుమ్రోగిపోవడమే కాదు..ఆనందాన్ని గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయడం ఎలానో చేసి చూపించారు.ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ వివాహ వేడుక ఇది. ఎరిక్ ఆష్లే పౌర్ణిమను వివాహ చేసుకున్నారు. ఈ జంట ఇటీవలే బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, ఎరిక్ యూఎస్‌లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)లో కంప్యూటింగ్, మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తునన్నారు. అలాగే ఆయన బయోకాన్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా. ఇక వధువు ఆష్లే పౌర్ణమ్ వైద్యురాలిగా, కంప్యూటేషనల్ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Anil Shetty (@anilshetty87) (చదవండి: ఐఏఎస్ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..) -
Viral Video: ఎంతుంటే ఏంటయ్యా.. గెలిచానా లేదా..?
జపాన్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో సుమో ముందువరుసలో ఉంటుంది. ఈ క్రీడకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ చిన్న కుర్రాడు, ఓ మహాబలున్ని అలవోకగా ఓడిస్తాడు. సాధారణంగా సుమో పోరాటాల్లో బరువు, అనుభవం కీలకమని భావిస్తారు. అయితే ఈ సందర్భంలో 68 కిలోల బరువుండే ఓ 16 ఏళ్ల కుర్రాడు, 168 కిలోల బరువుండే 39 ఏళ్ల ఓ అనుభవజ్ఞుడిని సులువుగా ఓడించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో 43 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.16-year-old sumo prodigy Kosei defeated 39-year-old Amamidake, who’s more than twice his size. 😳In professional sumo, there are no weight classes. pic.twitter.com/A8adcb0Vmj— Dudes Posting Their W’s (@DudespostingWs) November 12, 2025ఈ పోటీని చూసిన వారు డేవిడ్ వర్సెస్ గొలియాత్ పోటీగా అభివర్ణించారు. ఎంతున్నామన్నది కాదన్నయ్యా.. గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఈ పోటీలో అమమిడాకే అనే పేరుగల భారీకాయుడిపై గెలిచిన కుర్రాడి పేరు కోసే. కోసే.. అమమిడాకే కటౌట్‌ను చూసి బయపడకుండా, తన తక్కువ బరువునే ఆయుధంగా మలచుకొని అమమిడాకేను రింగ్ బయటికి కదిలించాడు. ఈ పోటీలో కోసే పాదాల కదలిక, అతని ధైర్యం అందరిని ఆకట్టుకున్నాయి. చదవండి: షోయబ్‌తో విడాకులు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సానియా మీర్జా -
లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియో
మహిళ జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తినంత పనే. ఈ సమయంలో గర్భిణీకి అటు అత్తింటివారు, ఇటు పుట్టింటి వారు చాలా అండగా ఉంటారు. ప్రసవం పూర్తయి, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండే దాకా చాలా ఆందోళన పడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రసూతి వార్డులో జరిగిన ఒక సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. పురుటి నొప్పులతో బాధపడుతున్నకోడల్ని ఓదార్చి, ధైర్యం చెప్పాల్సిన అత్తగారు దారుణంగా ప్రవర్తించింది. దీనిపై గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది .ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగింది.వారణాసి నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. సహజం ప్రసవంకావాలని పట్టుబడుతూ కోడలిపై అరవడం మొదలు పెట్టింది. "నోరు మూసుకో, లేకపోతే మూతి పగలగొడతా అంటూ బెదిరించింది. ఇదంతా జరుగుతున్నపుడు, బాధిత మహిళ భర్త, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. కొంత వాగ్వాదం, కోడలి పరిస్థితి చూసిన తరువాత వారు సిజేరియన్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ అత్తగారు మాత్రం సహజ ప్రసవానికి పట్టుబడుతుండటం ఈ వీడియోలో చూడవచ్చు. "ఇలా ఏడుస్తూ ఉంటే తల్లి ఎలా అవుతావు?" అంటూ మండిపడింది. తన అంతేకాదు భార్య చేయి పట్టుకున్న కొడుకుని వారించింది. ఇతర కుటుంబ సభ్యులు ఆమెను శాంతింప జేయడానికి ప్రయత్నించినా ఆమె ధోరణికి అడ్డుకట్ట పడలేదు. మొత్తానికి ఆపరేషన్ లేకుండానే, సహజంగానే పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ సమయంలో ఆమెతో ప్రేమగా ఉండాలిఈ సంఘటనపై స్పందిస్తూ, గైనకాలజిస్ట్ డాక్టర్ నాజ్ ఫాతిమా, ఆమె మొదట ఏదో తమాషా చేస్తోందిలే అనుకున్నా.. కానీ ఇలాంటి పరిస్థితులలో, కుటుంబం గర్భిణీ స్త్రీని ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవాలి. అనునయంతో, ఓదారుస్తూ మాట్లాడాలి కదా అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ummul Khair Fatma (@drnaazfatima)నెటిజన్లు స్పందనపెద్దవాళ్లు తోడుగా ఉండాలి గానీ ఇలా ప్రవర్తించకూడదు, ఇంత మొరటుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ పరిస్థితిలో ఆమెకు ధైర్యం చెప్పాలి అని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పగవాళ్లకి కూడా ఇలాంటి అత్తగారు ఇలా ఉండాలని కోరుకోను, ఈ సమయంలో కూడా కొడుకు తన భార్య చేతులు పట్టు కోవడం ఆమె భరించలేకపోతోంది అని మరొకరు వ్యాఖ్యానించారు. అయ్యో.. ఆమె అలా అరుస్తోంటే, భర్త ఏంటి ఏమీ మాట్లాడడు, భార్య కోసం స్టాండ్ తీసుకోవాలి కదా అంటూ మరొకరు మండిపడ్డారు. ఇదీ చదవండి: లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్‌నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్‌లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్‌గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్‌లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్‌స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
లండన్‌లో లిటిల్ ఇండియా..మన సిగ్నేచర్ ఇదా..?
మనం ఒక చోట ఉన్నాం అనగానే..ఫలానా వాళ్లు అనే ఐడెంటీ ఉండాలి. ఆ గుర్తింపు కోసం అంతా ఆరాటపడుతుంటాం. కానీ అది మరొలా మనల్ని గుర్తిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం అప్పుడైనా సరిదిద్దుకుంటే..ఓకే..ఎప్పటికీ ఆ గుర్తింపుతోనే ప్రతి చోట ఐడెంటిఫై అయితే..అంతకంటే ఇబ్బందికరం మరొకటి ఉండదు కదూ..ప్రతి మనిషికి సామాజికి బాధ్యత లేదా సివిక్ సెన్స్ అనేఇఉండాలి. అది లేకపోతే..మనం ఎక్కడ ఉన్నా..అది మన చేతలు లేదా చర్యల ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. మన సంస్కృతి, ఆచారాలతో ఇతర దేశాలను అబ్బురపర్చడమే కాదు..సామాజికపరంగా కూడా మన చేతలు ఆహా అనేలా ఉంటేనే అన్ని విధాల శ్రేయస్కరం. ఇదంతా ఎందుకంటే లండన్‌లో లిటిల్ ఇండియాగా పేర్కొనే ప్రాంతాలు చూడగానే..ఠక్కున భారతీయులు ఉండే ప్రదేశం అని చెప్పేస్తారు. కానీ అలా ఎందుకు చెబుతారో తెలుసా.. ఆచుట్టుపక్కల ఉండే చెత్త చెదారాలను బట్టి.అంతలాదారుణంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చెత్తతో నిండి ఉన్నాయి అంటే..అది భారతీయులు ఉండే ప్రాంతాలని అర్థం అని తలిపించేలా ఉంది ఆ లిటిల్ ఇండియా. అందుకు సంబంధించిన వీడియోని ఓ భారతీయ యూట్యూబర్ షేర్చేయడంతో..అస్సలు మనవాళ్లకి సివిక్ సెన్స్ ఉందా అని సందేహం లెవనెత్తుంది. లండన్‌లో సౌతాల, వెంబ్లి ప్రాంతాల..భారతీయ కమ్యూనిటీలు ఉండే ప్రాంతాలుగా పేరుగాంచినవి. అవి చూడగానే మన సంస్కృతిని ప్రతిబింబిచే దేవాలయాలు, చీరల దుకాణాలు, తినుబండారాలు దర్శనంతోపాటు..చుట్టుపక్కల పరిసరాలన్నీ చెత్తతో కనిపిస్తే..సామాజిక బాధ్యత లోపం బట్టబయలు అవుతుంది కదూ..!. ప్రతిమనిషి పబ్లిక్‌లో ఉండేటప్పుడూ.. కొన్ని విలువలను పాటించాల్సిందే..అది మన ఉనికిని స్పష్టంగా కనబడేలా చేస్తాయి. అందుకు నిదర్శనం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోవ్యక్తిగత శుబ్రతతోపాటు మన పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి. View this post on Instagram A post shared by Nayem 🇮🇳🇬🇧 (@nayem_in_london) ఒక పరాయి దేశంలో మన ఉనికిని తేటతెల్లం చేసేది ఈ సామాజికి స్పృహ. ఆ విషయంలో కరెక్ట్‌గా ఉంటే ..అది ఆ ప్రాంతంలోని మొత్తం జనాభా విజయాన్ని, సమిష్టి కృషిని ఎలుగెత్తి చాటుతుంది. సివిక్ సెన్స్‌తో వ్యవహరిస్తే..మనల్ని ఉన్నతంగా నిలిచేలా చేయడమే కాదు యావత్తు దేశాన్ని గర్వపడేలా చేయగలిగిన వాళ్లం అవుతాం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు యూట్యూబర్. నెటిజన్లు కూడా ఎన్ని డిగ్రీలు ఉన్నా..సివిక్ సెన్స్ లేకపోతే..అవన్నీ వ్యర్థమే అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
గూగుల్ బాయ్ ఆఫ్ చత్తీస్‌గఢ్
‘గూగుల్ బాయ్ ఆఫ్ చత్తీస్‌గఢ్’గా పేరు తెచ్చుకున్న అర్మాన్ ఉబ్రానీ వంద సంక్లిష్టమైన పజిల్స్‌ను 13 నిమిషాల లోపు పరిష్కరించి రికార్డ్ సాధించాడు. అయిదు సంవత్సరాల అర్మాన్ మూడు పుస్తకాలు రాశాడు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నాడు.బిలాస్‌పూర్‌లోని ఒక వ్యాపారవేత్త ఏకైక కుమారుడు అయిన అర్మాన్ చిన్నప్పటి నుంచే తన వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తన కంటే చాలా పెద్ద వయసు వాళ్లు కుస్తీలు పడుతుంటే...‘ఇదిగో ఇలా చేస్తే సరిపోతుంది’ అని నిమిషాల వ్యవధిలో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వారిని ఆశ్చర్యపరిచేవాడు. ‘నంబర్–సాల్వింగ్ స్కిల్స్’ విభాగంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్, ఆన్లైన్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. అర్మాన్ రాసిన ‘పింక్ డాల్ఫిన్’ ప్లానెక్స్’ ‘మై కాంటినెంట్’ పుస్తకాలకు మంచి ఆదరణ లభించింది. ఈ పుస్తకాలు అమెజాన్, గూగుల్ బుక్స్, కోబో బుక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.‘ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలనే తపన అర్మాన్లో కనిపిస్తుంది. మామూలుగా మ్యాథ్స్ పాఠాలు చెబుతుంటే పిల్లల్లో ఆసక్తి ఉండదు. అయితే అర్మాన్ మాత్రం చాలా ఆసక్తిగా వినేవాడు’ అని కుమారుడి గురించి చెప్పింది తల్లి నైనా ఉబ్రానీ. (చదవండి: రియల్ అన్నాచెల్లెళ్ల అనుబంధం..! ప్రముఖ బాలీవుడ్ నటి) -
4 నెలల క్రితం ఊస్టింగ్.. మళ్లీ పోస్టింగ్?!
కంపెనీల్లో ఉద్యోగాల నియామకాల్లో హెచ్ఆర్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇంత ముఖ్యమైన హెచ్ఆర్ పనివిధానంపై చాలా విమర్శలు కూడా చాలా కామన్. తాజాగా అలాంటి సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చర్చనీయాంశమైంది. 14 ఏళ్ళ సర్వీసు తర్వాత కాస్ట్ కటింగ్‌లో భాగంగా తొలగించిన ఉద్యోగికి రిక్రూటర్ తిరిగి జాబ్ ఆఫర్ చేసిన ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేసింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత తిరిగి అదే ఉద్యోగం కోసం ఒక రిక్రూటర్ తనను నియమించుకోవడానికి ప్రయత్నించాడని ఆయన వెల్లడించాడు."ఒక రిక్రూటర్ నన్ను భర్తీ చేయడానికి ప్రయత్నించాడు" అనే శీర్షికతో ఒక రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. 14 ఏళ్ల పాటు కంపెనీకి సేవలందించిన తనను ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలగించారని వెల్లడించాడు.ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంతక్కువ వేతనంతో ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. నాలుగు నెలలు పాటు వెదికి, చివరికి లింక్డ్ఇన్ ద్వారా తిరిగి రిక్రూటర్లలో ఒకరు తనను సంప్రదించారని తెలిపాడు. అలాగే మొత్తానికి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేసి, తాను అప్పటికే ఆ కంపెనీలో పనిచేసిన విషయాన్ని గుర్తించాడు అని కూడా పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందన అతని ఆఫర్‌ను అంగీకరించాలని మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు కోరగా, తమకు ఇలానే జరిగింది అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. రిక్రూటర్లు అంతే.. అన్నారు ఇంకొంతమంది.అలాగే ఆఫర్‌ను ఓకేచేసి, ఇంటర్వ్యూకి వెళ్లాలి, అపుడు వాళ్ల ఎక్స్పెషన్స్ చూడాలి మజా వస్తుంది అని ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. -
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్‌కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..) -
భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!
మన దేశానికి వచ్చిన విదేశీయులను మన వివాహ వేడుకలు ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి అనడంలో సందేహం లేదు. దీనికి తాజా ఉదాహరణ జేక్ కోడియా అనే కొరియన్. గురుగ్రామ్‌లోని కాస్మెటిక్ రిసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్న కోడియా తొలిసారిగా ఒక భారతీయ వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఆ వేడుకలోని వైభోగం, అతిథి మర్యాదలలోని ఆత్మీయతను చూసి అతడికి వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. విందులోని రుచుల సంగతి సరే సరి. పానీపూరి అతడికి తెగ నచ్చేసింది. వధువు ఎంట్రీ నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నాడు. పెళ్లివారితో కలిసి డ్యాన్స్ చేశాడు.‘కొరియన్ విజిట్స్ ఇండియన్ వెడ్డింగ్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజనుల మనసును హోల్‌సేల్‌గా దోచేసుకుంది. ఒక ఫారినీయుడు ఇలా స్పందించాడు... ‘తాజ్‌మహల్ చూడడానికి ఇండియాకు వెళ్లాలనుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి వేడుకలు చూడడానికే ఇండియాకు వెళ్లాలనిపిస్తోంది’. View this post on Instagram A post shared by Cha Jaeil🇰🇷🇮🇳💕 (@pyara_jake_kodia) (చదవండి: ఎక్కడైనా సీక్రెట్ కెమెరా దాగి ఉంటే ఇలా పట్టేయండి..!) -
నెట్టింట భయానక వీడియో.. అధికారుల వార్నింగ్
భవిష్యత్తు సాధనంగా భావించే కృత్రిమ మేధస్సు (AI).. నాణేనికి రెండోవైపులా భయానక పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. ప్రధానంగా అశ్లీలతను పెంపొందించే కంటెంట్ సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు తప్పుడు ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టించడంలో ముందు ఉంటోంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ జాబితాలోనిదే.. ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు, వాయిస్‌లు.. ఇప్పుడు ఇవన్నీ నిజాన్ని వక్రీకరించే సాధనాలుగా మారుతున్నాయి. ఈ దెబ్బకు ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తు పట్టలేని స్థితికి మనిషి చేరుకుంటున్నాడు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేలా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర చందద్రాపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో సారాంశం ఏంటంటే.. అక్టోబర్ 31వ తేదీన.. అటవీశాఖకు చెందిన అతిథి గృహం బయట ఓ వ్యక్తి కాపలాగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ పెద్దపులి వచ్చి అతనిపై దాడి చేసి నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ వీడియో ఒరిజినల్‌ది కాదని అధికారులు స్పష్టం చేశారు. అది అసలైన వీడియో కాదు, AI ద్వారా రూపొందించబడినదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ ఘటన ఏఐ వినియోగం ఎంత ప్రమాదకరంగా మారిందో చాటిచెప్పింది. ఇలాంటి సాంకేతికతలు సాధనంగా ఉండాలే తప్ప సాధనంగా మారకూడదని, ప్రజల భద్రత, నైతికత, నిజాయితీకి భంగం కలిగించేలా ఏఐ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిపప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक)👇👇👇 pic.twitter.com/d4SGS2Fu6N— Himmu (@Himmu86407253) November 7, 2025AI వల్ల కలిగే ప్రమాదాలు:• నకిలీ వీడియోలు: నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా భయాన్ని, అవమానాన్ని, రాజకీయ అస్థిరతను కలిగించే అవకాశం• డీప్‌ఫేక్ టెక్నాలజీ: ప్రముఖుల ముఖాలు, వాయిస్‌లు మార్చి తప్పుడు సమాచారం సృష్టించడం• సామాజిక గందరగోళం: ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానం కలగడం ప్రజలకు సూచనలు:• ధృవీకరించని వీడియోలు, ఫోటోలు షేర్ చేయవద్దు• అధికారిక వనరుల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్‌పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బైక్ డ్రైవర్‌తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్‌కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్‌ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్‌ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్‌ట్యాప్‌లు కావాలా? -
రూ. 69 వేలా? అంత సీన్ లేదు : రూ. 5లకే కొనొచ్చు!
ఇటీవలి కాలంలో ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా లగ్జరీ బ్యాగులు, చెప్పులు,లంచ్‌బాక్స్ ఇలా వివిధ రకాల వింత వింత డిజైన్లలో ఉత్పత్తులను లాంచ్ చేసింది. తాజాగా లగ్జరీబ్రూచ్ (సేఫ్టీ పిన్)ను పరిచయం చేసింది. దీని ధర గురించి తెలుసుకుని జనం షాకవుతున్నారు. అతి సాధారణ పిన్సీసు లాంటి దానికోసం అంత డబ్బు వెచ్చించాలా అని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై తెగ చర్చ జరుగుతోంది.ప్రాడా అనే సంస్థ ఏకంగా 775 డాలర్లకు (రూ. 68758) విలువతో దీన్ని లాంచ్ చేసింది. సుమారు 3.15 అంగుళాల పొడవులో రంగురంగుల క్రోచెట్ దారంతో రూపొందించిన ఈ బ్రూచ్ మూడు రంగుల కలయికలలో లభిస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. అయితే దుకాణాలలో సాధారణంగా 15 నుండి 20 ప్యాక్‌కు దాదాపు రూ. 10 ఖర్చవుతుంది.69వేల రూపాయలా? నేను దీన్ని చాందిని చౌక్‌లో రూ. 5 కి అదే కొన్నాను మరికొందరు వ్యాఖ్యానించారు. దీన్ని ఏ రంగుతోనైనా తయారు చేయగలను, సేఫ్టీ పిన్ రంధ్రం కోసం బంగారాన్ని కూడా ఉపయోగిస్తాను అని ఒకరు, ఈ డబ్బుతో మొత్తం గదినినింపేసే అన్ని పిన్స్ కొంటాను అని మరొకరు... ఇలా తలా ఒక రకంగా ఈ బ్రూచ్‌ను ఎగతాళి చేశారు. View this post on Instagram A post shared by BlackSwanSazy (@blackswansazy) కాగా లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఆటో మోడల్లో బ్యాగ్, రూ. 1.2 లక్షల ధరతో కొల్హాపురి-శైలి చెప్పులను తీసుకురావడం వార్తల్లో నిలిచింది. మహారాష్ట్ర సాంప్రదాయ చేతితో తయారు చేసిన షోలాపురి చెప్పులకు కాపీ అంటూ విమర్శలు చెలరేగాయి. చేతివృత్తులవారికి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తమైంది. ప్రాడా తమ డిజైన్‌ను కాపీ చేసినట్లు ఆరోపిస్తూ భారతీయ కళాకారులకు ద్రవ్య పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయడంతో వివాదం మరింత తీవ్రమైంది. -
అదిగో అదే భారత్‌లో అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం..!
భారత్‌ని సందర్శించిన జర్మన్ వ్లాగర్ అలెక్స్ వెల్డర్ ఇప్పటివరకు తాను చూసిన వాటిలో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అంటూ దాని గురించి వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాదు..నెట్టింట ఆ ప్రదేశం హాట్‌టాపిక్‌గా మారింది. జర్మన్ వ్లాగర్ అలెక్స్ భారతదేశంలో తాను చూసిన అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం ఇదేనని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను దక్షిణ గోవాని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నాడు. "బహుశా భారతదేశంలో నేను చూసిన వాటిల్లో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అయ్యి ఉండొచ్చు. కచ్చితంగా ఈ గోవా సూపర్ పార్టీ హాట్ స్పాట్ అవుతుంది. ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అయినా ఇక్కడ చెత్త ఉంటుదని అంచనవేయలేంద. ఈ దక్షిణ గోవా చుట్టూ తిరxగా ఎక్కడా.. చిన్న చెత్త ముక్క దొరకలేదు అంటూ ఆశ్చర్యపోయాడు. తాను అక్కడ ముగ్గురు స్థానికులను చూశానని, వాళ్లు ఆకాశం వైపు చూసి నవ్వుతూ ఉండటం చూశానని అన్నాడు. ఈ ప్రదేశం అందానికి నిజంగా మంత్ర ముగ్దుడుని అయిపోయా..ఇది నిజంగా యూరప్‌లా అనిపిస్తోంది. కచ్చితంగా దీన్ని చూడాగానే ఎవ్వరైనా..ఉష్ణమండల దేశమైన భారత్ అని అనుకోరు. ఇక్కడ ఎక్కడ మీకు ఒక్క చెత్త డబ్బ కనిపించదు. ఈ ప్రదేశానని చూసి కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇది నిజంగా అందంగా ఉంది అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు అలెక్స్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ప్రదేశం ఎప్పటికీ అలానే ఉండాలి అని ఆశిస్తున్నాం, కోరుకుంటుంన్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Alexander Welder (@alexweldertravels) (చదవండి: అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..!) -
అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..!
ప్రపంచంలోనే అతిపెద్ద సాలీగూడుని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అల్బేనియన్ గ్రీకు సరిహద్దులోని చీకటి గుహలో ఈ బారీ సాలీడు గూడును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గూడులో మొత్తం లక్షలకు పైగా సాలెపురుగులు నివాసం ఉన్నాయని, అందులో 69 వేలు దేశీ సాలెపురుగులు కాగా, మరో 42 వేలు మరోరకం జాతి సాలెపురుగులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ భారీ గూడు సుమారుగా 1,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అయితే సూర్యరశ్మిలేని అధికస్థాయి విషపూరిత హైడ్రోజన్ సల్ఫర్ వాయువు ఉన్న గుహలో ఈ సాలెపురుగులు ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయనేది శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది. ఈ సల్ఫర్ గుహ ఎంట్రెన్స్‌లో కటిక చీకటిలో ఈ భారీ సాలీడు గూడు ఉండటం విశేషం. ఈ భారీ గూడులో ఆధిపత్య సాలీడు జాతులు కలిసి జీవించడం అనేది అత్యంత విచిత్రమని, ఇదొక ప్రత్యేకమైన కేసుగా పేర్కొన్నారు. ఇక గుహలోపలి వరకు ఉన్న గూడులోని సాలీడ్లు సల్ఫర్ తినే సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకునే చిన్న మిడ్జ్లను ఈ సాలీడు పురుగులు తింటాయని పరిశోధకులు గుర్తించారు. ఇక గుహ బయట వైపు ఉన్న గూడులోని సాలీడు పురుగులు వీటికి అత్యంత భిన్నంగా ఉన్నాయని తెలిపారు. జన్యుపరంగా కూడా ఇవి చాలా వ్యత్యాసంగా ఉన్నాయన్నారు. గుహలోపల ఉండే మురికికి అనుగుణంగా అక్కడ ఉండే సాలీడులు జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతుంది. Scientists discovered the world’s largest spiderweb, covering 106 m² in a sulfur cave on the Albania-Greece border. Over 111,000 spiders from two normally rival species live together in a unique, self-sustaining ecosystem—a first of its kind.pic.twitter.com/LPLKVElSNv— Massimo (@Rainmaker1973) November 6, 2025 (చదవండి: pooja kaul: ఖరము పాలతో కాస్మెటిక్..!) -
12 ఏళ్ల కుర్రాడితో అభ్యంతరకర సంభాషణ!
ఈ మధ్య కాలంలో ఎటు చూసిన ఏఐ ఛాట్బోట్లే. స్మార్ట్‌ఫోన్‌లో, బ్యాంకింగ్, వాహనాలు... ఛాట్బోట్లు లేని రంగం అంటూ లేకుండా పోయింది. మంచిదే కదా? మన పనులు సులభం చేసేస్తాయి కదా? అనుకుంటున్నారా? ఇది సగం వాస్తవం. మిగిలిన సగం చాలా ఇబ్బందికరమైంది. ఎలాగంటారా? కెనడాలో గత నెల జరిగిన ఒక ఘటన చెబుతంది ఆ విషయాన్ని. ఫరా నాసర్ కెనెడాలో ఒక జర్నలిస్ట్. పన్నెండేళ్ల కుమారుడితో కలిసి టెస్లా కారులో ఎక్కడికో వెళుతోంది. పిల్లాడు కారులోని ఛాట్బోట్తో సరదాగా మాట్లాడుతున్నాడు. రకరకాల ఐస్‌క్రీమ్స్, డెజర్ట్స్లో చక్కెర ఎంతెంత ఉంటుందని కుర్రాడు అడగడం.. టెస్లా ఛాట్‌బోట్ గ్రోక్ దానికి సమాధానం ఇవ్వడం నాసర్ విన్నారు. సంభాషణంతా మామూలుగానే గడిచిపోయింది. మరుసటి రోజు కుర్రాడు ఇంకో ప్రశ్న వేశాడు. ఫుట్‌బాల్ గురించి గ్రోక్తో మాట్లాడుతూ.. ‘‘క్రిస్లియానో రొనాల్డో, లయొనిల్ మెస్సీల్లో ఎవరు గొప్ప’’ అని అడిగాడు. అదే సమయంలో ఆ కుర్రాడు గ్రోక్ వ్యక్తిత్వాన్ని కాస్త ‘గోర్క్’కు మార్చేశాడు. సోమరిపోతైన పురుషుడిలా సమాధానాలిస్తుందన్న మాట ఈ పర్సనాలిటీ మోడ్‌లో చర్చ ఇలా నడుస్తూండగానే సడన్‌గా గోర్క్ అడిగిన ప్రశ్నకు నాసర్ బిత్తరపోయింది. ఎందుకంటే.. పన్నెండేళ్ల కుర్రాడిని అడగకూడనిది అడిగిందా ఛాట్‌బోట్. ‘‘నగ్ర చిత్రాలు పంపు’’ అని!! ఇదే విషయాన్ని వివరిస్తూ నాసర్ తాజాగా ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. ఏమిటీ గోర్క్?ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా విద్యుత్తుతో నడిచే కార్ల తయారీలో పేరెన్నిక గన్న విషయం తెలిసిందే. ఎక్స్‌తోపాటు టెస్లా కార్లలోనూ గ్రోక్ పేరుతో ఒక ఏఐ ఆధారిత ఛాట్‌బోట్‌ను ఏర్పాటు చేశారు. ఫ్యాక్ట్చెక్లతోపాటు ఏదైనా అంశానికి సంబంధించిన అనుమానాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతో. అయితే కో-పైలట్, పర్ప్లెక్సిటీ, జెమిని, ఛాట్‌జీపీటీ వంటి అనేక ఏఐ ఆధారిత బోట్లతో పోలిస్తే ఇది కొంచెం భిన్నం. మనం ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాధానం మారిపోతుంది. తెలివైన ప్రశ్న వేస్తే.. అంతే తెలివిగా, తుంటరి ప్రశ్న వేస్తే అంతకంటే తుంటరిగా జవాబిస్తుంది. వెటకారమాడితే.. తన కూడా అదే తీరులో సమాధానమిస్తుంది. అయితే.. నాసర్ కుమారుడు అడిగిన ప్రశ్నకు, గోర్క్ (గ్రోక్ తాలూకూ ఒక వ్యక్తిత్వం) సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడం గమనార్హం. పైగా 12 ఏళ్ల కుర్రాడితో అలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదని నాసర్ అంటున్నారు. ఆ సమాధానం విని.. ‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు’’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. మాట్లాడే వ్యక్తి వయసుకు తగ్గట్టు ఏఐ తన సమాధానాలను మార్చుకునేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా మరోసారి ఏఐ, నైతిక విలువలు, కార్పొరేట్ సంస్థల బాధ్యత అన్న అంశాలపై చర్చకు జీవం పోసింది. ఈ అంశంపై టెస్లా కూడా స్పందించింది. అక్టోబరు 17న ఈ ఘటన జరిగిందని, పిల్లల భద్రతకు కంపెనీ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఏఐ ఛాట్బోట్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఫరా నాసర్ ట్వీట్ ఇప్పుడు ఎక్స్ వేదికపై లేకపోవడం కొసమెరుపు! సీబీసీలో తన అనుభవాన్ని వివరిస్తున్న ఫరా నాసర్ వీడియో. -
అడవిలో మిక్కీ మౌస్!
పిల్లలకు కార్టూన్ షోలు కొత్తేమీకాదు. వారి ప్రపంచంలో ఏ మూలన చూసినా అవి కనిపిస్తాయి. అయితే అడవి బిడ్డల సంగతి వేరు! వారికి టీవీలు, స్మార్ట్‌ఫోన్ సౌకర్యం ఉండదు కాబట్టి.. కార్టూన్ షోలు వారికి బొత్తిగా అపరిచితం. ఛత్తీస్‌ఘడ్ అడవుల్లోని ఆదివాసి బిడ్డలకు ఒక సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ తన ఫోన్లో కార్టూన్ షో చూపిస్తున్న దృశ్యం, పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు నెటిజనుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ‘చాలా ఆలస్యంగా అయినా మిక్కీ మౌస్లాంటి కార్టూన్ క్యారెక్టర్లు అడవిబిడ్డలకు పరిచయం కావడం సంతోషంగా ఉంది’ ‘ఈ పిల్లలను చూస్తుంటే చాలా జాలిగా ఉంది. కార్టూన్ షోలాంటివి ఎన్నో మిస్ అవుతున్నారు’ అని కొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం... ‘దురదృష్టం కాదు. చాలా అదృష్టం. డిజిటల్ పోల్యూషన్లేని స్వచ్ఛమైన బాల్యాన్ని అడవిబిడ్డలు అనుభవిస్తున్నారు’ అని కొందరు స్పందించారు. -
తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం
మంచి ఉద్యోగం సంపాదించి, ఖరీదైన కారు తెచ్చి, ఇంటిముందు నిలిపి, గర్వంగా ఈ కారు నీదే నాన్నా చెప్పాలనే డ్రీమ్ దాదాపు పిల్లలందరికీ ఉంటుంది. తన చదువు, ఉన్నతి కోసం కష్టపడిన తండ్రి రుణం తీర్చుకోవాలనేది వారి ఆశ. అలా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి తన తండ్రిని సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.టూవీలర్ మీదే ఎక్కువ జీవితాన్ని గడిపేసిన తన తండ్రి సుఖం కోసం సరికొత్త టాటా పంచ్‌ను బహుమతిగా ఇచ్చాడు సత్యం పాండే అనే ఐటీ ఉద్యోగి. ఇన్నేళ్ల ఆయన కృషి , త్యాగానికి ప్రతిఫలంగా అభివర్ణించాడు.🥹❤️🙏🏽 https://t.co/Bv7xYPesQk pic.twitter.com/Y3gDOAOpQb— Satyam Pandey (@fittwithsatyam) November 5, 2025 బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఇటీవల తన తండ్రిని కారుతో ఆశ్చర్యపరిచాడు, మరియు ఈ ప్రక్రియలో వేలాది మంది ఇంటర్నెట్ అపరిచితులను భావోద్వేగానికి గురిచేశాడు. పాట్నా సివిల్ కోర్టులో సహాయకుడిగా పనిచేసే తన తండ్రి ముగ్గురు పిల్లల చదువు, సంక్షేమం కోసం, కొన్ని సౌకర్యాలను త్యాగం చేశాడని ,ముఖ్యంగా 14 ఏళ్లనుంచి హీరో హోండా స్ప్లెండర్తోనే గడిపాడని చెప్పాడు సత్యం. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడిగా, తమ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుననీ, తమది సాధారణ దిగువ-మధ్యతరగతి కుటుంబం, డబ్బు ప్రాముఖ్యత నేర్పించారని గుర్తు చేసుకున్నాడు. తనకు 14 యేళ్ల వయసులోతండ్రి బక్సర్‌లో పనిచేసేవాడు. కుటుంబం పాట్నాలో ఉండేది . 120 కి.మీ. దూరం ప్రతిరోజూ జిల్లా కోర్టులో పని కోసం రైలులో ప్రయాణించేవాడు. తెల్లవారకముందే వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చేవార, తన చదువు కోసం చాలా కష్టపడ్డారంటూ ఆయనకు కృతజ్ఞత తెలిపారు.కాగా బిట్స్-పిలానీ నుండి పట్టభద్రుడయ్యాక, సత్యంపాండే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. దీంతపాటు ఫిట్నెస్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తద్వారా తన ఎడ్యుకేషన్ లోన్‌ను తీరుస్తున్నాడు. అలాగే MBBS డిగ్రీ చదువుతున్న తన చెల్లెలికి కూడా మద్దతు ఇస్తాడు. ఇపుడిక తండ్రి కోసం కారు కొనాలని కలలు కన్నాడు. అంతేకాదు చిన్ని చిన్న యాక్సిడెంట్లనుంచి తండ్రి తప్పించుకున్నపుడు తనకు చాలా భయం వేసిందని, అందుకే బడ్జెట్లో, సేప్టీలో మెరుగైన టాటా పంచ్ కొన్నానని తెలిపాడు. ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సత్యంను అభినందిస్తున్నారు. ప్రతీ కొడుకు కల ఇదే కదా , అభినందనలుబ్రో అంటూ కమెంట్ చేయడం విశేషం -
ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్‌లో ఫ్యాన్స్
అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ ఇష్టం. అలా పాపులర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్‌గా సోషల్ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు. 10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, దురదృష్టవశాత్తు, 32 ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్‌కు చెందిన, అనునయ్ సూద్ (Anunay Sood) ఇక లేరన్న వార్త నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.32 ఏళ్ల అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్ లాస్ వెగాస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడిఎవరీ అనునయ్ సూద్ అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్, ఇన్‌స్టాగ్రామ్‌లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్ కంటెంట్, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్‌తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్‌ది. లాస్ వెగాస్‌లో స్పోర్ట్స్ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్ ఆయన చివరి పోస్ట్. -
ఆ పేపర్ బాయ్ స్కిల్‌కి మాటల్లేవ్ అంతే..!
ప్రతి ఒక్కరి ఏదో ఒక దాంట్లో అపారమైన నైపుణ్యం ఉంటుంది. అయితే దాన్ని ఎవరో గుర్తించి అంటే గానీ వాళ్లకూడా అంతగా పట్టించుకోరు. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దీప్ అనే పేపర్ బాయ్ న్యూస్‌పేపర్ డెలివరీ చేయు విధానం చూస్తే మతిపోతుంది. అబ్బా ఏం స్కిల్ ఇది..అని అనుకుండా ఉండలేరు. అతడు పేపర్ విసిరే విధానం..అవి నేరుగా వాళ్ల వాకిళ్లు లేదా గుమ్మాల్లోనూ, అక్కడ మనుషుల చేతుల్లోకి సరాసరి వెళ్లిపోతుండటం ఓ మ్యాజిక్‌లా జరిగిపోతుంది. ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదన్నట్లుగా వెళ్లిపోతున్నాయి. అరే ఏం టెక్నిక్ ఇది అనిపిస్తుంది. అతడు అలా న్యూస్ పేపర్లను డెలివరి చేస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోలేం కూడా. అంతలా చాకచక్యంగా స్కూటర్‌పై స్పీడ్‌గా వెళ్లిపోతూ వేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఎక్కడ పొరబాటు, తడబాటు జరగకపోవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Paper boy (@paper_boy_deep) (చదవండి: ఎయిర్ ఇండియా ప్రమాద మృత్యుంజయడు: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..) -
'ఇంత స్వేచ్ఛగా ఎప్పుడూ అనిపించలేదు'!
మన మాతృగడ్డపై చాలామంది విదేశీయలు పలు విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ తన మనసుకి హత్తుకున్న వాటి గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఆ కోవలోకి జర్మన్ మోటార్ సైకిల్ రైడర్ చేరిపోయాడు. ఆయన కూడా భారతదేశంలో పర్యటించేటప్పుడూ తనకు కలిగిన అనుభూతిని పంచుకోవడమే కాదు, ఇతర దేశాలతో పోల్చుతూ ఇక్కడే లభించే ఆనందం మాటలకందనిది అంటూ తన అనుభూతిని సోషల్ మీడియలో షేర్ చేసుకున్నాడు.జర్మన్‌కి చెందిన మోటార్ రైడర్ మార్క్ ట్రావెల్స్‌గా పేరుగాంచిన మార్కస్ ఎంగెల్ భారతదేశాన్ని బెస్ టూరిస్ట్ ప్లేస్‌గా అభివర్ణిస్తూ..ఈ మాతృగడ్డపై తన అనుభవాన్ని షేర్ చేశారు. తన పర్యటనలో భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడూ..ప్రపంచంలో మరెక్కడా లేనంత స్వేచ్ఛను అనుభవించానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో భారతదేశం గురించి ఇంతకముందు చెప్పాను..మళ్లీ ఇప్పుడూ చెబుతాను. నేను ఇప్పటివరకు చాలా దేశాల్లో పర్యటించాను, కానీ భారతదేశంలో పొందిన స్వేచ్ఛ మరెక్కడ పొందలేదు. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది అని వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, మార్కస్ ఎంగెల్ సాహసయాత్రలు, సుదూర మోటార్ సైకిల్ పర్యటనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే భారత్ వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గడిపాడు కూడా. అతను కేవలం ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతంలోని సంస్కృతిని అన్వేషిస్తాడు. ఇక మార్కస్ వీడియోలో తాను మళ్లీ కచ్చితంగా భారత్‌కి తిరిగి వస్తానని చెప్పాడు. ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. చాలాకాలం ఇక్కడ ఉన్నా. అయినా నాకు ఇక్కడ ఉండేలా ఐదేళ్ల వీసా ఉంది. కాబట్టి మళ్లీ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్‌లో వాలిపోతా. ఇక్కడ పర్యటిస్తే కలిగే ఫీల్ వేరేలెవెల్. అని వీడియోని ముగించాడు. ఈ వీడియో నెట్టింట రెండు లక్షలు పైనే వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. భారతదేశం అద్దం లాంటిదని..ఇక్కడ తన అందమైన గమ్యస్థానాలను చూపిస్తూ..తనలో కలిపేసుకుంటుంది. అలానే మిమ్మల్ని వశపరుచుకుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సంగీతకారుడిగా పనిచేసిన తర్వాత మార్క్ 2020లో పూర్తి సమయం మోటో-వ్లాగర్‌గా మారాడు. View this post on Instagram A post shared by Marc Travels (@marc.travels.blog)(చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..) -
ఐఏఎస్ సారూ..! మీరే ఇలా చేస్తే ఎలా..?
అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఏ మాటైనా, విమర్శ అయినా చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్లే..అనుకోకుండా లేదా ప్రమాదావశాత్తు చిన్న మాట తూలిన అంతే సంగతులు. ఇదేంటి సారూ..! ఇలా చేశారు అని అంతా వేలెత్తి చూపించేస్తారు. పైగా విమర్శలపాలవ్వక తప్పదు. అందుకే పెద్దలు సదా అటెన్షన్, నమ్రతగా ఉండాలి అని చెబుతుండేది అందుకే కాబోలు. ఇప్పుడిదంతా ఎందుకంటే..పాపం ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉద్దేశ్యం మరొకటి అయితే ప్రజల్లో మరొలా వెళ్లి..ఆయన ప్రవర్తననే ప్రశ్నించే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే..విదేశాల్లో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ నీలేష్ చేసిన ఒక్క పోస్ట్ పెద్ద వివాదాస్పదమై, సోషల్‌మీడియాలో చర్చలకు దారితీసింది. మన దేశ రాజాధానిలో వాయు నాణ్యత ఏ పరిస్థితిలో ఉందో తెలిసిందే. ఈ విషయమై నిపుణులు ఈపాటికే ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేశారు కూడా. అయితే ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తాను ఆ నేపథ్యంలోనే ఢిల్లీని వదిలి విదేశాల్లో బతుకుతున్నానంటూ..తాను అమెరికాలో ఉన్న స్థితిని, ఢిల్లీలోని పరిస్థితిని పోల్చి మరి వివరించారు. పైగా ఢిల్లీ గగన వీధుల్లో పొగమంచుతో ఉన్న స్కైలైన్‌ని, అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్ ప్రకృతి దృశ్యం చూపిస్తూ..రెండింటి మధ్య ఎంత వ్యత్యాసమో గమనించండి అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ముఖ్యంగా భారతదేశ రాజధానిలోని ప్రమాదకర గాలి నాణ్యత, విదేశాలలో కాలుష్యం లేని వాతావరణం మధ్య వ్యత్యాసాన్నిరీడింగ్లతో సహా చూపించారు. అయితే మన రాజధానిలో గాలి నాణ్యత అంతకంతకు పడిపోతుంది అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఇలా వేరే దేశంతో పోల్చి మనల్ని మనం దిగజార్చుకుంటూ చెప్పడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశానికి సేవ చేసే బాధ్యతయుతమైన వృత్తిలో ఉండి, ఇలా దేశం విడిచి వచ్చి మంచి పనిచేశాను, ఇప్పుడు నేను చాలా సురక్షితంగా ఉన్నానంటూ.. ఏదో ఘనకార్యం చేసినట్లుగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా అంటూ మండిపడ్డారు నెటిజన్లు. అసలు సమస్య పరిష్కారంలో భాగం కావలి గానీ మీరే ఇలా చేస్తారా?. నిజానికి మీరు దేశ సేవ చేయడానికే ఐఏఎస్ చేశారనుకున్నా..కానీ.. అని మిమర్శిస్తూ పోస్టులు పెట్టారు.If I hadn't left India, I would have had to live and breathe in this mess otherwise known as the North Block Secretariat.Note the stark contrast. 🤯 https://t.co/vBKuC0Te7p pic.twitter.com/GHUUtJfQNQ— LV Nilesh (@LVNilesh) November 2, 2025 (చదవండి: ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!) -
ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!
డబ్బు దేన్నైనా మార్చేయగలదు. అది మనుషుల దగ్గర ఉంటే..ఒక్కసారిగా వారి రేంజే మారిపోతుంది. మాట తీరు మారిపోతుంది. అందుకు నిదర్శనం ఈ సీఈవోకి ఎదురైన ఘటనే. అప్పటి వరకు సీఈవో దగ్గర నార్మల్‌గా పనిచేసిన వ్యక్తిలో..ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు. విస్తుపోవడం సీఈవో వంతైంది. ఆ తర్వాత గానీ తెలియదు అసలు కారణం ఇది అని. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా ఇటీవల కొత్తగా కారు డ్రైవర్ని నియమించుకున్నారు. పనిలో జాయిన్ అయిన రెండు రోజులు సాధారణంగానే పనిచేశాడు. మూడోవ రోజు..ఏకంగా ఆఘ మేఘాల మీద పునీత్ గుప్తాకి ఎదురొచ్చి డోర్ ఓపెన్ చేసి స్వాగతం పలికాడు. ఈ అనుహ్య చర్యకు విస్తుపోయిన సీఈవో..ఇంత హడావిడి ఏం అవసరం లేదు. కారు స్టార్ట్ చేసి ఉంటే తాను ఎక్కగానే కారు వెళ్లిపోయేది కదా అని చీవాట్లు పెట్టారు పునీత్ గుప్తా. పైగా మరోసారి రిపీట్ అవ్వనివ్వద్దు, కేవలం టైం వేస్ట్ అవ్వకుండా చూసుకో చాలు అని కాస్త గట్టిగా చెప్పారు. కానీ కారు డ్రైవర్ మాత్రం తన పనే తాను చేసుకుంటున్నానని చెప్పే యత్నం చేసినా..గుప్తా అలా వద్దని వారించారు. ఆ తర్వాత ఇన్ని రోజులు నార్మల్‌గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటా అని ఆలోచించారు గుప్తా. అప్పుడే గుర్తొచ్చింది. ఇందాక ఫోన్ కాల్లో రూ. 500 కోట్ల ఒప్పందం గురించి మాట్లాడానని, బహుశా దానివల్లే ఇతడిలో ఇంత మార్పు వచ్చిందా అని విస్తుపోయారాయన. డబ్బు నిజానికి ఎవ్వరినైనా మార్చేస్తుంది. అంటూ తనకు జరిగిని అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌పై మిశ్రమంగా స్పందించారు. కొందరు డ్రైవర్ అంకితభావంతో పనిచేస్తున్నాడని పేర్కొనగా, మరికొంతమంది కోట్లు గురించి వినగానే బ్రో 'కార్పొరేట్ డ్రైవర్ మోడ్'ని అన్‌లాక్ చేసాడు" అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..) -
ఒక వ్యక్తి.. 10వేల ఓటర్‌ఐడీలు!
ఏఐ జమానాలో ఏది అసలైందో తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దానికి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారంతో తోడవ్వడంతో మరింత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. దీంతో వాస్తవం ఏంటో తెలియకుండానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. ఒక వ్యక్తి 10వేల ఓటర్‌కార్డుల పేరిట ఓ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. వీడియోతో సహా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. జరిగింది ఏంటి?.. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా కల్యాణి టౌన్‌లోని మేజర్చర్ ప్రాంతంలో అక్టోబర్ 25వ తేదీన అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఇద్దరు యువకులు అతన్ని పట్టుకుని సంచి తెరిచి చూడగా.. అందులోంచి ఓటర్ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఆ సమయంలో తీసిన వీడియోనే అది. సో.మీ. ప్రచారంఒక వ్యక్తికి 10వేల ఓటర్ కార్డులు. అదసలు సాధ్యమేనా? అనేది పట్టించుకోకుండానే ప్రచారం చేసేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నది ఆ వీడియో సారాంశం. నేరగాళ్లు ఫేక్ ఓటర్ ఐడీలతో రెచ్చిపోతున్నారని.. ఇది ప్రభుత్వం కాదని.. పశ్చిమ బెంగాల్‌ను పశ్చిమ బెంగాల్‌గా మార్చే ప్రయత్నమని తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవి 100–250 దాకా ఉన్నాయి. అందులో మూడు డిజిటల్ కార్డులు అస్సాం రాష్ట్రానికి చెందినవిగా ఉన్నాయి. మిగతావి కల్యాణి, చుట్టుపక్కల వార్డులకు చెందినవిగా తెలుస్తోంది. అవి నకిలీవా? అసలువేనా?.. వీటితో మోసానికి పాల్పడ్డారా? అని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతోంది. ఫేక్ ప్రచారం అంటే.. పట్టుబడింది 250 ఓటర్‌కార్డులు. జాతీయ వార్త సంస్థలు కొన్ని ఆ విషయాన్ని ధృవీకరించాయి. అయితే అవి అసలువో.. నకిలీవో కూడా తెలియదు. కానీ,సోషల్ మీడియాలో కొందరు ఆ సంఖ్యను 10,000గా పేర్కొంటు ప్రచారానికి దిగారు. కొసమెరుపు.. 2018లో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఒక అపార్ట్మెంట్లో 10,000కు పైగా ఓటర్ ID కార్డులు లభ్యమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు హస్తం ఉందని, ఆ అపార్ట్మెంట్ ఆయన సిబ్బందినేనని ఆ సమయంలో బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. భారీ సంఖ్యలో ఫేక్ ఓటర్ ఐడీలు బయటపడడంతో అక్కడి ఓటింగ్‌ను ఈసీ వాయిదా కూడా వేసింది. ఆ సమయంలో.. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య ఇదంతా చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు కూడా. అయితే వాయిదా అనంతరం జరిగిన ఎన్నికలోనూ మునిరత్న నాయుడు ఘన విజయం సాధించారు. ఇప్పుడు 10వేల ఓటర్‌కార్డుల పట్టివేత ప్రచారం నేపథ్యంలో ఈ అంశం మరోసారి చక్కర్లు కొడుతోంది. -
ఏంటయ్యా ఇది.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. 'మీరేం పరిశీలించారు' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజనుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి.. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ గ్యాప్ నుంచి మరోవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన టెంపో అతడిని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు తన స్కూటర్‌తో సహా రోడ్డుపై పడిపోయాడు.టెంపో వెనుకే వచ్చిన మరో స్కూటరిస్ట్ కూడా కిందపడబోయి తమాయించుకున్నాడు. ద్విచక్రవాహనదారులు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోనే సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేసి.. 'మీరేం పరిశీలించార'ని అడిగారు. బాధ్యతతో కూడిన డ్రైవిండ్, ఎల్లప్పుడు భద్రతే ముఖ్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడండి అంటూ హ్యాష్‌ట్యాగ్స్ జత చేశారు. అయితే ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని (Hyderabad) ఏ ప్రాంతంలో జరిగిందన్న వివరాలు వెల్లడించలేదు.ఈ వీడియోపై నెటిజనులు (Netizens) స్పందించారు. ఈ ప్రమాదంలో రెండు వైపులా తప్పు ఉందని అభిప్రాయపడ్డారు. స్కూటరిస్ట్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయగా, టెంపో డ్రైవర్ నియంత్రించలేని వేగంతో ప్రమాదానికి కారణమయ్యాడని పేర్కొన్నారు. స్కూటరిస్ట్, టెంపో డ్రైవర్.. ఇద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.''ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ చూస్తుంటాం. పోలీసులు కూడా వారిని చూస్తారు, కానీ పట్టించుకోర''ని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన ఖాళీలు లేకుండా చూడాలని, డివైడర్ల సైజు పెంచాలని మరొకరు సూచించారు. షార్ట్‌కట్‌లతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని పలువురు హితవు పలికారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) కచ్చితంగా పాటించాలన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ శాఖ సహాయంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు.. సెమినార్లు, వీడియో సెషన్లు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. బాధ్యతారహిత డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కోర్సు ప్రవేశపెట్టి బోధించాలని ఓ నెటిజన్ సూచించారు.చదవండి: గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణంద్విచక్ర వాహనదారులే ఎక్కువ..మన దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,97,871 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,51,228 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా (45.80 %) ఉన్నారని నివేదిక వెల్లడించింది. అతివేగం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు (61.4 %) జరుగుతున్నట్టు ఎన్సీఆర్బీ తెలిపింది.What are your observations? #DriveWithResponsibility#SafetyFirstAlways#ResponsibleDriving#FollowRulesSaveLives pic.twitter.com/5z2RZO8BbN— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 30, 2025 -
పెళ్లిలో స్కాన్ చదివింపులు
ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పదో పరకో చదివింపులు జరుగుతూనే ఉంటాయి. దగ్గరివారైతే కొంచెం ఎక్కువ.. దూరపు చుట్టాలైతే చిన్న చిన్న గిఫ్ట్‌లతో పని కానిచ్చేస్తూంటాం. అయితే ఇప్పటివరకూ నగదు, బహుమతులతో సాగుతున్న ఈ చదివింపుల తంతు కేరళలో కొత్త అవతారమెత్తింది. పేటీఎం బాట పట్టింది. ఎలాగంటే.. కేరళలోని ఒకానొక ఊళ్లో ఒక పెళ్లి. బంధుమిత్రుల కోలాహలం, వధూ వరుల అచ్చట్లు ముచ్చట్లు ఎన్ని ఉన్నా.. ఈ వేడుకలో హైలైట్ మాత్రం పెళ్లికూతురి తండ్రి. తెల్లటి షర్టు, పంచెతో కనిపించిన ఈయనగారి జేబుపై పేటీఎం క్యూఆర్ కోడ్ పిన్ చేసి ఉంది మరి. పెళ్లికి కాదుకానీ... మూడేళ్ల క్రితం పంజాబ్, బీహార్లలో శుభకార్యాల్లో బ్యాండ్ వాయించే వారికి డిజిటల్ చదివింపుల చేసిన వాళ్లు ఉన్నారు. డ్రమ్ముకు అతికించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నజరానాలు సమర్పించిన వాళ్లు కొందరైతే.. డ్రమ్ముపైనే క్యూఆర్ కోడ్ ముద్రించుకుని మరీ నగదు ప్రశంసలు పొందిన వారు ఇంకొందరు. దేశంలో 2017లో మొదలైన ‘భారత్ క్యూఆర్’తో డిజిటల్ పేమెంట్లు చాలా సులువైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మాస్టర్‌కార్డ్, వీసాలతో మొదలుపెట్టగా.. తరువాతి కాలంలో దీన్ని అందరూ వాడటం మొదలైంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటివి మూలమూలలకూ చేరిపోయాయి. గత ఏడాది దేశం మొత్తమ్మీద 35 కోట్లకుపైగా క్యూఆర్ కోడ్లు చెలామణిలో ఉన్నాయంటే ఇదెంత పాప్యులర్ అన్నది ఇట్టే అర్థమై పోతుంది.క్యూఆర్ కోడ్లు పెట్టుకుని భిక్షమెత్తుకునే వారిని మనం చూసే ఉంటాం కానీ ఇలా వెరైటీగా చదివింపుల కోసం క్యూఆర్ కోడ్‌ను తొలిసారి వాడింది మాత్రం ఈయనే కాబోలు!. ‘‘అయ్యలారా.. అమ్మలారా.. కూతురి పెళ్లికి బోలెడంత ఖర్చయిపోయింది... చేసే చదివింపులు ఏవో నాకూ కొంత ముట్టజెబితే... అదో తుత్తి’’ అన్నట్టుగా ఉంది ఆ తండ్రి వ్యవహారం. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగవైరల్ అయిపోయింది ఈ వీడియో క్లిప్. కొంతమంది అతిథులు మొబైల్ఫోన్లతో స్కాన్ చేసి పేటీఎం చదివింపులు చేయించడమూ స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో పడిందే తడవు.. పలువురు పలు రకాల కామెంట్లూ చేస్తున్నారు. పెళ్లికూతురి తండ్రికి డిజిటల్ టెక్నాలజీపై ఉన్న మక్కువను, దేశంలో డిజిటల్ చెల్లింపులు సులువైన వైనాన్ని కొంతమంది బాగానే ప్రశంసించారు. మరికొందరు డిజిటల్ టెక్నాలజీ మన సంప్రదాయాలను మరుగున పడేలా చేస్తోందని నొసలు విరిచారు కూడా. ఏదైతేనేం.. ఆ పెళ్లికి వెళ్లిన వారందరూ ఆ తండ్రి చేష్టకు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇచ్చేదేదో ‘పే’ చేసేసి.. సుష్టుగా భోంచేసి మరీ వెళ్లిపోయారు. ఆశీర్వాదాలు వధూ వరులకు... క్యాష్ తండ్రికి అన్నమాట! View this post on Instagram A post shared by INDIA ON FEED (@indiaonfeed) -
హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్లా ఇంత అందమా? ఎలా?
సింహాలు పౌరుషంతో గంభీరంగా కనిపిస్తాయి.మగ సింహాలు అందమైన జూలుతో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మరి జూలు రింగు రింగులుగా ఉంటే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కర్లీ మేన్ సింహం బ్యూటీ చర్చకు దారిసింది."హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ది వైల్డ్" ("Handsome Boy In The Wild") అంటూ మసాయి మారా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కాంబిజ్ పౌర్ఘనాద్ తీసిన కర్లీ మేన్ సింహం అరుదైన ఫోటో ఆన్లైన్లో వైరలవుతోంది.ఇది వన్యప్రాణి ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kambiz Cameo Pourghanad (@silent_whispers.photography) మగ సింహాల శరీరం రంగు ,ఆకృతి చాలా మారుతూ ఉంటాయి. కానీ జుట్టు ఇలా మారడం చాలా అరుదు. ఎంతో ఓపిగ్గా, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్లు అలాంటి సింహ రాజాలను పరిచయం చేస్తూ ఉంటారు. అలా గిరిజాల జుట్టుతో ఉన్న సింహం అద్భుతమైన క్లోజప్ ఫోటోలను తీశారు. అడవిలో చాలా అరుదుగా కనిపించే దృశ్యాన్ని తన కెమెరాలలో బంధించారు. సెలూన్ బ్లోఅవుట్ చేసి చక్కగా మేకప్ చేసినట్టు అందంగా కనిపించింది. ఈ అందమై హీరో పేరు న్జురి - M6. ఒలెపోలోస్ కుమారుడు . అలాగే కెన్యాలోని మసాయి మారాలో ఏడు టోపి ప్రైడ్ సింహాల్లో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ సింహం ఫోటోను షేర్ చేస్తూ ఇలా కామెంట్ చేశారు ’’రాసి పెట్టుకోండి, న్జురి ప్రస్తుతం మసాయి మారాలో అత్యంత అందమైన సింహాలలో ఒకటి. అలాగే అందంలో భవిష్యత్తులో ఆఫ్రికాలో బాన్ జోవి, కింగ్ మోయా ,బ్లాండీ సరసన నిలబడుతుంది’’ అని. View this post on Instagram A post shared by Kambiz Cameo Pourghanad (@silent_whispers.photography) ఫోటోలో న్జురి అద్భుతమైన అలలుగా, దాదాపుగా స్టైల్ చేయబడిన మేన్ తో కనిపిస్తుంది, ఇది సాధారణ అడవి సింహం మేన్ కంటే లాగా కనిపిస్తుంది. జన్యుశాస్త్రం, అధిక తేమ , వర్షంలో తడిసిన తర్వాత సహజంగా ఎండిన మేన్ కలయిక వల్ల కర్ల్స్ ఏర్పడి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ప్రకృతి చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయిన వన్యప్రాణుల ఔత్సాహికులు, సాధారణ ప్రేక్షకుల నుండి ప్రశంసలందుకుంటోంది. భలే ముద్దుగా గిరజాలు అని ఒకరు, "హ్యాండ్సమ్ బాయ్! సినిమా స్టార్లా ఉన్నాడు" అని ఒక యూజర్ చమత్కరించారు. "ఎంత అందం, దురాశాపరుడైన మానవుని చేతిలో దానికి నష్టం కలగకుండా చూడాలి అతన్ని రక్షించాలి" అని ఒకరంటే, " ఒక అందమైన సింహం, మారా నుండి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి" అని అంటూ మరొకరు కమెంట్ చేశారు. దీంతో న్జూరి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను దక్కించుకుంటోంది.ఇదీ చదవండి : పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, వైరల్ వీడియో -
పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, అసలు సంగతి ఇదీ!
సోషల్ మీడియా విశేషాల పుట్ట. మంచో, చెడో, విశేషమో, వికారమో ఏదో ఒక వీడియో నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా ఒక వీడియో ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. మరీ ముఖ్యంగా ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఇపుడు మీరు చదవబోయేది అలాంటిదే..మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో అక్టోబర్ 4వ తేదీన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. 52 ఏళ్ల కూలీ రాజు పటేల్ పుల్గా మద్యం తాగి రోడ్డుపై వెళుతున్నాడు. అయితే ఇటీవలి వర్షాలు వరదల కారణంగా , సమీపంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ బయటకు వచ్చిన చిన్న బెంగాల్ టైగర్ రోడ్డుపైకి వచ్చింది. అటు బెంగాల్ టైగర్, ఇటు రాజు.. ఇద్దరూ తారసపడ్డాడు. అర్థరాత్రి దాన్ని పిల్లి అనుకున్న రాజు దాన్ని మెల్లిగా బుజ్జగించడం మొదలు పెట్టాడు. ఒక చేత్తో బాటిల్ పట్టుకొని నెత్తిమీద సున్నితంగా నిమిరాడు. అంతేకాదు..దానికీ ఓ చుక్క తాగిద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ పులి పట్టించుకోలేదు. ఏయ్.. పిల్లీ పక్కకు వెళ్లు అంటూ తాగిన మత్తులో గొణిగాడు. ఇది చూసి ఆ పులి పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అది ఏమీ అనలేదు. దీంతో బతికిపోయాడు రాజు. పుస్సీ కేట్ అనుకుంటూ అక్కడినుంచి సర్దుకున్నాడు. దాదాపు 10 నిమిషాల ఈ తంతు అంతా సీసీటీవీలో రికార్డైంది. తరువాత అటవీ అధికారులు స్పాట్లైట్లు, తేలికపాటి ట్రాంక్విలైజర్లతో వచ్చి అలసిపోయిన పులిని తెల్లవారుజామున 3 గంటలకు అడవిలోకి తిరిగి పంపించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నాడు. అయితే రాజు మాత్రం ఇప్పుడు భారీ పోలీసు రక్షణలో ఉన్నాడట. అతని సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేశాడు . మరోవైపు అంత ధైర్యం ఎలా వచ్చింది.. నీవు తాగిన డ్రింక్ రెసిపీ చెప్పు భయ్యా.. అంటూ పెళ్లైన మగాళ్లు వెంటబడుతున్నారంటూ పలు జోక్స్ పేలుతున్నాయి. @dekhane_mukul నిజంగా జరిగిందే అంటూ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. అసలు నిజం ఏమి మాత్రం వేరేలా ఉంది. అయితే ఇది ఏఐ జెనరేటెడ్ వీడియో అని ఫారెస్ట్ అధికారు ఒకరు స్పందించారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. AI generated. Please stay away from such AI generated videos and don’t forward them. May create unnecessary panic. https://t.co/SXoc6hqCnA— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 29, 2025— Mukul Dekhane (@dekhane_mukul) October 29, 2025 -
ఎప్పటికీ 'రియల్ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్ అప్లు..
కొన్ని సంఘటనలు అందర్నీ మైమరిచిపోయేలా చేస్తే..మరికొన్ని ఒక్క క్షణం ఆగిపోయి చూస్తుండిపోయేలా ఉంటాయి. వారి హోదాను కూడా పక్కన పెట్టి మనతో సామాన్యుల మాదిరిగా కలిసిపోయే వారి ఔదార్యం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. పైగా ఆ దృశ్యం అందరం ఒక్కటే అనేట్టుగా ప్రతిధ్వనిస్తుంది. అలాంటి అపురూపమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.ఢిల్లీలో జరిగిన శౌర్య వీర్ - రన్ ఫర్ ఇండియా' మారథాన్‌లో ఈ ఘటన ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఆ వేదికపై ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లవాడు అందర్నీ విస్తుపోయేలా పుష్ అప్లు చేస్తున్నాడు. ఇంతలో ఆర్మీ చీఫ్ ద్వివేది..ఆ పిల్లవాడిని ఉత్సాహపరిచేలా అతడితోపాటు ఆయన కూడా పుష్అప్లు చేశారు. ఆయన చేసిన పని ప్రజల హృదయాలను గెలుచుకుంది. నిజానికి ఈ మారథాన్ కార్యక్రమం సైన్యం, ధైర్యం అంకితభావానికి నివాళులర్పించే 79వ శౌర్య దినోత్సవ వేడుకల్లో భాగం. కరియప్ప పరేడ్ గ్రౌండ్లో వేదికపై ప్రత్యేక సామార్థ్యం ఉన్న పిల్లవాడు పుష్-అప్లు చేయడం ప్రారంభించినప్పుడు, ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఆ పిల్లవాడి ఉత్సాహాన్ని చూసి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది కూడా అతడితో చేరారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకుండా నెటిన్ల మనసును దోచుకుంది. అంతేగాదు 61 ఏళ్ల వయసులో ఎంత అప్రయత్నంగా పుష అప్లు చేశారు సార్ అని ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు.Army Chief joins a specially-abled child for push-ups : a powerful gesture of encouragement and inclusion. 🇮🇳 leadership is about lifting others in spirit and strength. pic.twitter.com/bl3HZFyTPI— Alpha Defense™🇮🇳 (@alpha_defense) October 27, 2025 (చదవండి: Success Story: కాలేజ్‌కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..) -
శ్రీనివాసులంతా ‘గ్రూపు’ కట్టేశారు! రికార్డు కొట్టేశారు!
విద్యానగర్(కరీంనగర్): కలియుగ దైవం శ్రీనివాసుడి నామ థ్యేయంతో ఒకటైన శ్రీనివాసులందరిది సమాజ సేవే లక్ష్యం కావాలని చిలుకూరు బాలాజీ శ్రీసుందరేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, ధర్మసంస్ధాపన అధ్యక్షులు రామదాసి ఆత్మరాం సురేశ్‌శర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని పీవీఆర్ ప్లాజాలో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుడిపై భక్తి విశ్వాసాలను పెంచుకున్న ఉమ్మడి రాష్ట్రంలోని ఆయన భక్తులు.. తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకుని వారిలో ఆ దేవదేవుడిని నిత్యం దర్శిస్తున్నారని తెలిపారు. శ్రీనివాసులందరూ దైవకార్యాలతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వూట్కూరు శ్రీనివాస్ రెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ నామధ్యేయులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో శ్రీనివాసులు రక్తదానం చేశారు.వాట్సాప్ గ్రూపుతో ముందుకు..తొలిసారిగా 2023 అక్టోబర్ 29న మనమంతా శ్రీనివాసులమే పేరుతో వుట్కూరి శ్రీనివాస్‌రెడ్డి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 28 వాట్సాప్ గ్రూపుల్లో శ్రీనివాసుల సంఖ్య 23వేలకు చేరింది. గతేడాది అక్టోబర్ 27న కరీంనగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో తొలి వార్షికోత్సవం నిర్వహించగా.. 760 మంది హాజరయ్యారు. ద్వితీయ వార్షికోత్సవానికి శ్రీనివాసులు పెద్ద ఎత్తున హాజరుకావడంతోపాటు వండర్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు.ఏకనామం సదాప్రీతిఏకనామం.. సదా ప్రీతి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఒకే భావజాలంతో శ్రీవారి సేవకు అంకితమవుతాం. ఇప్పటికే 23వేల మంది సభ్యుల ఐక్యత, భక్తి తత్పరత ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఆ శ్రీనివాసుని చల్లని దీవెనలు అన్నివే«ళలా అందరిపై ఉండాలని కోరుకుంటాను. – నంది శ్రీనివాస్, అధ్యక్షులు సాహితీ గౌతమి, కరీంనగర్పూర్వ జన్మ సుకృతంపూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం కావచ్చు ఈ జన్మలో మా తల్లిదండ్రులు ఏడుకొండల వాడి పేరు మాకు పెట్టారు. ఆ పేరు సార్థకం చేసుకుంటూ.. సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నాం. శ్రీనివాస్ పేరు ఉన్నవారందరం ఒక చోట, ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. – గాండ్ల శ్రీనివాస్, న్యాయవాది, శ్రీనివాసుల సేవా సంస్థ లీగల్ ఆడ్వైజర్, కరీంనగర్ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉందిలక్ష్మీనివాసుడైన శ్రీనివాసుడి పేరు మాకు ఉండడం అదృష్టం. ఇంత మంది శ్రీనివాసులు ఒకే వేదిక మీద కలువడం అద్భుతంగా ఉంది. శ్రీనివాస్ పేరు తలిస్తేనే అధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అలాంటి మహాత్మ్యం మరో పేరులో లేదు. అలాంటి పేరు మాకు ఉండడం చాలా సంతోషంగా ఉంది. -కన్నోజు శ్రీనివాస్, ఇనుగుర్తి శ్రీనివాస్, జగిత్యాలపేరు ప్రాధాన్యం తెలపడానికిఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరికి శ్రీనివాస్ పేరు పెట్టేవారు. ప్రస్తుతం కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ పేరు ప్రాధాన్యాన్ని నేటి తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనమంతా శ్రీనివాసులం అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాను. శ్రీనివాస్ పేరున్న అందరినీ ఒకటి చేస్తున్నా. – వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసుల సేవా సంస్ధ అధ్యక్షులుకలియుగ దైవం పేరుకలియుగ దైవం శ్రీనివాసుడంటే అందరికీ భక్తి, నమ్మకం. అ నమ్మకంతోనే మా తల్లిదండ్రులు ఆయన పేరును మాకు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆయన ఆశీస్సులు ఉంటే అంతామంచి జరుగుతుందనే నమ్మకం. శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరి విశ్వాసం, ఆయన పేరు మాకు ఉండడం మా అదృష్టం. – పల్లెర్ల శ్రీనివాస్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి,కరీంనగర్మాది పేరు బంధంకలియుగ ప్రత్యక్ష దైవం శ్రీని వాసుడు. ఆయన పేరును కు టుంబసభ్యులు మాకు పెట్ట డం అదృష్టంగా భావిస్తాను. శ్రీనివాసులందరిదీ దైవబంధం. ఆ శ్రీనివాసుడు ఏమీ ఆశించకుండా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదే విధంగా మేమందరం కూడా సామాజిక సేవలో నడువాలన్నదే ధ్యేయం. – ఎలగందుల శ్రీనివాస్, వాసుదేవ హాస్పిటల్, కరీంనగర్ -
భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!
మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్‌కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు ఓ జపనీస్ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.భారత్‌లో నివశిస్తున్న జపనీస్ భారతీయుడు నోజోము హగిహర ఒక శక్తిమంతమైన పాఠాన్నినేర్చుకున్నానంటూ భ్యావోద్వంగంగా మాట్లాడిన వీడియోని నెట్టిట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. తత్వం ఆంతర్యం తెలుసుకునేందుకు ఉపకరించే ధర్మ యోగా గురించి మాట్లాడాడు ఆ వీడియోలో. ఇది మనిషి ఎలా జీవించాలో..ఎలా ఉంటే మంచిది అనేది తెలియజేస్తుంది. యోగ సూత్రాలైన యమ(నిగ్రహం), నియమ(క్రమశిక్షణ)లు నిజాయితీ, కరుణ, క్రమశిక్షణలతో పాతుకుపోయిందని చెబుతున్నాడు. ఇది జీవన విధానం గురించి తెలుపుతుంది. అహింస, సత్యం, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు పోస్ట్‌లో ఈ యోగా అహింస, సత్యం, నిజాయితీ, దొగతనం చేయకుండా ఉండటం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నాడు. బ్రహ్మచర్యం, మిత సంభాషణ, శారీరక, మానసిక శక్తిని బలోపేతం చేయడమే కాదు, దురాశను, దక్కని దానియందు బాధ వంటి వాటిని దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యోగా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడాడు నోజోము. దీనికి దయతో జీవించే ఆర్ట్‌ని నేర్పింస్తుందనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Nozomu Hagihara (Nono)萩原望 (@india_nono_) (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
భారత్‌లో అలాంటి నిషేధం వద్దా?
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక.. సోషల్ మీడియా మత్తులో జనం మునిగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. యూట్యూబ్-ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, మీమ్స్ అని.. ఇలా రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే గడిపేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలనూ తల్లిదండ్రులు కట్టడి చేయలేకపోతున్నారు. అందుకే విప్లవాత్మక మార్పులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో.. యూరోపియన్ యూనియన్‌తో మలేషియాలోనూ బ్యాన్పై చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కాకపోయినా.. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణకు చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ స్పూర్తితో భారత్‌లోనూ అలాంటి నిర్ణయం జరగాలన్న అభిప్రాయాల్ని ఓ సర్వే తోసిపుచ్చింది. భారత్‌లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట!!..పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకంపై అభిప్రాయం కోరుతూ Ipsos, Statista సంయుక్తంగా ‘గ్లోబల్’ సర్వే నిర్వహించాయి. ఇందులో 30 దేశాలకు చెందిన వేల మంది తల్లిదండ్రులు ఫీడ్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది నియంత్రణ సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఇండోనేషియా ఆ తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి ఈ ఒపీనియన్ వెల్లడైంది. అయితే.. భారత్ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభింaచింది. వందలో 68 మంది మాత్రమే చిన్నారులకు సోషల్ మీడియా కట్టడిని సమర్థించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. కిందటి ఏడాది ఇది 73 శాతం ఉంది. అంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గిపోయిందన్నమాట.ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ.. పూర్తి నిషేధం సబబు కాదనే అభిప్రాయం తాజా సర్వేలో ఇండియన్ పేరెంట్స్ నుంచి వ్యక్తమైంది. బ్యాన్‌కి బదులు మార్గదర్శకత్వం అవసరం అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే మా నుంచి కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది.:హైదరాబాద్‌కు చెందిన ఓ తల్లినిషేధం సబబు కాదు. దాని కంటే సరైన గైడ్‌లైన్స్ మీద దృష్టి పెట్టాలి: బెంగళూరుకు చెందిన ఓ తండ్రిభద్రతా సమస్యలు ఉన్నా సో.మీ.ను పూర్తిగా నిషేధించడం సమర్థనీయం కాదు: ఢిల్లీకి చెందిన తల్లిదండ్రులుసోషల్ మీడియా వినియోగం అనేది పిల్లల వికాసం, అవగాహన కోసం ఉపయోగపడుతుందని కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత్‌కు డిజిటల్ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. విద్యా, వ్యాపార అభివృద్ధి, కమ్యూనిటీ నిర్మాణం లాంటి రంగాల్లో ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం ఉంటోంది. మరీ ముఖ్యంగా.. యూత్ కల్చర్‌లో లోతుగా కలిసిపోయింది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు కఠిన నియంత్రణలు అవసరమని భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా.. నిషేధం కంటే నియంత్రణ మీదే(వయస్సు ధృవీకరణ, డిజిటల్ విద్యా అవగాహన, తల్లిదండ్రుల పర్యవేక్షణ లాంటి అంశాలు) ఎక్కువ దృష్టిసారిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా పిల్లల విషయంలో హానికరమైన కంటెంట్, అల్గోరిథం విషయంలో నియంత్రణలకు సిద్ధంగానే ఉన్నట్లు సూచన ప్రాయంగా చెబుతున్నాయి. జర్మనీలో.. భారత్‌కు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చిన వారి శాతం అత్యల్పంగా 53% ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే మద్దతు 13% పెరిగింది. ఇది పెరుగుతున్న అక్కడి తల్లిదండ్రుల ఆందోళనను, మారుతున్న పిల్లల ఆలోచనా ధోరణిని సూచిస్తోంది. -
రీల్స్ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్
యూట్యూబ్ రీల్స్ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్‌పూర్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.తన మొబైల్ ఫోన్లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇదీ చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్‌లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే -
నాణేల సంచితో షోరూమ్‌కి రైతు.. కూతురి కోసం ఎంత తాపత్రయం!
ఓ త్రండి ఆర్థిక సామర్థ్యానికి మించి కుమార్తె ఓ కోరిక కోరితే.. నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు ఆ నాన్నా. అది తన తాహతుకు, శక్తికి మించిన పని అని తెలిసినా.. అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన అతడి కథ ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది.ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. బజరంగ్ రామ్ అనే రైతు కూతురు లక్షరూపాయ ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతడి ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం అతడికి అనితరసాధ్యమైనది కూడా. అయినా సరే ప్రతి రూపాయి వెనకేస్తూ.. ఏదోనాటికి కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంతా చేయడం ప్రారంభించాడు. తన సంపాదనలో మిగిలిని నాణేలన్నీ బాక్స్‌లో వేస్తూ..కొంత సొమ్ము పోగుచేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి..తాను స్కూటర్ కొనాలనుకుంటున్నా అంటూ..ఆ నాణేల సంచిని వారిముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందటూ ఆ నాణేల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూమ్ డైరెక్టర్ ఆనంద్ గుప్తాను మనసుని కదిలించింది. కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టేవారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి..ఆ సంచిలోని నాణేలన్నింటిని తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం రూ. 40,000 అని చెప్పగా. మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటానని అన్నాడు బజరంగా రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తిచేశాడు. ఆ తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ కుటుంబానికి ఆహ్వానం పలికి. టీ సర్వ్ చేసి మరి సరికొత్త హోండా యాక్టివా కీను అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడూ కూతురు చంపా కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆమె కన్నీళ్లతో ఇది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామె.(చదవండి: ఆ ప్రొఫెసర్‌కు 150 ప్లస్ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!) -
డీప్‌ఫేక్స్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో రూపొందించిన కృత్రిమ కంటెంట్ (డీప్‌ఫేక్స్, సింథటిక్ కంటెంట్) నుంచి యూజర్లకు రక్షణ కల్పించే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ’ఐటీ రూల్స్ 2021’కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పలు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అసలు, నకిలీ కంటెంట్‌కి మధ్య వ్యత్యాసాన్ని యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా సింథటిక్ కంటెంట్‌కి లేబులింగ్, మార్కింగ్ చేయాల్సిన బాధ్యత బడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై (ఎస్ఎస్ఎంఐ) ఉంటుంది. అప్లోడ్ చేసిన కంటెంట్.. ఏఐతో తయారు చేసినదా లేదా అనేది యూజర్ల నుంచి ఎస్ఎస్ఎంఐలు డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా, వారిచ్చిన డిక్లరేషన్ నిజమే నా కాదా అనేది కూడా తగు సాంకేతికతను ఉపయోగించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. విజువల్ అయితే కనీసం 10 శాతం స్థలాన్ని ఆక్రమించేలా, లేదా ఆడియో అయితే ప్రారంభంలోనూ, అది సింథటిక్ కంటెంట్ అని యూజర్లకు స్పష్టంగా తెలిసేలా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సదరు కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి లేదా మార్చడానికి తోడ్పడే సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక, ’చట్టవిరుద్ధమైన సమాచారాన్ని’ తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఆదేశాలు జారీ చేసే అధికారం జాయింట్ సెక్రటరీ అంతకు మించిన స్థాయి గల ప్రభుత్వ సీనియర్ అధికారులు, డీఐజీ అంతకు మించిన స్థాయి గలవారికి మాత్రమే ఉంటుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
గోల్డెన్ క్రియేటర్
ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్‌కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్‌స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్‌స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్‌స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్‌స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్‌స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్‌తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్‌స్టా సంస్థ బంగారు రింగ్‌ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్‌స్టా ప్రొఫైల్‌లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్‌ని ఇన్‌స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్‌గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి. -
ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్‌కి వెళ్లింది. ఆ హోటల్లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది. ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు. నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్‌ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం. మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025 (చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..) -
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్‌ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్‌పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
వయసు 82.. వెనక్కి తగ్గేదే ల్యా..
సాహసం వయసు అడుగుతుందా?‘అబ్బే! అలాంటిదేమీ లేదు’ అంటుంది 82 సంవత్సరాల బామ్మ. ఈ బామ్మగారి పేరు ఏమిటో, ఊరు ఏమిటో తెలియదుగానీ నెటిజనులు మాత్రం ‘బంగీజంప్ గ్రాండ్మా’ అని పిలుచుకుంటున్నారు.82 ఏళ్ల వయసులో గట్టిగా నడవడం కూడా కష్టమే. అలాంటిది మన గ్రేట్ గ్రాండ్మా రిషికేష్‌లోని శివ్‌పురిలో బంగీ జంప్ చేసి ‘వావ్’ అనిపించింది. బంగీ జంప్ చేసే ముందు బామ్మలో ఎలాంటి సంకోచం, బెదురు కనిపించలేదు. హుషారుగా స్టెప్పులు వేసింది!ఆమె కళ్లలో నిండైన ఆత్మవిశ్వాసం కనిపించింది. బామ్మగారి బంగీ జంప్ విన్యాసాలు చూస్తే... ‘అయ్బాబోయ్’ అనుకోవాల్సిందే.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఆత్మవిశ్వాసం అనే రెక్కలతో గాల్లో దేవకన్యలా ఎగురుతోంది’ అని ఒక నెటిజనుడు కామెంట్ రాశాడు. View this post on Instagram A post shared by Bungee Jumping & Adventure in Rishikesh (@globesomeindia)(చదవండి: సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్‌ఫిల్..!) -
అవినీతి నిరోధక సంస్థలో రూ.5 కోట్ల హైఎండ్ కార్లా? మండిపడుతున్న నెటిజన్లు
దేశంలోని అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ అయిన లోక్‌పాల్ (Lokpal) హై ఎండ్ లగ్జరీ కార్లకోసం అన్వేషిస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ ఏజెన్సీల నుండి ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తోందన్న వార్త నెట్టింట తీవ్ర చర్చకు తెరతీసింది.అక్టోబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్లో లోక్‌పాల్ 7 BMW లగ్జరీ కార్లను కోరుకుంటోంది. వాటి ధర ఒక్కొక్కటి రూ. 70 లక్షలు. BMW 3 సిరీస్ Li కార్లను ఏడింటిని కొనుగోలు చేయడానికి టెండర్‌ను పిలిచింది, ఛైర్పర్సన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్తో సహా ప్రతి సభ్యునికి ఒకటి చొప్పున వీటిని కేటాయించనున్నారు. అంతేకాదు కార్ల తయారీ సంస్థ BMW లోక్‌పాల్ డ్రైవర్లు ,సిబ్బందికి ఏడు రోజుల 'శిక్షణ' అందించనుంది. ఈ శిక్షణలో కార్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు కార్యకలాపాలపై వారికి ట్రెయినింగి కూడా ఇవ్వాలట. టెండర్ నోటీసు ప్రారంభ తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది.The institution of Lokpal has been ground to dust by the Modi govt, by keeping it vacant for many years & then appointing servile members who are not bothered by graft & are happy with their luxuries. They are now buying 70L BMW cars for themselves! pic.twitter.com/AEEE2gPMtp— Prashant Bhushan (@pbhushan1) October 21, 2025 విమర్శలు, నెటిజన్లు రియాక్షన్స్ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లోఆగ్రహాన్ని రేకెత్తించింది. విలాసాలతో లోక్‌పాల్ ప్రతిష్టను మంటగలుపు తున్నారంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. ఒకపుడు జవాబుదారీతనానికి చిహ్నంగా ఉన్న లోక్‌పాల్ గౌరవం దిగజారుతోందని, సంస్థలో కీలక నియామకాలు చేపట్టలేని ప్రభుత్వం విలాసవంతమైన విదేశీ కార్లను ఎందుకు కొనుగోలు చేస్తోందని యూత్ కాంగ్రెస్ విభాగం విమర్శలు గుప్పించింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇపుడు ఒక్కొక్కిరికీ రూ. 70 లక్షల విలువైన కారు. తరువాత రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు అంటూ సెటైర్లు వేశారు. -
క్యాబ్ డ్రైవర్‌గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..
విదేశాల్లో సెటిల్ అవ్వడం చాలామంది యువత డ్రీమ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అలాంటి ఆలోచన చేసే ముందు అక్కడ నియమ నిబంధనలు గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి లేదంటే..తీరా కోర్సు పూర్తి చేశాక ఉద్యోగం చేసేందుకు వీలు లేకపోతే పరిస్థితి అగమ్యగోచరం. అందుకు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి అంటోంది ఈ బెంగళూరు మహిళ. అసలేం జరిగిందంటే..కెనడాలో క్యాబ్ నడుపుతున్న ఒక వైద్యుడిని కలిసిన బెంగళూరుకి చెందిన మేఘన శ్రీనివాస్ అందుకు సంబంధించిన వీడియో సంభాషణను నెట్టింట షేర్ చేశారు. మిస్సిసాగా నుంచి టొరంటోకు ట్రావెల్ చేస్తుండగా ఆ డ్రైవర్ని కలిశారామె. అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఆ డ్రైవరర్ తాను కెనడాలో డిగ్రీ చదువుతున్నట్లు తెలిపాడు. తన ఖర్చుల కోసం అని క్యాబ్నడుపుతున్నట్లు ఆమెతో చెప్పాడు. క్యాబ్ నడపుతూ తాను రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, అందులో కేవలం సింగిల్ బెడ్రూం కోసమే ఏకంగా రూ 2 లక్షలు పైనే ఖర్చు చేస్తున్నట్లు మేఘనతో వాపోయాడు. తాను గతంలో అమెరికా, కెనడా సైనిక వైద్యుడిగా పనిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో ప్రజప్రతినిధిగా ఉన్నట్లు తెలిపారు. తాను కెనడాలో తన వైద్య వృత్తిని కొనసాగించడానికి, వైద్య లైసెన్సు పొందేందుకు నానా తిప్పలు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చివరగా ఆ వీడియోలో మేఘన దయచేసి కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటే అన్ని విషయాలను తెలుసుకుని సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇక్కడకు రావాలనుకునే విద్యార్థులు కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ తీరు తెన్నులు..జీవిత వాస్తవాలు గుర్తించి పూర్తిగా తెలుసుకుని రావడం మంచిదని చెప్పుకొచ్చింది మేఘన. చివరగా ఆమె ఈ దేశం మనకు అద్భతమైన అవకాశాలను ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అందుకు అచంచలమైన ఓర్పు చాలా అవసరమని అన్నారామె. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి..అంతర్జాతీయ వైద్య గ్రాడ్యుయేట్లకు సంబంధించి.. నియమాలు, చట్టాల మారాయి. స్థానికత లభించడం దాదాపు అసాధ్యం అని ఒకరు, విదేశీ వైద్యులు అక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Meghana Srinivas | Realtor, Windsor ON (@meghana.srinivasa_) (చదవండి: 'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ) -
'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ
ఆడపిల్లలను ఇంటి లక్ష్మిగా కీర్తిస్తుంటారు మన పెద్దలు. ఆ విషయాన్ని గుర్తుచేశారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఈ దీపావళి పండుగలో వెలుగుని తెచ్చేది కూతుళ్లే అంటూ హృదయపూర్వక సందేశాన్ని అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రిలయన్స్ దీపావళి పార్టీలో నీతా అంబానీ కూతుళ్ల కోసం జరుపుకునే పండుగగా అభివర్ణించిన సందేశం ప్రతి ఒక్కరు మనుసును హత్తుకుంది. తరుచుగా మన పెద్దలు చెప్పేమాటను ఆమె గుర్తు చేస్తూ..ఈ పండుగ అందమే కూతుళ్లని, వారి రాకతోనే మన ఇల్లుకాంతిమయం అవుతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు. తన మనవరాళ్లు ఆదియ శక్తి పిరమల్, వేద అంబానీలను తన ఇంటి లక్ష్మీగా పరిచయం చేసింది. వారి వల్ల తమ ఇల్లు వెలిగిపోతుంటుందని, నట్టింట వారు నడయాడుతుంటే లక్ష్మీ దేవి ఉన్నట్లే అనిపిస్తుందని అన్నారామె. భారతీయ సంప్రదాయంలో కూమార్తెలను లక్ష్మీదేవత ప్రతిరూపంగా భావిస్తుంటారు. వారి వల్లే తమ ఇంటి శ్రేయస్సు, ఆనందం, అదృష్టమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. దాన్ని ఆమె ఈ పండుగ నేపథ్యంలో గుర్తు చేస్తూ..ఆడపిల్లలు మన ఇంటి లక్ష్ములు అంటూ మన సంస్కృతిని లింగ సమానత్వం, సాధికారతను మిళితం చేసేలా గొప్పగా సందేశమిచ్చారామె. అంతేగాదు ఈ పండుగకు అసలైన అర్థం, అంతరార్థం బహుచక్కగా వివరించి.. నెటిజన్ల మనసును దోచుకున్నారామె. పైగా కుటుంబం విలువను తెలియజేసేలా ఐక్యత, ప్రేమ, అనేవి దీపాల వెలుగల వలే మన జీవితాల్ని కాంతిమయం చేస్తాయని తన భావోద్వేగ సందేశంతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. View this post on Instagram A post shared by The Times of India (@timesofindia) (చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్‌ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!) -
ముచ్చటగా మూడోసారి: తన రాక్‌స్టార్స్‌కు బ్రాండ్ న్యూ కార్లు గిఫ్ట్స్
దీపావళికి బోనస్‌లు, స్వీట్లు, గిఫ్ట్‌లు సహజమే. కానీ ఖరీదైన బహుమతు లివ్వడం వార్తల్లో నిలుస్తాయి. తాజాగా హెల్త్‌కేర్ సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త ఎంకే భాటియా ముచ్చటగా మూడోసారి తన ఉద్యోగులకు వచ్చిన విలువైన బహుమతులు నెట్టింట సందడిగా మారాయి.చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ‘మిట్స్ నేచురా లిమిటెడ్’ కంపెనీ అధినేత ఎంకే భాటియా దీపావళి వేడుకల్లో భాగంగా తన ఉద్యోగుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉద్యోగులకు 51 సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. స్వయంగా తాళాలు అందజేసి వారిని అభినందించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన బృంద సభ్యులకు ఎస్యూవీ, స్కార్పియో వంటి ఖరీదైన కార్లను అందించారు. ఎంకే బాటియా ఇలా కార్లను బహుమతిగా ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి. ఇదీ చదవండి: గౌరీ పూజ, షారూఖ్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!లింక్డ్ఇన్ పోస్ట్‌లో, భాటియా ఏమన్నారంటే. ‘‘గత రెండు సంవత్సరాలుగా, అత్యంత అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాం. అసలు వారిని ఉద్యోగులు లేదా సిబ్బంది అని ఎప్పుడూ పిలవలేదు. వారు నా జీవితంలో రాక్‌స్టార్ సెలబ్రిటీలు, మా ప్రయాణంలోని ప్రతి దశనూ బ్లాక్‌బస్టర్‌గా మార్చేసే తారలు. ఈ దీపావళి ఎక్స్ట్రా స్పెషల్" అంటూ కార్లను హ్యాండ్ఓవర్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. తన కంపెనీకి వారే వెన్నెముక అనీ, వారి కృషి, నిజాయితీ, అంకితభావమే తమ కంపెనీవిజయానికి పునాది. అందుకే వారి శ్రమను గుర్తించడం, ప్రోత్సహించడం, కంపెనీని మరింత అభివృద్ధి దిశ,ఉన్నత శిఖరాలకు నడిపించడం ఏకైక లక్ష్యమని తెలిపారు. వార్తా సంస్థ PTI ప్రకారం, భాటియా ఈ వారంలో ఉద్యోగులకు వాహనాలను అందజేశారు. ఆ తర్వాత షోరూమ్ నుండి కంపెనీ మిట్స్ హౌస్ ఆఫీస్ వరకు వేడుకగా "కార్ గిఫ్ట్ ర్యాలీ" కూడా జరిగిందట.మీ విజయాన్ని లాభాలను ఉద్యోగులతో పంచుకోవడం చాలా సంతోషం అంటూ భాటియాను చాలామంది నెటిజన్లు ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను తన మేనేజర్‌కి చూపిస్తే ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారనీ, ఆ తరువాత డ్రైఫ్రూట్స్, 4 దీపాలు ఇచ్చారంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. వరుసగా మూడోసారిగత ఏడాది 15 కార్లను, అంతకు ముందు సంవత్సరం, 12 కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాబోయే సంవత్సరంలో 50 కార్లను బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్టు భాటియా గత దీపావళికే ప్రకటించడం విశేషం. -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల స్టెప్పులు : వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో ఒక వీడియో మళ్లీ తెగ వైరలవుతోంది. ప్రయాణీకులకు అసౌకర్యం , భద్రతల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మెట్రో రైళ్లు , స్టేషన్లలో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించినప్పటికీ అందమైన సాంప్రదాయ దుస్తులలో ముగ్గురు అమ్మాయిల డ్యాన్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.బాలీవుడ్ హిట్ సినిమా ‘హమ్ ఆప్కే హై కౌన్’లోని ‘పెహ్లా పెహ్లా ప్యార్ హై’ అనే సాంగ్‌కు ముగ్గురు అమ్మాయిలు అందంగా డ్యాన్స్ చేశారు. చక్కటి హావభావాలు, అందమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. చాలా బావుంది అంటూ నెటిజన్లు ప్రశంసించారు. వీడియోను జ్యోతి JSK (hezal_little_dancer) అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండింగ్ అస్సలు మిస్ కావద్దు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ట్రెడిషన్ల్ దుస్తుల్లో భలే అందంగా డ్యాన్స్ చేశారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇటీవల నవరాత్రి సందర్భంగా, తండ్రీ కూతుళ్ల ఉత్సాహభరితమైన గర్బా డ్యాన్స్వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నైషా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆరోగ్యకరమైన వీడియోలో తండ్రి వేడుకల్లో ఆనందంగా స్టెప్పులేయడం అందర్నీ ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Jyoti JSK (@hezal_little_dancer) -
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్‌తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్‌ను వేలాడదీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్‌ట్యాప్‌తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్‌లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్‌హ్యాండ్‌తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్‌లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
పనిమనిషి జీతం రూ. 45 వేలు : అంత అవసరమా, నెట్టింట చర్చ!
సిలికాన్ సిటీ, ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గార్డెన్ సిటీ బెంగళూరులో జీవితం అంటే చాలా ఖరీదైనదే. అలాంటిది బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ తన ఇంటి సహాయకురాలికి నెలకు రూ.45,000 కంటే ఎక్కువ చెల్లించడం చర్చకు దారితీసింది.తాజాగా రష్యాకు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా బెంగళూరు లైఫ్ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తన బిడ్డను చూసుకునేందుకు నియమించుకున్న పనిమనిషికి నెలకు రూ. 45,000 చెల్లిస్తానని వెల్లడించింది. అంతేకాదు ఇంటి పనిని కూడా "వృత్తిపరంగా" చూస్తానని, ఏదేని కార్పొరేట్ ఉద్యోగం లాగే ప్రోత్సాహకాలను అందిస్తానని అస్లమోవా చెప్పారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) ఇంకా ఇంటి అద్దెకు 1.25 లక్షల రూపాయలు, తన పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ.30వేలు, ఆహారంతో సహా ఇంటి ఖర్చుల కోసం రూ.75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ఈ మహిళ వెల్లడించింది. పనిమిషికి 45 వేలు ఇవ్వడం అంటే తనను "పిచ్చిదానిని" అని అనుకోవచ్చు. కానీ ఆమె విధేయత, వృత్తి నైపుణ్యం కారణంగా ఆమె ఈ ప్రతిఫలానికి అర్హురాలని తాను భావించినట్లు తెలిపింది. తన కుమార్తె ఎలినా కోసం నానీని నియమించుకునే ముందు కనీసం 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశానని ఆమె చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. బెంగళూరు సహా భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు స్పందించారు. కొందరు ఆమెను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. మీరు ఎక్కువ చెల్లిస్తున్నారనీ, ఇంతకంటే తక్కువకు ఫ్లాట్లు దొరుకుతాయని కమెంట్ చేశారు. మరొక వినియోగదారు “అది TCS, ఇన్ఫోసిస్ ,యాక్సెంచర్ టెక్ ఫ్రెషర్లకు చెల్లించే దానికంటే ఎక్కువ.” అని పేర్కొన్నారు.అయితే విమర్శలపై స్పందిస్తూ అస్లమోవా తన వైఖరికి కట్టుబడి ఉండటం విశేషం. "మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే, కర్మ మీకు ఫలితం ఇస్తుంది" అని కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అలాగే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన వృద్ధికి బదులుగా ఇంటి పనికి రోజుకు చాలా గంటలు కేటాయించేవారు విలువైన అవకాశాలను కోల్పోతున్నారని చెబుతూ, వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. -
ఇదే ఆఖరి దీపావళి పండుగ..! మళ్లీ ఏడాది..
దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్‌గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి. అసలేం జరిగిందంటే..21 ఏళ్ల వ్యక్తి హృదయ విదారక పోస్ట్ నెట్టింట ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టేలా చేసింది. ఆ పోస్ట్‌లో అంతలా ఏముందంటే..అతడు 2023 నుంచి స్టేజ్4 కొలొరెక్టల్ కేన్సర్(colorectal cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. నెలలతరబడి కీమోథెరపీలు, ఆస్పత్రుల్లో గడిపిన తదనంతరం వైద్యులు ఈ ఏడాదికి మించి బతకలేడని నిర్థారించారని షేర్ చేసుకున్నాడు. "దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బహుశా ఇదే నా చివరి దీపావళి పండుగ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. త్వరలో దీపావళి రాబోతోంది అంతా దీపాలు వెలిగించి..సందడిగా ఉంటే..తన హృదయ దీపం ఆరిపోయి..జీవితం ముగిసిపోనుంది అని భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నా జీవితం ముగిసిపోతుంది అని తెలిసి కూడా ఎలా సాగుతుందో చూడటం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నా నా కల, ఆకాంక్షలు అన్ని జారిపోతున్నట్లుగా ఉంది. ఆలోచనలన్నీ మసకబారుతున్నాయి. నా తల్లిదండ్రుల ముఖాలో తీవ్ర దుఃఖం కనిపిస్తుంది. అయినా ఇదంతా నేనెందుకు పోస్ట్ చేస్తున్నానో కూడా నాకు నిజంగా తెలియదు. బహుశా నిశబ్దంగా వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా పోస్ట్‌లో బిగ్గరగా చెప్పలనేమో." అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. ఈ పోస్ట్ నెట్టింట వేలాదిమంది నెటిజన్ల హృదయాలను తాకింది. చాలామంది ఉన్న సమయం ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వగా మరికొందరూ మాత్రం ఏదైనా మిరాకిల్ జరగొచ్చు కేన్సర్ మీ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు అని ఆశను రెకెత్తించేలా పోస్టుల పెట్టారు. (చదవండి: జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..) -
ఏకంగా 200 రకాల వెరైటీ సమోసాలు..! ఎక్కడంటే..
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్‌తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్‌స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి. ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్‌లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Foodpandits! (@foodpandits) (చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు) -
టీనేజర్ల మానసిక ఆరోగ్యం : స్పెషల్ టూల్స్ ప్రారంభించిన యూట్యూబ్
గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం యూ ట్యూబ్ (YouTube) దేశంలో టీనేజర్లకోసం ప్రత్యేకంగా విభాగాన్ని అక్టోబర్ 15న ప్రారంభించింది.మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారించి ప్రత్యేకంగా రూపొందించిన ఆధారాల ఆధారిత కంటెంట్‌ను ప్రారంభించింది. టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో YouTube ఈ ప్రత్యేక వీడియో షెల్ఫ్‌ను లాంచ్ చేసింది. యువ వినియోగదారుల కోసం సురక్షితమైన సమాచారం అందిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక ప్రధాన అడుగు అని యూట్యూబ్ ప్రకటించింది.ఇందులో డిప్రెషన్, ఆందోళన, ADHD, ఈటింగ్ డిజార్డరలు, తదితర అంశాలపై సమాచారంతో వీడియోలు ఉంటాయి. ఈ కంటెంట్‌ను సంబంధిత రంగ నిపుణుల సూచనలతో రూపొందించారు. అమెరికా, యూకే, కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఎదుగుతున్న దశలో వారికి విశ్వసనీయ సమాచారాన్ని సులభంగా అందించడమే లక్ష్యమని గూగుల్ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారం ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’ (shelf of films) అందుబాటులో ఉంటుంది. యువతకు మానసిక ఆరోగ్యం, ఆరోగ్యం గురించి సినిమాలు తీయడంలో నేర్పించడంలో ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ సంస్థలతో YouTube పనిచేస్తోంది. అలాగే ఒక వీడియోను ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’లో పొందుపరచాలంటే కంటెంట్ టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయంగా ఉండాలి.భారతదేశంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్ర మానసిక ఆరోగ్య కేంద్రం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS), నమ్మకమైన మానసిక ఆరోగ్య సలహాల నిమిత్తం"మనోసందేశ్" వీడియో సిరీస్‌ను రూపొందించింది. ప్రముఖ పరిశోధకులు, పేషెంట్ న్యాయవాదులు మరియు మానసిక ఆరోగ్య నిపుణులు ఈ సిరీస్‌లో తరచుగా అడిగే సమస్యలకు ప్రతిస్పందిస్తారు. ఉదాహరణకు “నా టీనేజర్‌తో ఒత్తిడి, ఆందోళన గురించి నేను ఎలా మాట్లాడగలను?” లాంటివి ఉంటాయని తెలిపింది.కౌమారదశలో భావోద్వేగాలు, వాటి ముందస్తు గుర్తింపు , మానసిక ఆరోగ్య సమస్యలకు సకాలంలో మద్దతు ఇస్తే, ఇది వారి ఆరోగ్యంపై శాశ్వతంగా మెరుగైన ప్రభావం చూపుతుందని NIMHANSలో సైకియాట్రీ డైరెక్టర్, సీనియర్ ప్రొఫెసర్ డా. ప్రతిమ మూర్తి తెలిపారు. ఇది యువతకు జ్ఞానం, పోరాట నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న సంరక్షణ విధానాల ద్వారా సవాళ్లను అధిగమించేలా,, స్థితిస్థాపకతను పెంపొందించడంలోవారి సామర్థ్యాన్ని బలపరుస్తుందన్నారు. వీటిని వారిలో అవగాహనపెంచిడమే, మానసిక ధైర్యాన్ని పెంచడం తోపాటు, పాఠశాలలు, కుటుంబాలు, సొసైటీలో సురక్షితమైన, సహాయవాతావరణాలను కూడా పెంపొందిస్తాయి. ఈ ప్రయత్నాల ద్వారా తదుపరి తరానికి మానసిక ఆరోగ్య ఫలితాలను మార్చడానికి కేంద్రంగా ఉండాలని భావిస్తున్నామని యూట్యూబ్ ప్రకటించింది. టీనేజర్లు అవసరమైనప్పుడు విశ్వసనీయ సమాచారాన్ని యాక్సెస్ చేస్తూ డిజిటల్ స్పేస్‌ను సురక్షితంగా, యువవినియోగదారులకు మరింత సహాయంగా మార్చాలనే నిబద్ధతలో ఇది భాగమని యూట్యూబ్ హెల్త్ డైరెక్టర్ మరియు గ్లోబల్ హెడ్ డాక్టర్ గార్త్ గ్రాహం తెలిపారు. -
జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్‌లో మహిళతో రాసలీలలు..
ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా ఓ జడ్జీ.. లైవ్‌లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్లైన్లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్‌లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్‌లో వీడియో మోడ్‌ను ఆన్ చేసిన సంగతి మర్చిపోయాడు.ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్‌లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు.


