జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్‌లో మహిళతో రాసలీలలు.. | Court is online but judge forgot To his LIVE Video | Sakshi
Sakshi News home page

జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్‌లో మహిళతో రాసలీలలు..

Oct 16 2025 8:45 AM | Updated on Oct 16 2025 8:45 AM

Court is online but judge forgot To his LIVE Video

ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్‌ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా ఓ లాయర్‌.. లైవ్‌లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్‌లైన్‌లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్‌లైన్‌లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్‌లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్‌లో వీడియో మోడ్‌ను ఆన్‌ చేసిన సంగతి మర్చిపోయాడు.

ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్‌లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement