మన దేశంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా తెలియజేసే ఘటన ఇది. ఆంగ్ల భాషలో కనీస స్పెల్లింగులు కూడా రాకుండానే ప్రైమరీ స్కూల్‌లో ఓ టీచర్ పిల్లలకు పాఠాలు నేర్పుతూ పట్టుబడ్డాడు. పైగా అతగాడి టాలెంట్ దేశం మొత్తం వైరల్ వీడియో రూపంలో పాకింది.
noge నోజ్ అంటే ముక్కు.. ఈఏఆర్‌ఈ(EARe) ఇయర్ అంటే చెవులు, ఐఈవై(Iey) ఐస్ అంటే కండ్లు.. ఇవి ఈయనగారు చెప్పే పాఠాలు. అంతేకాదు.. సండే, మండే.. కూడా తప్పుల తడకగానే రాస్తున్నారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. మదర్, ఫాదర్, బ్రదర్.. వీటికి ఈయనగారికి అసలు స్పెల్లింగులే రావట.
ఛత్తీస్‌గఢ్ బలరామ్‌పూర్ జిల్లా మచాన్‌దండ్ కోగ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 42 మంది పిల్లలు ఉన్నారు. వీళ్లకు ఇద్దరు టీచర్లు. అందులో ఒకడైన అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టొప్పో గారి పాండిత్యమే ఇది. ఇది వైరల్ కావడంతో విద్యాశాఖ ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది.
'Iey मतलब आंख, Noge मतलब नाक' सिखाने वाले टीचर का वीडियो वायरल, शिक्षा विभाग ने किया सस्पेंड https://t.co/3QfKQr4WFI#Chhattisgarh #CGNews #Ambikapur #English #Teacher pic.twitter.com/cGiollwCXo
— NaiDunia (@Nai_Dunia) November 16, 2025
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ మధ్యే అకడమిక్ ఈయర్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా గుణవత్తా అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ కింద టీచర్లు లేని స్కూల్స్ ఇక మీదట ఉండకూడదని, ప్రతీ బడిలో కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలని, తమ పిల్లలకు సరిగా పాఠాలు బోధించని టీచర్లను తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితులు రావాలని.. ముఖమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఓ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఏమాత్రం అనుభవం లేని, చదువురాని వాళ్లను టీచర్లుగా నియమిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులోనూ ఈ తరహాలోనే అక్కడ ఓ ఘటన బయటపడింది. నెలకు రూ.70 వేల జీతం అందుకునే ఓ టీచర్ పిల్లలకు తప్పుగా పాఠాలు చెబుతూ విద్యాశాఖ అధికారులకు దొరికాడు.


