కొన్ని సంఘటనలు అందర్నీ మైమరిచిపోయేలా చేస్తే..మరికొన్ని ఒక్క క్షణం ఆగిపోయి చూస్తుండిపోయేలా ఉంటాయి. వారి హోదాను కూడా పక్కన పెట్టి మనతో సామాన్యుల మాదిరిగా కలిసిపోయే వారి ఔదార్యం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. పైగా ఆ దృశ్యం అందరం ఒక్కటే అనేట్టుగా ప్రతిధ్వనిస్తుంది. అలాంటి అపురూపమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.
ఢిల్లీలో జరిగిన శౌర్య వీర్ - రన్ ఫర్ ఇండియా' మారథాన్‌లో ఈ ఘటన ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఆ వేదికపై ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లవాడు అందర్నీ విస్తుపోయేలా పుష్ అప్‌లు చేస్తున్నాడు. ఇంతలో ఆర్మీ చీఫ్ ద్వివేది..ఆ పిల్లవాడిని ఉత్సాహపరిచేలా అతడితోపాటు ఆయన కూడా పుష్‌అప్‌లు చేశారు.
ఆయన చేసిన పని ప్రజల హృదయాలను గెలుచుకుంది. నిజానికి ఈ మారథాన్ కార్యక్రమం సైన్యం, ధైర్యం అంకితభావానికి నివాళులర్పించే 79వ శౌర్య దినోత్సవ వేడుకల్లో భాగం. కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వేదికపై ప్రత్యేక సామార్థ్యం ఉన్న పిల్లవాడు పుష్-అప్‌లు చేయడం ప్రారంభించినప్పుడు, ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఆ పిల్లవాడి ఉత్సాహాన్ని చూసి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది కూడా అతడితో చేరారు.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకుండా నెటిన్ల మనసును దోచుకుంది. అంతేగాదు 61 ఏళ్ల వయసులో ఎంత అప్రయత్నంగా పుష అప్‌లు చేశారు సార్ అని ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు.
Army Chief joins a specially-abled child for push-ups : a powerful gesture of encouragement and inclusion.
🇮🇳 leadership is about lifting others in spirit and strength. pic.twitter.com/bl3HZFyTPI— Alpha Defense™🇮🇳 (@alpha_defense) October 27, 2025
(చదవండి: Success Story: కాలేజ్‌కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..)


