
సాహసం వయసు అడుగుతుందా?‘అబ్బే! అలాంటిదేమీ లేదు’ అంటుంది 82 సంవత్సరాల బామ్మ. ఈ బామ్మగారి పేరు ఏమిటో, ఊరు ఏమిటో తెలియదుగానీ నెటిజనులు మాత్రం ‘బంగీజంప్ గ్రాండ్‌మా’ అని పిలుచుకుంటున్నారు.
82 ఏళ్ల వయసులో గట్టిగా నడవడం కూడా కష్టమే. అలాంటిది మన గ్రేట్ గ్రాండ్‌మా రిషికేష్‌లోని శివ్‌పురిలో బంగీ జంప్ చేసి ‘వావ్’ అనిపించింది. బంగీ జంప్ చేసే ముందు బామ్మలో ఎలాంటి సంకోచం, బెదురు కనిపించలేదు. హుషారుగా స్టెప్పులు వేసింది!
ఆమె కళ్లలో నిండైన ఆత్మవిశ్వాసం కనిపించింది. బామ్మగారి బంగీ జంప్ విన్యాసాలు చూస్తే... ‘అయ్‌బాబోయ్’ అనుకోవాల్సిందే.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఆత్మవిశ్వాసం అనే రెక్కలతో గాల్లో దేవకన్యలా ఎగురుతోంది’ అని ఒక నెటిజనుడు కామెంట్ రాశాడు.