Girl Bungee Jumping Goes Horribly Wrong Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: యువతి బంగీ జంప్‌! తాడు తెగడంతో..

May 15 2023 3:03 PM | Updated on May 15 2023 3:15 PM

Girl Bungee jumping goes horribly wrong Video Viral - Sakshi

లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేయడంతో ఆమె కాళ్లకు ఉన్న తాడు.. 

బంగీ జంప్‌.. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో ఒకటి. తాడు సాయంతో వేలాడినప్పటికీ.. గుండె ధైర్యం ఉంటే తప్ప అలాంటి ఫీట్‌కు ముందుకు రాలేరు చాలామంది. ఎందుకంటే అందులో ఉన్న రిస్క్‌లు అలాంటివి!. 

తాజాగా ఓ యువతి బంగీ జంప్‌ సాహసానికి దిగింది. అక్కడి ఆపరేటర్‌ ఆమెను లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేశాడు. అయితే యువతి బంగీ జంపింగ్‌ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో ఆ యువతి బలంగా కింద ఉన్న నీళ్లలో పడిపోయింది. 

భయానకమైన ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగింది?.. ఆ యువతి పరిస్థితి ఏంటన్నదానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాకుంటే నెటిజన్లలో కొందరు మాత్రం ఆమె సురక్షితంగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సీసీటీవీ ఐడియట్స్‌ అనే ట్విటర్‌పేజ్‌ నుంచి ఈ వీడియో పోస్ట్‌ కాగా, మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇదీ చూడండి: ఎనిమిదేళ్లుగా జాబ్‌ కోసం ప్రయత్నాలు.. ఆ వీడియోతో జాబ్‌ దొరికింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement