రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.5000 నోట్లను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
సోషల్ మీడియాలో రూ.5000 నోట్లకు సంబంధించి, వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఐదు వేలరూపాయల నోట్ల విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్ధిక అంశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. సామజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారతదేశంలో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండువేల రూపాయల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
⚠️ सतर्क रहें ⚠️
सोशल मीडिया पर दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक द्वारा ₹5000 के नए नोट जारी किए जाएंगे#PIBFactCheck
✅ यह दावा #फर्जी है
✅@RBI द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है
✅ आधिकारिक वित्तीय जानकारी हेतु वेबसाइट https://t.co/e6gEcOvLu3 पर विजिट करें pic.twitter.com/EF82vaxMvE— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2025


