లండన్‌లో లిటిల్‌ ఇండియా..మన సిగ్నేచర్‌ ఇదా..? | Londons little India video shows streets filled with trash Goes Viral | Sakshi
Sakshi News home page

లండన్‌లో లిటిల్‌ ఇండియా..మన సిగ్నేచర్‌ ఇదా..?

Nov 12 2025 3:10 PM | Updated on Nov 12 2025 3:19 PM

Londons little India video shows streets filled with trash Goes Viral

మనం ఒక చోట ఉన్నాం అనగానే..ఫలానా వాళ్లు అనే ఐడెంటీ ఉండాలి. ఆ గుర్తింపు కోసం అంతా ఆరాటపడుతుంటాం. కానీ అది మరొలా మనల్ని గుర్తిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం అప్పుడైనా సరిదిద్దుకుంటే..ఓకే..ఎప్పటికీ ఆ గుర్తింపుతోనే ప్రతి చోట ఐడెంటిఫై అయితే..అంతకంటే ఇబ్బందికరం మరొకటి ఉండదు కదూ..

ప్రతి మనిషికి సామాజికి బాధ్యత లేదా సివిక్‌ సెన్స్‌ అనేఇఉండాలి. అది లేకపోతే..మనం ఎక్కడ ఉన్నా..అది మన చేతలు లేదా చర్యల ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. మన సంస్కృతి, ఆచారాలతో ఇతర దేశాలను అబ్బురపర్చడమే కాదు..సామాజికపరంగా కూడా మన చేతలు ఆహా అనేలా ఉంటేనే అన్ని విధాల శ్రేయస్కరం. ఇదంతా ఎందుకంటే లండన్‌లో లిటిల్‌ ఇండియాగా పేర్కొనే ప్రాంతాలు చూడగానే..ఠక్కున భారతీయులు ఉండే ప్రదేశం అని చెప్పేస్తారు. కానీ అలా ఎందుకు చెబుతారో తెలుసా.. ఆచుట్టుపక్కల ఉండే చెత్త చెదారాలను బట్టి.

అంతలాదారుణంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చెత్తతో నిండి ఉన్నాయి అంటే..అది భారతీయులు ఉండే ప్రాంతాలని అర్థం అని తలిపించేలా ఉంది ఆ లిటిల్‌ ఇండియా. అందుకు సంబంధించిన వీడియోని ఓ భారతీయ యూట్యూబర్‌ షేర్‌చేయడంతో..అస్సలు మనవాళ్లకి సివిక్‌ సెన్స్‌ ఉందా అని సందేహం లెవనెత్తుంది. లండన్‌లో సౌతాల​, వెంబ్లి ప్రాంతాల..భారతీయ కమ్యూనిటీలు ఉండే ప్రాంతాలుగా పేరుగాంచినవి. 

అవి చూడగానే మన సంస్కృతిని ప్రతిబింబిచే దేవాలయాలు, చీరల దుకాణాలు, తినుబండారాలు దర్శనంతోపాటు..చుట్టుపక్కల పరిసరాలన్నీ చెత్తతో కనిపిస్తే..సామాజిక బాధ్యత లోపం బట్టబయలు అవుతుంది కదూ..!. ప్రతిమనిషి పబ్లిక్‌లో ఉండేటప్పుడూ.. కొన్ని విలువలను పాటించాల్సిందే..అది మన ఉనికిని స్పష్టంగా కనబడేలా చేస్తాయి. అందుకు నిదర్శనం నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో​వ్యక్తిగత శుబ్రతతోపాటు మన పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి. 

 

ఒక పరాయి దేశంలో మన ఉనికిని తేటతెల్లం చేసేది ఈ సామాజికి స్పృహ. ఆ విషయంలో కరెక్ట్‌గా ఉంటే ..అది ఆ ప్రాంతంలోని మొత్తం జనాభా విజయాన్ని, సమిష్టి కృషిని ఎలుగెత్తి చాటుతుంది. సివిక్‌ సెన్స్‌తో వ్యవహరిస్తే..మనల్ని ఉన్నతంగా నిలిచేలా చేయడమే కాదు యావత్తు దేశాన్ని గర్వపడేలా చేయగలిగిన వాళ్లం అవుతాం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు యూట్యూబర్‌. నెటిజన్లు కూడా ఎన్ని డిగ్రీలు ఉన్నా..సివిక్‌ సెన్స్‌ లేకపోతే..అవన్నీ వ్యర్థమే అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్‌ ధరించిన నెక్లెస్‌..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement