Mahabubnagar
-
పశ్చిమ బెంగాల్‌కు తల్లి, బిడ్డ తరలింపు
పాలమూరు: జడ్చరలోని సఖి కేంద్రంలో ఉంటున్న సంజన అలాగే ఆమె బిడ్డను సఖి కేంద్రం నిర్వాహకులు పశ్చిమబెంగాల్‌కు పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన సంజన భర్తతో కలిసి కూలి పనులు చేసుకోవడానికి జడ్చర్ల వచ్చారు. అయితే గొడవ జరగడంతో భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడు. గర్భిణిగా ఉన్న ఆమె గత జనవరిలో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక సమస్యలతో పుట్టిన బిడ్డను అమ్మే ప్రయత్నం చేయగా గమనించిన ఆస్పత్రి సిబ్బంది సఖి కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో వారు నాలుగు నెలల పాటు తల్లిబిడ్డకు ఆశ్రయం కల్పించారు. అయితే సంజన పూర్తి వివరాలు తెలియడంతో ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి మంగళవారం స్వగ్రామానికి పంపించారు. ప్రత్యేక బృందంతో తల్లి, బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు తరలించినట్లు సఖి కేంద్రం కో–ఆర్డినేటర్ సౌజన్య తెలిపారు. -
డిగ్రీలో ప్రవేశానికి ‘దోస్త్’
నేటితో ముగియనున్న మొదటి దశ దరఖాస్తుల గడువు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 2025–26 విద్యా సంవత్సారానికి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి దశలో భాగం 21 వరకు నేరుగా ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 29న అలాట్మెంట్, 30 నుంచి వచ్చే నెల 6 వరకు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. పీయూ పరిధిలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉండగా.. 31వేల డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందుకే ప్రైవేటు కళాశాలల్లో ర్యాటిఫికేషన్, అఫ్లియేషన్ ప్రక్రియ చేపట్టాం. దీంతో ప్రతి విద్యార్థి మంచి బోధన, వసతులు పొందగలుగుతారు. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వం రెండేళ్లు కళాశాలలో చదవడం, మూడో సంవత్సరం అప్రెంటిషిప్ చేసుకునే విధంగా కొత్త కోర్సులను తీసుకొచ్చింది. ప్రభుత్వం కొత్త డిగ్రీ, గురుకుల కళాశాలలు తీసుకొచ్చింది. కొన్ని కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచింది. వాటిలో చేరితే ఆర్థిక భారం తగ్గుతుంది. – శ్రీనివాస్, వీసీ , పీయూ దరఖాస్తు చేసుకోలేదు పీయూ పరిధిలోని పలు కళాశాలలు ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకునేందుకు అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అడ్మిషన్లకు అవకాశం కల్పించాం. మారుమూల ప్రాంతాల విద్యార్థులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, గురుకుల కళాశాల్లో అడ్మిషన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. – రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ ఉపాధి ఆధారిత కోర్సులు.. కొన్నేళ్లుగా పీయూ పరిధిలో మొత్తం ఉన్న సీట్లలో కనీసం 65శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి ఉంది. ఇందుకు కారణం సాంప్రదాయ బీఏ, బీకాం వంటి కోర్సుల చదవడం వల్ల పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదనే వాదనలు ఉన్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం నూతన విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీ కాలంలో రెండేళ్లు కళాశాలలో తరగతులు.. చివరి సంవత్సరం అప్రెంటిషిప్ ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థికి వేతనం సైతం లభిస్తుంది. ఇటువంటి కోర్సులు ఎంవీఎస్‌లో 5, ఎన్టీఆర్‌లో 2, బీఆర్ఆర్తో పాటు మరిన్ని కళాశాలలకు అవకాశం కల్పించారు. అందులో బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్‌కు ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు, బీఎస్సీ మార్కెటింగ్, ఫార్మా సేల్స్, బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్కు బైపీసీ, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐకి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మూతబడ్డ 24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దరఖాస్తు చేసుకోని 12 కళాశాలలు 74 కళాశాలల్లో 31వేల అడ్మిషన్లకు అవకాశం -
సిగ్నల్‌గడ్డ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌జాం
పట్టణంలోకి వెళ్లే మార్గంలో నిలిచిన వాహనాలు హైస్కూల్ సమీపంలో రోడ్డుపై నిలిచిన వాహనాలు బ్రిడ్జిపై అడ్డుగా నిలిచిన లారీ జడ్చర్ల సిగ్నల్‌గడ్డ బ్రిడ్జిపై మంగళవారం ఓ లారీ ఆకస్మికంగా బ్రేక్ డౌన్ కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే సిగ్నల్‌గడ్డ బ్రిడ్జి విస్తరణ పనుల నిలిపివేసిన క్రమంలో ఇరుకుగా ఉన్న బ్రిడ్జిపై లారీ మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు, చిన్న చిన్న వాహనాలు బాదేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందుగా వెళ్లినా.. భారీ వాహనాలు మాత్రం బ్రిడ్జిపై నిలిచిపోయాయి. అనంతరం లారీకి మరమ్మతు చేసి తొలగించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. – జడ్చర్ల/జడ్చర్లటౌన్ -
అంబేడ్కర్ అడుగుజాడలే దిశానిరే ్దశం
రాజోళి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావుపూలే అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన ఆశయాలను నెరవేర్చాలని ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. మండలంలోని పెద్ద దన్వాడలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్యం వైపు వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయని, వాటిని దీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. యువతకు మహనీయులు అంబేడ్కర్, పూలే జీవితాలే ఆదర్శమన్నారు. కలిసికట్టుగా పోరాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ రఘు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ప్రారంభం అలంపూర్ : అలంపూర్ పట్టణంలో వెలసిన షా–అలీ–పహిల్వాన్ ఉర్సు మంగళవారం రాత్రి గంధోత్సవంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాలను ముస్తాబు చేశారు. ఉత్సవాలను తిల కించడానికి వచ్చే భక్తులకు నిర్వాహక కమిటీ తగు సౌకర్యాలు కల్పించింది. ఉత్సవాల నాలుగు రోజుల పాటు పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. తరతరాల సంప్రదాయాలకు స్వాగతం పలుకుతూ ఉత్సవాలను కొనసాగించారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఖాజ బందేనవాజ్ దర్గా నుంచి వచ్చిన గంధంతో ఉత్సవాలను ప్రారంభించారు. -
హరీశ్‌రావు ఆరోపణలు అవాస్తవం
అచ్చంపేట: అమ్రాబాద్ మండలం మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎంను కలిసేందుకు వచ్చిన చెంచులను నిర్భందించి, ఆరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 2016లో మన్ననూర్‌లో చెంచుల మరణాలపై పుస్తకం ఆవిష్కరించినా హరీష్‌రావు.. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెంచుల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెంచులకు హైదారాబాద్‌లో కార్పొరేట్ వైద్యసేవలు అందించేవారని, బీఆర్ఎస్ హయంలో ఎందుకు అందించలేదని మండిపడ్డారు. జీవీవీకేలు, జీసీసీలను గత ప్రభుత్వం ఊపిరి తీస్తే.. తమ ప్రభుత్వం ఊపిరి పోస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చెంచులకు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను లాక్కునే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా చెంచులను ఆదుకోనేందుకు రూ.12,600 కోట్లతో పండ్ల తోటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. చెంచులకు పక్కా ఇళ్లు కట్టించేందుకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించడం చెంచుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతుందన్నారు. త్వరలోనే సలేశ్వరం లింగమయ్యను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్ది విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్ గౌరీ శంకర్, మాజీ ఎంపీపీ రామనాథం, నర్సయ్య యాదవ్, బాబా తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ సందర్భంగా ఎవరిని అరెస్టు చేయలేదు సభ విజయవంతం కావడంతోనే విమర్శలు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ -
‘దేశం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ సహించలేదు’
వనపర్తిటౌన్: ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందని, దేశం అభివృద్ధి చెందితే ఆ పార్టీ సహించలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవిలత ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు విడివిడిగా నిర్వహించడంతో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమలులో ఉండి సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల పేరుతో ఏటా రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని, ఈ ఆటంకాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఒకే దేశంలో ఒకే ఎన్నిక చట్టం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఓటుకు ఎలక్షన్ కమీషన్ రూ.1,475 ఖర్చు చేస్తుందని, పార్లమెంట్ ఎన్నికలకు రూ. 6లక్షల కోట్లు, శాసనసభ ఎన్నికలకు రూ.3లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇవే కాకుండా శాసనమండలి, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, సర్పంచ్, సింగిల్‌విండో ఎన్నికల నిర్వహణకు లెక్కలేనంత డబ్బులు ఖర్చవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, కార్యక్రమం జిల్లా ఇన్చార్జ్ అహన్యరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్, ఓబీసీ మోర్చా నాయకుడు బి.శ్రీశైలం, రామన్‌గౌడ్, జ్యోతిరమణ, సుమిత్రమ్మ, కుమారస్వామి, సీతారాములు, పెద్దిరాజు, మనివర్ధన్, బోయల రాము, రాజశేఖర్‌గౌడ్, అశ్వినిరాధ, రాఘవేందర్ గౌడ్, వారణాసి కల్పన, ఎండీ ఖలీల్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రజాధనం వృథాను అరికట్టేందుకే జమిలి ఎన్నికలు బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవి లత -
భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులను వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణం భూ సేకరణ, ఆర్అండ్ఆర్ పనులను, కోయిల్ సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జడ్చర్ల మండలంలోని వల్లూర్, ఉదండపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, ఒంటిగుడిసెతండా, శామగడ్డతండాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు వివరించారు. దీంతో జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, ఉదండాపూర్, వల్లూరు, పోలేపల్లి, కిస్టారం రెవెన్యూ గ్రామాలు, నవాబ్ పేట మండలం లోని తీగలపల్లి, కార్కొండ, సిద్ధోటం రెవెన్యూ గ్రామాల్లో 4887.035 ఎకరాల వ్యవసాయ భూముల భూ సేకరణకు గాను 4876.185 ఎకరాలు భూసేకరణ చేసినట్లు, ఉదండపూర్ రెవెన్యూ గ్రామంలో 1453.33 ఎకరాలకు గాను 1443.09 ఎకరాలు సేకరించామని ఇంకా 10.24 ఎకరాలు భూ సేకరణ చేయవలసి ఉందని వివరించారు. వల్లూర్, ఉదండాపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్ట తండా, ఒంటిగుడిసెతండా, శామగడ్డతండా, పోలేపల్లి ఆవాస ప్రాంతాల్లో 1954 గృహాల కోసం 60.26 ఎకరాల భూ సేకరణకు నోటిఫై చేసినట్లు తెలిపారు. 667 గృహాలకు అవార్డ్ పాస్ చేసినట్లు, 510 గృహాలకు టోకెన్లు జనరేట్ చేసినట్లు ఇంకా బ్యాలెన్స్ 161 గృహాలకు టోకెన్లు జనరేట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్అండ్ఆర్ కింద తుమ్మల కుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటిగుడిసెతండా, పోలేపల్లి నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. జడ్చర్ల మండలంలోని నిర్వాసితులకు పోలేపల్లిలో 125.13 ఎకరాలను, జడ్చర్లలో 149.19 ఎకరాలు మొత్తం 274.32 ఎకరాలను పునరావాస కాలనీలుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఆర్అండ్ఆర్ లోకేషన్ 1, 2 లలో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు వివరించారు. అనంతరం కోయిల్‌సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణ పనులను సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ బి.వి.రమణారెడ్డి, ఎస్ఈ చక్రధరం, ఆర్డీఓ నవీన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్‌రావు, పీఆర్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్ -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
మహబూబ్‌నగర్ క్రీడలు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో జరుగుతున్న అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ రెండోరోజు మంగళవారం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడా ఆణిముత్యాలను వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా క్రికెట్ సంఘం ఎంతో పాటుపడుతున్నట్లు తెలిపారు.క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అనంతరం కొత్వాల్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అండర్–23 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో రెండో రౌండ్ లీగ్ మ్యాచులు జరుగుతాయని అన్నారు. క్రీడాకారులు లీగ్ మ్యాచుల్లో తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్ గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారుడు ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ ఇన్నింగ్స్ విజయం ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూడే లీగ్‌లో మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్ జట్టు ఇన్నింగ్స్ 49 పరుగుల తేడాతో జడ్చర్ల జట్టుపై విజయం సాధించింది. 255 పరుగుల ఆధిక్యంతో మహబూబ్‌నగర్ ఉండగా రెండో రోజు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన జడ్చర్ల జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులకు చేసింది. కేతన్‌కుమార్ యాదవ్ అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 106 బంతుల్లో 16 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహబూబ్‌నగర్ బౌలర్లు షాదాబ్ 2, శశాంక్ 2, డేవిడ్ క్రిపాల్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందడంతో మహబూబ్‌నగర్ జట్టు బోనస్‌పాయింట్‌తో కలిపి ఆరు పాయింట్లు సాధించింది. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ శుభారంభం చేసిన మహబూబ్‌నగర్ జట్టు -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
● మద్యం తాగొదన్నందుకు.. చెట్టుకు ఉరేసుకొన్న వైనం రాజాపూర్: మద్యం తాగొద్దని తనయుడు తల్లికి చెప్పినందుకు మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నవెల్లి గ్రామానికి చెందిన పొట్ట పద్మమ్మ(62) మద్యానికి బానిస కావడంతో హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు శ్రీనివాసులు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చి తల్లితో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పద్మమ్మ మద్యం తెచ్చుకుని తాగుతుండగా కుమారుడు శ్రీనివాసులు మందలించి ఇంటిపై నిద్రించాడు. మధ్యరాత్రి లేచి చూచేసరికి తల్లి కనిపించక పోవడంతో చుట్టు పక్కల గాలించాడు. మంగళవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న మర్రిచెట్టుకు పద్మమ్మ ఉరేసుకొని వేలాడుతున్న విషయాన్ని గమనించి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతురాలి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. ప్రసవానికి వస్తే ప్రాణం పోయింది కల్వకుర్తి టౌన్: ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన రేణుక (25)కు వెంకటేష్‌తో 2024లో వివాహాం జరిగింది. పురిటి నొప్పులతో పట్టణంలోని శ్రీసాయి ఆస్పత్రికి ఆదివారం రాత్రి తీసుకురాగా వైద్య సిబ్బంది ప్రసవం చేశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం అవుతుండటంతో సోమవారం సాయంత్రం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో రేణుక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని మృతదేహాన్ని తిరిగి కల్వకుర్తిలోని శ్రీసాయి ఆస్పత్రికి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ నాయకుడు, మరో పోలీస్ అధికారి రాజీ కుదిర్చి బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదిర్చినట్లు తెలిసింది. పట్టణంలోని ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవటం, నాయకులు వెంటనే రాజీ కుదర్చటం పరిపాటిగా మారిందని పట్ట ణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. -
టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్లో చేరేలా చూడాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):ప్రభుత్వపాఠశాల లో పదవ తరగతి చదివిన వారందరూ ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించి వారు ఏ కళాశాలలో చేరాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ఇంటర్మీడియట్లో చేర్పించాలన్నా రు. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది ఇంటర్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండడంపై ఆరా తీసిన కలెక్టర్.. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. చదవడం, రాయడం రాని విద్యార్థుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల లో రాయడం, చదవడం రావాలన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థు ల నమోదును పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించి వారిని సమీపంలోని భవిత కేంద్రాల్లో చేర్పించాలన్నారు. బడులు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించాలన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి నిర్లక్ష్యం చేయండా నిర్వహించాలన్నారు. రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లడానికి వీలుకాని వారు తెలంగాణ ఓపెన్ పాఠశాల ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) వాల్ పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, డీఐఈఓ కౌసర్ జహాన్, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, డీడబ్ల్యూయూఓ జరీనా బేగం, సీఎంఓ బాలుయాదవ్, ఆర్సీఓలు, డీసీఓలు పాల్గొన్నారు. -
కోర్టును ఆశ్రయిస్తాం..
జడ్చర్ల పరిధిలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ గుట్టలపై కన్నేసిన మట్టి మాఫి యా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి టిప్పర్లలో తరలిస్తున్నారు. అలాగే గుట్టలను బ్లాస్టింగ్ పెట్టి పేల్చి పిప్పి చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం. – అనిల్‌కుమార్, సామాజికవేత్త, జడ్చర్ల చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలించిన సంఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలించడం చట్టవిరుద్ధం. మట్టి తరలింపును అడ్డుకునే విధంగా సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తాం. గుట్టలను బ్లాస్టింగ్ చేసి తొలగించడంపై కూడా విచారిస్తాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల -
విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
మల్లన్న చెంతకు.. నాలుగు వరుసల రోడ్డు ● హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ ● రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్–765 నిర్మాణం ● మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు ● స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ● మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ..శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు డీపీఆర్ రూపొందించారు.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఎలివేటేడ్ కారిడార్‌ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్ అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్‌ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్‌ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. అత్యంత కీలక మార్గం హైదరాబాద్– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కి.మీ., దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. వన్యప్రాణులు తిరిగే 62.5 కి.మీ., ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ మిగతా ప్రాంతంలో భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, మైసిగండి, ఆమనగల్, డిండి, మన్ననూర్ మీదుగా ప్రయాణిస్తారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 7,750 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని రవాణా శాఖ అంచనా. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 10 వేలకు చేరుతుంది. ఇక 2027 నాటికి 12,200, 2040 నాటికి 27,580కి చేరుతుందని ట్రాఫిక్ అధ్యయనంలో తేలింది. అయితే ఈ రహదారి నల్లమల అటవీ గుండా సాగుతోంది. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో ఎలివేటేడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రమాదాలకు నెలవు.. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెరిగిన వాహనాల రద్దీతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరించకపోవడంతో పాటు మధ్యలో డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అనుసంధానంగామరో రెండు.. ఎన్‌హెచ్–765కి అనుసంధానంగా కల్వకుర్తి (కొట్ర గేట్)–నంద్యాల–167కే జాతీయ రహదారి ఏర్పాటవుతుంది. అలాగే సోమశిల ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరపతి వెళ్లే ప్రయాణికులకు 80 కి.మీ., దూరభారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని కల్వకుర్తి వరకు ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆదర్శనగర్‌లోని దివ్యాంగుల కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఈ కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని, వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హౌసింగ్‌బోర్డు కాలనీలో నిర్మించిన పోచమ్మతల్లి ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణ లో, అలాగే క్లాక్‌టవర్ వద్ద ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లతో పాటు వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్–షాపులను ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీ పరీక్షల కోసం స్థానిక అంబేడ్కర్ కళాభవన్‌లో శిక్షణ తీసుకుంటున్న ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రానున్న పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో స్థిరపడాలని యువతకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, నాయకులు హన్మంతు, శివశంకర్, ఎం.రాజు, జె.చంద్రశేఖర్, కావలి కాశీం, బేదురి యాదయ్య, తిరుపతయ్య, ఫయాజ్, శ్రీనివాస్‌యాదవ్, గుండా మనోహర్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడంటే..?
ప్రఽదానంగా ఈ అక్రమ వ్యాపారం జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ మండలాల్లో విచ్చలవిడిగా సాగుతుంది. బాదేపల్లి, బూరెడ్డిపల్లి, మల్లెబోయిన్పల్లి, చర్లపల్లి శివార్లలోని గుట్టలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శంకరాయపల్లి తండా సమీపంలో గుట్టలను సైతం హరిస్తున్నారు. బాదేపల్లి రంగనాయకస్వామి గుట్టకు సైతం ఎసరు పెట్టారు. చర్లపల్లి శివారులో గుట్టను నామరూపాలు లేకుండా చదును చేసి వెంచర్‌కు సిద్ధం చేశారు. శంకరాయపల్లి తండా సమీపంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో గల బొంగురాల తిప్ప గుట్ట ఇప్పటికే పిట్టగూడుగా మారింది. అలాగే శంకరాయపల్లి తండా సమీపంలోని సర్వే నం.385లో గుట్టను తవ్వేశారు. జడ్చర్లలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వెనుక ప్రాంతంలో జాతీయ రహదారి–44 పక్కన గుట్టను బ్లాస్టింగ్ పెట్టి ఆనవాళ్లు లేకుండా చేశారు. హౌసింగ్‌బోర్డు పక్కనే గల మరో గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. గత కొన్ని నెలలుగా భారీ యంత్రాలను పెట్టి గుట్టలను తవ్వి ఓ వైపు మట్టిని తరలించి సొమ్ము చేసుకోవడంతోపాటు వెంచర్ ఏర్పాటుకు చదును చేస్తున్నారు. అలాగే మిడ్జిల్ మండలంలోని కేఎల్ఐ కాల్వ కట్ట నుంచి యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. -
స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే కాకుండా, వారికి అందివచ్చిన స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం పట్టణంలోని మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి కుట్టుమిషన్లు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయిస్తూ.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. స్వయం శక్తితో ఎదిగి కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. -
మా పాలన దేశానికే రోల్ మోడల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్‘మా పాలన దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలన, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం మా పాలనను అభినందించక తప్పని పరిస్థితి నెలకొంది. మా పాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం. గత 16 నెలల్లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. మరో 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించాం. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.మా పాలనలో మాత్రం నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా ప్రణాళిక రూపొందించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద మాచారంలోని 29 మంది చెంచు రైతులకు చెందిన 45 ఎకరాల పోడు భూముల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.వాటిల్లో బోర్లు, సోలార్ పంప్ సెట్‌తో పాటు మామిడి, ఉద్యాన మొక్కలు నాటారు. కాగా ఆయా భూముల్లోని సోలార్ పంప్‌సెట్‌ను ముఖ్యమంత్రి ఆన్ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించి మాట్లాడారు. వాళ్లు భూములు గుంజుకున్నారు.. మేం పంటలు ప్రోత్సహిస్తున్నాం ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు రైతుల భూములను గుంజుకుని వారికి బేడీలు వేసి జైలుకు పంపింది. ములుగు, తాడ్వాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్టుకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలబడ్డాం. కాంగ్రెస్ వచ్చాక గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జలవికాసం అమలు చేస్తున్నాం. గిరిజనుల పోడు భూముల్లో సోలార్ విద్యుత్, బోర్లు ఏర్పాటు చేసి వారు పంటలను పండించేలా ప్రోత్సహిస్తున్నాం. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం నేను ఇక్కడి నల్లమల ప్రాంతానికి చెందిన వాడినని చెప్పుకునేందుకు నా గుండె ఉప్పొంగుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ రానున్న వంద రోజుల్లో ఉచితంగా సోలార్ బోర్లను ఏర్పాటు చేస్తాం. సోలార్ విద్యుత్ వినియోగంతో పాటు ఉత్పత్తి చేసి నెలనెలా రూ.ఐదారు వేల ఆదాయం కల్పించేలా చూస్తాం. నియోజకవర్గంలో ఎన్ని సోలార్ పంప్సెట్లైనా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సన్న బియ్యంతో పేదల ఆత్మగౌరవం పెంచాం.. గతంలో రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నడు. మేం వచ్చాక సన్నాలు పండించాలని చెప్పి రూ. 500 బోనస్ అందించాం. ఏడాదిలో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపాం. రేషన్ బియ్యంగా సన్న బియ్యాన్ని అందించి పేదల ఆత్మగౌరవాన్ని పెంచాం.’ అని సీఎం చెప్పారు. ప్రధాని అంటే ఇందిరా గాందీలా ఉండాలి.. ‘భారత్–పాకిస్తాన్ యుద్ధం సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను రెండు ముక్కలు చేశారు. ఇప్పటికి 50 ఏళ్లైనా ప్రధాని అంటే ఇందిరాగాం«దీలా ఉండాలని అంటారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో మేం ప్రజల కళ్లల్లో వెలుగులు నింపేలా పని చేస్తున్నాం. అక్రమ సంపాదనతో ఎవరెన్ని కుట్రలు చేసినా, మా ఆడబిడ్డలకు అన్నీ తెలుసు. సన్నాసులంతా కలసి సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా, మహిళలకు నిజం తెలుసు. కడుపు నిండా విషం కక్కుతూ మా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారి దిక్కు చూడం, పట్టించుకోం..’ అని రేవంత్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదు: భట్టి విక్రమార్క భూమి కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించి నీటి సౌకర్యం కలి్పంచిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా రాష్ట్రంలోని గిరిజనుల కోసం సంకల్పం తీసుకోవడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరు««ద్‌రెడ్డి పాల్గొన్నారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రేవంత్ పర్యటన సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గజమాల, పూలతో ఊరేగింపుగా వచ్చి ఘన స్వాగతం పలికారం. కాగా ముఖ్యమంత్రి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన సొంత ఇంట్లో భోజనం చేశారు. ఏమ్మా.. నీళ్లు పడ్డాయా?చెంచు మహిళలతో సీఎం సంభాషణ సాక్షి, నాగర్‌కర్నూల్: ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంబోత్సవం సందర్భంగా మాచారంలోని చెంచుల పోడు భూములను సందర్శించిన ముఖ్యమంత్రి.. అక్కడే ఉన్న చెంచు మహిళలు ఉడుతనూరి అలివేలు, లక్షమ్మలను పలకరించారు. వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. సీఎం: ఏమ్మా.. మీ బోరులో నీళ్లు పడ్డాయా? అలివేలు: మా భూమిలో వేసిన బోరులో నీళ్లు మంచిగా పడ్డాయి సర్. సంతోషంగా ఉంది. సీఎం: ఏం మొక్కలు నాటారు, వాటిని బతికించుకుంటారా? అలివేలు: మామిడి, ఆవకాడో, బత్తాయి మొక్కలు నాటాం. బాగా కాపాడుకుంటాం సర్. ఇన్నాళ్లు మా భూమి బీడుగానే ఉంది. ఇప్పుడు పంటలు పండించుకుంటాం. సీఎం: ఈ పథకంపై ఇతర మహిళలకు శిక్షణ ఇస్తావా? అలివేలు: నేను డిగ్రీ పూర్తి చేశాను సర్. తప్పకుండా మా తోటి మహిళలకు, చెంచులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తా. మీరు మా కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది ‘పోడు’కు నిధుల తోడు గిరిజన సంక్షేమం లక్ష్యంగా నల్లమల డిక్లరేషన్ నల్లమల డిక్లరేషన్‌లో రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అంశాలను పొందుపర్చింది. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజనులకు 2006 ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన సుమారు 6.69 లక్షల ఎకరాల భూములపై పూర్తి హక్కులను గుర్తించింది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల పోడు భూముల్లో నూరు శాతం ఉచితంగా బోరుబావులు, సోలార్ విద్యుత్ సౌకర్యంతో పాటు ఉద్యాన పంటల ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తారు. పోడు భూముల్లో నీటి సౌకర్యం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధుల కేటాయిస్తారు. ⇒ ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద గిరిజనులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు ⇒ తొలుత మాచారంలో పైలట్ ప్రాజెక్ట్. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు ⇒ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు ఐదేళ్ల పాటు లబి్ధదారులతో సర్కారు సమన్వయం. ఎప్పటికప్పుడు అటవీ, విద్యుత్, భూగర్భ జలవనరులు, ఉద్యాన శాఖల పర్యవేక్షణ ⇒ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెంచులు, ఆదిమ జాతుల కుటుంబాలు అందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ⇒ రాజీవ్ యువవికాసం కింద ప్రత్యేకంగా గిరిజన యువతకు రూ.1,000 కోట్ల నిధులతో ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు. -
ఇంట్రా టూ డే లీగ్‌లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్‌కు భారీ ఆధిక్యం ● డేవిడ్ క్రిపాల్ డబుల్, షాదాబ్ సెంచరీలు సమర్థ స్కూల్ మైదానంలో మహబూబ్‌నగర్–జడ్చర్ల మధ్య జరగిన టూడే లీగ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన జడ్చర్ల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయిది. జట్టులో సంజయ్ 70, కేతన్ కుమార్ 32 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్ ముఖిత్ 15 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు షాదాబ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 50 ఓవర్లలో 420 పరుగుల భారీ స్కోర్ చేసి 255 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ రాయ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 13 సిక్స్‌లు, 16 ఫోర్లతో 220 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ షాదాబ్ అహ్మద్ 72 బంతుల్లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 270 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. నేడు (మంగళవారం) రెండో రోజు మ్యాచ్ కొనసాగనుంది. మహబూబ్‌నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారుల కోసం మొదటిసారిగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్‌లు ప్రారంభించిందని, ఈ టోర్నీల్లో క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ సోమవారం ప్రారంభమైంది. రాజశేఖర్ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లలో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్‌సీఏ టోర్నమెంట్లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామని అన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లు ప్రారంభించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ -
నాందేడ్‌లో చెంచు మహిళ మృతి
బల్మూర్: ఆదివాసి చెంచు మహిళ వలస వెళ్లి మహారాష్ట్రలోని నాందేడ్‌లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని బాణాలకు చెందిన నల్లబోతుల లింగస్వామి లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన కవిత (26)ను రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు అప్పాయిపల్లికి చెందిన గుంపు మేసీ్త్ర అర్జున్‌తో రూ.60 వేలు అడ్వాన్స్ తీసుకొని బాణాలకు చెందిన మరికొందరితో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్‌కు పనికి వెళ్లారు. ఈ నెల 15న పని ప్రదేశంలో కవిత బావిలో పడి మృతి చెందడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. భర్త, అత్త చిట్టెమ్మ అక్కడ పని చేస్తున్న మరో ఇద్దరు మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొచ్చి ఈ నెల 17న శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కవిత తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా 12 ఏళ్ల సోదరుడు గణేష్ ఉన్నారు. అతడి సంరక్షణకుగాను రూ.75 వేలు గుంపుమేసీ్త్ర ఇచ్చేలా మధ్యవర్తులు ఒప్పందం కుదుర్చారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గుంపు మేసీ్త్ర తమను పట్టించుకోవడం లేదని.. ఇస్తానని రూ.75 వేలు కూడా ఇవ్వడం లేదని లింగస్వామి, అతడి తల్లి చిట్టెమ్మ వాపోతున్నారు. గుంపు మేసీ్త్ర చెరలో 33 మంది చెంచులు.. అప్పాయిపల్లికి చెందిన గుంపు మేస్త్రి అర్జున్ లింగాల మండలంలోని శ్రీరంగాపూర్, బల్మూర్ మండలంలో ని బాణాల నుంచి 33 మంది చెంచులను అడ్వాన్సు లు ఇచ్చి మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ కంపెనీలో సిమెంట్, కాంక్రీట్ పనులు చేసేందుకు తీసుకెళ్లాడని బాధితులు విలేకర్లకు తెలిపారు. వెళ్లే సమయంలో రోజు కూలి రూ.500 ఇస్తామని చెప్పి అక్కడికి వెళ్లాక నెలకు కేవలం రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు. అంతేగాకుండా నెలలో రెండ్రోజులు మాత్రమే సెలవులిస్తూ.. నాసిరకంగా భోజనం అందిస్తున్నారని వివరించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి కవిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు గుంపు మేస్త్రిపై కఠిన చర్యలు తీసుకోని అక్కడి చెంచులను స్వగ్రామాలకు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అలస్యంగా వెలుగు చూసిన ఘటన -
నిరుద్యోగులకు ఉపాధి
నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 1,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజాం పాలనలోని సర్వే వివరాలే కొలమానం నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూశాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దరఖాస్తుల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది. 50 రోజులపాటు శిక్షణ ఇంటర్లో గణితం ఓ సబ్జెక్టుగా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్‌మెన్(సివిల్), బీటెక్ సివిల్, పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ కోర్సులు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మీసేవ ద్వారా ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించారు. వీరిలో నుంచి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేసి 50 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. థియరీ, టిప్పన్, ప్లాటింగ్, ఫీల్డ్ వర్క్ తదితర మూడు విభాగాల్లో శిక్షణ తీసుకొని తదుపరి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ సర్టిఫికెట్ అందజేస్తారు. భవిష్యత్‌లో భూ భారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితులు సర్వేకు సంబంధించిన సమస్య పరిష్కారానికి, నక్ష వేయించుకోవడానికి ఈ ధ్రువపత్రం కలిగిన వారు ఇచ్చేవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సర్వేయర్ల కొరత తీరనుంది భూ భారతి చట్టం అమలు నేపథ్యంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ ఇవ్వనుంది. ఎంపికై న సర్వేయర్లతో ప్రైవేట్ భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించునున్నారు. భూ కొలతలకు వారిని వినియోగించుకోనున్నారు. – గిరిధర్, జిల్లా సర్వే అధికారి, నారాయణపేట ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు -
సత్వర న్యాయం అందేలా చూడాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిర్యాదులు చేసే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా పలువురు బాధితులు సమస్యలపై ఎస్పీ ఫిర్యాదులు అందించారు. ఆ తర్వాత ఆయా పోలీస్స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు, సీఐలతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల భద్రత, న్యాయం, నమ్మకాన్ని పెంపొందించేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలు నమ్మకంతో ముందుకు రావాలని సూచించారు. బాధితులకు న్యాయం ఆలస్యం అవుతున్నా.. సమస్యలు ఎదురవుతున్నా వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ట్రాన్స్‌కో అధికారులఫోన్ నంబర్లు మారాయి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఫోన్ నంబర్ల స్థానంలో కొత్తవాటిని కేటాయించారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) 87124 72097, డీఈ 87124 72155, టౌన్ ఏడీ 87124 72156, టౌన్–1 ఏఈ 87124 72160, టౌన్ –1 ఫ్యూస్ ఆఫ్ 87124 72215, టౌన్–2 ఏఈ 8712472161, ఫ్యూస్ ఆఫ్ 8712472219, టౌన్–3 ఏఈ 8712472162, ఫ్యూస్ ఆఫ్ 87124 72221 కేటాయించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముగ్గురు డీఎస్పీల బదిలీ మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేయడంతోపాటు ఒకరికి పోస్టింగ్ ఇస్తూ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సుదర్శన్‌ను హైదరాబాద్ గోషామహల్ ఏసీపీగా, సీసీఎస్ డీఎస్పీగా ఉన్న లక్ష్మీనారాయణను షాద్‌నగర్ ఏసీపీగా బదిలీ చేయడం జరిగింది. అలాగే గాంధీనగర్ ఏసీపీగా పనిచేస్తున్న వై.మొగిలయ్యను గద్వాల డీఎస్పీగా బదిలీ చేయగా.. గద్వాల డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డిని కుషాహిగూడ ఏసీపీగా బదిలీ చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పరీక్షలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్‌టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆముదాలు @ రూ.5,906 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన ఈ టెండర్లలో ఆముదాలు క్వింటాల్ సరాసరిగా రూ.5,906 ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడంతోపాటు చాలామంది రైతులు ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయిస్తుండటంతో మార్కెట్‌కు అమ్మకానికి ధాన్యం రాలేదు. -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(హహబూబ్‌నగర్): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సమీకృత జిల్లాకార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వారం 103 అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం త్వరితగతిన పూర్తి చేసి జూన్ 2వ తేదీన అర్హులకు మంజూరు చేయాలని సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖలకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. మండల స్పెషల్ అధికారులు ఎంపీడీఓలతో కలిసి దరఖాస్తులను ఫైనలైజ్ చేసి, ప్రతిపాదనలు పంపాలన్నారు. మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మార్క్ ఔట్ చేసి గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు ప్రత్యేక హక్కులు : మంత్రి సీతక్క
నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనులకు రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కలు లభించాయని మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఐటీడీఏలను నిర్వీర్యం చేసిందన్నారు. వాటికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని సీఎంను కోరారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వం సౌర విద్యుత్ కల్పిస్తూ పండ్ల తోటలకు అవకాశం కల్పించిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గిరిజనుల భూమలు లాక్కొని కేసులు పెట్టారని ఆరోపించారు. ● -
జాతీయ గోగేమ్ టోర్నీలో క్రీడాకారులకు పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: బిహార్ రాష్ట్రం ఆరాలో ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు జరిగిన జాతీయస్థాయి గోగేమ్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి మూడు బంగారు పతకాలు సాధించారు. సబ్ జూనియర్ సింగిల్స్‌లో జిల్లా క్రీడాకారుడు పి.రాజేష్ ఫైనల్ మ్యాచ్‌లో 40–30 స్కోర్‌తో బిహార్ క్రీడాకారుడిపై, మరో క్రీడాకారుడు మహ్మద్ బషీరుద్దీన్ ఫైనల్ మ్యాచ్‌లో 16–03 స్కోర్‌తో ఒడిశా క్రీడాకారుడిపై, జూనియర్ సింగిల్స్‌లో మహ్మద్ రయ్యన్ నజం ఫైనల్ మ్యా చ్లో తమిళనాడు క్రీడాకారుడిపై 17–9 స్కోర్‌తో గెలుపొంది బంగారు పతకలు సాధించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను తెలంగాణ గోగేమ్ అసోసియేషన్ నసరుల్లా హైదర్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, కోశాధికారి వినోద్‌కుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్, సభ్యులు అభినందించారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుంది
జెడ్పీసెంటర్(హహబూబ్‌నగర్): రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీ సత్తా చాటుతుందని, ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతవిష్ణు అన్నారు. సోమవారం స్థానిక జిల్లా క్లబ్ మీటింగ్‌హాల్‌లో ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాల వారీగా కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ తరుపున అభ్యర్థులను పోటీలో పెట్టునున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎజెండాల్లో ముఖ్యమైనది రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ ఉచిత విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులను అనుసంధానం చేసి సాగు, తాగు నీళ్ల సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జై మహాభారత్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి చెన్నప్పగారి రఘోత్తంరెడ్డి, కో ఇన్చార్జి అనుప రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నిజామొద్దీన్, కో ఆర్డినేటర్లు చెన్నయ్య, జిల్లా ఆర్గనైజర్ వహీద్ పాల్గొన్నారు. 119 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ పోటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతవిష్ణు -
భూవివాదంపై తల్లీకూతుళ్ల ఆందోళన
● న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు గట్టు: భూవివాదంపై తల్లీకూతుర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన ఘటన సోమవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. ఆలూరు గ్రామానికి చెందిన రాణి తన భర్త సవారన్న మరణాంతరం గ్రామ శివారులో సర్వే నంబర్ 183/డీ1, 188/డీ1, 189/జీలో 1.32 ఎకరాల పొలాన్ని తన పేరున మార్చుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇట్టి పొలాన్ని సాగు చేసేందుకు వెళ్లగా తన మరిది మల్లేష్ సాగు చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాణి కుమార్తె మంజుల, మనవళ్లతో కలసి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, పోలీసులు పట్టించుకోక పోవడంతో గట్టు– మాచర్ల రోడ్డుపై బైటాయించి సోమవారం ఆందోళన చేశారు. అదే విధంగా తన వాటాకు రావాల్సిన మరో 7.18 ఎకరాల భూమిని మరిది మల్లేష్ తన పేరున మార్చుకొని అన్యాయం చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, మరిది మల్లేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భూ వివాదంపై విచారణ చేపడుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఐదుగురిపై పిచ్చికుక్క దాడి పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానికంగా నివాసముంటున్న మెకానిక్ రాముడు, రంజాన్‌బీ, గౌరమ్మ, లక్ష్మయ్య, వేణుగోపాల్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పిచ్చికుక్కను కర్రలతో దాడి చేసి చంపేశారు. అనంతరం బాధితులు ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
48 గంటలైనా లభించని ఆచూకీ
కృష్ణా: భీమానదిలో మొసలి దాడికి గురైన రైతు ఆచూకీ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు వృథా అయ్యాయి. మండలంలోని కుసుమర్తిలోని భీమానదిలో రైతు జింకల్ తిప్పన్నపై శనివారం మొసలి దాడి చేసి ఈడ్చుకెళ్లిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ, మక్తల్ సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో , రెవెన్యూ అధికారులు సోమవారం స్థానిక జాలర్ల సాయంతో నదిలో తిప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటలైనా తిప్పన్న ఆచూకీ లభించక పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా అటవీ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌గౌడ్, నాగేంద్ర, సంతోష్పాటీల్, సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర ఆవేదనలో కుటుంబ సభ్యులు అటవీ అధికారులకు వినతి -
ఆర్టీసీ బస్సు బోల్తా
● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కొత్తకోట రూరల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు ఓవైపు ప్రచారం చేస్తున్నప్పటకీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులకు ఏం జరిగిందో తెలియక రక్షించాలంటూ కేకలు వేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కడప నుంచి సికిందరాబాద్‌కు 37మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యంలోని పాలెం సమీపంలోకి బస్సు రాగానే ఒక్కసారిగా అదపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణికులు నారాయణ, శిల్ప, తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను 108 లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. బస్సు సా ధారణ స్పీడ్‌లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నవ వధువు అనుమానాస్పద మృతి మద్దూరు/కొత్తపల్లి: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతిచెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కడపని స్వామితో కోయిలకొండ మండలం మల్కాపూర్‌కు చెందిన జ్యోతి(19)కి గత నెల 20న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జ్యోతి తల్లి గారింటికి వెళ్లి అక్కడ పదిరోజులు ఉండి ఈ నెల 14న ఎక్కమేడ్కు వచ్చింది. ఈ నెల 18న రాత్రి పడుకున్న తర్వాత ఆకస్మికంగా మృతిచెందగా ఈ విషయాన్ని స్వామి చిన్నాన్న చంద్రప్ప మృతురాలి బంధువులకు సమా చారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు పెద్దఎత్తున ఎక్కమేడ్లోని స్వామి ఇంటికి చేరుకోగా కోస్గి ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుమార్తె మృతిపై అనుమానం ఉందని తండ్రి గుర్రాల కుశలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఉస్మాన్ వివరించారు. -
మహిళల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
పాలమూరు: పెహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ప్రతీకారం తీర్చుకున్న భారత సైనికులకు సంఘీభావంగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పాత గ్రంథాలయం నుంచి క్లాక్‌టవర్ వరకు మహిళలతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహిళ కార్యకర్తలు, పట్టణ మహిళలతో కలిసి ఎంపీ జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలో నడిచారు. మహిళా సైనికులు అయిన ఖురేషి, వ్యోమికా సింగ్‌లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ధర్మంతోనే జగతికి శాంతి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అందరూ ధర్మం పాటిస్తే జగతికి శాంతి చేకూరడమే గాక నైతిక విలువలు పెంపొందుతాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో వచ్చే నెల 16న జరిగే ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవం, మహాత్మా బసవేశ్వర జయంతోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవాళి విశ్వశాంతి కోసం ఆది జగద్గురు పంచాచార్యులు పట్టణానికి రానుండటం శుభసూచకమని అన్నారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ముక్తా శ్రీశైలం, సంఘం నాయకులు ఎం.కె.గాంధీ, జంగం శివరాజయ్య, గాజుల మృత్యుంజయ, రాజశేఖర్, శరణ్‌కుమార్, శివకుమార్, గురుపాదస్వామి, బసప్ప, శివప్రసాద్, గురుపాదయ్య, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ,మహిళలు -
పాలమూరు బాధ్యత నాదే
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్‌గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తూ అదనపు విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్‌సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామ లం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడినని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి -
పులకరించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి రెండోసారి రావడంతో గ్రామస్తులు పులకరించిపోయారు. సోమవారం సాయంత్రం కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎంకు గజమాలతో ఘనస్వాతం పలికారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో సామూహికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి దంపతులు ఆంజనేయస్వామి, శివుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పండితులు ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశీర్వచనం చేసి శాలువాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి సొంత నిధులతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడం అభినందనీయమని పలువురు మంత్రులు కొనియాడారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేకంగా చేసిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ముందుగా మంత్రులు హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లగా.. కొంత ఆలస్యంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. వంగూరు మండల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొండారెడ్డిపల్లిలో సీఎంను ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, నరేందరర్రెడ్డి, రమేశ్‌గౌడ్ కలిసి మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. రూ. 100కోట్లతో కొండారెడ్డిపల్లి నుంచి హాజీపూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం, పలు గ్రామాల్లో రూ. 12కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడంతో పాటు విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని వారు సీఎం దృష్టికి తెచ్చారు. అన్నింటినీ పరిశీలించి నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, కొండారెడ్డిపల్లికి చెందిన వందన గీసిన ముఖ్యమంత్రి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, వేమారెడ్డి, కృష్ణారెడ్డి, లాలూ యాదవ్, వంశీ తదితరులు ఉన్నారు. మండల అభివృద్ధికి నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు, మంత్రులు -
నేటి నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు
అలంపూర్: మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉర్సు ఉత్సవాలకు షా–అలీ పహిల్వాన్ దర్గాలు ముస్తాబు అవుతున్నాయి. పట్టణంలో వెలిసిన షా–అలీ–పహిల్వాన్ సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండటంతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధికారికంగా జరిగే ఈ ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. 23 వరకు ఉత్సవాలు.. షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు నాలుగు రోజుల పా టు జరగనున్నాయి. ఈ నెల 20న రాత్రి గంధోత్సవం ఉంటుంది. రాత్రి సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయం గంధం తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక ప్రార్ధనల అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి గంధంను సర్ ముబారక్ దర్గాకు భక్తజనసందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. సర్ ముబారక్ దర్గాలో గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. చివరగా ధడ్ ముబారక్ దర్గాలకు గంధంను తీసుకెళ్లి ప్రార్ధనలు చేయడం ఆనవాయితీ. 21న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు జరగనున్నాయి. 22న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తీలు నిర్వహిస్తారు. పెద్ద కిస్తీపోటీలను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. 23న ప్రత్యేక ఉత్సవాలతో ముగుస్తాయి. రేపు దర్గాలలో గంధోత్సవం 21 చిన్న కిస్తీలు, 22న పెద్ద కిస్తీలు -
అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లాకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడకక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లా వ్యవసాయశాఖ జీలుగ 4,000 క్వింటాళ్లు, జనుము 1,000 క్వింటాళ్లు కావాలని ఇండెంట్ ఇవ్వగా.. ఇప్పటివరకు జీలుగ 2,000 క్వింటాళ్లు, జనులు 1,000 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. జిల్లాలోని పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, టీజీఎస్డీఎల్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు. ● సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగ విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.5 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు. పంపిణీకి విత్తనాలు సిద్ధం ఇప్పటికే జిల్లాకు చేరుకున్న జీలుగ, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం. రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకంతో సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలి. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జిల్లాలో 3వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం 50 శాతం సబ్సిడీతో విక్రయం -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్‌సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. సీఎం సొంత గ్రామంలోనూ పర్యటన.. మాచారంలో ‘ఇందిరా సౌర జల వికాసం’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకోనున్నారు. గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఖర్చుతో ఇటీవల నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్‌తో నడిచే బోరు మోటారును ఆన్‌చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి బయల్దేరుతారు. 1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 3 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. -
తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య
హన్వాడ: క్షణికావేశం.. కన్నవారి ప్రేమానురాగాన్ని మరిపించింది. జీవితం అంటే ఇంతేనా అనే రీతిలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చాడు. హన్వాడ మండలం టంకరలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా.. టంకరకు చెందిన మెండె పెద్దరాములు – గౌరమ్మలకు ఇద్దరు సంతానం. కుమారుడు మల్లేష్ (13) నారాయణపేటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేసుకొని సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. కూతురు స్వగ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. అయితే వేసవి సెలవుల్లో ఇంటి పట్టున ఉంటున్న మల్లేష్ బయటి వ్యక్తులు, ఇతరులతో కలివిడిగా కలిసిపోకపోగా.. ఎవరితోనూ మాట కలపకుండా స్తబ్దుగా ఉండేవాడు. ఇంట్లో కేవలం టీవీ, మొబైల్ ఫోన్ చూస్తూ ఉండే వాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమారుడి శైలిపై పలుమార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం గౌరమ్మ పొలం వద్ద చిన్నపని ఉంది.. వెళ్లొద్దామని కోరగా అయిష్టంగానే వచ్చి, మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల కలలు కళలైపోయాయి. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
హైవేపై తప్పిన పెను ప్రమాదం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఆదివారం ప్రయాణిస్తున్న భారీ కంటైనర్‌లోని మిషనరీ కారుపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లకు చెందిన పుస్యహాసారెడ్డి తన కారులో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై పదో బెటాలియన్ సమీపంలో ముందుగా వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో దానికి స్వల్పంగా వెనకనుండి ఢీకొట్టారు. ఈ క్రమంలో రెండు కార్ల యజమానులు వాహనాలను రోడ్డు పక్కన ఆపి గొడవ పడుతుండగా.. అదే దారి గుండా వెళ్తున్న ఓ భారీ కంటైనర్‌ను నిలువరించేందుకు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బెల్ట్ తెగిపోయి దానిపై ఉన్న మిషనరీ కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కారుపై పడిన కంటైనర్‌లోని మిషనరీ భారీగా నిలిచిన వాహనాలు -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కౌకుంట్ల మండలం ముచ్చింతలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పెద్ద గొల్ల చంద్రన్న (56) ఇంటి ఎదుట ఉన్న కట్టెలు వర్షానికి తడవకుండా లోనికి తరలిస్తున్నాడు. అదే సమయంలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగ తెగి అతడిపై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రన్నకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఏఎస్ఐ వెంకటస్వామి వివరించారు. -
ఆదివాసీ చెంచులకు వరం
అచ్చంపేట/మన్ననూర్: ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ఆదివాసీ చెంచులకు వరంలాంటిదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్‌లతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దశాబ్ధాలుగా నిరాధారణకు గురైన ఆదివాసీ చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. పోడు భూముల్లో ఎకరాకు రూ. 6లక్షల నుంచి రూ. 8లక్షల వరకు ఖర్చుచేసి ఉద్యాన తోటలను అభివృద్ధి చేసి ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది ఆదివాసీ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గిరిజన రైతుల కోసం ప్రవేశపెడుతున్న కొత్త పథకాన్ని నల్లమల ప్రాంతంలో ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ చెంచుల అభ్యున్నతి కోసం బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సీఎం సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి అధికారి, డీఎఫ్ఓ రోహిత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీపీఓ రామ్మోహన్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ మాధవి, జిల్లా ఉద్యానశాఖ అధికారులు జగన్, వెంకటేశ్, రాజేందర్, మల్లేష్, వెంకటయ్య తాహసీల్దార్ శైలేంద్ర, ఎంపీడీఓలు వెంకటయ్య, జగదీశ్ పాల్గొన్నారు. -
ఇసుక టిప్పర్ల పట్టివేత
గద్వాల క్రైం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వనపర్తి జిల్లా రంగాపురం పరిధిలోని నదీ పరివాహాక ప్రాంతం నుంచి ఉండవెల్లి మండలం కల్లుగోట్ల గ్రామానికి చెందిన ఆర్వీ శేషుకు చెందిన టిప్పర్ల ద్వారా ఆదివారం ఇసుక గద్వాలకు తరలిస్తున్నారన్నా సమాచారం మేరకు జమ్మిచెడ్ శివారులో దాడి చేసి టిప్పర్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించామన్నారు. అదే విధంగా జమ్మిచెడ్ శివారులోని అక్రమంగా ఆరు టిప్పర్ల ఇసుకను నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు టిప్పర్ల యాజమాని ఆర్వీ శేషుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పోడు భూములకు మహర్దశ
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టనున్న ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంతో పోడు భూములకు మహర్దశ పట్టనుంది. గిరిజన, చెంచు రైతులు ఉద్యాన పంటలు పండించి ఆదాయం పొందేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు, మార్గదర్శకాలను గిరిజన సంక్షేమశాఖ విడుదల చేసింది. వందశాతం రాయితీతో ఒక్కో యూనిట్‌కు రూ. 6లక్షల చొప్పున ఖర్చు చేస్తారు. పోడు భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు రానున్న ఐదేళ్ల పాటు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి వసతి కల్పిస్తారు. మొదటి మూడేళళ్లు అంతర పంటలు సాగుచేస్తూ.. ఆదాయం పొందే విధంగా రైతులను ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత పండ్ల తోటల నుంచి దిగుబడులు వచ్చి రైతులకు ఆదాయం సమకూరనుంది. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 27 మందికి చెందిన 50 ఎకరాల భూముల్లో సౌర విద్యుత్‌తో పాటు ఉచితంగా బోరుడ్రిల్లింగ్, 5హెచ్‌పీ మోటార్లు, స్పింకర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు రైతులకు ఒకటి చొప్పున 16 బోర్లు వేయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని 114 గ్రామాల్లో 3,410 మంది చెంచు, గిరిజనులకు 7,765.12 ఎకరాల పోడు భూములకు అటవీ హక్కుల చట్టం కింద భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశారు. వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివరాలిలా.. నియోజకవర్గం గ్రామాలు రైతులు పోడు భూములు అచ్చంపేట 58 1,827 4,612.4 కొల్లాపూర్ 24 1,083 2.531.1 కల్వకుర్తి 3 8 24.5 మహబూబ్‌నగర్ 12 77 116.12 వనపర్తి 17 415 481 క్షేత్రస్థాయి పర్యటన.. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద చేపట్టే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, దానిమ్మ, వెదురు, కొబ్బరి ఇతర తోటలను పరిశీలించడానికి మాచారం గ్రామ చెంచు రైతులను దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి ఉద్యానవన పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పండ్ల తోటలు, మొక్కల పెంపకం, వాటికి ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పోడు భూములను చదును చేసి పండ్ల తోటలు పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ‘ఇందిరా సౌరగిరి జలవికాసం’తో సౌర విద్యుత్‌తో పాటు సాగునీటి వసతి గిరిజన, చెంచు రైతుల సుస్థిర సాగుకు పక్కా ప్రణాళిక -
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
వనపర్తిటౌన్: కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాయిగడ్డ కాలనీలో తోటి చిన్నారులతో కలిసి డింపుల్ అనే చిన్నారి ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి యత్నించాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమేస్తున్న క్రమంలో ఓ కుక్క డింపుల్‌పై దాడి చేయడంతో ముఖం, చేతిపై గాయాలయ్యాయి. స్థానిక మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ సహకారంతో చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కుక్కకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో లేవని వైద్యులు చెప్పడంతో.. స్థానికంగా ఉన్న ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు చిన్నారి తల్లిదండ్రులు ప్రకాశ్, స్రవంతి తెలిపారు. పట్టించుకోని మున్సిపాలిటీ.. జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా కుక్కల బెడద ఎక్కువైందని మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ అన్నారు. వీధి కుక్కలను ఎనిమల్ కేర్‌కు తరలించి తగిన చర్యలు చేపడతామని పుర అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని, కుక్కల నివారణకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థి ప్రాణం తీసిన పిడుగు
దేవరకద్ర రూరల్: ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. బాగా చదువుకొని తమకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్న తరుణంలో.. పిడుగుపాటు రూపంలో వచ్చిన మృత్యువు వారి ఆశలను కబళించింది. కన్నవారికి తీరని శోకం మిగిల్చిన ఈ ఘటన ఆదివారం దేవరకద్ర మండలం గద్దెగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గద్దెగూడెం గ్రామానికి చెందిన రైతు బత్తుల కృష్ణయ్య వ్యవసాయం, పాడి ఉత్పత్తితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం తనకు పొలం వద్ద పని ఉండటంతో వెళ్లాడు. ఇంటర్ పూర్తిచేసుకుని వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన అతడి కుమారుడు ఉదయ్‌కుమార్ (18) పశువులను మేపేందుకు వెళ్లగా.. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక కుమారుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం
మరికల్: టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాము కథనం మేరకు.. ధన్వాడ మండలం కంసాన్‌పల్లికి చెందిన కొల్లంపల్లి ఉప్పరి నారాయణ (48) పెద్దచింతకుంట నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మరికల్ చౌరస్తాలో బైక్‌ను మలుపుతుండగా ఒడిస్సా నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొని ఆయన తలపై నుంచి టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నారాయణ రియల్ వ్యాపారం చేస్తుండటంతో ఆయన బైక్‌లో విలువైన డాక్యుమెంట్లు, రూ.లక్ష నగదు ఉండటంతో పోలీసులు వాటిని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. బైక్ అదుపుతప్పి మరొకరు మృతి వెల్దండ: మండలంలోని బైరాపూర్ సమీపంలో వెల్దండ–చారకొండ రహదారిపై బైక్ అదుపుతప్పి భూత్కురి రమేశ్ (30) మృతి చెందినట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. కొట్ర గ్రామానికి చెందిన రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోగా ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆదివారం రోడ్డు పక్కన గుంతలో బైక్, వ్యక్తిని గుర్తించిన బైరాపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ వివరాలు సేకరించగా కొట్ర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్ఐ వివరించారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి మానవపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎస్ఐ సమద్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఏఎస్ఐ సమద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్‌లో విధులు నిర్వర్తించేవాడు. గత నెల 27న విధులు ముగించుకొని తిరిగి వస్తూ మానవపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతదేహానికి అలంపూర్ ఆరోగ్య కేంద్రంలో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమద్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్పీ ఆదేశానుసారం సమద్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంత్యక్రియలకుగాను రూ.20 వేలు అందించినట్లు ఏఎస్ఐ వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతి నాగర్‌కర్నూల్ క్రైం: చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలులో చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. మండలంలోని ఔరాసిపల్లికి చెందిన ప్రభాకర్ (39) హైదరాబాద్‌లో మేసీ్త్ర పని చేసుకొని జీవనం సాగించే వాడు. ఈ నెల 13న స్వగ్రామానికి వచ్చిన అతడు తిరిగి వెళ్లలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నాగనూలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య బలన్మరణం వంగూర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వంగూర్ మండలం నర్సంపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేందర్ వివరాల మేరకు.. నర్సంపల్లికి చెందిన పార్వతమ్మ (45) భర్త వెంకటయ్య అనారోగ్యంతో 20 రోజుల క్రితం మృతిచెందాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొంత సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాలమూరులో తిరంగా ర్యాలీ
పాలమూరు: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం సాయంత్రం పాలమూరు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ప్రధా న స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్‌టవర్ వరకు జాతీ య జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాజీ సైనికులు, బీజేపీ నే తలు, యువకులతో కలిసి జాతీయ జెండాలు చేతి లో పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ సైనికల్లో ధైర్యం నింపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదుల స్థావ రాలపై దాడులు చేసి పాకిస్తాన్‌కు మన సత్తా ఏంటో చూపించామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు సాహితీరెడ్డి, జయశ్రీ, బాలత్రిపుర సుందరి పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్న పరీక్షల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొత్తం 9,069 మంది రాయనున్న ఆయా పరీక్షలకు గాను జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఐఈఓ కౌసర్ జహాన్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి వృత్తి నైపుణ్యం పెంపు కోసం ఇస్తున్న శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఈ నెల 13 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె జిల్లాకేంద్రంలోని జేపీఎన్‌ఈఎస్ భవనంలో ఇస్తున్న శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని స్థాయిలలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు తెరిచిన తర్వాత రెండు వారాల పాటు 1 నుంచి 10వ తరగతి వరకు వర్ణమాల, ఇంగ్లిష్ అక్షరాలు, పదాలు, గణిత భావనలపై పునశ్చరణ తరగతులు నిర్వహించి విద్యార్థులను సంసిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ, డీఈఓ ప్రవీణ్ కుమార్, ఏఎంఓ శ్రీనివాస్, ిసీఎంఓ బాలుయాదవ్ పాల్గొన్నారు. -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్‌నగర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్‌ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం..
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని పీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ ఇన్చార్జ్ సాంబయ్య అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. కార్యకర్తల కృషిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలందించే వారికి పదవుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, ఇతర పదవులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందరి సమష్టి నిర్ణయంతో పదవులను ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర సముచిత స్థానం కల్పిస్తామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల ఎంపికలో పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. -
ఆర్టీసి బస్టాండ్‌లో వృద్ధుడి హఠాన్మరణం
వనపర్తి రూరల్: వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఎస్ఐ హరిప్రసాద్ వివరాల మేరకు.. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కు చెందిన కోటయ్య (60)కు ఆరోగ్యం బాగో లేకపోవడంతో మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి వెళ్లేందుకు శనివారం గ్రామం నుంచి వనపర్తికి చేరుకున్నాడు. అయితే బస్టాండ్ ప్రాంగణంలోని చలివేంద్రం వద్ద సిమెంట్ బెంచీ పక్కన కూర్చున్న అతడు.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే కోటయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. గోడ కూలి వ్యక్తి మృతి ఊట్కూరు: మండలంలోని కొల్లూరులో ప్రమాదవశాత్తు గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన మాల చంద్రప్ప (55) శనివారం అదే గ్రామానికి మంగళి లక్ష్మమ్మ మట్టి ఇల్లు కూల్చివేత పనులకు వెళ్లాడు. ఇంటి గోడను కూలగొడుతున్న క్రమంలో ఒక్కసారిగా అతడిపై కూలి పడింది. గమనించిన స్థానికులు వెంటనే అత డిని శిథిలాల నుంచి బయటికి తీయగా.. అప్ప టికే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు. తండ్రితో డబ్బుల వ్యవహారంలో గొడవ.. ● కుమారుడి ఆత్మహత్య మహబూబ్‌నగర్ క్రైం: డబ్బుల వ్యవహారంలో తండ్రితో గొడవ పడిన యువకుడు మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ కె.రాజు కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఏనుగొండకు చెందిన బాలకృష్ణ(21) ప్రైవేట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బుల విషయంలో శుక్రవారం రాత్రి తండ్రితో గొడవ జరగడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన బాలకృష్ణ ఏనుగొండ సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి అయిజ: మండలంలోని బింగుదొడ్డి గ్రామానికి చెందిన హనుమన్న (62) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్ఐ శ్రీనివాసరావు వివరాల మేరకు.. బింగుదొడ్డికి చెందిన హనుమన్న కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి రోడ్డుపక్కన అపస్మారక స్థితితో అతడు పడి ఉండటాన్ని బాటసారులు గుర్తించి 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. బావిలో పడి యువకుడి మృతి దేవరకద్ర: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కౌకుంట్లకు చెందిన ఆనంద్‌కుమార్ (27) గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బహిర్భూమికి వెళ్లిన అతడు.. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాళం వేసిన ఇళ్లకు కన్నం దేవరకద్ర/మన్ననూర్: దేవరకద్రకు చెందిన శివ అనే వ్యక్తి తన భార్యను అత్తగారింట్లో వదిలిపెట్టడానికి శుక్రవారం వెళ్లాడు. తిరిగి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోగా.. అప్పటికే ఇంటికి వేసిన తాళం పగులగొట్టి కనిపించింది. ఇంట్లోని వస్తువలన్నీ చిందరవందరగా పడ్డాయి. ఇంట్లో దాచిన రూ. 2లక్షలు కనిపించకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన బాధితుడు.. శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగన్న ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ● అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఉన్న దాబా కాటేజీ నిర్వాహకుడు నరేశ్ బంధువుల వివాహం ఉండటంతో ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉంచిన 8 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ, 30వేల నగదు చోరీ చేశారు. కాగా, బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో తచ్చాడినట్లు సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైందని.. ఈ ఘటనపై అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
ఎంవీఎస్‌లో ఉపాధి ఆధారిత కోర్సులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉపాధి ఆధారిత కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీలో రెండేళ్లపాటు కళాశాలలో తరగతులు వినడం, తర్వాత మరో ఏడాది అప్రెంటిషిప్ ఉంటుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థికి వేతనం సైతం లభిస్తుందన్నారు. ఇలాంటి కోర్సులు ఎంవీఎస్‌లో 5 ప్రారంభించామని, అందులో బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్‌కు ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, బీఎస్సీ మార్కెటింగ్, ఫార్మా సేల్స్‌కు బైపీసీ, బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్కు బైపీసీ, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐకి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. వీటి ద్వారా డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం డిగ్రీలో చేరికకు దోస్త్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ నెల 21 వరకు అవకాశం ఉందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఎంవీఎస్ కళాశాలను ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అధ్యాపకులు సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు కొందరు బదిలీ అయ్యారు. వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న స్వప్న, జోగుళాంబ గద్వాల జిల్లాలో పనిచేస్తున్న ఆంజనేయులును మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించారు. ఈ మేరకు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ అయిన వారికి స్థానాలను కేటాయించనున్నారు. రైలు ఢీకొని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి దుర్మరణం మహబూబ్‌నగర్ క్రైం/దేవరకద్ర: వేర్వేరు ప్రాంతాల్లో పట్టాలు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను రైళ్లు ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రైల్వే ఎస్ఐ కె.రాజు వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి (60) రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని.. మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ● దేవరకద్రలో మూతపడిన రైల్వేగేటు సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే ఎస్ఐ అక్బర్ వివరాల మేరకు.. దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌కు చెందిన బాజాపల్లి ఆంజనేయులు (52) హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకునే వాడు. ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చిన అతడు.. దేవరకద్రలోని అత్తగారింటికి వెళ్లడానికి రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. ఫిల్టర్ ఇసుక కేంద్రాలు ధ్వంసం బిజినేపల్లి: మండలంలోని లట్టుపల్లి గ్రామ శివారు తండాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన 4 ఫిల్టర్ ఇసుక కేంద్రాలను తహసీల్దార్ శ్రీరాములు, ఎస్ఐ శ్రీనివాసులు ధ్వంసం చేశారు. శనివారం ప్రత్యేకంగా ఫిల్టర్ ఇసుక కేంద్రాలపై రైడ్ నిర్వహించారు. మిట్యా తండాతో పాటు ఇతర తండా పరిసరాల్లో అక్రమంగా డంప్ చేసిన ఫిల్టర్ ఇసుకను ధ్వంసం చేసి 8 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇళ్లు, భవనాల నిర్మాణం కోసం ఫిల్టర్ ఇసుకను వాడరాదని, నాణ్యమైన ఇసుకను వినియోగించాలన్నారు. ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిల్టర్ ఇసుకలు నిర్వహించే వారి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. -
బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. నెల రోజులపాటు జరిగే స్వామివారి ఉత్సవాల్లో మొదటి శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. కొందరు భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో వెలసిన వివిధ దుకాణాలు కొనుగోలు దారులతో రద్దీగా కనిపించాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాలు మార్మోగిన అంజన్న నామస్మరణ -
డీసీసీబీకి ఐఎస్ఓ సర్టిఫికెట్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు డీసీసీబీ కేటగిరి–సీ నుంచి బీకి అప్‌గ్రేడ్ కావడంతోపాటు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి సమక్షంలో డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. కాగా, దీనికి కృషి చేసిన సీఈఓ పురుషోత్తంతోపాటు పాలకమండలి, పీఏసీఎస్ అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సిబ్బందికి విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
రేపటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఎండీసీఏ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అయితే ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లకు శ్రీకారం చుట్టారు. ఈ లీగ్‌లకు సంబంధించి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్–19, 23 విభాగాల జిల్లాల జట్ల ఎంపికలు నిర్వహించగా.. వందలాది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. పాల్గొననున్న ఆరు జట్లు.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ నెల 19 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ పురుషుల అండర్–23 క్రికెట్ టూడే లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్‌లుగా విభజించారు. పూల్–ఏలో మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, పూల్–బీలో జడ్చర్ల, గద్వాల, నాగర్‌కర్నూల్ జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో టూడే లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్రీడాకారులు ప్రతిభ చాటాలి.. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 లీగ్‌లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు ఈ లీగ్ ఒక వరంలా మారనుంది. ఈ లీగ్‌లో రాణించే క్రీడాకారులను రానున్న హెచ్‌సీఏ లీగ్‌ల్లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తాం. మ్యాచ్‌ల వివరాలు.. వచ్చేనెల 1వ తేదీ వరకు కొనసాగనున్న అండర్–23 క్రికెట్ మ్యాచ్‌లు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో నిర్వహణ ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. మొదటి రౌండ్ ఈ నెల 19, 20 తేదీల్లో నాగర్‌కర్నూల్–వనపర్తి (వేదిక–నాగర్‌కర్నూల్), జడ్చర్ల–మహబూబ్‌నగర్ (జడ్చర్ల), గద్వాల–నారాయణపేట (నారాయణపేట), రెండో రౌండ్ 22, 23 తేదీల్లో మహబూబ్‌నగర్–గద్వాల (మహబూబ్‌నగర్), వనపర్తి–నారాయణపేట (వనపర్తి), జడ్చర్ల–నాగర్‌కర్నూల్ (జడ్చర్ల), మూడో రౌండ్ 25, 26 తేదీల్లో నారాయణపేట–జడ్చర్ల (నారాయణపేట), మహబూబ్‌నగర్–నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్), వనపర్తి–గద్వాల (గద్వాల), నాలుగో రౌండ్ 28, 29 తేదీల్లో మహబూబ్‌నగర్–వనపర్తి (మహబూబ్‌నగర్), జడ్చర్ల–గద్వాల (జడ్చర్ల), నారాయణపేట–నాగర్‌కర్నూల్ (నాగర్‌కర్నూల్), ఐదో రౌడ్ 31, జూన్ 1 తేదీల్లో మహబూబ్‌నగర్–నారాయణపేట (నాగర్‌కర్నూల్), గద్వాల–నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్), జడ్చర్ల–వనపర్తి (గద్వాల). -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
నాగర్‌కర్నూల్ క్రైం: అత్యాచారం చేసి మహిళను హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు నాగర్‌కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. ఈనెల 11న కుమ్మెర శివారులో జరిగిన మహిళ హత్య కేసుకి సంబంధించి శుక్రవారం సీఐ వివరాలు వెల్లడించారు. బిజినేపల్లి మండలం వసంతాపూర్కి చెందిన రాములమ్మ(44) తన భర్త మృతి చెందడంతో ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే లింగసానిపల్లి గ్రామానికి చెందిన పరశురాములు తన స్నేహితుడి ద్వారా రాములమ్మను పరిచయం చేసుకుని ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. ఈనెల 11న బైక్‌పై కుమ్మెర శివారులోని వ్యవసాయ పొలం వద్దకు రాములమ్మను తీసుకువెళ్లి అత్యాచారం చేయడంతో పాటు హత్యకు పాల్పడ్డాడు. నిందితుడు రాములమ్మ వద్ద ఉన్న తులం బంగారు ఆభరణాలను, మూడు తులాల వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. కుమ్మెర శివారులో వ్యవసాయ పొలం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ఈనెల 14న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి సెల్‌ఫోన్ డేటాను తీసుకొని విచారణ జరిపిన పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్‌పై అనుమానంతో శనివారం లింగసానిపల్లి గ్రామానికి వెళ్లి పరశురాములును అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడు నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై గోవర్ధన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అలంపూర్ ఆలయంలో చండీహోమాలు
అలంపూర్: ఐదో శక్తి పీఠమైన అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమాలు నిర్వహించారు. అమావాస్య, పౌర్ణమి, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో చండీహోమాలు నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు చండీహోమాల్లో పాల్గొన్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ పేర్కొన్నారు. చండీహోమాలు నిర్వహించిన భక్తులు శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం అందజేశారు. -
క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ
అమరచింత: ఆట మధ్యలో ఏర్పడిన చిన్న వివాదం ఓ ప్రాణం తీసింది. క్రికెట్ మ్యాచ్‌లో గొడవపడి రెండు గ్రామాల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో... తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి.. మండంలోని ధర్మపురం గ్రామానికి చెందిన యువకులతో పాటు సమీప గ్రామం నాగల్‌కడ్మూర్ యువకులు కలిసి మూడు రోజుల కిందట క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో ఇరు గ్రామాల యువకుల మధ్య ఆట విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నాగల్‌కడ్మూర్‌కు చెందిన యువకులు దాడిలో ఆంజనేయులు(32) తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య మహేశ్వరి తన భర్తను ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం ఆంజనేయులు మృతదేహంను ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫిర్యాదులో పేర్కొన్న నిందితులు సురేందర్‌రెడ్డి, బన్నీ, రవి, వెంకటేష్, తిరుమలేష్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శివకుమార్ వెల్లడించారు. ● మృతుడు ఆంజనేయులు కుటుంబాన్ని న్యా యం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమా ండ్ చేయడంతో నాగల్‌కడ్మూర్ గ్రామ పెద్దలు శు క్రవారం ధర్మపురం గ్రామానికి చెందిన వ్యక్తుల తో చర్చించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండడంతో వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. నిందితుల ద్వారా రూ.12.70 లక్షలు ఇప్పించేందుకు ఒప్పందం చేశారు. రెండు గ్రామాల యువకులమధ్య గొడవ ఒక యువకుడికి తీవ్ర గాయాలు, చికిత్సపొందుతూ మృతి ఐదుగురిపై కేసు నమోదు -
సంస్కృతి ప్రతిబింబించేలా ప్రదర్శనలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మిస్ వరల్డ్ పోటీదారులు పిల్లలమర్రి సందర్శన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మనదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం, ఓడియా, కథక్, కేరళ జానపద కళాకారులు సుమారు 20 నిమిషాలపాటు ప్రదర్శన ఇచ్చారు. ‘మేరా ఇండియా.. ప్యారా ఇండియా’ పాట సందర్భంగా మిస్ వరల్డ్ పోటీదారులు జాతీయ జెండాలను చేతబూనగా చప్పట్లతో పిల్లలమర్రి ప్రాంగణం మార్మోగింది. అనంతరం కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, పాలమూరు మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ●పిల్లలమర్రి ఆధ్యాత్మిక సముదాయం.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ రాక చాలా సంతోషం కలిగించింది. ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్త ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. తెలంగాణ ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ప్రేమగల ప్రజలు ఉన్న భూమి ఇది. తెలంగాణలో సాంస్కృతిక విలువలు, జ్ఞానోదయం, వినోదం కలిసి సాగుతాయి. పిల్లలమర్రిని తెలంగాణ ప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక సముదాయంగా అభివృద్ధి చేసింది. చెట్టు, ఆలయం ఆకట్టుకునే కలయికగా ఉండడమే ఇందుకు నిదర్శనం. పర్యాటకాభివృద్ధితో ఎంతో మందికి స్వయం ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాంత సామాజిక అభివృద్ధికి పర్యాటక రంగం దోహదం చేస్తుంది. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలి. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి దేశానికే గర్వకారణం.. పిల్లలమర్రి పాలమూరు జిల్లాకే కాదు.. తెలంగాణ రాష్ట్రం, భారతదేశానికి గర్వకారణం. దీని విశిష్టతను తెలుసుకునేందుకు మిస్ వరల్డ్ పోటీదారులు రావడం ఆనందంగా ఉంది. వారు ఎన్నో తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళతారు. ఈ పిల్లలమర్రి మహావృక్షం 700 సంవత్సరాల క్రితం జన్మించింది.. మరో 700 ఏళ్లు జీవించి ఉంటుంది. – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే బందోబస్తు పర్యవేక్షించిన డీఐజీ మహబూబ్‌నగర్ క్రైం: మిస్ వరల్డ్ 2025 పోటీదారుల బృందం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ సుందరీమణుల బృందం చుట్టూ మహిళా పోలీస్ సిబ్బంది సఫారీ సూట్లలో రక్షణ వలగా ఉంటూ విధులు నిర్వహించారు. జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ డి.జానకి, గద్వాల ఎస్పీ తోట శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు రోడ్డుకు ఇరువైపుల కానిస్టేబుల్స్ పహారా కాశారు. -
నిప్పంటుకొని గుడిసె దగ్ధం
చిన్నంబావి: మండలంలోని అయ్యావారిపల్లి గ్రామంలో బీజేపీ నాయకుడు చెన్నయ్య యాదవ్‌కు చెందిన గుడిసె నిప్పంటుకొని దగ్ధమైంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసె కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ జగన్మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇంట్లో సామగ్రి మొత్తం కాలిపోయిందన్నారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. వనపర్తి జానపద నృత్యానికి గుర్తింపు వనపర్తిటౌన్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం రాత్రి అక్షిత ఫౌండేషన్, నటరాజ అకాడమీ సంయుక్తంగా రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు నిర్వ హించారు. రాష్ట్రస్థాయిలో ఏకపాత్రాభినయాలు, సా మూహిక నృత్య ప్రదర్శనలు 200 వరకు వచ్చాయి. ఇందులో వనపర్తి నుంచి యశ్వంత్ అకాడమీకి చెందిన పదేళ్లలోపు నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ప్రదర్శించిన జానపద నృత్య ప్రదర్శనకు ఐకాన్ అవార్డు దక్కింది. ఈ అవార్డును డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్, విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్, అక్షిత ఫౌండేషన్, నటరాజ అకాడమీ ప్రతినిధులు అందజేశారు. -
ఎకై ్సజ్ దాడుల్లో నల్ల బెల్లం పట్టివేత
కొత్తకోట: కొత్తకోట ఎకై ్సజ్ శాఖ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రూట్ వాచ్ దాడుల్లో నల్ల బెల్లంను తరలిస్తున్న రెండు వాహనాలను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట ఎకై ్సజ్ సీఐ కరుణ తెలిపిన వివరాల మేరకు కర్నూలు నుంచి పెబ్బేరు ఆటోలో 750 కేజీల నల్ల బెల్లాన్ని తరలిస్తున్న మోహన్‌కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో 3,500 కేజీల నల్ల బెల్లాన్ని తరలిస్తున్న సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ పోలీసులు ఎస్సై పృథ్వీ రాజ్, కానిస్టేబుల్స్ నాగరాణి, తిరుమలేష్, జనార్దన్, వినోద్ పాల్గొన్నారు. -
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
మరికల్: వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన అర్ధరాత్రి మరికల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన రంగలి శ్రీకాంత్ అలియాస్ (శ్రీనివాసులు)(22), చిన్నచింతకుంట మండలం ఉంధ్యాలకు చెందిన శివారెడ్డి వేరువేరుగా రెండు బైక్‌లపై వస్తున్నారు. మరికల్ పెంట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి వేగంగా రెండు బైక్‌లను ఢీకొట్టింది. క్షతగాత్రులను 108 అంబులైన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరికల్ చెందిన శ్రీకాంత్ మృతి చెందాడు. శివారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్‌కు 14 నెలల కిందటే పెళ్లి కాగా.. భార్య హైదరాబాద్‌లో నర్సింగ్ చదువుతోంది. దీంతో మరికల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి అడ్డాకుల: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. కౌకుంట్ల మండలం పేరూర్‌కి చెందిన ముసలన్న(60) అడ్డాకుల వద్ద రోడ్డు దాటుతుండగా కర్నూలు వైపు వెళ్లే డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముసలన్నను పోలీసులు అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాద సమయంలో వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకోగా వివరాలు తెలియరాలేదు. తర్వాత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వృద్ధుడిని పేరూర్‌కు చెందిన ముసలన్నగా గుర్తించి ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నీటిసంపులో పడివ్యక్తి మృతి పాన్‌గల్: ప్రమాదవశాత్తుతో నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ప్రొబేషన్ ఎస్ఐ హిమాబిందు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగడ తండాకు చెందిన రత్నావత్ భీమ్లానాయక్ (42) పెయింటింగ్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల నుంచి మండలంలోని కేతేపల్లిలో ఎల్లమ్మ గుడికి పెయింటింగ్ వేసేందుకు వచ్చి, అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేవాడు. శుక్రవారం ఉదయం గుడి ముందు ఉండే నీటి సంపులో కళ్ల అద్దాలు పడిపోయాయని, వాటిని తీసేందుకు సంపులోకి దిగి ప్రమాదవశాత్తుతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రేమ వ్యవహారంలో మనస్తాపం యువకుడి ఆత్మహత్య చేవెళ్ల: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్‌పల్లికి చెందిన కుమ్మరి రవి(22) నార్సింగి పరిధిలో ఆటో నడిపేవాడు. ఇతనికి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విరక్తి చెందిన రవి శుక్రవారం ఉదయం తన ఆటోలో చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల అటవీ ప్రాంతానికి వచ్చి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆటో నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి బాబమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ఖిల్లాఘనపురం: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్‌గౌడ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని తిరగడంతో పాటుగా కుటుంబ సభ్యులకు తెలియకుండా పలుచోట్లకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
అమ్మానాన్నకు వందనం
ప్రపంచాన్ని పరిచయం చేసి.. నడక నేర్పి.. పదాలకు పునాది వేసే మొదటి గురువులు అమ్మానాన్నలు. వారే ప్రత్యక్ష దైవం అనే విషయాన్ని విద్యార్థుల మదిలో పదిలంగా దాచుకునేలా.. విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలు కడిగి పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమాన్ని అమరచింతలో శుక్రవారం నిర్వహించారు. అమరచింత డీఎంఆర్ఎం పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తుండగా.. ఇందులో గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి 280 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇదిలాఉండగా, పిల్లలు ప్రాథమిక దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో శిబిరం నిర్వాహకులు తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈమేరకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి పూలు చల్లి వారి ఆశీర్వాదం పొందారు. – అమరిచింత -
పిల్లలమర్రిలో అందగత్తెల సందడి
పిల్లలమర్రి మహావృక్షం వద్ద సుందరీమణులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, తదితరులు విద్యార్థులతో మాటామంతీ.. మహా వృక్షం సందర్శించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీదారులు జిల్లాకు చెందిన విద్యార్థులతో చిట్‌చాట్ చేశారు. నలుగురు విద్యార్థులు నాలుగు ప్రశ్నలు అడిగారు. అందులో ఓ చిన్నారి మీ మిస్ వరల్డ్ జర్నీ గురించి వివరించండని ప్రశ్నించగా.. జపాన్‌కు చెందిన పోటీదారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మరో చిన్నారి పిల్లలమర్రి సందర్శన తర్వాత వృక్ష సంరక్షణపై మీరు ఇతరులకు అవగాహన కల్పిస్తారా? అని అడిగారు. దీనిపై ఇండియాకు చెందిన పోటీదారు మాట్లాడుతూ ఇండియన్ అని, మాది రైతు కుటుంబమని, చెట్ల గురించి తనకు తెలుసని.. వాటి పెంపకం గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని వివరించారు. విశ్వ వేదికలపై మాట్లాడటానికి సూచనలివ్వాలని ఓ విద్యార్థి కోరగా.. బంగ్లాదేశ్ చెందిన కంటెస్టెంట్ సమాధానమిచ్చారు. ఆత్వవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. చివరగా ఓ విద్యార్థి మీ చిన్ననాటి కలల గురించి చెప్పండని ప్రశ్నించగా.. నేపాల్, థాయ్‌లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన మిస్‌వరల్డ్ పోటీదారులు స్పందించారు. మహావృక్షం వద్ద 2 గంటలు.. రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియం సందర్శన తర్వాత సాయంత్రం 6.01 గంటలకు అందాలభామలు మహావృక్షం వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ పిల్లలమర్రి చరిత్రను వివరించారు. 700 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని 2018 నుంచి ఎలా సంరక్షిస్తూ వస్తున్నామనే అంశాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం మర్రిచెట్టు సమీపంలో 11 మొక్కలు నాటారు. ఆ తర్వాత మహావృక్షం చెంత ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే టీ, స్నాక్స్ తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దాదాపు 2 గంటలు మహావృక్షం వద్దే ఉన్నారు. అనంతరం చేనేత స్టాల్స్‌ను సందర్శించారు. గద్వాల, నారాయణపేట చేనేతలు తయారు చేసిన చీరలను పరిశీలించారు. అక్కడే ఉన్న మగ్గాన్ని, వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తొలుత రాజరాజేశ్వర ఆలయం నుంచి.. పిల్లలమర్రికి చేరుకున్న అందాల భామలకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సంపంగి, లైట్ పింక్ గులాబీ పువ్వులతో తయారు చేసిన మాలలను వేసి స్వాగతం పలికారు. ముందుగా 16వ శతాబ్దం కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ చరిత్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైతే ఇక్కడికి తీసుకొచ్చి పునఃప్రతిష్టించినట్లు మిస్‌వరల్డ్ పోటీదారులకు గైడ్ శివనాగిరెడ్డి వివరించారు. అక్కడి నుంచి మ్యూజియం వద్దకు చేరుకోగా.. వివిధ విగ్రహాలు, శిల్పాల విశిష్టత, పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర, కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాల గురించి వివరించారు. మ్యూజియంలో శాతవాహనుల నుంచి అసఫ్జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణేలతో పాటు మహా శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహాల గురించి శివనాగిరెడ్డి వివరించారు. -
మహబూబ్‌నగర్
కొత్త కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025ఫొటో తీస్తున్న మిస్ ఇండియా జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రవేశపెట్టిన నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా.సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో బీకాంలో రిటైల్ మేనేజ్మెంట్, బీఎస్సీలో హెల్త్ మేనేజ్మెంట్ కోర్సులను ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యార్థులు దోస్త్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పై కోర్సులు ఎంపిక చేసుకున్న వారికి పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. తళుక్కుమన్న సుందరీమణులు ● మహావృక్షాన్ని సందర్శించిన మిస్‌వరల్డ్–25 పోటీదారులు ● 22 దేశాలకు చెందిన యువతుల రాక ● ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన -
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్/శంకర్పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్ శివార్లలోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.ప్రత్యేక గైడ్ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు. మనసు దోచుకున్న ఎక్స్పీరియం.. హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్ వరల్డ్ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్ యూఎస్ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్పీరియం, సృజనాత్మక డిజైన్‌తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో తెలిపారు. కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే.. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
శాంతినగర్: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వడ్డేపల్లి మండలంలోని కొంకలలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. కొంకల గ్రామానికి చెందిన కురువ ఈరన్న(38) నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం కడుపునొప్పి ఎక్కువ కావడంతో జూలెకల్ శివారులోని వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలెకల్ రైతులు ఈ సమాచారం కుటుంబసభ్యులు అందించడంతో ఈరన్నను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అతని భార్య కురువ సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ ఏఎల్ఎం మృతి శాంతినగర్: గడ్డిమందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురైన విద్యుత్‌శాఖకు చెందిన ఏఎల్ఎం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు. అలంపూర్ మండలం లింగనవాయికి చెందిన ఏఎల్ఎం చాకలి రాజశేఖర్ శాంతినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మద్దూరు శివారులో పొలంలోని గెట్లకు ఉన్న గడ్డిని తొలగించేందుకు ఈనెల 4న గడ్డి మందు కొట్టడానికి వెళ్లాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మందు పిచికారీ చేశాడు. మందు కొడుతున్న సమయంలో ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి పోవడంతో అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ వివరించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నాడు. మృతదేహం లభ్యం ఇటిక్యాల: ఎర్రవల్లి మండలంలోని వేముల గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు కోదండాపురం ఎస్ఐ మురళి తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొంకాలపల్లి గ్రామానికి చెందిన శేషయ్య(56) బుధవారం దేవర నిమిత్తం కోదండాపురంలో తమ బంధువుల ఇంటికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి వేముల శివారులోని జక్కం బావి దగ్గరకు ఈత పడేందుకు వెళ్లగా, ప్రమాదవశాత్తు బావిలో కాలు ఇరుక్కొని గళ్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు రోజుల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి కుమారుడు రాంభూపాల్ ఫిర్యాదు మేరకు సంఘటనఫై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అడ్డాకుల: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న డీసీఎం అడ్డాకుల పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వృద్ధుడిని అంబులెన్స్‌లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వివరాలు తెలియ రాలేదని ఎస్ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. హైవేపై ఘోరం ● కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం ● భార్య మృతి.. తండ్రీకొడుకుకు తీవ్రగాయాలు ఇటిక్యాల: కొడుకుతో కలిసి బైక్‌పై బయల్దేరిన భార్యాభర్తలను విధి వక్రీకరించింది. గుర్తుతెలియని వాహనం రూపంలో మృత్యువు వెంటాడింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా.. తండ్రీకొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. అయిజ మండలం గురుదొడ్డి గ్రామానికి చెందిన ఉస్సేన్ రెడ్డి గురువారం తెల్లవారుజామున తన భార్య తిమ్మమ్మ (30), 13ఏళ్ల కుమారుడు జగన్మోహన్రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై వనపర్తి జిల్లా గంగవరం గ్రామంలోని తన చెల్లెల్లి వద్దకు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి భార్య తిమ్మమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉస్సెన్ రెడ్డి, అతడి కొడుకు జగన్మోహన్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘట నా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు దేవేందర్ రెడ్డి ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అంగన్వాడీల్లో కంటి పరీక్షలు
జడ్చర్ల టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆర్బీఎస్కే బృందాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,300 అంగన్వాడీ కేంద్రాలు.. 2,21,434 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం 26 ఆర్బీఎస్కే బృందాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 బృందాలు ఏడుగురు ఆప్తాలమిస్టులతో ప్రతిరోజు శిబిరాలు కొనసాగుతుండగా.. మిగిలిన జిల్లాల్లో వైద్యుల కొరత కారణంగా రోజు విడిచి రోజు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 7న ప్రారంభమైన కంటి పరీక్షల నిర్వహణ జూన్ 10 నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించారు. శిబిరాల్లో 6 నెలల చిన్నారి నుంచి ఆరేళ్ల విద్యార్థి వరకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు మేధో వైకల్యాలు, ఎదుగుదలలోని మైలురాళ్ల మూల్యాంకనం సైతం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివిన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లను పంపిణి చేశారు. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వం అంగన్వాడీల్లోని చిన్నారులపై దృష్టిసారించింది. సమగ్ర కంటి పరీక్షలు.. ముఖ్యంగా దృష్టి లోపం (దగ్గర, దూరం), మెల్ల కన్ను, కనురెప్పలు వాలిపోవడం, పై కనురెప్పల పొక్కులు, నిష్టగమస్–కనుగుడ్ల అనియంత్రణ, జన్మతా కంటి శుక్లాలను గుర్తిస్తున్నారు. లోపాలను గుర్తించి వారిని ప్రత్యేక చికిత్సల కోసం డీఈఐసీ, మహబూబ్‌నగర్ జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. మేధో వైకల్యాలు.. కంటి పరీక్షలతో పాటు పిల్లల్లో మైలురాయి మూల్యాంకనం, మేధో వైకల్యాలు సైతం గుర్తిస్తున్నారు. ఇందుకోసం 42 ప్రశ్నలతో రూపొందించిన ఓ జాబితా రూపొందించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి శారీరక, మానసిక వైకల్యాలు గుర్తిస్తున్నారు. అలా గుర్తించిన వారికి మెరుగైన చికిత్స కోసం డీఈఐసీకి రెఫర్ చేయనున్నారు. జిల్లాలో 56,854 మంది చిన్నారులకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 1,163 అంగన్వాడీ కేంద్రాల్లోని 56,854 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేస్తున్నాం. 6 నెలల పసికందు నుంచి ఆరేళ్ల చిన్నారి వరకు అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశాం. వీటితోపాటు మేధోవైకల్య పరీక్షలు చేసి చిన్నారుల ఆరోగ్య వివరాలన్నీ తెలుపడంతో వారి జీవితానికి భరోసా కలుగుతుంది. – డా.కృష్ణ, డీఎంహెచ్ఓ, మహబూబ్‌నగర్ జూన్ 10 నాటికి పూర్తిచేస్తాం.. 6 నెలల చిన్నారి నుంచి ఆరేళ్ల బాలల వరకు కంటి పరీక్షలు చేస్తున్నాం. దీంతోపాటు మానసిక వైకల్యం, మేధోవైకల్యం నిర్ధారణ జరుపుతున్నాం. జడ్చర్ల, మిడ్జిల్ ఆర్బీఎస్కే పరిధిలో జూన్ 10 నాటికి పరీక్షలు పూర్తిచేస్తాం. – డా. సునీల్, ఆర్బీఎస్కే వైద్యుడు, జడ్చర్ల ఆర్బీఎస్కే బృందాలతో నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 2,21,434 మందిచిన్నారులు జూన్ 10 నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు -
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
మన్ననూర్/కల్వకుర్తి టౌన్: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్టారావు, ఎంపీ మల్లురవి అన్నారు. అమ్రాబాద్ మండలం మాచా రంలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డిలతో కలిసి వారు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జలంధర్‌రెడ్డి ఇంటి వద్ద, కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మల్లు రవి మాట్లాడారు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభోత్సవంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూడదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాచారం గ్రామంలోని ఆదివాసీ చెంచుల ఊపిరీ తీయాలని చూస్తే.. నల్లమల బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని.. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నీతిమాలిన అసత్య గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విషయంలో ఏకాభిప్రాయంతో నడుస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి ఎజెండానే తమందరి ఎజెండా అని తెలిపారు. అత్యంత వెనకబడిన గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరి జల వికాసం పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 18న ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు నల్లమలకు రానున్నారని చెప్పారు. ● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో రూ. 12,600 కోట్లతో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ఆదివాసీలతో ప్రారంభమయ్యే ఈ పథకం.. ఎస్టీలలోని ఇతర వర్గాలతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుపేద కుటుంబాల్లోని రైతులకు కూడా వర్తింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. మాట తప్పం.. మడమతిప్పం అనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని తెలిపారు. ● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో మరో భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 25కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మరో రూ. 75కోట్లు కేటాయించాలని సీఎంను కోరుతామన్నారు. సీఎం పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశాల్లో మాజీ జెడ్పీటీసీ డా.అనురాధ, పీసీబీ మెంబర్ బాలాజీ సింగ్, నాయకులు రాములు, రాజేందర్, శ్రీనివాసులు, మల్లేష్, ఆనంద్ కుమార్, విజయ్‌కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భూపతిరెడ్డి ఉన్నారు. -
వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక
పొలం గట్ల తయారీ పంటలపై తీసుకోనే శ్రద్ధ పొలం గట్లు, మురుగు కాల్వలపై చూపించడం లేదు. వీటిలో వివిధ రకాలైన ఒయ్యారి భామ, మూల మాతంగి, నీరు గొబ్బి, గొంగల గరాకు, గరక రాకసి, తుంగ వంటి మొక్కలు పంటలతో పాటు పెరిగే వివిధ రకాలైన వ్యాధులు వచ్చేందుకు పురుగుల వ్యాప్తికి కారణమవుతాయి. వేసవిలోనే తప్పనిసరిగా పొలం గట్లు, మురుగు కాలువల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తనాల ఎంపిక ముఖ్యం తాలు గింజలు, సగం నిండని గింజలు, కలుపు విత్తనాలు వేరు చేసి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సర్టిఫైడ్ విత్తనం కాని, పరిశోధన స్థానాల నుంచి సేకరించిన విత్తనాలను తీసుకోవాలి. ఏ విత్తనమైన మొలక శాతం తెలుసుకోకుండా నారు పోయకూడదు. ఎంపిక చేసిన విత్తనాలను తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసిన 12 గంటల తర్వాతనే విత్తనాన్ని భూమిలో విత్తుకోవాలి. అలంపూర్: వానాకాలం సీజన్లో పంట సాగు సకాలంలో జరగాలంటే ముందు నుంచే రైతులు ప్రణాళికలు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఇందుకు గాను రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనుల గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ వివరించారు. దుక్కులు దున్నడం.. ముందస్తు దుక్కులు దున్నడం వలన తొలకరి వర్షాలకు భూమి నీటిని పీల్చుకొని తేమ శాతం పెరగడానికి దోహదపడుతుంది. వాలుకు అడ్డంగా దున్నే దుక్కిలతో వర్షపు నీరు ఒకవైపు వెళ్లకుండా నేల కోతను ఆరికడుతుంది. తోటల్లో ఉండే మొండి జాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటికి ఊడి వస్తాయి. దీనికి తోడు నిద్రావస్థలో ఉన్న పలు కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పశువు పేడ, వర్మికం పోస్టులను పొలాలకు వేయాలి. భూసార పరీక్షలు భూమిలో పోషక విలువలు తగ్గిపోయి పంటల్లో సూక్ష్మపోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పోషకాలను పట్టి ఉంచే శక్తి, గాలి, నీరు చొచ్చుకొని వెళ్లే లక్షణం. మురుగు తీత మొదలైన గుణాలే కాకుండా రసాయనిక లక్షణాలైన ఉదజని సూచిక, లవణ పరిమాణం, లభ్య పోషకాలు చర్యల మొదలైనవి పెరుగుదల, దిగుబడిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో భూసార పరీక్షలు చేయించాలి. ఏడాదికి ఒకటి, రెండు పంటలు పండించే భూముల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రాల్లో అందజేయాలి. వారి సూచన మేరకు పంట సాగు చేసుకోవడం మంచిది. పచ్చిరొట్ల పైర్ల సాగు తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద మొదలగు పంటలను పండించి భూమిలో దున్నాలి. దీంతో ఎకరాకు 25–30 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. భూమి ఆరోగ్యంగా ఉంటుంది. జనుము, పల్లి పెసరలు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా ఉపయోగపడుతుంది. పాడి–పంట చౌడు భూములను బాగు చేసుకోవడం.. భూగర్భ జలాలను విరివిగా వాడటంతో నీటిలోని క్లోరైడ్ ద్వారా పొలాలు చౌడు భూములుగా మారుతాయి. భూసార పరీక్షలను అనుసరించి చౌడు భూములను వ్యవసాయ యోగ్య భూములుగా మార్చేందుకు వేసవి కాలం అనువైన సమయం. ఎండాకాలంలో నేలపైకి పొంగి ఉన్న ఉప్పు చౌడును పారలతో తొలగించాలి. మురుగు నీరు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని చదును చేసి దాదాపు 20–25 సెంట్ల మడులను విభజించి గట్టు వేయాలి. కారు చౌడు నేలలు ఎండినప్పుడు గడ్డపార వేసిన పెకలక రాయి వలే ఉంటుంది. తగినంత నీరు, తేమ ఉన్నప్పుడు మొత్తటి, చిక్కటి బురద తయారవుతుంది. ఇలాంటి నేలలను వేసవిలో బాగు చేసుకోవచ్చు. -
నేడు ఆలయ భూముల కౌలు వేలం
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాల భూముల కౌలు వేలం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు భూముల బహిరంగ వేలం ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 21న ఆలయాలకు సంబంధించిన పలు సర్వే నెంబర్లలోని భూముల బహిరంగ కౌలు వేలం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేలం పాటలో కొన్ని సర్వే నంబర్లకు సరైన కౌలు ధర రాకపోవడంతో వేలం నిలిపివేసినట్లు తెలిపారు. వాటికి సంబంధించి ఈ నెల 2న మరోసారి వేలం నిర్వహించినా.. రైతులు ఆసక్తి చూపకపోవడంతో శుక్రవారం మూడోసారి వేలం నిర్వహిస్తున్నామన్నారు. తక్కశీల గ్రామంలోని సర్వే నంబర్ 253లో 4.04 ఎకరాల భూమి మాదక్క పట్టెలు పొలం, అలంపూర్ శివారులోని సర్వే నంబర్ 566లో 9.28 ఎకరాలు కుమ్మరి గుట్టల పొలం, సర్వే నంబర్ 960లోని 9.04 ఎకరాలు తంగడి మాను చేను, బైరంపల్లిలోని సర్వే నంబర్ 11లోని 11.13 ఎకరాలు ఈదుల గడ్డ పొలం, చందాపూర్‌లోని సర్వే నంబర్ 20లో ఉన్న 7.08 ఎకరాలు, కర్నూల్ జిల్లాలోని కల్లూరులో సర్వే నంబర్ 346/1, 346/3లోని 15.18 ఎకరాలు పెరుగువాని చేనుకు కౌలు వేలం కొనసాగుతుందన్నారు. వేలంలో పాల్గొనే రైతులు రూ.50 వేలు డిపాజిట్ ఆలయ ఈఓ పేరు మీద డీడీ తీసి ఇవ్వాలని, ఆధార్ కార్డుతో పాటు ఏదైన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రెండు చెక్కులు సమర్పించాలని కోరారు. పాత బకాయిలు ఉన్న రైతులు, ఇతర బకాయిలు ఉన్న రైతులు వేలం పాటలో పాల్గొనడానికి అనర్హులుగా పేర్కొన్నారు. వివరాలకు 94404 54656, 88867 61196 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడి
కొత్తపల్లి: లింగాల్ చేడ్ వాగునుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను కొత్తపల్లి గ్రామ శివారులో ఆపి తనిఖీ చేయగా, టిప్పర్ డ్రైవర్ ఎండీ షరీఫ్ ఆపకుండా ముందుకు వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లి రోడ్డు పక్కకు ఇసుకను అన్లోడ్ చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టిప్పర్ యజమాని ఎండీ మహబూబ్ బాషా, అతని కొడుకు ఖాదర్ వెంటనే అక్కడికి వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులను బూతులు తిడుతూ దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోకల్ మద్దూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని టిప్పర్‌ను, దాడికి పాల్పడిన ముగ్గురిని పట్టుకొని పోలీస్‌ష్టేషన్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఉద్యోగులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూరు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు -
ఎక్కడి పనులు అక్కడే..
● నిలిచిన 167వ నంబరు జాతీయరహదారి విస్తరణ పనులు ● కొలిక్కిరాని మహనీయుల విగ్రహాల తరలింపు ● దుమ్ము, ధూళితో ప్రయాణికులకుఇబ్బందులు జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రధాన చౌరస్తా సిగ్నల్‌గడ్డ వద్ద 167వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా పనులకు ఆటంకంగా మారిన మహనీయుల విగ్రహాల తరలింపు కొలిక్కి రాకపోవటమే సమస్యగా మారింది. దీంతో కాంట్రాక్టర్ అసహనం వ్యక్తం చేస్తుండగా.. ప్రయాణికులు దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్‌గడ్డ వద్ద డా.అంబేడ్కర్, మహాత్యాజ్యోతిరావు పూలే, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలు తొలగించాల్సి ఉంది. అయితే వీటిని మళ్లీ ఎక్కడ ప్రతిష్ఠించాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం మూడుసార్లు సమావేశాలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరడం లేదు. కంకర వేసి.. లయన్స్‌క్లబ్ వద్ద రోడ్డు తవ్వి కంకర వేసి వదిలేశారు. పట్టణంలోకి వెళ్లే వైపు సగం తవ్వి సగం మెటల్ వేశారు. అంబేడ్కర్, పూలే చౌరస్తాలో పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. పూలే విగ్రహం అలాగే ఉంచి మట్టి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట కంకర పర్చి వదిలేశారు. ఆరాధ్య మార్ట్ వైపు సగం తవ్వి విడిచిపెట్టారు. ఇలా ఉన్న కొద్దిపాటి ప్రాంతంలోనే పనులు వదిలి వేయటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వాహనదారులు, పట్టణంలోకి వచ్చి వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విగ్రహాలు తొలగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్ జాతీయ రహదారుల శాఖ అధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ వాల్ నిర్మాణం మాత్రమే జరుగుతుంది. ఇది పూర్తయ్యాక పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే విస్తరణ పనులకు పూర్తిగా బ్రేక్ పడినట్లవుతుంది. ఇప్పటికే మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరింతకాలం సమస్యతో సతమతమవ్వాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఈ విషయమైన ఏం చేయాలో తెలియక జాతీయ రహదారుల శాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. విగ్రహాల తరలింపు సంగతేమిటో.. రోడ్డు విస్తరణ పనులు ముగిసిన తర్వాత ఆ విగ్రహాలను అక్కడే ప్రతిష్ఠించాలని కులసంఘాలు పట్టుబడుతున్నాయి. అందుకు జాతీయ రహదారుల శాఖ ససేమిరా అంటుండటంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్, కొడంగల్ పట్టణాల్లో జాతీయ రహదారి సర్కిల్స్‌లోనే డా.అంబేడ్కర్ విగ్రహం ఉండటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. అక్కడ లేని నిబంధనలు ఇక్కడెందుకు అంటూ నిలదీస్తున్నారు. స్పందించని ఎమ్మెల్యే, ఎంపీ విగ్రహాల తరలింపు, పునఃప్రతిష్ఠపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ స్పందించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే పనులు ఆలస్యం కావటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు జోక్యం చేసుకుని అందరి ఆమోదం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు
ఖిల్లాఘనపురం: అర్హత లేకపోయినా కొంతమంది ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రీనివాసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం ఖిల్లాఘనపురం వచ్చిన ఆయన డీఈఎంఓ రవికుమార్‌తో కలిసి గ్రామంలోని ప్రాథమిక చికిత్స కేంద్రాలను పరిశీలించారు. స్థాయికి మించి వైద్యం అందిస్తున్న 9 క్లినిక్‌లను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఎంపీలు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లను ఏర్పాటు చేసుకొని అవగాహన లేని వైద్యం చేస్తూ ఇష్టారీతిగా డబ్బులు లాగుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కమీషన్లకు ఆశ పడి అవసరం లేకపోయినా ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు, ల్యాబ్ టెస్టులకు రిఫర్ చేస్తున్నారన్నారు. అలాంటి ప్రథమ చికిత్స కేంద్రాలు సుశ్రుత క్లినిక్, నరేందర్‌గౌడ్, బాల్‌రాజ్, భాగ్యమ్మ, నరేందర్‌బాబు, శ్రీనివాసులు, నాగేశ్వర్‌రెడ్డి, వెంకటేష్ కు చెందిన మొత్తం 9 క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. ముమ్మరంగా దాడులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు పాన్గల్లో 2, శ్రీరంగాపురంలో 2, పాలెంలో 2, వనపర్తిలో 5, ఖిల్లాఘనపురంలో 9, ఆత్మకూర్‌లో 1, బలిజపల్లిలో 2 మొత్తంగా 23 క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. ఆర్ఎంపీలు అవగాహన లేకుండా ఇచ్చే మందుల వలన ప్రజలకు ప్రాణాపాయం ఏర్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈఎంఓ రవికుమార్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రీనివాసులు ఖిల్లాఘనపురం మండలంలో 9 క్లినిక్‌ల సీజ్ -
పాలమూరుకు అందాలభామలు
ముస్తాబైన పిల్లలమర్రివెయ్యి మంది పోలీసులతో బందోబస్తు మిస్ వరల్డ్–2025 పోటీదారుల పర్యటను సంబంధించి జిల్లా పోలీస్ శాఖ 1,008 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి వరుసలో మహిళ పోలీస్ సిబ్బంది విత్ సఫారీలో ఉండగా, రెండో వరుసలో సివిల్ పోలీస్, మూడో వరుసలో ఏఆర్ పోలీస్ బలగాలను బందోబస్తు కోసం కేటాయించనున్నారు. వీరితో పాటు స్పెషల్ పార్టీ, రాష్ట్రస్థాయి నుంచి బలగాలు పహారా కాస్తాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌ల నుంచి పోలీస్ బలగాలను రప్పించారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 936 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. బందోబస్తును మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించనున్నారు. -
విద్యార్థులను విజయతీరాలకు చేరుస్తాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పేద విద్యార్థులను విజయతీరాలకు చేర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటుచేసిన పయనీర్ కార్యక్రమంలో ఎప్‌సెట్ కోచింగ్ తీసుకుని ర్యాంకులు సాధించిన 114 మంది విద్యార్థులకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేయగా.. కలెక్టర్ విజయేందిర బోయి, పీయూ వీసీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పయనీర్ కార్యక్రమంలో తీసుకున్న ఎంసెట్ కోచింగ్ ద్వారా పేద విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు సైతం టాలెంట్ ఉంటుందని, దాన్ని వినియోగించుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఇక్కడ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా కళాశాల, హాస్టల్ వసతి కల్పించేందుకు జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాల మంజూరయ్యాయని, ఐఐఐటీ కళాశాల, నవోదయ సైతం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ● కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేద విద్యార్థుల ఉన్నతికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు. తన వద్దకు ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా జిల్లాలో విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తారని చెప్పారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. విద్యాభివృద్ధిలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ● పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోడ్పాటుతో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంచి కళాశాలల్లో సీటు లభించే అవకాశం ఉందన్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారిగా ఎదగాలని ఆకాంక్షించారు. పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ఎమ్మెల్యే యెన్నం ఎంతో కృషి చేశారని.. ఇందులో డాటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వంటి మంచి కోర్సులు తీసుకువస్తున్నట్లు వివరించారు. తాజాగా ఐఐఐటీ ఏర్పాటుతో పాలమూరు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందన్నారు. ‘పయనీర్’తో 114 మందికి ఎప్సెట్ర్యాంకులు ర్యాంకర్ల అభినందన సభలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి -
సుందరీమణుల భద్రత అత్యంత కీలకం: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో విధుల్లో ఉండే ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్లో గురువారం పోలీస్ అధికారులకు విధుల కేటాయింపుతో పాటు బ్రీఫింగ్ నిర్వహించారు. 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు పిల్లలమర్రికి వస్తున్న క్రమంలో మూడు అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పర్యటన ఉంటుందని, ఇందులో శ్రీ రాజారాజేశ్వరి ఆలయం, పురాతన మ్యూజియం, పిల్లలమర్రి మహావృక్షం సందర్శిస్తారని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా బందోబస్తు నిర్వహించాలని, ప్రజలకు, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమం కావడం వల్ల జిల్లాకు గర్వకారణం అవుతుందని, సుందరీమణుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, సుదర్శన్, శ్రీనివాసులు, సీఐలు పాల్గొన్నారు. -
ధాన్యం మొలకెత్తింది..
ఐదు ట్రాక్టర్ల ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. 20 రోజులుగా ధాన్యాన్ని కొనడం లేదు. ప్రతి రోజు ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాస్తున్నాను. వర్షానికి తడిసి దాదాపు ఒక ట్రాక్టర్ ధాన్యం మొలకెత్తింది. దీంతో నేను తీవ్రంగా నష్టపోయాను. ఏ అధికారి, ప్రజాప్రతినిధి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంత దారుణం ఎక్కడా లేదు. – సాయిలు, రైతు, కావేరమ్మపేట పట్టించుకునే వారే లేరు.. ఎంతో కష్టపడి పండిచిన ధాన్యాన్ని అమ్ముదామని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే పట్టించుకునే వారే లేరు. కొనుగోలు చేయాలంటూ బతిమాలుతున్నా లాభం లేదు. దాదాపు 50 బస్తాల ధాన్యం కేంద్రానికి తీసుకువచ్చాను. ప్రతి రోజు ఆరబెట్టడం, కుప్పగట్టడం, కుప్ప వద్ద పడుకోవడం తప్పడం లేదు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి. – నర్సింహ, రైతు, కావేరమ్మపేట ● -
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా మీదుకు నారాయణపేట పర్యటన వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ విజయేందిర మొక్కను అందజేసీ స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి మహావృక్షం ఫొటోను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం, డీటీ దేవేందర్, ఆర్ఐలు నర్సింగ్, సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
జడ్చర్ల: ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ గురువారం అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. జడ్చర్ల శివారులోని పత్తి మార్కెట్ యార్డులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి పలు గ్రామాల నుంచి రైతులు ధాన్యం దిగుబడులను తీసుకొచ్చారు. అయితే నిబంధనల మేరకు పూర్తిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార బట్టడం వంటివి చేసి రోజులు గడుస్తున్నా.. ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రైతులు దాదాపు 20 రోజులుగా తమ ధాన్యం కుప్పల వద్దే రేయింబవళ్లు పడిగాపులు గాస్తున్నారు. ప్రతి రోజు ధాన్యాన్ని ఆరబెట్టడంతో పాటు ప్లాస్టిక్ కవర్లు కప్పుకుంటూ వర్షం నుంచి కాపాడుకుంటూ వస్తున్నా సంబంధిత అధికారులు ఎంత మాత్రం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అయినా వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తి నష్టం జరుగుతున్నా కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ● పత్తి మార్కెట్ యార్డు ఎదురుగా 167 నంబర్ జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏ మాత్రం పనిచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా ఇబ్బందు లు పడి ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తే కొను గోలు చేయకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. కనీసం సంబంధిత అధికారులు, పాలకులు జాడలేకుండా పోయారని ఆరోపించారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు ఆందోళన విమరమించేది లేదన్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జయప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారులు, పాలకులతో చర్చిద్దామంటూ రైతులతో ఆందోళన విరమింపజేశారు. జడ్చర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం ఆగ్రహంతో జాతీయ రహదారిపైరాస్తారోకో పట్టించుకునే వారే లేరని రైతన్నలమండిపాటు -
యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు.. తగిన సౌకర్యాలు లేక తిప్పలు
యాదాద్రి భువనగిరి: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండకు వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులకు కొరవడిన రవాణా సౌకర్యంతో పాటు, భద్రతా సిబ్బంది వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో దైవ దర్శనం కోసం భక్తులు యాదాద్రికి పోటెత్తుతున్నారు. దర్శన సమయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఈ సమయంలో భక్తుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి తోడు భక్తుల రద్దీకి తగ్గట్లు రవాణ సౌకర్యం లేదని, దైవదర్శనంలో భక్తులు వాగ్వాదినికి దిగుతున్నా పోలీసు సిబ్బంది పట్టించుకోవడం లేదు.దీనికి తోడు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపడంలో అధికారుల విఫలమవుతున్నట్లు సమాచారం.బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోవాలా దోపిడీ ఎక్కువైందని, తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ట్రాక్టర్ కిందపడి రైతు దుర్మరణం
తిమ్మాజిపేట: ట్రాక్టర్ కొనుగోలు చేసి పది రోజులు కూడా కాకముందే అంతలోనే అనంత లోకాలకు వెళ్లాడు రైతు. ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కిందపడి రైతు మృతి చెందిన సంఘటన తిమ్మాజిపేట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని బావాజిపల్లికి చెందిన బత్తుల బాలస్వామి(48) వ్యవసాయ పనుల కోసం ఇటీవల నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. తన సొంత వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. పొలం దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్ పొలం ఒడ్డు ఎక్కి అదుపుతప్పి బాలస్వామిపై బోల్తాపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దగ్గర పొలంలో ఉన్న రైతు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని జేసీబీతో ట్రాక్టర్‌ను తొలగించగా అప్పటికే మృతి చెందాడు. హుటాహుటిన మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి భార్య రేవతమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమార్తె వివాహం చేశాడు. బాలస్వామి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి నాగర్‌కర్నూల్ క్రైం: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కుమ్మెర శివారులో చోటు చేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలంలోని వసంతాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ (44) భర్త నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో కుమ్మెర శివారులోని కేఎల్ఐ కాల్వ వద్ద మృతి చెంది ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రాములమ్మ మృతి చెంది రెండు రోజులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటం, శరీరంపై బట్టలు సరిగా లేకపోవడంతో ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి మృతురాలి అన్న చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. బావిలో మృతదేహం లభ్యం బిజినేపల్లి: మండలంలోని పాలెం గ్రామానికి చెందిన అయ్యగారి బావిలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు (56) మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు శ్రీనివాసులు కోసం తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా బుధవారం ఉదయం అయ్యగారి బావి సమీప రైతులు బావిలోని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావి నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి పాన్‌గల్: మండల కేంద్రం పాన్గల్లో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఎస్ఐ హిమాబిందు తెలిపిన వివరాల ప్రకారం.. పాన్‌గల్‌కు చెందిన వడ్డె శివయ్య(51) కుటుంబం హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 7న భార్యతో కలిసి స్వగ్రామం పాన్‌గల్‌కు వచ్చారు. అయితే ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లినా శివయ్య కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో బుధవారం గ్రామంలోని వైన్ షాపు సమీపంలో ఉన్న డ్రెయినేజీలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. శివయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. వృద్ధుడి మృతిపై కేసు నమోదు ఉండవెల్లి: మండలంలోని చిన్న ఆముదాలపాడు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి(65) అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య గమనించి అంబులెన్స్‌లో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. -
మద్యం మత్తులో ఎక్కువగా..
హత్యలు చేసే వారి మానసిక స్థితి విభిన్నంగా ఉంటుంది. మద్యం మత్తులో ఎక్కువగా నేరాలకు పాల్పడుతుంటారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెదడులో కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. ఈ సమయంలో వారు ఎవరి మాటను లెక్కచేయరు. తాము చేయాలనుకున్న పనిపైనే దృష్టి పెడుతారు. ఇలాంటి సమయంలోనే హత్యలు చేస్తున్నారు. ఇదే కారణంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. సున్నిత మనసు కలిగిన వారు తమను తాము ఆత్మహత్య చేసుకుంటారు. మిగిలిన వారు అవతలి వ్యక్తులను చంపి ప్రతీకారం తీర్చుకోవడం చేస్తుంటారు. వీరికి సరైన తరహాలో కౌన్సెలింగ్ ఇవ్వడం, ఆలోచన తీరు మార్చడం అవసరం. – డా.అనిల్‌రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రిస్ట్ క్షణికావేశంలోనే.. జిల్లాలో జరిగిన హత్యలు పథకం ప్రకారం జరిగినవి కాదు. కేవలం క్షణికావేశంలో చేయడం జరిగింది. కావేరమ్మపేటలో జరిగిన హత్యకు సంబంధించి ఇంకా నేరస్తులు ఎవరూ అనేది తెలియరాలేదు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు పెరుగుతున్నాయి. పోలీస్ శాఖ నుంచి అవసరమైన కౌన్సెలింగ్ కార్యక్రమాలు చేపడుతాం. క్షణికావేశంలో తప్పులు చేయరాదు. చిన్న పొరపాటుకు జీవితకాలం నష్టపోవాల్సి ఉంటుంది. –వెంకటేశ్వర్లు, డీఎస్పీ ● -
అండర్ –19, 23 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
జడ్చర్ల టౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్ –19, 23 బాలుర క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జట్టు కోసం బుధవారం స్థానిక సేడియం మైదానంలో ఎంపిక నిర్వహించారు. ఎంపికలకు జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 60మంది హాజరయ్యారు. ఎంపిక కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత ప్రారంభించి ప్రసంగించారు. క్రీడాకారులు తమ ప్రతిభను వెలికి తీసి జట్టుకు ఎంపిక కావటంతో పాటు టోర్నీలో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బి.రవిశంకర్, కాల్వరాంరెడ్డి, అశోక్‌యాదవ్, కౌన్సిలర్లు సతీష్, ఉమాశంకర్‌గౌడ్, ఎండీసీఏ పరిశీలకులు మన్నాన్నియర్, కోచ్‌లు మోయిన్, మహేష్‌లు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంటికి కన్నం మహబూబ్‌నగర్ క్రైం: తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని న్యూమోతీనగర్‌కు చెందిన మంజుల కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 10న ఇంటికి తాళం వేసి గ్రామంలో జాతర ఉంటే వెళ్లారు. అయితే బుధవారం ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ ద్వారా మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం ఇవ్వగా బాధితురాలు మంజుల ఇంటికి వచ్చి చూసుకోగా బీరువాలో ఉన్న 16 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టరాదని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి 60మంది హాజరు -
టాటా ఏస్ ఢీ.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
వనపర్తి రూరల్: బైక్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవర గాయాలయ్యాయి. చిమనగుంటపల్లి శివారులోని సద్గురు భజన మండలి ఎదురుగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన మంగళి జమ్మున్న (40) వాయిద్యా కళాకారుడు.గోపాల్పేట మండలం చెన్నూర్ గ్రామంలో పెళ్లి ఉండడంతో మరో మిత్రుడితో కలిసి భజంత్రి వా యించడానికి బైక్‌పై వెళ్లి బుధవారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వనపర్తి మండలం చిమనగుంటపల్లి వద్ద బైక్‌ను టాటా ఏస్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జమ్మున్న అప్పటికే మృతి చెందినట్లు తెలుపగా మరో వ్యక్తి వెంకటేశ్వర్లును కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలయ్య తెలిపారు.బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదుకోస్గి రూరల్: బాలికపై అత్యాచారం చేసిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల్‌రాజ్ బుధవారం తెలిపారు. గుండుమాల్ మండలంలోని బలుబద్రాయపల్లి గ్రామం ఓడ్డుక్రిందితండాకు చెందిన బాలిక (15) ఈ నెల 9న బహిర్భూమికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన సబావత్ విజయ్ కుమార్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి పక్కనే ఉన్న గుట్టలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం ఎరికై నా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అటుగా వెళుతున్న కొందరు దీనిని గమనించి బాలిక తల్లికి విషయాన్ని చెప్పారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చికిత్స పొందుతూమరొకరు మృతి
వెల్దండ: మండలంలోని కొట్ర సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొమ్ముల సాయి(28) వెల్దండలోని యెన్నమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. కారు రోడ్డుపై ఆపిన డీసీఎంను ఢీకొన్న ప్రమాదంలో ఇనుప చువ్వలు గుచ్చుకొని 8 నెలల చిన్నారి తేజశ్రీ అక్కడికక్కడే మృతిచెందగా.. సాయి, ఆయన భార్య శిరీష తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాయి మృతిచెందగా ఆయన భార్య శిరీష ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై సాయి సోదరుడు కొమ్ముల ప్రభాకర్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ కల్వకోలు బాలస్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సాయి, ఆయన కుమార్తె తేజశ్రీ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ముగిసిన బీచుపల్లి అంజన్న బ్రహ్మోత్సవాలు
ఇటిక్యాల: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాలతో ఆంజనేయస్వా మిని ఆలయం నుంచి పల్లకీలో కృష్ణానది వరకు ఊరేగించారు. పవిత్ర కృష్ణానదిలో అర్చకులు వేద మంత్రాలతో బీచుపల్లి రాయుడికి అమృతస్నానం చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో హాజరై ఉత్సవాలు తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి దాసంగాలతో అంజన్నకు మట్టి కుండల్లో నైవేధ్యాలు వండి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్, పాలక మండలి సభ్యులు, అర్చకులు,ఉన్నారు. వైభవంగా కృష్ణానదిలో అమృతస్నానం ప్రత్యేక అలంకరణలో స్వామివారు -
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
ఇటిక్యాల: ఈతకు వెళ్లి బావిలో వ్యక్తి గల్లంతైన సంఘటన ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల గ్రామంలో బుధవారం చోటుకుంది. ఎస్ఐ మురళీ, స్థానికుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా కొంకల్పల్లి గ్రామానికి చెందిన శేషయ్య(55) దేవర నిమిత్తం కోదండాపురం గ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఐదు మంది స్నేహితులతో కలసి వేముల గ్రామంలోని జక్కం బావిలోకి ఈత బుధవారం ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈతలో పోటీ పడుతుండగా ప్రమాదశాత్తు శేషయ్య బావిలో గల్లంతైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో కలసి రెస్కూ టీం సహాయంతో గల్లంతైన వ్యక్తి కోసం బావిలో గాలించినట్లు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో దాదాపు ఐదు గంటల నుంచి ప్రయత్నించిన వ్యక్తి ఆచూకీ లభించనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న శేషయ్య కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. దేవర నిమిత్తం వచ్చి బావిలో వ్యక్తి గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కారులో మంటలు జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట బుధవారం పార్క్ చేసిన కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో ఊపిరీ పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మిడ్జిల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం జడ్చర్లకు వచ్చి మార్కెట్ యార్డు వద్ద కారును పార్క్ చేసి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కారులో నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు మార్కెట్ యార్డు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైతులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
కొత్తకోట రూరల్: ప్రస్తుతం మానవాళిని కబళిస్తున్న జీవనశైలి వ్యాధులను దీటుగా తట్టుకోవాలంటే నాణ్యమైన ఆహారంతో పాటు శారీరక దారుఢ్యం ముఖ్యమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ డా. జె.చీన అన్నారు. పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాల వేదికగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంగళ, బుధవారం జరిగిన క్రీడాపోటీల్లో కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా, ఆదిలాబాద్‌లోని దస్నాపూర్, నల్గొండలోని గడ్డిపల్లి, కొల్లాపూర్‌లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఆటల పోటీలను తప్పనిసరి భాగంగా చేసుకోవాలన్నారు. వ్యక్తిత్వ వికాసం, బృందాలుగా పనిచేయడం, నాయకత్వ లక్షణాలు, ఆలోచన మార్గాల పెంపొందింపు వంటి జీవన వికాస సూత్రాలన్నీ ఫిజికల్ ఫిట్నెస్తోనే ముడిపడి ఉన్నాయన్నారు. అన్ని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాతినిథ్యం ఉందని.. ఇందుకుగాను ఫిట్నెస్ కోచ్‌లు, కావాల్సిన సౌకర్యాలు వర్సిటీ సమకూరుస్తుందని వివరించారు. అనంతరం వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైద య్య, రామగిరి ఖిల్లా ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. బి.నవీన్‌కుమార్, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ నరేష్‌గౌడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. షహనాజ్, పూర్ణిమ మి శ్రా, కో–ఆర్డినేటర్ డా. జి.విద్య, అసిస్టెంట్ ప్రొఫె స ర్లు శ్రీనివాస్, గౌతమి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ మహేష్ పాల్గొన్నారు. -
పిల్లలమర్రి ముస్తాబు
రేపు ప్రపంచ సుందరీమణుల రాక వివరాలు 8లో u● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి సందర్శన ● మహావృక్షం ఖ్యాతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఏర్పాట్లు ● విజయనగరం కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు ● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు ● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు, బోనాల ప్రదర్శన ● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట ● సుమారు వెయ్యి మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్‌రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను నియమించారు. గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన.. మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఏర్పాట్లు ఇలా.. -
ఇంట్రా టోర్నమెంట్లో ప్రతిభచాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో మంగళవారం ఇంట్రా టోర్నమెంట్లో పాల్గొనే అండర్– 19, 23 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ రెండు విభాగాలకు సంబంధించి దాదాపు 70 మందికిపైగా హాజరుకాగా.. క్రీడాకారులకు బౌలింగ్, బ్యాటింగ్ అంశాల్లో పరీక్షించి ఎంపికలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఈసారి వేసవి ఉచిత శిక్షణ శిబిరాల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేటల జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు ఇదొక సువర్ణ అవకాశం అని, క్రీడాకారులు టోర్నమెంట్లో తమ వ్యక్తిగత ప్రదర్శన చాటుకోవాలని కోరారు. ఈ టోర్నమెంట్లలో రాణించే క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్లు, రాబోయే హెచ్‌సీఏ టోర్నమెంట్లకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ముఖ్తార్‌అలీ పాల్గొన్నారు. ఎంపికై ంది వీరే.. పి.రామాచారి, కనిష్క్గౌడ్, శేఖర్, దినేష్, లోకేష్, రాఫే, అంకిత్‌రాయ్, అభినవ్, అభిషేక్, ప్రణయ్, ప్రవీణ్, శ్రీకాంత్, పవన్, సోను, నవీన్, అభినవ్తేజ, శివ కేశవ్ ఎంపికయ్యారు. అలాగే అండర్– 23లో తరుణ్, అబ్దుల్ రాఫే, అక్షయ్, గణేష్, శ్రీకాంత్‌నాయక్, షాదాబ్, ఎండి.అదిబ్, సయ్యద్ ఇమ్రాన్, వివేక్. కె.శ్రీకాంత్, రయ్యాన్, వంశీ, శషాంక్, అంజనీశ్వర్, ముఖిత్, ఎండీ ఇమ్రాన్ ఉన్నారు. -
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
15 వేల బస్తాల వరిధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం భారీ ఎత్తున వరిధాన్యం వచ్చింది. ఆర్ఎన్ఆర్ 9,136 బస్తాలు, ఇతర సీడ్ (1010) 4,176 బస్తాల ధాన్యం వచ్చిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. కాగా దీనికి గాను ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,296, కనిష్టంగా రూ.1,911, ఇతర సీడ్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,220, కనిష్టంగా రూ.1,712 ధర లభించింది. వరి ధాన్యం ఎక్కువగా రావడంతో వారంలో రెండు రోజులు టెండర్లు వేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ లింగం వివరించారు. సొంతింటి కల నెరవేర్చుకోండి నవాబుపేట: ‘ఏంటమ్మా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుంది.. ఇల్లు కుదురుగా కట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకోండి.. పెద్దగా కట్టుకునేందుకు పోయి అప్పుల పాలుకావొద్దు’ అని కలెక్టర్ విజయేందిర ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూచించారు. బుధవారం ఆమె మండలంలోని దేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారు అలివేలుతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలతోనే పూర్తి చేసుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నమూనాను రూపొందించిందని వివరించారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకుంటే త్వరగానే బిల్లులు వస్తాయని చెప్పారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ్ కలెక్టర్ దృష్టికి తేగా.. సమస్యను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణం ప్రారంభించని వారికి మరో మూడు రోజులే గడువు ఉందని, ఆలోగా పనులు చేపట్టాలని, లేకపోతే రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామన్నారు. కాగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దేపల్లిని మోడల్ గ్రామంగా ప్రకటించి 93 ఇళ్లను మంజూరు చేయించారు. ఇందులో 25 ఇళ్లు బేస్మెంట్ పూర్తి చేసుకుని గోడల దశలో ఉండగా.. మరో 15 ఇళ్లు పునాదుల దశలో ఉన్నాయి. అనంతరం కలెక్టర్ చౌడూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తేమను చూసి గన్నీ బ్యాగులు, లారీల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయరాంనాయక్, ఈఓపీఆర్డీ బద్రునాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వెంకటేష్‌గౌడ్, రాములు, రాజు, అమరేష్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ●ఏర్పాట్లు పూర్తిచేశాం.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్‌లర్ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సెమిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్టర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రాయనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించారు. మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండుసార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభం 47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వంగూరు/మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా సీఎం స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి.. సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో దాదాపు రూ. 50కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ, మిషన్ భగీరథ అధికారులు అభివృద్ధి పనులను పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలం హైవే నుంచి గ్రామం వరకు నాలుగు లెన్ల రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైయినేజీ, సీసీరోడ్లు, సోలార్ విద్యుత్ సౌకర్యం తదితర పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా హెలీప్యాడ్ సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం సభా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామపెద్ద జలంధర్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బోరుబావులు, సౌరశక్తి పలకల ఏర్పా ట్లు, పండ్ల మొక్కల నాటడం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారిగా నల్లమలకు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పా టు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వారి వెంట వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, డీఈ నాగలక్ష్మి, పంచాయతీరాజ్ డీఈ చంద్రకళ, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, తహసీల్దార్ శైలేంద్ర, ఎంపీడీఓలు వెంకటయ్య, జగదీశ్ తదితరులు ఉన్నారు. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
పాలమూరు: జిల్లాలో ఈ ఏడాది మార్చి 8న నిర్వహించిన లోక్ అదాలత్‌లో 17,431 కేసులు రాజీ చేశామని, అలాగే వచ్చే నెల 14న నిర్వహించే లోక్ అదాలత్‌లో ఇంకా ఎక్కువ స్థాయిలో కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కోసం మహబూబ్‌నగర్ కోర్టులో ఆరు బెంచీలు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోక్ అదాలత్ కోసం ఇప్పటికే కొంత మంది కక్ష్యిదారులను గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతోపాటు ఇతరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రధానంగా పోలీస్ శాఖ కేసులు అధికంగా రాజీ అయ్యేలా కీలక పాత్ర పోషిస్తుందని, కోర్టుకు పోలీసులు బాగా సహకరిస్తున్నారని చెప్పారు. రాబోయే లోక్ అదాలత్‌లో అధికంగా కేసులు రాజీ కావడానికి పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టాలని కోరారు. ఫ్రీ లిటిగేషన్ కేసులు, క్రిమినల్, విద్యుత్, భూ పంచాయితీ, రోడ్డు ప్రమాద కేసులు, వివాహం కేసులు, బ్యాంకు, సివిల్, క్రిమినల్, ఎంవీఐ యాక్ట్, డ్రంకెన్ డ్రైవ్, చెక్ బౌన్స్ ఇలా రాజీ కావడానికి అవకాశం ఉన్న ప్రతి కేసును లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర తదితరులు పాల్గొన్నారు. ● జూన్ 14న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా బుధవారం జిల్లా కోర్టులో న్యాయమూర్తి పాపిరెడ్డి బ్యాంకుల మేనేజర్స్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. బ్యాంకు కేసుల సెటిల్మెంట్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులపై చర్చించారు. ఈసారి నిర్వహించే లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని, కక్ష్యిదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగిరం చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంపై ఎంఎస్ఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన వెబెక్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనవి ఎన్ని.. బేస్మెంట్ లెవెల్ నిర్మాణం ఎన్ని పూర్తి చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్లికేషన్ లెవెల్లో ఉన్నవి పరిశీలించాలని, రేషన్ కార్డులు లేనివి, కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ మంజూరైతే పరిశీలించి తీసివేయాలని, రెండో విడత అప్లికేషన్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి అప్రూవ్ చేసిన వాటిని ప్రొసీడింగ్స్ ఇచ్చి మంజూరు చేస్తామన్నారు. వర్షాకాలం రాక ముందే ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. రెడ్ ఫ్లాగ్ ఉన్న అప్లికేషన్లను శుక్రవారంలోగా మళ్లీ పరిశీలించి అప్రూవల్ కోసం పంపించాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల సమస్య ఉంటే అలాంటి వారికి ఐకేపీ లేదా శ్రీనిధి ద్వారా రుణాలు ఇప్పించాలని, ఒకవేళ అర్హులైన వారు ఇల్లు కట్టుకునేందుకు నిరాకరిస్తే వారి నుంచి లెటర్ తీసుకుని రద్దు చేయాలని సూచించారు. మెటీరియల్ చార్జెస్, మేసీ్త్రకి ఇవ్వాల్సిన డబ్బులను సైతం పరిశీలించాలని, ఇసుక పంపిణీ గురించి తహసీల్దార్లను సంప్రదించాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, అప్లికేషన్ సరిగా ఉంటే సిబిల్ స్కోరు వివరాలు పరిశీలించేందుకు బ్యాంక్ మేనేజర్లకు ఎన్ని అప్లికేషన్లను పంపించారని ఆరా తీశారు. అసలైన లబ్ధిదారులు ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులకు అప్లికేషన్ల వివరాలను వారితో కలిసి వెరిఫై చేయాలని, లబ్ధిదారులకు లోన్ మంజూరు కోసం నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, హౌసింగ్ పీడీ భాస్కర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శంకరాచారి, డీవైఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలమర్రిలోపకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 16న పిల్లలమర్రికి ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొననున్న పోటీదారులు రానుండటంతో పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లలమర్రి సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్ విజయేందిర ఎస్పీ జానకితో కలిసి మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. పురావస్తు మ్యూజియం, పిల్లలమర్రి వృక్షం, దేవాలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పంట కాల్వలను పరిశీలించిన అధికారులు
అయిజ: పంట కాల్వలతో పొలం మునిగిపోతుందని, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని రైతు అనంతరెడ్డి గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. విచారణ చేపట్టేందుకు మంగళవారం లోకాయుక్త దర్యాప్తు అధికారి మాథ్యూ కోశీ, నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఎస్ఈ రహముద్దీన్ తూంకుంటకు చేరుకున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామ సమీపంలో నిర్మించిన 106 ప్యాకేజీ కాల్వలను పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల పొలాల రైతులను విచారించారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ఫీటు కాల్వలను రైతులు పూడ్చివేయడంతో సమస్య ఏర్పడిందని.. బాధితుడు తమ పొలంలోని కాల్వకు ఇరువైపులా ఉన్న కట్టలను చదును చేయడంతో సమస్య మరింత జఠిలమైందని నిర్ధారణకు వచ్చారు. మైనర్ కాల్వను ముందుకు కొనసాగించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఇందుకు రైతులు సంతకాలు చేసి నెట్టెంపాడు ప్రాజెక్ట్ అధికారులకు ఇవ్వాలని ఎస్ఈ రహముద్దీన్ సూచించారు. విచారణ అంశాలను లోకాయుక్తకు అందజేస్తానని దర్యాప్తు అధికారి మాథ్యూ కోశీ పేర్కొన్నారు. -
తల్లి ఒడిలోనే ప్రాణాలొదిలింది
వెల్దండ: తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లిపోయింది. ప్రమాదంలో తల్లిదండ్రులు సైతం తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కొట్రగేట్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. తెలకపల్లి మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన కోమల సాయి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటూ కారు క్యాబ్ డ్రైవర్ జీవనం సాగిస్తున్నారు. అయితే లింగాల మండలం అంబటిపల్లిలో బంధువుల వివాహం ఉండటంతో కారులో సాయితోపాటు భార్య శిరిష, వీరి కూతురు తేజశ్రీ (8నెలలు)తో కలిసి మంగళవారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో వెల్దండ సమీపంలోని వీజేఆర్ హోటల్ వద్ద కల్వకుర్తి వైపు ఇనుప సీకులు (చువ్వలు)తో వెళ్తున్న డీసీఎం ఎలాంటి సిగ్నల్ లేకుండా రోడ్డుపై నిలిపాడు. వెనుక నుంచి వచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టడంతో అందులోని ఇనుప సీకులు చిన్నారి తలలోకి గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అలాగే భార్యాభర్తలు శిరీష, సాయి చాతీ భాగంలోకి ఇనుప చువ్వలు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని యెన్నమ్స్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కారు, డీసీఎం ఢీ.. ఇనుప సీకులు గుచ్చుకొని చిన్నారి మృతితల్లిదండ్రుల పరిస్థితి విషమం -
తపాలా సేవలు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు
వనపర్తిటౌన్: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించింది. ప్రతి జిల్లాలో కలెక్టరేట్ పరిధి ఆ జిల్లా వరకే పరిమితమై ఉంటుంది. కానీ తపాలా శాఖ అందుకు భిన్నంగా ఉండటంతో ప్రజలకు రవాణ కష్టాలు, వ్యయప్రయాసలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఐఏఎస్ క్యాడర్ అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉన్నా తపాలా శాఖ మాత్రం యధాతథంగానే కొనసాగుతుంది. వనపర్తి తపాలా ప్రధాన కార్యాలయం పరిధి నాలుగు జిల్లాల్లో విస్తరించి హైదరాబాద్ చేరువ వరకు సేవలందిస్తోంది. నాలుగు జిల్లాలకు వనపర్తి కేంద్ర కార్యాలయంగా సేవలు అందిస్తోంది. వనపర్తి జిల్లాతో పాటుగా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 20 మండలాలతో పాటు మిగతా నాలుగు జిల్లాలకు వనపర్తి కేంద్రంగా తపాలా సేవలు అందుతున్నాయి. జిల్లాల పునర్విభజన కంటే ముందు ప్రతి జిల్లాలో రెండు ప్రధాన తపాలా కార్యాలయాలను ఏర్పాటు చేఽశారు. అందులో భాగంగానే అప్పట్లో ఒకటి వనపర్తిలో ఉంటే, మరొకటి మహబూబ్‌నగర్‌లో ఉండేది. ఈ రెండు కార్యాలయాల ద్వారానే అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా అంతటా రంగారెడ్డి ప్రాంతంలోని పలు ప్రాంతాల దాకా తపాల శాఖ తన సేవలను అందించేది. పరిధి 200 కిలోమీటర్లు వనపర్తి జిల్లా పరిధి 30 కిలోమీటర్ల లోపు ఉంటే తపాలా పరిధి సుమారు 200 కిలోమీటర్ల వరకు ఉంది. శ్రీశైలం డ్యాం చివరి డెడ్‌లైన్ వరకు చేవేళ్ల దాకా ఉంది. ఈ తపాలా పరిధిలో సేవింగ్, ఆర్డీ, ఎస్ఎస్ఏ, ఎంఐఎస్, పీపీఎఫ్ ఇలా తదితర ఖాతాలు కలిపి 371,107 మంది వినియోగదారులు ఉన్నారు. ఇందుకు గాను 398 బ్రాంచి పోస్టాఫీసులు, 38 సబ్ పోస్టాఫీస్‌లో కలిపి సుమారుగా 600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మా పరిధి నాలుగు జిల్లాలే.. వనపర్తి జిల్లాతో పాటుగా వనపర్తి తపాలా కార్యాలయం మిగతా మూడు జిల్లాలోనూ సేవలు అందిస్తోంది. జడ్చర్లలోని ఏఎస్పీ, సబ్ డివిజనల్ ఆఫీసర్లు వారి సమీపంలోని కార్యాలయాలను పర్యవేక్షిస్తారు. నేను మా పరిధిలోని కార్యాలయాలంటినీ తరచుగా విజిట్ చేసి వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం. కార్యాలయాల పరిధిని కుదిస్తే ప్రజలకు సత్వర సేవలు అందించవచ్చు. – భూమన్న, వనపర్తి తపాలా అధికారి 2016 నుంచి మారిన సీన్ 2016 అక్టోబర్ 11వ తేదీన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలతో కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే తపాలా కార్యాలయం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో విభజించిన జిల్లాలకు అనుగుణంగా తపాలా కార్యాలయం పరిధిని మార్చలేదు. ఫలితంగా తపాలా కార్యాలయం పరిధి అలాగే కొనసాగుతుంది. విభజించిన జిల్లాలకు కలెక్టర్లను కేటాయిస్తున్నప్పుడు తపాలాను జిల్లాకు అనుగుణంగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. జిల్లాలు ఏర్పాటు అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో తపాలా ప్రధాన కార్యాలయాల పరిధిలో మార్పు కనిపించలేదు. ఇంతకు ముందు రెండు ప్రధాన తపాలా కార్యాలయాల పరిధిలో ఒక జిల్లా కలెక్టర్ ఉంటే ప్రస్తుతం నాలుగు జిల్లాల కలెక్టర్ల పరిధిలో వనపర్తి ప్రధాన తపాలా కార్యాలయం కొనసాగుతుండటం గమనార్హం. వనపర్తిలో విధులు నిర్వర్తించే ప్రధాన పోస్టల్ సూపరిండెంట్‌కు ఏ జిల్లాలో కలెక్టర్ మీటింగ్ పెడితే అక్కడకు పరుగెత్తాల్సి వస్తోంది. ఈ క్రమంలో అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు మారినప్పుడు మర్యాద పూర్వకంగా కలిసేందుకు, సమీక్షలకు హాజరయ్యేందుకు అన్ని జిల్లాలకు వెళ్లాల్సిందే. ఒకవేళ తపాలా ఉన్నతాధికారుల విజిట్ వల్ల హాజరు కాకపోతే మరుసటి రోజు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తప్పని భారం వనపర్తి తపాలా పరిధి నాలుగు జిల్లాలలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అధికారుల్లోనూ ఒత్తిడి నెలకొంది. ఏదైనా తీరని సమస్యను పరిష్కరించుకునేందుకు ఇన్సూరెన్స్ క్లెయి మ్స్ విషయంలో తేడాలు ఇలా ఏ సమస్య ఎదురైన ప్రజలు వనపర్తి ప్రధాన కార్యాలయానికి రావడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో అధికారులు అందుబాటులో ఉండటకపోవడం, మరుసటి రోజు వరకు నిరీక్షణ చేయాల్సి వస్తుంది. రంగారెడ్డి, అమ్రాబాద్, బాల్నగర్లతో పాటుగా ఇతర జిల్లాలలోని మండలాల ప్రజలు వనపర్తికి వచ్చేందుకు జంకుతున్నారు. ప్రస్తుత జిల్లాలకు అనుగుణంగా తపాలా శాఖ సేవలను విస్తరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు కలెక్టరేట్ల పరిధిలోకి వనపర్తి తపాలా కార్యాలయం జిల్లాలు ఏర్పడి తొమ్మిదేళ్లు కావొస్తున్న పరిస్థితిలో రాని మార్పు ప్రభుత్వం అభ్యర్థిస్తేనే మిగతా జిల్లాలకు ప్రయోజనం -
జీనుగరాల పెద్దగుట్టపై.. మధ్యయుగం నాటి రాతి చిత్రాలు
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగరాల గ్రామంలోని పెద్దగుట్టపై తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన అన్వేషణలో 11వ శతాబ్దానికి చెందిన కొత్త రాతి చిత్రాలు వెలుగు చూశాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ కొత్త చరిత్ర బృందం సభ్యులు కావలి చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జీనుగరాల పెద్దగుట్టపై జరిపిన అన్వేషణలో రాతిపై ఎర్రటి రంగులో చిత్రించిన చిత్రాలు బయటపడ్డాయి. ఇందులో కింది నుంచి పైకి ఒక రథంలా కనిపించే ఎరుపు గీతలలో మనిషి ఆకారం చతురస్రాకారంలో కనిపిస్తుంది. అలాగే తాబేలు, పక్కన నిచ్చెన వంటి నిలువు గీతలు ఉన్నాయి. వాటి చిత్రాలను తీసి చరిత్ర బృందం రాతి చిత్రాల నిపుణులు మురళీధర్‌రెడ్డి, కొత్త చిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌కు పంపించారు. వారు వీటిని పరిశీలించి చారిత్రక కాలానికి మధ్యయుగం నాటి రాతి చిత్రాలుగా గుర్తించారని చంద్రకాంత్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బొమ్మ లోపల బొమ్మల వలె ఒక మనిషి నిలువ బొమ్మలో ఇవన్నీ గీసినట్లు కనిపిస్తుంది. ఇవి ప్రత్యేకంగా స్థానిక ప్రజలలో ఒకవర్గం వారి పూజాస్థానం అనిపిస్తుంది. ఈ రాతి చిత్రాల పరిసరాల్లో పురాతన మానవుల సమాధులు, ఆవాసాల జాడలున్నాయి. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అన్వేషిస్తే మరిన్ని చరిత్ర పూర్వయుగ సంస్కృతులు తెలిసే అవకాశం ఉందని చంద్రకాంత్ తెలిపారు. -
కొనసాగుతున్న అంజన్న బ్రహ్మోత్సవాలు
ఇటిక్యాల: ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు మంగళవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం, చౌకిసేవ, బలిహరణం తదితర పూజలు చేశారు. రాత్రి ప్రభోత్సవం కనులపండువగా సాగింది. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మట్టి కుండల్లో ప్రత్యేక నైవేద్యం తయారుచేసి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పలువురు భక్తులు ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన దుకాణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. ఏటా మే నెలలో నాలుగు శనివారాల పాటు జాతర ఘనంగా నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుగండా ఆలయ ఈఓ రామన్‌గౌడ్, పాలకమండలి సభ్యులు అన్ని వసతులు కల్పించారు. -
గంజాయి విక్రేత అరెస్టు
● 680 గ్రాముల గంజాయి స్వాధీనం గద్వాల క్రైం: గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివ రాలు వెల్లడించారు. గద్వాల పట్టణం చింతలపేట కాలనీకి చెందిన బషీర్ కొన్ని రోజుల నుంచి హై దరాబాద్(దూల్‌పేట), మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా గంజాయి కొనుగోలు చేసి పట్టణంలోని కార్మికులకు 1 గ్రాము రూ.500 చొప్పున్న విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచి ఆరా తీయగా గద్వాలకు చెందిన యువకుడిగా తెలిసిందన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గంజాయి విక్రయించేందుకు రాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 680 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోగా, దాని విలువు రూ.27వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి అలంపూర్ కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్‌గా పనిచే స్తూ అక్రమంగా డబ్బులు సంపదించాలనే అత్యాశతో నిషేధిత మత్తు పదార్ధాల దందాకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సవరన్న, సిబ్బంది కిరణ్, చంద్రయ్య, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడి దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: లారీ ఢీకొట్టడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వన్‌టౌన్ ఎస్ఐ శీనయ్య తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్టకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహ్మద్ అబ్దుల్ రఫీక్ (52) మంగళవారం సాయంత్రం జేపీఎన్సీఈలో శిక్షణ ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వన్‌టౌన్ చౌరస్తాలో బైక్‌ను రాయచూర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రఫీక్‌కు తీవ్రగాయాలై స్పాట్లోనే మరణించాడు. మృతుడి భార్య నహీద బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మున్సిపల్ కార్మికుడి బలవన్మరణం జడ్చర్ల/జడ్చర్ల టౌన్: ఓవైపు అప్పులబాధ, మరోవైపు అనారోగ్య సమస్యలతో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. జడ్చర్ల వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు (38) స్థానిక మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. చేసిన అప్పులను తీర్చేందుకు గాను ఇటీవల మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఫైనా న్స్లో రూ. 4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతినెలా కిస్తీ కట్టాల్సి ఉండగా.. మొదటి నెల మాత్రమే కట్టాడు. తర్వాత అతడు అనారోగ్యానికి గురికావడంతో తర్వాతి కిస్తీలు కట్టలేకపోయాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ వారి నుంచి ఒత్తి డి రావడంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడాయి. వీటితో మానసిక ఆందోళనకు గురైన అతడు.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మాధురి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం మున్సిపాలిటీ తరఫున రూ. 30వేలు అందజేశారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి నాగర్‌కర్నూల్ క్రైం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన ఉపేందర్ (23) హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. అతడు మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని లాడ్జీలో రూం అద్దెకు తీసుకొని అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహం లభ్యం అచ్చంపేట రూరల్: మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలోని పీర్లబావిలో మంగళవారం గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైంది. విధుల్లో భాగంగా పంచాయతీ కార్మికుడు పరమేశ్వర్ బావి దగ్గర చూడగా శవం ఉన్నట్లు గుర్తించి పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుకు సమాచారం ఇచ్చాడు. అతను సిద్దాపూర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు శవాన్ని బయటకు తీశారు. మృతుడు కాఫీ రంగు టీ షర్ట్, సిమెంట్ రంగు ఫార్మల్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. కుడి చేతిపై వి.అనిత 143 అనే టాటూ ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. బస్టాండ్‌లో భారీ చోరీ మాగనూర్ (మక్తల్): మక్తల్ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి వివరాల ప్రకారం.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్‌కు చెందిన ఉప్పరి మహేశ్వరి ఆశ కార్యకర్తగా పని చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం యాదిగిరి జిల్లాలో నివాసముంటున్న చెల్లెలు అవసరం నిమిత్తం సరస్వతి మహిళా సంఘంలో రూ.3.50 లక్షలు లోనుగా తీసుకొని యాదగిరి వెళ్లడానికి మక్తల్ బస్టాండ్‌కు వచ్చారు. రాయచూర్ బస్సు ఎక్కి మాగనూర్ సమీపంలో బ్యాగును చూసుకోగా డబ్బు కనిపించలేదు. వెంటనే మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాళం వేసిన ఇంట్లో దొంగతనం జడ్చర్ల: పట్టణంలోని సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. ఏపీలోని కృష్ణా జిల్లా రాఘవపురానికి చెందిన రామకృష్ణారెడ్డి ఉద్యోగం రీత్యా జడ్చర్లలోని సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 10న కుటుంబసభ్యులతో కలసి సొంతూరుకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలో దాచిన మూడు తులాల బంగారు నగలతో పాటు 20 తలాల వెండి కొంత నగదు చోరీకి గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో మౌంట్‌బాసిల్ విజయదుందుభి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో మహబూబ్‌నగర్ మౌంట్‌బాసిల్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. పాఠశాల విద్యార్థులు ఎన్.సాయిశ్రీచరణ్ 492 మార్కులు సాధించి ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. చేతన్ 484, శ్రీనిత్య 480, వినయ్‌గౌడ్ 478, శివసాయిచరణ్ 477, సాయిచరణ్ 476 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చంద్రకళా వెంకటయ్య మాట్లాడుతూ.. పాఠశాలలో వందశాతం ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అందుకు సహకరించిన తల్లిదండ్రులకు అభినందలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ శిరీష ప్రవీణ్, పూజిత మోహన్‌రెడ్డి, సుశాంత్‌కృష్ణ, ప్రిన్సిపాల్ సోమశేఖర్‌రెడ్డి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 నుంచి 55 మంది వరకు కార్పొరేటర్లను గెలిపించుకోవాలన్నారు. అలాగే గ్రామ వార్డు సభ్యుడు మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల వరకు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. గ్రూపు రాజకీయాలు, పాత, కొత్త అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఏకతాటిపై నడవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిష్టానం సూచించిన విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు గుమ్మడి సాంబయ్య, భాస్కర్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధి జహీర్‌అక్తర్, కార్యదర్శి నయీం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, ఎన్పీ వెంకటేష్, సురేందర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సాయిబాబా, లింగంనాయక్, రాములుయాదవ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశీలన కొనసాగుతోంది..
రాజీవ్‌యువ వికాసం కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులతోపాటు బ్యాంకు అధికారులు సమగ్రంగా దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారు. బ్యాంకుల పరిశీలన పూర్తయిన తర్వాత ఆమోదం పొందిన వాటిని జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తాం. – ఖాజా నిజాం అలీ, బీసీ సంక్షేమ శాఖాధికారి, నాగర్‌కర్నూల్ అర్హులకు అందించాలి.. రాజీవ్ యువవికాసం కింద ఫొటోస్టూడియో ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం జీవనోపాధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి సకాలంలో సబ్సిడీ రుణాలను అందజేయాలి. – రాజశేఖర్, మన్ననూర్, అమ్రాబాద్ మండలం● -
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ నూతన కమిటీని మంగళవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి, కో చైర్మన్లుగా రవికుమార్, నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్లు, నరేందర్, నారాయణయాదవ్, రవీందర్‌గౌడ్, సాయిలుగౌడ్, రామదాసు, వైస్ చైర్మన్లుగా దయానంద, శ్రీనివాస్‌రావు, అనంతప్ప, అదనపు కన్వీనర్‌గా మదన్‌మోహన్‌యాదవ్, డిప్యూటీ కన్వీనర్లుగా చంద్రనాయక్, సుధాకర్‌రెడ్డి, వరప్రసాద్, చంద్రకాంత్, తాయారు, ఫైనాన్స్ సెక్రటరీగా కృష్ణమోహన్, పబ్లిసిటీ సెక్రటరీగా శ్యాంసుందర్‌రెడ్డి, సెక్రటరీలుగా ప్రభాకర్, శ్రీనివాసులు, రామకృష్ణ, గంగార్, జ్ఞానేశ్వర్ ఎన్నికయ్యారు. -
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో మహబూబ్‌నగర్– రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయబద్ధంగా స్నానం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.వచ్చే నెల 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణమహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 17వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇస్తారన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తారన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈ నెల 31 వరకు విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు కేంద్రంలో సంప్రదించాలని ఆయన కోరారు.20న సార్వత్రిక సమ్మెమహబూబ్నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టీఎన్జీఓ భవన సమావేశ మందిరంలో సమ్మె వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. లేబర్ కోడ్లను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం అమలు కోసం కార్మికులు ఈ నెల 20న నిర్వహించే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీ యూ నాయకులు బాలు, దాసు, వెంకటేశ్, వెంకటస్వామి, రాము పాల్గొన్నారు.ఉత్సాహంగా సబ్ జూనియర్ నెట్‌బాల్ సెలక్షన్స్మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో మంగళవారం సబ్ జూనియర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వేర్వురుగా బాల, బాలికల నెట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జనగాంలో ఈనెల 15 నుంచి 18 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్లు ప్రతిభచాటాలని కోరారు. కార్యక్రమంలో ఖాజాఖాన్, అంజద్‌అలీ, షరీఫ్, షకీల్, అక్రం, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.రేపు జాబ్మేళాజెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వివిధ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం గురువారం జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ నిర్మాణ్ ఆర్గనైజేషన్, మన్నాన్ ట్రేడర్స్ భవనంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఫార్మసీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు. -
రాష్ట్రస్థాయి ఉద్యాన పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామంలోని ఉద్యాన కళాశాల వేదికగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మే 13 నుంచి 14 వరకు రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర అంతర్ కళాశాలల ఆటల పోటీలలో కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా, ఆదిలాబాద్‌లోని దస్నాపూర్, నల్గొండలోని గడ్డిపల్లి, కొల్లాపూర్‌లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల టీంలు పాల్గొన్నాయి. పోటీలను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిదిగం సైదయ్య ప్రారంభించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ఇందుకోసమే యూనివర్సిటీలో పరిధిలోని అన్ని కళాశాలల్లో చదువుతో పాటు క్రీడలకు సైతం సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామగిరి ఖిల్లా ఉద్యాన పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి నవీన్ కుమార్, గడ్డిపల్లి గంట గోపాల్ రెడ్డి ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ నరేష్ గౌడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉన్నతాధికారుల దృష్టికి..
బాదేపల్లి యార్డుకు సెలక్షన్ గ్రేడ్ హోదా లభించేలా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత కొన్నేళ్లుగా నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువే లభిస్తుంది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి తగ్గట్టు ఆదాయం వచ్చింది. ఈసారి దిగుబడులు తగ్గినా మార్కెట్లో మంచి ధరలు రావడం ఆదాయానికి కలిసి వచ్చింది. మున్ముందు కూడా ఇదే రీతిలో రైతులకు మంచి ధరలు లభించేలా కృషి చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు కృషిచేస్తాం. – నవీన్‌కుమార్, యార్డు కార్యదర్శి, బాదేపల్లి స్థాయి పెంపునకు కృషి.. బాదేపల్లి యార్డుకు ప్రతి ఏడాది మంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది కూడా రూ.6.98 కోట్ల ఆదాయం లభించింది. యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ఆదాయానికి అనుగుణంగా మార్కెట్ స్థాయిని పెంచేందుకు కృషిచేస్తాం. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సహకారంతో సెలక్షన్ గ్రేడ్ మార్కెట్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – జ్యోతి, మార్కెట్ చైర్పర్సన్, బాదేపల్లి ● -
పిల్లలమర్రిలో ఏర్పాట్ల పరిశీలన
పాలమూరు: జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిని ఈనెల 16న ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్న నేపథ్యంలో సోమవారం ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఏర్పాట్లను పరిశీలించారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం పిల్లలమర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తున్న క్రమంలో భారీ పోలీస్ భద్రతతోపాటు అన్ని రకాల ఏర్పాట్లపై సమీక్షించారు. పురావస్తు మ్యూజియం, పిల్లలమర్రి వృక్షం, ఆలయం వద్ద జరుగుతున్న అన్ని రకాల పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వారి వెంట ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు. -
14న హెచ్‌సీఏ ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఎంపిక
జడ్చర్ల టౌన్: పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో బుధవారం హెచ్‌సీఏ ఆధ్వర్యంలో అండర్–19, 23 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాలుర జట్టును ఎంపిక చేస్తామని జిల్లా క్రికెట్ కార్యదర్శి రాజశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని స్టేడియం మైదానంలో కొనసాగుతున్న క్రికెట్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికలకు జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, షాద్‌నగర్, రాజాపూర్, ఊర్కొండ మండలంలో నివసించే ఔత్సాహికులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రావాలని కోరారు. అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు మోయిన్, మహేష్, వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్, ఫ్లైవాక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందని బోనస్
15 రోజులు గడిచినా జమ కాని రూ.500 ప్రోత్సాహకం ●● ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు కాని నిధులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.11.36 కోట్లు పెండింగ్ ● ఉన్నతాధికారుల మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ● సన్నరకం వరి రైతులకు తప్పని ఎదురుచూపులు అధికారులు కూడా తెలియదంటున్నారు 50 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. ధాన్యం వేసి 25 రోజులు అవుతుంది. ఇంత వరకు బోనస్‌కు సంబందించి రూ.25 వేలు రావాల్సింది. బోనస్ డబ్బులు ఎప్పుడు వేస్తారని అధికారులను సంప్రదిస్తే.. తమకు తెలియదని సమాధానమిచ్చారు. అసలు బోనస్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – చెన్నప్ప, రైతు, కన్మనూర్, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా 15 రోజులైనా రాలేదు.. నాకున్న నాలుగు ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశాను. మొత్తం 118 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. ధాన్యం విక్రయించి ఇప్పటికే 15 రోజులైనా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రాలేదు. – బూషయ్య, రైతు, లట్టుపల్లి, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా ఒకట్రెండు రోజుల్లో బోనస్ డబ్బులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల నుంచి 59,785 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో రూ.8.88 కోట్లు బోనస్ డబ్బులు కూడా జమ చేస్తాం. మద్దతు ధరతో ప్రతిఒక్క గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు. డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ చేస్తాం. – రవినాయక్, మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ, మహబూబ్‌నగర్ సాక్షి, నాగర్‌కర్నూల్: వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో అత్యధిక మంది సన్నాల సాగుకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున సన్నరకం ధాన్యం వస్తోంది. అయితే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి వారం, పది రోజులు గడుస్తున్నా బోనస్ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2.28 లక్షల క్వింటాళ్ల సన్నాలు సేకరించగా ఇందుకు సంబంధించి రూ.11.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. పెరిగిన సన్నాల సాగు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. అయితే ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్లోనూ రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 1.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో ఏకంగా 86,369 మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇప్పటి వరకు దొడ్డు రకం కంటే.. సన్నాలే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే కేవలం రెండు రోజుల్లోనే రైతులకు పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు పడుతాయని అధికారులు చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. కనీస మద్ధతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమయ్యేందుకు కనీసం వారం రోజులు పడుతుండగా, రూ.500 చొప్పున ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు 15 రోజులు దాటినా పడటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్ డబ్బులు ఖాతాల్లో జమచేయాలని వేడుకుంటున్నారు. జిల్లా కేంద్రాలు సేకరించిన రావాల్సిన సన్న రకం ధాన్యం బోనస్ (క్వింటాళ్లు) (రూ.కోట్లు) నారాయణపేట 101 86,369 4.31 మహబూబ్‌నగర్ 193 59,785 2.98 వనపర్తి 255 53,998 2.69 నాగర్‌కర్నూల్ 231 15,321 0.76 జోగుళాంబ గద్వాల 75 12,542 0.62 15 రోజులు గడిచినా.. వాస్తవానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూశాక నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు కనీసం వారం రోజుల సమయం పడుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులైనా బోనస్ డబ్బులు మాత్రం పడటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ అమలు చేస్తుందా.. లేదా.. అని అయోమయానికి గురవుతున్నారు. -
బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి క్షేత్రంలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాది భక్తజనం పాల్గొనగా.. బీచుపల్లి క్షేత్రమంతా అంజన్న నామస్మరణతో మార్మోగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అభయాంజనేయస్వామిని ప్రత్యేకంగా అలంకరించి.. పంచామృతాభిషేకం, వ్యాసపూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన సీతారాముల కల్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రథంగా హోమం, రాత్రికి కుంభం పూజలు చేశారు. అనంతరం వేలాది భక్తజనం నడుమ అంజన్న రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతకుముందు దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. అభయాంజనేయస్వామి దర్శనానికి బారులు దీరారు. పలువురు భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్స వాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో మి ఠాయి, బొమ్మలు, గాజుల దుకాణాలు సందడిగా కనిపించాయి. కార్యక్రమంలో ఆలయ ఇఓ రా మన్గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వైభవంగా అభయాంజనేయస్వామి రథోత్సవం మార్మోగిన అంజన్న నామస్మరణ వేలాదిగా తరలివచ్చిన భక్తజనం -
మరో రెండింటిలోనూ స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను గత ఏప్రిల్ 10న పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించగా.. అందులో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్న విషయం విదితమే. అయితే రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభమైన స్లాట్ బుకింగ్ సేవలను జిల్లా స్టాంఫ్స్, రిజిస్ట్రేషన్ల అఽధికారి వి.రవీందర్ పరిశీలించారు. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా స్లాట్ బుకింగ్ సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా వచ్చే అమ్మకపు, కొనుగోలు దారులకు కార్యాలయాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలకు ఐదు వాక్ఇన్ రిజిస్ట్రేషన్లుగా సాయంత్రం 5నుంచి 6గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నందున, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
గోడ కూలి వ్యక్తి మృతి
గట్టు: మండల పరిధిలోని బల్గెర గ్రామంలో ఇంటి నిర్మాణంలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న గోడ కూలి పోవడంతో సంక ఏబేలు (38) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. బల్గెరకు చెందిన సంక ఏబేలు అదే గ్రామానికి చెందిన బోయ నర్సింహులుకు చెందిన ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. పాత గోడపై కొత్తగా ఇటుక పెల్లతో నిర్మాణం చేస్తున్న క్రమంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఏబేలు (38) తీవ్రంగా గాయపడగా అయిజలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య సువార్తమ్మతో పాటుగా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుని తండ్రి సంక దేవదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. అనుమానాస్పదంగావ్యక్తి మృతి అచ్చంపేట రూరల్: అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొత్తతాండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఐనోల్ గ్రామం కొత్తతాండకు చెందిన మాయని శ్రీశైలం (36) శ్రీశైలం మద్దిమడుగు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవించేవాడు. మద్యానికి బానిస కావడంతో మొదటి భార్య రజిత విడిగా ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం మద్దిమడుగుకు చెందిన విజయలక్ష్మిని రెండో వివాహం చేసుకోగా వీరికి ఐదు నెలల పాప ఉంది. ఈనెల 11న శ్రీశైలం తల్లి వెంకటమ్మ కుమారుడి ఇంటికి వెళ్లింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచింది. ఇంటి తలుపు పగులగొట్టి చూడగా శ్రీశైలం తీవ్ర రక్తగాయాలతో చనిపోయి ఉన్నాడు. భార్య కూడా కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. ధని యాప్ పేరుతో రూ.4.12 లక్షల మోసం ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల గ్రామానికి చెందిన కుర్వ మహేష్ ధని యాప్ పేరిట ఆన్లైన్లో 4 విడతల్లో అకౌంట్లోకి రూ.4,12,884 నగదు పంపించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలుగోట్ల గ్రామానికి చెందిన కుర్వ మహేష్‌కు ఫేస్బుక్లో మార్చి 31న ఆన్లైన్లో ధని యాప్ ద్వారా లోన్ ఇస్తామని రావడంతో వెంటనే క్లిక్ చేశారు. అదే యాప్ ద్వారా ఏప్రిల్ 1న మరొక వ్యక్తి ఫోన్ చేసి లోన్ ప్రాసెస్ గురించి వివరించాడు. దీంతో ప్రాసెసింగ్ ఫీజు కింద ఒకసారి రూ.2 వేలు, మరోసారి రూ. 10 వేలను ఆన్లైన్లో చెల్లించాడు. ఏప్రిల్ 3న మరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి ఎంత భూమి ఉందని అడగడంతో 2 ఎకరాలు ఉందని మహేష్ తెలిపాడు. దీంతో అపరిచిత వ్యక్తి రూ.80 లక్షల లోన్ వస్తుందని, రిజిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించాలని తెలపడంతో మొత్తం రూ.26,789 నగదును ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు వెల్లడించారు. అలా వివిధ అకౌంట్లకు మొత్తం నాలుగు విడుతలలో రూ.4,12,884ను ఆన్లైన్లో చెల్లించాడు. మరుసటి రోజు తనకు కాల్స్ వచ్చిన నంబర్లకు తిరిగి ఫోన్ చేయడంతో స్విచ్ఛాప్ అని రావడంతో.. తాను మోసపోయానని గ్రహించిన మహేష్ ఉండవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్‌క్రైం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. బాధిత కుటుంబీకుల ఆందోళన జడ్చర్ల టౌన్: పట్టణంలోని కావేరమ్మపేటలో విద్యుదాఘాతంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం మృతుల కుటుంబీకులు, గ్రామస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒక్కో కుటుంబానికి రూ. 20లక్షల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా ఈ విషయమై విద్యుత్ అధికారులు, సదరు కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపారు. కాంట్రాక్టర్ ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు రాగా.. కనీసం రూ. 20లక్షల చొప్పున ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీస్‌స్టేషన్‌లో గంటల తరబడి చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులు 167వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఘటనకు కారణమైన లైన్‌మన్ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. విషయాన్ని కొందరు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. అయితే ఎమ్మెల్యే చొరవతో ఒక్కో కుటుంబానికి రూ. 15లక్షలు ఇచ్చేలా కాంట్రాక్టర్, లైన్‌మన్ అంగీకరించారు. అదే విధంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో కుటంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూస్తామన్నారు. దీంతో ఆందోళన విరమించారు. -
‘పచ్చిరొట్ట’తో ప్రయోజనాలు
అలంపూర్: నేలల్లో పోషకాలు పెంచి ఆశించిన దిగుబడి సాధించడానికి రైతులు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. కానీ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట సాగుచేస్తే పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. గతంలో సాగుభూమిలో పశువుల ఎరువులు ఉపయోగించే వారమని, క్రమంగా పశు పోషణ తగ్గడంతో.. ప్రస్తుతం రైతులు రసాయన ఎరువుల వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం ద్వారా నేలల్లో సూక్ష్మ పోషకాలు నశించి, భూములు చౌడు బారి సత్తువ తగ్గిపోతుంది. దీని ప్రభావం పంట దిగుబడులపై పడుతుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, ఉలవ పైర్లును సాగుచేసి నిర్ణీత సమయంలో భూమిలో కలియ దున్నాలన్నారు. ఉపయోగాలు.. లక్షణాలు ● పచ్చిరొట్టతో నేల గుల్లబారి భూమికి నీటిని, పోషకాలను నిల్వ చేసుకోనే శక్తినిస్తోంది. ● పంట వేర్లకు గాలి, నీరు, కావాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు అందుతాయి. ● నేలలో చౌడు, కలుపు మొక్కల ఉధృతిని తగ్గిస్తుంది. ● నేల లోపలి పొరల్లో ఉండే పోషకాలు పై పొరల్లోకి వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది. ● పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయి. వేరు వ్యవస్త వృద్ధి చెందుతుంది. ● నేల కోతను అరికడుతుంది. ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ● పచ్చిరొట్ట మొక్కల వేరు బూడిపెల్లో రైజోబియం పెరిగి ఎక్కువ నత్రజని స్థిరీకరిస్తుంది. యాజమాన్య పద్ధతులు ఉదయజని ఎక్కువగా ఉన్న నేలల్లో పచ్చిరొట్ట పైరుగా జీలుగ మాత్రమే వేయాలి. జీలుగలో చౌడును హరించే శక్తి ఉంది. ఎర్రనేలల్లో, తేలిక నేలల్లో జనుము, అలసంద, పెసర, నల్లరేగడి నేలల్లో జీలుగ, పిల్లి పెసర వేసుకోవచ్చు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే నీటి వసతిని పరిగణలోకి తీసుకోని పచ్చిరొట్ట పెంచడం శ్రేయస్కరం.పచ్చిరొట్ట పంట ఎకరానికి చల్లాల్సిన తయారయ్యే లభించే అనుకులమైన విత్తనాలు పచ్చిరొట్ట నత్రజని నేలలు జనుము 16 కిలోలు 10–15 టన్నులు 16–24 కిలోలు ముంపు నేలలు జీలుగ 12 కిలోలు 8–10 టన్నులు 30–40 కిలోలు చౌడు నేలలు పిల్లి పెసర 8 కిలోలు 4–5 టన్నులు 10–14 కిలోలు నల్లరేగడి నేలలు పెసర 14 కిలోలు 4–5 టన్నులు 10–14 కిలోలు నల్లరేగడి నేలలు అలసంద 16 కిలోలు 4–6 టన్నులు 16–20 కిలోలు తేలిక నేలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పచ్చిరొట్టను కలియదున్నిన తర్వాత 2 వారాల్లో వరి నాట్లు వేస్తారు. అయితే తేలిక నేలల్లో మురుగు నీరు ఎక్కువగా పారే భూముల్లో వారం రోజుల్లో నాట్లు వేసుకోవచ్చు. మురుగు నీరు పోయే అవకాశం లేని భూముల్లో మూడు వారాలు నాట్లు వేయరాదు. ఎందుకంటే పచ్చిరొట్ట భూమిలో కుల్లినప్పుడు తయారయ్యే కొన్ని వాయువులు, ఆమ్లాలు అప్పుడే నాటిన వరి మొక్కకు హాని చేస్తాయి. -
డ్రంకెన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలుశిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా సోమవారం న్యాయమూర్తి జైలుశిక్షతో పాటు జరిమానా విధించారు. రెండు రోజుల కిందట వన్‌టౌన్ పోలీసులు చేసిన డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో ఆనంద్‌చారి, నరేష్ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం కోర్టులో హాజపర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి.నిర్మల ఒక్కొక్కరికి రెండు రోజుల జైలుశిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురిని ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆర్.శశిధర్.. ఒకరికి ఐదు రోజుల జైలుశిక్ష, ఒకరికి రూ.2వేలు, మరో ఇద్దరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా కల్వకుర్తి టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జడ్జి జైలుశిక్షతో పాటు జరిమానా విధించనట్లుగా ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు కూడళ్లలో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించచారు. అందులో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడడంతో వారిని పోలీసులు కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి కావ్య వారిలో వంగూర్ మండలంలోని ఉల్లంపల్లికి చెందిన నాగార్జున, మున్సిపాలిటీలోని తిమ్మరాశిపల్లికి చెందిన నరేందర్‌కు నాలుగు రోజుల జైలుశిక్షతో పాటుగా, ఒక్కొక్కరికి రూ.100 జరిమానా విధించారు. -
భక్తిశ్రద్ధలతో చండీ హోమం
అలంపూర్: పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం చండీ హోమాలు నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జరిగిన చండీ హోమాల్లో 96 మంది భక్తులు పాల్గొనట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ● అలంపూర్ క్షేత్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి పాపిరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి.. స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ సివిల్‌కోర్టు జడ్జి మిథున్ తేజ ఉన్నారు. -
పీయూ కంట్రోలర్‌గా ప్రవీణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా డా.ప్రవీణను నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె ఎగ్జామినేషన్ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా ప్రవీణ బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ కంట్రోలర్‌గా పనిచేసిన రాజ్‌కుమార్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆమెను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అధ్యాపకులు, అధికారులు అభినందనలు తెలిపారు. కొనసాగుతున్న ఐసీ పరీక్షలు.. పీయూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్ 8కు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. పీయూలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. 60మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు. 15 నుంచి డిగ్రీ పరీక్షలు.. పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర గ్రూప్స్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి సెమిస్టర్–2, 4, 6 పరీక్షలు నిర్వహించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ సర్క్యూలర్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 814.1 అడుగులు దోమలపెంట: శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం నాటికి 814.1 అడుగుల వద్ద 36.8198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరగలేదు. కాగా శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.807 టీఎంసీలు నీటి నిల్వలు ఉంటాయి. -
కనులపండువగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మధ్య స్వామివారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. ముందుగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ ఆలయం ముందు గల మైదానంలో పూల అలంకరణతో తయారు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. కల్యాణ తంతులో భాగంగా జీలకర్ర బెల్లం తదితర పూజల అనంతరం అమ్మవారికి మంగళసూత్రధారణ గావించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవతామూర్తులకు పట్టువస్త్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య దేవతామూర్తుల దంపతులు ధగధగా మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకలను కనులారా తిలకించి పునీతులయ్యారు. చాలామంది దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకోవడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు దేవస్థానం తరఫున వారి చేతులకు పసుపు కొమ్మలను ధరింపచేశారు. కల్యాణోత్సవం అనంతరం ఈ దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ మండపం నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలా మంది దేవస్థానంలో కూడా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ఘనంగా గరుడవాహన సేవ శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి స్వామివారి గరుడ వాహన సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన గరుడవాహనంపై స్వామి దంపతులను ఉంచి ఊరేగించారు. గర్బగుడి నుంచి దేవస్థానం ముందున్న కమాన్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తుల హరినామస్మరణ, పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు, కాగడాల వెలుతురులో స్వామివారి సేవ ముందుకు కదిలింది. స్వర్ణాభరణ అలంకరణలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవతా మూర్తులు గరుడవాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ పవిత్రసేవను చూసి భక్తులు తరించారు. స్వామివారి నామస్మరణతో మన్యంకొండ గిరులు మార్మోగాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మన్యంకొండ దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, శంకర్, గోవింద్, ఆంజనేయులు, అలివేలు, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, రవీందర్, రంగయ్య, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం వైభవంగా గరుడవాహన సేవ స్వామివారి నామస్మరణతో మార్మోగిన మన్యంకొండ -
వాగ్దేవీ విద్యార్థుల విజయదుందుభి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు టీజీఎప్‌సెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సాయి దీపిక 741, జవేరియా 1,279, రబ్షా 2,191, తబ్రీజ్ 3,483, శ్రీహరి 5,223, నూరిన్ 5,486, రాజేశ్వరి 5,627, ప్రియాంక 7,052, వైష్ణవి 7,162, సీమ 8,353, నవనీత్ కుమార్‌గౌడ్ 8,391, పవన్‌కల్యాణ్ ే8,613, అనుష్క 8,638, అబేదా 8,684, మౌనిక 8,730, జ్ఞానేశ్వర్ 9,468, యమునా 9,573 ర్యాంకు సాధించారు. వీరితో పాటు 15 వేల ర్యాంకు లోపు 22 మంది విద్యార్థులు 20 వేల ర్యాంకు లోపు 29 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి ఐఐటి నీట్ అకాడమీ ఇంచార్జ్ పావని రెడ్డి ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్ యాజమాన్య సభ్యులు రాఘవేంద్రరావు, కోట్ల శివకుమార్, నాగేందర్, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
25 ఏళ్లకు కలిసిన పేగుబంధం
దేవరకద్ర రూరల్: ఆర్థిక సమస్యలతో విసిగివేసారి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. 25 ఏళ్లకు తిరిగివచ్చిన సంఘటన ఆదివారం మండలంలోని గుడిబండలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుడిబండకు చెందిన మన్సూర్అలీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా.. వివిధ కారణాలతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో అప్పుల బాధ పెరిగిపోయి మనస్తాపానికి గురైన మన్సూర్‌అలీ ఇంట్లో కూలీ పనులకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మన్సూర్‌అలీ భార్యనే ఇంటి పెద్ద దిక్కుగా మారి కూలీ పనులు చేస్తూ, కుటుంబాన్ని పోషించి పిల్లల పెళ్లిళ్లు సైతం చేసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనినిమిత్తం బెంగళూర్ వెళ్లగా అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మన్సూర్అలీని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అతడి కుమారుడు యూనిస్ బెంగుళూరు వెళ్లి తన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ఒకానొక దశలో లేడు అనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆర్థికంగా ఎదగలేకపోవడంతో కుటుంబానికి మొహం చూపించలేక తిరిగి రాలేకపోయినట్లు మన్సూర్‌అలీ తెలిపారు. ఆర్థిక సమస్యలతో వెళ్లిపోయిన మన్సూర్‌అలీ గ్రామస్తుడి సమాచారంతో తిరిగి ఇంటికి చేరిన వైనం -
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి
కొత్తకోట రూరల్: రోడ్డుపక్కన ఆగివున్న డీసీఎంను బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున కొత్తకోట సమీపంలో జాతీయ రహదారి 44పై చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా ముత్కూర్ గ్రామానికి చెందిన దూదేకుల అల్లాబకాష్ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో నివాసం ఉంటున్నాడు. ఈయన కుమారుడు దూదేకుల ఇబ్రహీం (29) హైదరాబాద్‌లోనే ప్రైవేట్ జాబ్ చేస్తుండేవాడు. స్వగ్రామంలో పని నిమిత్తం ఇబ్రహీం తన బైక్‌పై శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున ఇబ్రహీం కొత్తకోట సమీపంలో హైవే పై ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి అల్లాబకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని మహిళ శవం లభ్యం మాగనూర్ (మక్తల్): మక్తల్ మండలంలోని నారాయణపేట రోడ్డులో గల కాటన్ మిల్లు సమీపంలో సంగంబండ లెఫ్ట్ కెనాల్లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. మహిళ శవం కాల్వలో పడి సుమారు రెండు, మూడు రోజులై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. శవం కుళ్లిపోయిన దశలో ఉందన్నారు. మహిళ వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చన్నారు. అటువైపు వెళ్తున్న వారి సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి కుళ్లిపోయిన మహిళ శవాన్ని కాల్వలో నుంచి పైకి తీసుకొచ్చామని, శరీరంపై గులాబీ రంగు జాకెట్, నల్ల రంగు లంగ, మెడలో మూడు తాయత్తులు ఉన్నాయన్నారు. ఈ ఆనవాళ్లతో ఎవరికై నా సమాచారం ఉంటే మక్తల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జమ్ములమ్మ ఆభరణాలు చోరీ శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, భక్తుల వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జమ్ములమ్మ ఆలయంలో ప్రవేశించి అమ్మవారి కిరీటం, నగలు, వెండి ఆ భరణాలు చోరీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గత కొంతకాలంగా హుండీలు పగులగొట్టి అందులోని నగదు, తాళాలు పగులగొ ట్టి ఆలయాల్లో విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచి గ్రా మం వెలుపల ఉన్న ఆలయాలకు రక్షణ కల్పించి భవిష్యత్‌లో ఆలయాల్లో చోరీలు జరగకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
మరోసారి ‘రిషి‘ విజయకేతనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన టీజీఎప్‌సెట్ ఫలితాలలో మహబూబ్‌నగర్‌లోని ‘రిషి’ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి 73వ ర్యాంకు సాధించి పాలమూరు జిల్లా విద్యాఖ్యాతిని సగర్వంగా నిలిపారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య పేర్కొన్నారు.అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారు అగ్రికల్చర్, ఫార్మ విభాగంలో స్వర్ణకుమారి 73వ ర్యాంకు, హప్స ఫాతిమా 604వ ర్యాంకు, జ్యోతిక 634వ ర్యాంకు, సిరి 859 ర్యాంకు, అలాగే 5,000 లోపు ర్యాంకులు 25 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రణీత్ కుమార్ 1,521 ర్యాంకు, అహ్మద్ ఇస్త్రార్ మునావర్ 1,726 ర్యాంకు, అలాగే 10,000 లోపు ర్యాంకులు 37 మంది విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.కార్యక్రమంలో అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్ రెడ్డి,ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి, రాఘవేంద్రరావు,అధ్యాపకులు, అధ్యాపకేతర బందం పాల్గొన్నారు. -
ఎప్‌సెట్ ఫలితాల్లో సత్తాచాటిన ‘ప్రతిభ’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీజీఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తాచాటారు. ఇంజినీరింగ్ విభాగంలో కళాశాల విద్యార్థులు వాత్సల్య 531, జతిన్ 603, శివశంకర్‌గౌడ్ 1.251, ఎం.భానుప్రతాప్ 1,561, శ్రీవత్స 2,251, అభిరాం 2,459, మల్లేష్ 2,560, పల్లవి 2,868, హర్షన్ 2,767, సుమేర్ 2,972, భవాని 3,018, సాయిజశ్వంత్రెడ్డి 3,043, సాకేత్‌కుమార్‌రెడ్డి 3,213 ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మ విభాగంలో కె.భావన 371, భీమేశ్వరి 616, ఉమైమసారి 680, శ్రుతి 834, సుప్రియ 922, పావని 1,054, శ్రీచందన 1,170, సుప్రజ 1,186, ప్రణవసాయి 1,331, సిద్దికనౌషీన్ 1,443, మసూరరహిల 1,522, శ్రావణి 1,565, స్పూర్తి 1,721, సౌందర్య 1,836, అక్షర 2,493, మౌనిక 3,094, శ్రావణి 3,822, సౌమ్య 3.849 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణుజనార్దన్రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
వికసించిన మే పుష్పం
ప్రకృతి ప్రియులను అలరించే ‘మే’ పుష్పం వికసించింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూచే ఈ పువ్వు ఎరుపు రంగులో కనువిందు చేస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా 17వ వార్డులోని పాపయ్యనగర్లో రిటైర్డ్ పోస్టుమాస్టర్ నరసింహసాగర్ నివాసంలోని పెరటితోటలో ఈ పుష్పం వికసించింది. దీన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ఇళ్ల వారు ఆసక్తి చూపారు. స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ అనే శాసీ్త్రయ నామం ఈ మొక్కను ఫుట్‌బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీగా పిలుస్తారని జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్య తెలిపారు. దీనిని మనదేశంలో మే పుష్పం అంటారని, ఇది మూడు రోజుల పాటు వికసించి ఉంటుందని పేర్కొన్నారు. – నాగర్‌కర్నూల్ -
ఎప్‌సెట్ విజేతల మనోగతం
అధ్యాపకుల సలహాల వల్ల.. ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో చదివాను. ప్రతి రోజు 12 నుంచి 14 గంటల దాకా చదివేదాన్ని, కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం సూచనలు, సలహాలతో ర్యాంకు సాధించడం చాలా సులువుగా మారింది. నీట్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తాననే నమ్మకం ఉంది. – సువర్ణకుమారి, 73వ ర్యాంకు, అగ్రికల్చర్, రిషి కళాశాల డాక్టర్ కావాలన్నదే లక్ష్యం.. కళాశాలలో అధ్యాపకులు చెప్పిన పాఠాలతో పాటు మంచి మెటీరియల్ చదవడం, ప్రతిరోజు కళాశాలలో పెట్టే గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల ఎఫ్‌సెట్ పరీక్ష రాయడం చాలా సులువుగా మారింది. డాక్టర్ కావాలన్న లక్ష్యం కోసం ప్రతి రోజు చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాను. భవిష్యత్‌లో మరింత రాణించేందుకు కృషి చేస్తాను. – భావన, 371, అగ్రికల్చర్, ప్రతిభ కళాశాల ప్రత్యేక బోధన వల్ల.. కళాశాలలో ప్రతి విద్యార్థిఫై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అధ్యాపకులు, యాజమాన్యం తరగతి గదిలో వచ్చిన సందేహాలను వెంటనే నివృతి చేశారు. అందువల్ల చదువులో ఎలాంటి సందేహాలు లేకుండా అర్థం అయ్యేది. డాక్టర్ కావాలన్న లక్ష్యం కోసం ప్రతి రోజు కష్టపడి చదివాను. భవిష్యత్‌లో మరింత రాణిస్తాం. – సాయి దీపిక, 741, అగ్రికల్చర్, వాగ్దేవీ కళాశాల -
నాలుగు తరాల అను‘బంధం’
ఒకే కుటుంబం.. నాలుగు తరాలు.. 123 మంది కుటుంబ సభ్యులు.. 50 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసిన అపూర్వ ఘట్టం. మదర్స్‌డే సందర్భంగా వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలగండలో వంశాధిపతి బూజుల నరసమ్మ, అక్కిరెడ్డిల వారసులు నాలుగు తరాలకు చెందిన 123 మంది సభ్యులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం బంధాలను చరవాణులకే పరిమితం చేసి, బంధువులు సైతం ఒకరినొకరు పరిచయం చేసుకునే దుస్థితి ఉంది. ఇలాంటి రోజుల్లో నాలుగు తరాలకు చెందిన 123 మంది కుటుంబసభ్యులు ఒకే వేదికపై కలుసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ వంశాధిపతిబూజుల నరసమ్మ, అక్కిరెడ్డిలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకను కుటుంబసభ్యులో ఒకరు, స్థానిక బీజేపీ నాయకుడు జగ్గారి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. – చిన్నంబావి (వనపర్తి జిల్లా) -
అమ్మవారికి బంగారు ఆభరణం బహూకరణ
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ క్షేత్రంలో ఐదవ శక్తిపీఠంగా కొలువైన శ్రీజోగుళాంబ అమ్మవారికి భక్తులు ఆదివారం బంగారు కాసుల పేరును బహుకరించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన శివ చరణ బ్రహ్మచారి సస్య గ్రూప్ శ్రీనివాస్ దంపతులు, కృష్ణమోహన్ దంపతులు ఈ బంగారు ఆభరణాన్ని బహుకరించినట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారు ఆభరణం 118 గ్రాముల బరువు ఉండగా విలువ రూ.11 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రసాద్ స్కీంలో భాగంగా అన్నదాన సత్రంలో భక్తుల కోసం రూ.50 వేల విలువ గల 25 స్టీల్ టేబుల్స్‌ను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
మామిడి.. మాగించే పద్ధతులు
అలంపూర్ : పండ్లు అన్నింటిలో రారాజు మామిడి పండు. మామిడిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే మామిడిని పండ్లకు రాజుగా గుర్తిస్తారు. ఇందులో విటమిన్–సీ 76 శాతం, విటమిన్–ఏ 25 శాతం, విటమిన్–బీ6 11 శాతం, ఫైబర్(పిచు) 9 శాతం, రాగి 9 శాతం పొటాషియం 7 శాతం, మెగ్నీషీయం 4 శాతం ఉంటుంది. వేసవి కాలంలో మామిడికి అధిక డిమాండ్, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుండడంతో వాటిని మాగించే పద్ధతులు, కోత కోసే సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచిస్తున్నారు. ఇలా మాగించడం మేలు మార్కెట్లోకి పంచదార, కలప వంటి రకాలు ముందుగా వస్తాయి. పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసాల రకాలు తర్వాత అందుబాటులోకి వస్తాయి.ఆ తర్వాత బేనిషా, నీలం, బెంగుళూరు(తోతపరి, కలెక్టర్) రకాలు మార్కెట్లోకి వస్తాయి. ముందుగా వచ్చే పండ్లకు నాణ్యత ఉండదు. కార్బెట్‌ను ఉపయోగించి రంగును తెప్పించి విక్రయిస్తారు. అయితే చెట్టుపై నుంచి కోసిన పండ్లను సాధారణ పద్ధతిలో మాగించడం వల్ల మంచి రుచిని కలిగి ఉంటాయి. పండ్లను ఇలా మాగించడానికి ఒక గదిలో గడ్డి లేదా వరిగడ్డి పరచి వాటిపై కాయలు పేర్చి మళ్లీ గడ్డిని కప్పాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే కాయలు మాగుతాయి. ఇక పండ్లకు మంచి రంగును తెప్పించడానికి ఇథైల్‌ను ఉపయోగించవచ్చును. ఇది కెమికల్ కాదు. ఒక హార్మోన్. లీటర్ నీటికి 1 ఎంఎల్ నుంచి 1.8 ఎంఎల్‌ను ఉపయోగించి కాయలన్నీంటికీ సమానంగా రంగును తెప్పించి మాగపెట్టవచ్చును. ఇథైల్‌ను వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కలిపి కాయలను 5 నిమిషాలు ముంచి తీసి ఆరబెట్టినా మంచి రంగు వస్తాయి. మామిడి పండ్లను చెక్కపెట్టల్లో కాకుండా సీఎఫ్‌బీ పెట్టెల్లో ఉంచి రవాణ చేయడం ఉత్తమం. 5–10 కిలోల వరకు పెట్టేల్లో ఉంచి దూర ప్రాంతాలకు రవాణ చేయడం వలన పండ్లు దెబ్బతినవు. కాల్షియం కార్బైట్‌తో మాగించడం వలన..! కొంత మంది రైతులు, వ్యాపారులు కాయలను మాగపెట్టడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. కాల్షియం కార్బైట్‌ను అధికంగా వినియోగించి సరిగ్గా పక్వానికి రాని కాయలను కృత్రిమంగా రంగు తెప్పించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా మాగబెట్టినవి తినడం వలన ఆరోగ్యానికి హానికి కలిస్తాయి. పాడి–పంట ఇథైల్ వాడకం శ్రేయస్కరం.. మామిడి కాయలను మాగించడానికి ఇథైల్ వాడకం శ్రేయస్కరం. దీన్ని ఉపయోగించడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇది పండుకు తీపిదనంతో పాటు మంచి సువాసనను ఇస్తోంది. ఇథైల్ వాడకంతో మామిడి కాయాల్లో ఇథీలిన్ వాయువు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల రైతులు కార్బెడ్ ఉపయోగించకుండా ఇలా మాగపెడితే రైతుకు మంచి ధర లభిస్తోంది. గ్రేడింగ్ విధానం : కాయాలను గ్రేడింగ్ చేయడం ద్వారా అవసరమైన సైజు (పరిమాణం), రంగు, బరువును బట్టి వేరు చేసి విక్రయిస్తే మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఆవిరి (వేపర్ ట్రీట్మెంట్) ద్వారా కాయలను శుభ్రం చేసి విక్రయించినా అధిక ధర ల భిస్తుంది. 200–250 గ్రాములు ఉన్న వాటిని ఒక గ్రే డ్గా, 300–350 బరువు ఉన్న వాటిని ఇంకో గ్రేడ్‌గా విడగొట్టి విక్రయిస్తే మంచి లాభాలు పొందవచ్చు. -
విద్యుదాఘాతంతో గుడిసెలు దగ్ధం
కేటీదొడ్డి: విద్యుదాఘాతంతో రెండు గుడిసెలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు దొంబర వీరన్న వివరాల ప్రకారం.. పొలం దగ్గర ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న గుడిసెలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా కాలిపోగా, పక్కనే ఉన్న బర్రెల షెడ్‌కు మంటల వ్యాపించి షెడ్ కూడా పూర్తిగా కాలిపోయింది. బర్రెలు బయట ఉండటంతో ప్రమాదం తప్పింది. గుడిసెలో టీవీ, ఇన్వెటర్, సీసీ కెమెరాలు, గడ్డి కట్‌చేసే యంత్రం మంటలో కాలుతుండగా గమనించిన స్ధానికులు మంటలు అర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో దాదాపు రూ4.లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరారు. -
నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి
జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యమో.. అలసత్వమో కానీ.. విద్యుదాఘాతానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వ్యవసాయ పొలంలో విరిగిన విద్యుత్ స్తంభాన్ని మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరిగి షార్ట్‌సర్క్యూట్‌తో ఓ రైతు, మరో కూలీ దుర్మరణం చెందారు. కావేరమ్మపేట శివారులో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలిలా.. కావేరమ్మపేటకు చెందిన రైతు గుమ్మకొండ ఆంజనేయులు(30)కు దేవునిగుట్టతండా సమీపంలోని వ్యవసాయ పొలంలో వరికోత యంత్రం తగిలి విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఈ క్రమంలో రైతు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని విన్నవించాడు. దీంతో అధికారులు విద్యుత్ పనులు చేసే కాంట్రాక్టర్‌కు చెప్పి స్తంభం పాతేందుకు గోతులు తీసి స్తంభాలను ఎత్తే ట్రాక్టర్‌ను అక్కడికి పంపారు. దీంతో మండలంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన సిద్దమోని మౌనికుమార్(28) విద్యుత్ పనులు చేసేందుకు తాత్కాలిక కూలీగా రాగా.. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ షాక్ సంభవించి అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. కాగా ఆ పక్కనే ఉన్న మరో ఇద్దరు కూలీలు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. మౌనికుమార్కు తల్లి జయమ్మ, తండ్రి నర్సింహులు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అలాగే కావేరమ్మపేటకు చెందిన ఆంజనేయులుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. విచారించి చర్యలు విద్యుత్ షాక్ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని జడ్చర్ల విద్యుత్ శాఖ డీఈఈ చంద్రమౌలి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభత్వ పరంగా సహాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ముగిసిన ఆర్ఎస్ఎస్ సార్వజనికోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని స్వామినారాయణ గురుకుల్లో 15 రోజులుగా కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ సార్వజనికోత్సవం ఆదివారం రాత్రి ముగిసింది. ముగింపు వేడుకలకు స్థానిక ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్యవక్తగా తెలంగాణ ప్రాంత సహకార్యవహ ఉప్పలాంచ మల్లికార్జున్ హాజరై ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటుందని, ఆర్ఎస్ఎస్ ప్రారంభమయ్యాక జాతిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని, 1962లో చైనా, 1965లో పాకిస్తాన్ యుద్ధాల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు. 1963 రిపబ్లిక్‌డే వేడుకల్లో 3 వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారని వివరించారు. పరమపూజనీయ హెడ్గేవార్ స్వామి వివేకానంద, శివాజిని ఆదర్శంగా తీసుకుని జాతి నిర్మాణం చేశారన్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్ని భారత్‌వైపు చూస్తున్నాయని, ప్రపంచానికి దేశం యోగా ఇచ్చిందన్నారు. అలాగే పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై చేసిన పోరులో భారతశక్తి, సామర్థ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని భూస్థాపితం చేయగలిగామన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్ఎస్ఎస్ విన్యాసాలను ఎంపీ డీకే అరుణ తిలకించారు. కార్యక్రమంలో వర్గ సర్వాధికారి వెంకట్రావు, తెలంగాణ ప్రాంత మానవీయ సంఘ్ చాలక్ బర్ల సురేందర్‌రెడ్డి, పాలమూరు విభాగ్ మానవీయ సంఘ్ చాలక్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవాలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం సమీపంలోని మహబూబ్‌నగర్– రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుహలో బండరాయికి స్వయంభూగా వెలసిన స్వామివారికి మహానివేదన, సహస్ర నామార్చన, నక్షత్ర హారతి, ఆశీర్వాదం తదితర ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవం సందర్భంగా గుహలోని బండరాయికి వెలసిన స్వామివారికి వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం స్వామివారిని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరిపై స్వామివారి అనుగ్రహం మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం అందించాలని డిమాండ్..
మూడు మాసాల క్రితం గ్రీన్ చానల్ పద్ధతి ద్వారా వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి బ్యాంక్ అకౌంట్లను సేకరించింది. కానీ జిల్లావ్యాప్తంగా ఆపరేటర్లకు టీజీ బీపాస్ ద్వారా ఒక నెల వేతనమే ఇచ్చారు. ఇంకా కొన్ని మండలాల్లో ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు అందాల్సి ఉంది. ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5గంటలకు ఇంటికి వెళతారు. తమతో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ప్రజాపాలన దరఖాస్తులు, ఓటర్ల జాబితా, ఇతర సర్వేలు ఆన్లైన్ చేయిస్తూ.. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రకాల పనులు చేస్తున్నా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి కనీస వేతనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని, క్రమం తప్పకుండా ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు కోరుతున్నారు. అలాగే హెల్త్‌కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.28,000 జీతం ఇవ్వాలని కోరుతున్నారు. -
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: నిరంతరం ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చని, జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీవెంకటేశ్ అన్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెటర్లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు. ఇటీవల ఐపీఎల్లో బిహార్ యువ క్రీడాకారుడు వైభవ్ 35 బంతుల్లో సెంచరీ చేశాడని, ఆయనను పీఎం మోదీ ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రాంతాల్లో నెలరోజుల పాటు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఇస్తున్నారని, విద్యార్థులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది వేసవి క్రికెట్ శిబిరాలకు ప్రత్యేకత ఉందన్నారు. ఈ ఏడాది వేసవి శిబిరాల్లో మొదటిసారి ఇంట్రా టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిని క్రీడాకారులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు ఈ వేసవి శిక్షణ శిబిరాలు, ఇంట్రా టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో అండర్–19 లేదా అండర్–16 జాతీయస్థాయి టోర్నమెంట్ నిర్వహించడానికి హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ హామీ ఇచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఒక బాలికల టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామని అన్నారు. బాలికలకు ప్రత్యేక క్రికెట్ శిక్షణ అందజేస్తామని తెలిపారు. ఈ సారి ప్రత్యేకంగా టర్ఫ్ వికెట్‌పై 14 జట్లతో మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్‌ను జూలైలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కార్యదర్శి రాజశేఖర్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండి.మన్నాన్తోపాటు సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబిద్ పాల్గొన్నారు. -
‘ఆర్అండ్ఆర్’ పెంపుపై త్వరలో శుభవార్త
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు సంబంధించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంపునకు సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఆర్అండ్ఆర్ పెంపునకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్థికశాఖలో ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, ఆమోదం పొందిన వెంటనే పరిహారం పెంపునకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.40 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరామన్నారు. రిజర్వాయర్ పనులతో పాటు కాల్వల నిర్మాణపనులను కూడా వెంటనే చేపట్టాలని ఇందుకు సంబంధిచి టెండర్లు పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. కోడ్గల్, బైరంపల్లి, వాడ్యాల గ్రామాల పరిధిలో దుందుభీ వాగుపై చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని కోరామని పేర్కొన్నారు. -
కొల్లాపూర్ ఎస్బీఐలో షార్ట్‌సర్క్యూట్
కొల్లాపూర్: పట్టణంలోని ఎస్బీఐ (ఏడీబీ)లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రాత్రి 7:30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బ్యాంకు మేనేజర్‌కు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బ్యాంకులో ఓ కుర్చీ మాత్రమే కాలపోయిందని, ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. గంజాయి పట్టివేత: నిందితుల అరెస్ట్ జడ్చర్ల: అక్రమంగా దిగుమతి చేసుకున్న గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా మార్చి వినియోగదారులకు విక్రయిస్తున్న నిందితుడితో పాటు గంజాయి సరఫరా చేసిన మరొకరిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు జడ్చర్ల ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. బాలానగర్ మండలం మోతిఘనపూర్లో ధన్‌రాజ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో శనివారం అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 760 గ్రాముల గంజాయితో పాటు తూకం యంత్రం, మూడు మొబైల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తంగా రూ.1.20 లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గంజాయిని సరఫరా చేస్తున్న బిజ్జుసింగ్ను కూడా అరెస్ట్ చేసి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఇద్దరు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన వారుగా పేర్కొన్నారు. -
ఆదర్శమూర్తి.. అమ్మ
పిల్లల కోసం పలు అవతరాలు ఎత్తుతున్న తల్లి నేడు మదర్స్ డే ఇష్టాలు మార్చుకుంటూ.. పాలమూరు: అమ్మ అనే పదం అద్భుతం.. ఎంత చెప్పినా తక్కువే.. ఆదర్శ మూర్తి, చైతన్య స్ఫూర్తి.. అమ్మను ఎంత తలచినా మధురమే. అనుబంధానికి, అనురాగానికి ఆమె వారధి, సారథి. తొలి అడుగులో తడబాటును.. బతుకు బాటలో పొరపాటును సరిదిద్దుతోంది. అందుకే అమ్మే నిత్య చైతన్యస్ఫూర్తి. జన్మనిచ్చినప్పటి నుంచి పెద్దయ్యే వరకు రక్షణ కవచంగా ఉంటూ ప్రపంచాన్ని చూపుతోంది. కన్న పిల్లల కోసం ఎన్ని బాధలైనా ఓర్చుకుంటారు. నేటి సమాజంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన పలువుర్ని పలకరిస్తే వారి రోల్ మోడల్ అమ్మే అంటారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తొలి గురువు.. బిడ్డకు జన్మించినప్పటి నుంచి పెద్దయ్యే వరకు అమ్మ ఒక గురువులా వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది. బాల్యంలో అన్ని విషయాలు బోధించేది అమ్మే. తల్లే తొలి గురువు. చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపించే నాటి నుంచి పెద్దయ్యే వరకు తల్లులు పిల్లలకు ఎన్నో విషయాలు బోధిస్తారు. వారికి చెప్పడానికి కథలు నేర్చుకుంటారు. వారి కోసం తమ పంథా మార్చుకుంటారు. అమ్మ పెంపకాన్ని బట్టే పిల్లల ఎదుగుదల ఉంటుంది. పిల్లల ప్రతి దశలోనూ అమ్మ ప్రభావం ఉంటుంది. అమ్మకు ఎర్రరంగు అంటే అస్సలు ఇష్టం ఉండదు.. కానీ కూతురికి అదే ఎక్కువ మక్కువ. షాపింగ్‌కు వెళ్లినప్పుడు అమ్మ ఆకుపచ్చ పట్టుచీర కొందామంటే కూతురు ఎర్ర పట్టు కొంటే బాగుంటుంది అనగానే తల్లి తన ఇష్టాన్ని మార్చుకుంది. అప్పుడు అమ్మ కళ్లకు ఎర్ర రంగు పట్టుచీర ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇలా కట్టుకునే దుస్తుల నుంచి తినే తిండి వరకు అమ్మ తన ఇష్టాలను పక్కన పెట్టి పిల్లలు చెప్పిన దానికే ఓటు వేస్తుంది. ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యత అంతా ఆమెదే. పిల్లల కోసం స్కూటీ నేర్చుకోవాల్సి వస్తోంది. రోజూ హోం వర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకొని పిల్లలను నిద్రలేపుతుంది. తొమ్మిదింటికల్లా బడికి పంపించి ఆమె ఉద్యోగానికి ఉరగెత్తాలి. తిరిగి సాయంత్రం ఇంటికొచ్చాక పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. పిల్లలు అడిగిన కొత్త వంటకాల్ని టీవీలు, స్మార్ట్ఫోన్లలో ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకొని కమ్మగా వండి పెడుతోంది. -
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సార్వత్రిక సమ్మెకు మద్దతుగా శనివారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్‌హాల్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. అక్కడి నుంచి కొత్త బస్టాండు, న్యూటౌన్, జీజీహెచ్, మెట్టుగడ్డ మీదుగా బాయమ్మతోట, రాజేంద్రనగర్, పాత డీఈఓ కార్యాలయం, ఎర్రసత్యం విగ్రహం, తెలంగాణచౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్ మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు పరచాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వద్దని, 8 గంటల పనిని 12, 14 గంటలకు పెంచే విధానం ఉపసంహరించుకోవాలన్నారు. సకల కార్మికులందరికీ పని భద్రత, ఉపాధిహామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కిల్లె గోపాల్, ఖమర్అలీ, చంద్రకాంత్, రాంమోహన్, పృథ్వీసింగ్, గోపాల్‌నాయక్, దేవానంద్, యు.కృష్ణయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా సాగుతున్న ‘టర్ఫ్’ పనులు
మహబూబ్‌నగర్ క్రీడలు: పై ఫొటోను చూస్తే ఒకప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక అయిన ఎల్బీ స్టేడియమో, ఇప్పటి ఉప్పల్ స్టేడియంలా కనిపిస్తుందంటే మీరు పొరబడినట్లే. ఇది పాలమూరులోని ఎండీసీఏ క్రికెట్ మైదానం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హెచ్‌సీఏకు ఉన్న ఏకై క క్రీడా మైదానం. ఈ మైదానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుబాటులోకి గ్రీనరీ మైదానం... ఉమ్మడి జిల్లాలోని క్రికెటర్ల కల త్వరలోనే నెరవేరబోతుంది. ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రికెట్లో టర్ఫ్ వికెట్ (పిచ్)కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్‌పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ అవసరం. అలాంటి టర్ఫ్ వికెట్ పిచ్‌లను ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణా శిబిరం ప్రారం భోత్సవంలో పలువురు హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు చేయాలని ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు మంజూరు కావడంతో మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనర్ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మైదానంలో గ్రీనర్ ఏర్పాటు పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మైదానంలో వర్షపునీరు నిలువకుండా ఎత్తుపెంచి చుట్టూ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో జాతీయస్థాయి టోర్నీ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనరీ అందుబాటులోకి రానుండడంతో త్వరలో హెచ్‌సీఏ వారు ఇక్కడి మైదానంలో జాతీయస్థాయి హెచ్‌సీఏ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఎండీసీఏ మైదానంలో అండర్–19 టోర్నీ లేదా అండర్–16 టోర్నీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీ జరిగి దేశంలోని వివిధ రాష్ట్రాల జట్లు వస్తే ఈ మైదానానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో రంజీ మ్యాచ్‌లకు కూడా ఎండీసీఏ మైదానం వేదిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనరీ ఏర్పాటు, అభివృద్ధి కోసం హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ రూ.60 లక్షలు కేటాయించి పనులు చేయిస్తోంది. ఈ మైదానం అభివృద్ధి కోసం అన్ని విధాల సహకారం అందిస్తున్న హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టర్ఫ్ వికెట్ ఏర్పాటైతే జిల్లా క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా క్రికెటర్లు రంజీ, భారత జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యం. – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రూ.60 లక్షలతో పనులు ప్రారంభం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం -
కన్నీళ్లు దిగమింగుకొని.. కూతుళ్లను చదివించి..
అమరచింత: ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త 26 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో భార్యకి భవిష్యత్ అంతా అంధకారం అలుముకున్నట్లయ్యింది. కానీ, తమ ఇద్దరు పిల్లల కోసం కన్నీళ్లను దిగమింగుకొని ఆమె జీవితంలో ముందడుగు వేసింది. కుట్టుమిషన్‌తో ఉపాధి పొందుతూ.. ఇద్దరు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అమరచింతకు చెందిన ఉప్పరి గితమ్మ. వివరాల్లోకి వెళ్తే.. అమరచింతకి చెందిన ఉప్పరి ప్రభాకర్, గితమ్మ భార్యభర్తలు. చిన్న, చిన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వారు. 1999వ సంవత్సరంలో ప్రభాకర్ ప్రమాదవశాస్తు మృతి చెందాడు. భర్త చనిపోయిన నాటికి గితమ్మకు ఇద్దరు కూతుళ్లు.. 5 ఏళ్ల ఇంద్రజ, మూడేళ్ల సింధూజ ఉన్నారు. చిన్నతనంలో భర్తను కోల్పోయిన గితమ్మ.. తన ఇద్దరు పిల్లల కోసం బాధనంతా తనలోనే దిగమింగుకొంది. తన ఇద్దరు కూతుళ్లకు ఉన్నత చదువులు.. భవిష్యత్ ఇవ్వాలనుకుంది. దీంతో కుట్టుమిషన్‌తో స్వయం ఉపాధి పొందడం ప్రారంభించింది. వచ్చిన చిన్నపాటి ఆదాయంతో అటు కుటుంబ పోషణ, ఇటు పిల్లలను చదివించింది. ప్రస్తుతం పెద్ద కూతురు ఇంద్రజ వెటర్నరీ కోర్సు పూర్తి చేసి.. వెటర్నరీ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. చిన్న కూతురు సిందూజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. పిల్లలిద్దరికి మంచి భవిష్యత్‌ను ఇవ్వడమే తన లక్ష్యమని.. ఎన్ని ఇబ్బందులు కలిగినా ముందుకు వెళ్లానని గీతమ్మ తెలిపింది. అమ్మ కష్టం వృథా చెయ్యలేదు అమ్మ కష్టం వృథా చెయ్యకుండా కష్టపడి చదివి వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాను. తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే నాన్న చనిపోవడంతో అమ్మే అన్నీ తానై తమను చూసుకుంది. ఆడపిల్లలంటేనే చిన్నచూపు చూసే ఈ రోజుల్లో తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా.. పురుషులతో సమానంగా అమ్మ తమను ఉన్నత చదువులు చదివించింది. అమ్మ కష్టం వృథా కాకుండా కష్టపడి చదివాం. ఉద్యోగం సాధించా. అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటాం. – ఇంద్రజ, అమరచింత -
‘కర్ణాటక వడ్లనే కొనుగోలు చేస్తుండ్రు’
కేటీదొడ్డి: కర్ణాటక నుంచి వస్తున్న వడ్లను కొనుగోలు చేస్తూ స్థానిక రైతులకు మోసం చేస్తున్నారని శనివారం మండలంలోని కొండాపురం రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సన్యాలకు మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటించడంతో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారని దుయ్యబట్టారు. 15 రోజుల నుంచి వడ్లను కల్లాలకే పరిమితం చేశారని, గోనె సంచులు లేవని సాకులు చెప్తూ కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి రాత్రికే సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం నుంచి కొండాపురం, వెంకటాపురం, ఈర్లబండ, కేటీదొడ్డి, ఎర్సందొడ్డి తదితర ప్రాంతాలకు చెందిన వడ్ల కొనుగొలు కేంద్రాలకు భారీ మొత్తంలో తెస్తుండడంతో వాటిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కొండాపురంలో పండించిన వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ గ్రామ రైతులు ఐకేపీ సెంటర్‌కు తాళం వేశారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. దీనిపై ఏపీఎం గోపాల్ వివరణ కోరగా.. టోకన్ ప్రకారం గన్నీ బ్యాగులు పంపిణీ చేస్తామని తెలిపారు. స్థానిక రైతుల ఆందోళన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తాళం వేసిన అన్నదాతలు నిర్వాహకుల చేతివాటం -
అమ్మా.. నీకు వందనం
సృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. ● అమ్మ మాట.. బంగారు బాట.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్‌లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్‌నగర్‌లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్‌కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్‌పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నేడు మాతృదినోత్సవం – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్‌కర్నూల్ అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్‌గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్‌లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్‌లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్‌గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్‌కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. అమృత పదం అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – విజయేందిర, కలెక్టర్, మహబూబ్‌నగర్ – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. అమ్మలేకుంటే నేను లేను తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. నా కెరీర్లో రోల్ మోడల్ – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
భూత్పూర్: మున్సిపాలిటీలోని శేరిపల్లి (బి) వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న శివదర్శిని ప్రైవేట్ బస్సు మరమ్మతుకు గురైంది. బస్సు క్లీనర్ ప్రవీణ్ కుమార్ (43) వేరే చోట బస్సు డ్రైవర్‌గా పనిచేసే శ్రీహర్షకు విషయం చెప్పాడు. అతను భార్య వీరమణికి (38)కు చెప్పగా ఆమె గ్రామానికి చెందిన శివకుమార్ ద్వారా బస్సును లాగడానికి ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకొని బయలుదేరారు. బస్సును తాడుతో ట్రాక్టర్‌కు కట్టి భూత్పూర్ వైపునకు తీసుకొస్తుండగా తాడు తెగిపోయింది. ప్రవీణ్ కుమార్, వీరమణి మళ్లీ తాడును కట్టి లాగే క్రమంలో బస్సు సడెన్‌గా స్టార్ట్ అయి ప్రవీణ్ కుమార్, వీరమణితో పాటు ట్రాక్టర్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ట్రాక్టర్ బోల్తా పడగా వీరమణి, ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సు డ్రైవర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆటో ఇప్పించలేదని యువకుడి బలవన్మరణం కొత్తకోట రూరల్: ఆటో కొనుక్కుకోవడానికి తండ్రి డబ్బులు ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురైన ఓ కొడుకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొత్తకోట మండలం అప్పరాలలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. అప్పరాల గ్రామానికి చెందిన జంగాల కృష్ణమ్మ, జంగాల పుల్లన్న దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి రెండో కుమారుడైన శివ(21) తనకు ప్యాసింజర్ ఆటో కావాలని తండ్రితో మొరపెట్టుకునేవాడు. పుల్లన్న ఇటీవలే కుమార్తె వివాహం చేయడంతో తన డబ్బులు లేవని లేవని చెప్పిన శివ వినిపించుకోలేదు. ఈనెల 9న మరోమారు తండ్రితో తనకు ఆటో ఇప్పిస్తావా? లేదా అని వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివ తిరిగి వచ్చి పురుగుల మందు తాగానని చెప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ శనివారం మృతి చెందాడు. తమ కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, పల్లకీసేవ వంటి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదేవిధంగా రాత్రి తెప్పతేరు కార్యక్రమాన్ని భక్తుల కోలాహం, మంగళవాయిద్యాలతో అర్చకులు అంగరంగ వైభవంగా చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తాడూరు: రెండు బైక్‌లు ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జగపతిరెడ్డి (55) శుక్రవారం పని నిమిత్తం ఇంటినుంచి బైక్‌పై బయల్దేరాడు. కల్వకుర్తి రహదారిలో పెట్రోల్‌బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టడంతో కిందపడిపోయిన జగపతి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. -
బావిలో పడి ఇద్దరు దుర్మరణం
● మృతుల్లో ఓ యువకుడు, ఓ బాలుడు ● సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘటన హుజూర్నగర్: యువకుడు బావిలో పడిపోగా.. అతడిని కాపాడబోయి మరో యువకుడు అందులోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన కన్మనూర్ తిరుపతయ్య, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మోదిపురం లక్ష్మణ్‌లు మరో ఆరుగురితో కలిసి గొర్రెలను మేపుకుంటూ హుజూర్‌నగర్‌కు వచ్చారు. గత పది రోజులుగా పట్టణానికి చెందిన జక్కుల లింగయ్య పొలంలో మేత కోసం గొర్రెలను నిలిపి అక్కడే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతయ్య కుమారులైన శేఖర్, చరణ్ వేసవి సెలవులు కావడంతో తండ్రి వద్దకు వచ్చారు. శుక్రవారం తిరుపతయ్య పెద్ద కుమారుడైన శేఖర్, గొర్రెల కాపరి లక్ష్మణ్‌తో కలిసి నీటిని తీసుకువచ్చేందుకు సమీపంలో గల లింగయ్య బావి వద్దకు వెళ్లారు. లక్ష్మణ్ (21) నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు శేఖర్ (14)ప్రయత్నించగా అతను కూడా బావిలో పడ్డాడు. దీంతో ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుడు శేఖర్ తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. -
హైదరాబాద్‌లో కానిస్టేబుల్ మృతి
పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని మీర్‌పేట పీఎస్ పరిధిలో స్కూటీపై వెళుతుండగా.. గుర్తుతెలియని కారు వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో కింద పడిన మహేందర్ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ స్వస్థలం లింగాలలో విషాదఛాయలు అములుకున్నాయి. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. -
వేసవిలో ‘చల్లని’ సేవ
మరికల్: వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఎంతో మంది స్వచ్ఛందంగా అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకుంటున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదట దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుటుంబ సభ్యులు మరికల్ మండలం తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితో మరికల్ మండల అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. 22 ఏళ్లుగా ప్రతి వేసవిలో బాటసారులు, కూలీల దాహార్తి తీరుస్తున్నారు. వీరి ఆదర్శంతో ఇతర మండలాలు, గ్రామీణ స్టేజీల వద్ద అంబలి కేంద్రాలను ఏర్పాటుచేసి వేసవిలో చల్లని సేవ అందిస్తున్నారు. 44 ఏళ్ల క్రితం.. ఈ ప్రాంత ప్రజలు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో మండుటెండలను సైతం లెక్క చేయకుండా పడుతున్న శ్రమను చూసి దివంగత మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి తండ్రి వెంకారెడ్డి చల్లించిపోయారు. తాను సర్పంచ్‌గా ఎన్నికై న తర్వాత వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను 1981లో తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఏడాది వేసవిలో అంబలి కేంద్రం నిర్వహిస్తూ వ్యవసాయ కూలీలతో పాటు బాటసారుల దాహం తీర్చే వారు. అయితే వెంకారెడ్డి మరణానంతరం ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కొనసాగించారు. అతడి మరణం తర్వాత ఆయన కుమారుడు, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తన అవ్వ వజ్రమ్మ, తాత వెంకారెడ్డి, తండ్రి వీరారెడ్డి జ్ఞాపకర్థంగా అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యప్ప అనుగ్రహంతోనే సేవ.. అయ్యప్ప సేవాసమితి స్థాపించిన నాటి నుంచి బాటసారుల తీర్చేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అయ్యప్పస్వామి అనుగ్రహంతో 22 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాం. – సతీశ్‌కుమార్, మరికల్ ఆనందంగా ఉంది.. మరికల్ బస్టాండ్, చౌరస్తాలో యువక మండలి తరఫున చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాం. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. – శ్రీకాంత్‌రెడ్డి, యువక మండలి అధ్యక్షుడు, మరికల్ తీలేర్ అంబలి కేంద్రానికి 44 ఏళ్లు పూర్తి వేసవిలో ప్రజల దాహార్తి తీరుస్తున్న దాతలు -
తక్కువ పెట్టుబడితో సీడ్ డ్రిల్ విత్తు
దూరం పాటించాల్సిందే...! రకం వరుసల మొక్కల మధ్య (సెం.మీ.) మధ్య (సెం.మీ.) వరి 25 15 మొక్కజొన్న 60 20 పామాయిల్ 60 20 పెసర 25 10 గోగు 25–30 15 వేరు శనగ 30 15 అలంపూర్: జిల్లాలో రైతులు ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగళి వెనుకసాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగు చేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచించారు. కూలీల సమస్యను అధికమించడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సీడ్‌డ్రిల్ యంత్రంతో సాగు పద్ధతులను ఆయన రైతులకు వివరించారు. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ ఉపయోగాలు.. ● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్‌తో వేయవచ్చును. ● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చు. ● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది. ● పంటను బట్టి వరుసల మద్య దూరం, మొక్కల మద్య దూరం మార్చుకోవచ్చు. ● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వలన పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. పంటకు గాలి వెలుతురు బాగా తగిలి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ● యంత్రాలతో వరి, వేరు శనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ము శనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు. ● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి. ● చివరి దుక్కిలో రోటోవేటర్ ఉపయోగించాలి. ● పొలం చదునుగా ఉంటే పొలం అంత విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది. యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది. పాడి–పంట సాగు ఇలా.. సీడ్‌డ్రిల్ యంత్రములో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్‌లో ఎరువులు వేయాలి. రెండవ బాక్స్‌లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది. -
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వెల్దండ: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొట్ర గ్రామానికి చెందిన చిట్టయ్య(65) మేకల కాపరిగా ఉండేవాడు. ఈనెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. మద్యానికి బానిసై అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి 10 రోజులకోసారి వచ్చేవాడు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం దుర్వాసన రావడంతో సమీప పొలాల రైతులు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి సమీపంలోని ప్రభుత్వ భూమిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న పోలెమోని చిట్టయ్య(65)ను గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ కురుమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుల్లిపోవడంతో సంఘటనా స్థలంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్ప త్రి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిట్టయ్యకు భార్య బాలమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యనిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతూ భర్త మృతి జడ్చర్ల టౌన్: నాలుగు రోజుల క్రితం వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కావేరమ్మపేటకు చెందిన చింతకుంట రాములు(52), తిరుపతమ్మ భార్యభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దీంతో నాలుగు రోజుల క్రితం భార్య రాములుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే కాలిన గాయాలతో ఉన్న అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా జిల్లా ఆస్పత్రిలోనే రెండురోజుల క్రితం మరణవాంగ్మూలం నమోదు చేశారు. ఘటనపై రాములు సోదరుడు యాదయ్య జడ్చర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివాహం జరిగిన నాటి నుంచి అన్నతో వదిన గొడవలు పడేదని, అదే క్రమంలో పెట్రోలు పోసి నిప్పంటించిందని ఫిర్యాదులో పొందుపర్చాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, అంత్యక్రియల నిమిత్తం సాయంత్రం వరకు అనుమతిచ్చారు. ఇద్దరు పిల్లలతో సహాతల్లి అదృశ్యం నవాబుపేట: ఇంట్లో అందరు నిద్రిస్తూ ఉండగా తల్లి ఇద్దరు పిల్లలతో అ దృశ్యమైన సంఘటన మండలంలోని తీగలపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండ లం నాగసాలకు చెందిన ఎడ్ల కృష్ణయ్య కుటుంబంతో ఐదేళ్ల క్రితం మండలంలోని తీగలపల్లికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణయ్యకు భార్యతో పాటు ముగ్గు రు పిల్లలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన అందరు తిని నిద్రించిన తరుణంలో తెల్లవారుజామున భార్య శ్రీదేవి (35) ఆ యన ఇద్దరు కుమారు లు విశ్వప్రసాద్(7), అ ఖిల్(5)లు కనిపించకుండ పోయారు. దీంతో ఆయన చుట్టుపక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్ర మ్ తెలిపారు. -
నేటి నుంచి బీచుపల్లి బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయన అర్చకులు తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, రాత్రికి తెప్పోత్సవం, ఆదివారం ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, సోమవారం ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, మంగళవారం ఉదయం పంచామృతాభిషేకం, చౌకిసేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం, బుధవారం ఉదయం అమృతస్నానం, పంచామృభిషేకం, రాత్రికి పల్లకీసేవతో ఆంజనేయస్వామి ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయంలో నిత్య పూజలు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి రోజు ఉదయం 07:30 లకు ఆకుపూజ, అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపడతారు. ఐదు రోజుల పాటు వేడుకలు 12న ఆంజనేయస్వామివారి రథోత్సవం వేలాది తరలిన రానున్న భక్తులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆంజనేయస్వామి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు.