
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
● మద్యం తాగొదన్నందుకు..
చెట్టుకు ఉరేసుకొన్న వైనం
రాజాపూర్: మద్యం తాగొద్దని తనయుడు తల్లికి చెప్పినందుకు మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నవెల్లి గ్రామానికి చెందిన పొట్ట పద్మమ్మ(62) మద్యానికి బానిస కావడంతో హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు శ్రీనివాసులు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చి తల్లితో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పద్మమ్మ మద్యం తెచ్చుకుని తాగుతుండగా కుమారుడు శ్రీనివాసులు మందలించి ఇంటిపై నిద్రించాడు. మధ్యరాత్రి లేచి చూచేసరికి తల్లి కనిపించక పోవడంతో చుట్టు పక్కల గాలించాడు. మంగళవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న మర్రిచెట్టుకు పద్మమ్మ ఉరేసుకొని వేలాడుతున్న విషయాన్ని గమనించి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతురాలి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్ తెలిపారు.
ప్రసవానికి వస్తే
ప్రాణం పోయింది
కల్వకుర్తి టౌన్: ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన రేణుక (25)కు వెంకటేష్‌తో 2024లో వివాహాం జరిగింది. పురిటి నొప్పులతో పట్టణంలోని శ్రీసాయి ఆస్పత్రికి ఆదివారం రాత్రి తీసుకురాగా వైద్య సిబ్బంది ప్రసవం చేశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం అవుతుండటంతో సోమవారం సాయంత్రం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో రేణుక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని మృతదేహాన్ని తిరిగి కల్వకుర్తిలోని శ్రీసాయి ఆస్పత్రికి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ నాయకుడు, మరో పోలీస్ అధికారి రాజీ కుదిర్చి బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదిర్చినట్లు తెలిసింది. పట్టణంలోని ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవటం, నాయకులు వెంటనే రాజీ కుదర్చటం పరిపాటిగా మారిందని పట్ట ణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.