
సిగ్నల్‌గడ్డ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌జాం
పట్టణంలోకి వెళ్లే మార్గంలో నిలిచిన వాహనాలు
హైస్కూల్ సమీపంలో రోడ్డుపై నిలిచిన వాహనాలు
బ్రిడ్జిపై అడ్డుగా నిలిచిన లారీ
జడ్చర్ల సిగ్నల్‌గడ్డ బ్రిడ్జిపై మంగళవారం ఓ లారీ ఆకస్మికంగా బ్రేక్ డౌన్ కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే సిగ్నల్‌గడ్డ బ్రిడ్జి విస్తరణ పనుల నిలిపివేసిన క్రమంలో ఇరుకుగా ఉన్న బ్రిడ్జిపై లారీ మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు, చిన్న చిన్న వాహనాలు బాదేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందుగా వెళ్లినా.. భారీ వాహనాలు మాత్రం బ్రిడ్జిపై నిలిచిపోయాయి. అనంతరం లారీకి మరమ్మతు చేసి తొలగించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. – జడ్చర్ల/జడ్చర్లటౌన్

సిగ్నల్‌గడ్డ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌జాం

సిగ్నల్‌గడ్డ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌జాం