
పశ్చిమ బెంగాల్‌కు తల్లి, బిడ్డ తరలింపు
పాలమూరు: జడ్చరలోని సఖి కేంద్రంలో ఉంటున్న సంజన అలాగే ఆమె బిడ్డను సఖి కేంద్రం నిర్వాహకులు పశ్చిమబెంగాల్‌కు పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన సంజన భర్తతో కలిసి కూలి పనులు చేసుకోవడానికి జడ్చర్ల వచ్చారు. అయితే గొడవ జరగడంతో భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడు. గర్భిణిగా ఉన్న ఆమె గత జనవరిలో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక సమస్యలతో పుట్టిన బిడ్డను అమ్మే ప్రయత్నం చేయగా గమనించిన ఆస్పత్రి సిబ్బంది సఖి కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో వారు నాలుగు నెలల పాటు తల్లిబిడ్డకు ఆశ్రయం కల్పించారు. అయితే సంజన పూర్తి వివరాలు తెలియడంతో ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి మంగళవారం స్వగ్రామానికి పంపించారు. ప్రత్యేక బృందంతో తల్లి, బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు తరలించినట్లు సఖి కేంద్రం కో–ఆర్డినేటర్ సౌజన్య తెలిపారు.