రాష్ట్రస్థాయి ఉద్యాన పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామంలోని ఉద్యాన కళాశాల వేదికగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మే 13 నుంచి 14 వరకు రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర అంతర్ కళాశాలల ఆటల పోటీలలో కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా, ఆదిలాబాద్‌లోని దస్నాపూర్, నల్గొండలోని గడ్డిపల్లి, కొల్లాపూర్‌లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల టీంలు పాల్గొన్నాయి. పోటీలను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిదిగం సైదయ్య ప్రారంభించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ఇందుకోసమే యూనివర్సిటీలో పరిధిలోని అన్ని కళాశాలల్లో చదువుతో పాటు క్రీడలకు సైతం సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామగిరి ఖిల్లా ఉద్యాన పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి నవీన్ కుమార్, గడ్డిపల్లి గంట గోపాల్ రెడ్డి ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ నరేష్ గౌడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.


