బాక్సింగ్‌లో బంగారు పతకం
ఊట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే లక్ష్మీపల్లికి చెందిన విద్యార్థి ఉప్పరి శ్రీరామ్ 6వ జాతీయ మిక్స్ బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటి బంగారు పతకం సాధించారు. మహారాష్ట్రలోని రాయిఘడ్ జిల్లాలో ఇండియన్ మిక్స్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 6వ జాతీయ మిక్స్ బాక్సింగ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలో ఉప్పరి శ్రీరాం పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించగా.. ఆ రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి అతిథి తాట్కరే పతకాన్ని అందజేశారు. కార్యక్రమంలో కరాటే శిక్షకులు నారక్‌రాం, రాజీవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


