ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి గ్రామసమీపంలోని ఊకచెట్టువాగు నుంచి మద్దూర్‌కు చెందిన ఫారూక్ ఆదివారం తన కోళ్లఫారం నిర్మాణానికి జేసీపీ, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తుండగా గ్రామానికి చెందిన సమీప రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీపీ, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కురుమూర్తి గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ.. మద్దూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ ఫారూక్ కురుమూర్తి శివారులో కోళ్ల ఫారం నిర్మాస్తున్నాడని, కోళ్లఫారం నిర్మాణానాన్ని అడ్డాగా చేసుకొని కొందరు అక్రమార్కులు వాటి సమీపంలో డంపులు చేసి రాత్రింభవళ్లు తేడాలేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోతే జేసీపీ, ట్రాక్టర్లను తగలబెడుతామని హెచ్చరించారు. వీటిపై ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డిని వివరణ కోరగా ఇసుక తరలింపునకు పాల్పడిన జేసీపీ, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. అట్టి వాహనాలను నేడు తహసీల్దార్‌కు అప్పగిస్తామని తెలిపారు.


