
భక్తిశ్రద్ధలతో చండీ హోమం
అలంపూర్: పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం చండీ హోమాలు నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జరిగిన చండీ హోమాల్లో 96 మంది భక్తులు పాల్గొనట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు.
● అలంపూర్ క్షేత్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి పాపిరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి.. స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ సివిల్‌కోర్టు జడ్జి మిథున్ తేజ ఉన్నారు.