
ముగిసిన బీచుపల్లి అంజన్న బ్రహ్మోత్సవాలు
ఇటిక్యాల: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాలతో ఆంజనేయస్వా మిని ఆలయం నుంచి పల్లకీలో కృష్ణానది వరకు ఊరేగించారు. పవిత్ర కృష్ణానదిలో అర్చకులు వేద మంత్రాలతో బీచుపల్లి రాయుడికి అమృతస్నానం చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో హాజరై ఉత్సవాలు తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి దాసంగాలతో అంజన్నకు మట్టి కుండల్లో నైవేధ్యాలు వండి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్, పాలక మండలి సభ్యులు, అర్చకులు,ఉన్నారు.
వైభవంగా కృష్ణానదిలో అమృతస్నానం
ప్రత్యేక అలంకరణలో స్వామివారు

ముగిసిన బీచుపల్లి అంజన్న బ్రహ్మోత్సవాలు