
ఎప్‌సెట్ విజేతల మనోగతం
అధ్యాపకుల సలహాల వల్ల..
ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో చదివాను. ప్రతి రోజు 12 నుంచి 14 గంటల దాకా చదివేదాన్ని, కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం సూచనలు, సలహాలతో ర్యాంకు సాధించడం చాలా సులువుగా మారింది. నీట్‌లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తాననే నమ్మకం ఉంది.
– సువర్ణకుమారి, 73వ ర్యాంకు,
అగ్రికల్చర్, రిషి కళాశాల
డాక్టర్ కావాలన్నదే లక్ష్యం..
కళాశాలలో అధ్యాపకులు చెప్పిన పాఠాలతో పాటు మంచి మెటీరియల్ చదవడం, ప్రతిరోజు కళాశాలలో పెట్టే గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల ఎఫ్‌సెట్ పరీక్ష రాయడం చాలా సులువుగా మారింది. డాక్టర్ కావాలన్న లక్ష్యం కోసం ప్రతి రోజు చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాను. భవిష్యత్‌లో మరింత రాణించేందుకు కృషి చేస్తాను.
– భావన, 371, అగ్రికల్చర్, ప్రతిభ కళాశాల
ప్రత్యేక బోధన వల్ల..
కళాశాలలో ప్రతి విద్యార్థిఫై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అధ్యాపకులు, యాజమాన్యం తరగతి గదిలో వచ్చిన సందేహాలను వెంటనే నివృతి చేశారు. అందువల్ల చదువులో ఎలాంటి సందేహాలు లేకుండా అర్థం అయ్యేది. డాక్టర్ కావాలన్న లక్ష్యం కోసం ప్రతి రోజు కష్టపడి చదివాను. భవిష్యత్‌లో మరింత రాణిస్తాం.
– సాయి దీపిక, 741, అగ్రికల్చర్, వాగ్దేవీ కళాశాల

ఎప్‌సెట్ విజేతల మనోగతం

ఎప్‌సెట్ విజేతల మనోగతం