
స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే కాకుండా, వారికి అందివచ్చిన స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం పట్టణంలోని మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి కుట్టుమిషన్లు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయిస్తూ.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. స్వయం శక్తితో ఎదిగి కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.