
విద్యుదాఘాతంతో గుడిసెలు దగ్ధం
కేటీదొడ్డి: విద్యుదాఘాతంతో రెండు గుడిసెలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు దొంబర వీరన్న వివరాల ప్రకారం.. పొలం దగ్గర ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న గుడిసెలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా కాలిపోగా, పక్కనే ఉన్న బర్రెల షెడ్‌కు మంటల వ్యాపించి షెడ్ కూడా పూర్తిగా కాలిపోయింది. బర్రెలు బయట ఉండటంతో ప్రమాదం తప్పింది. గుడిసెలో టీవీ, ఇన్‌వెటర్, సీసీ కెమెరాలు, గడ్డి కట్‌చేసే యంత్రం మంటలో కాలుతుండగా గమనించిన స్ధానికులు మంటలు అర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో దాదాపు రూ4.లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరారు.