
చికిత్స పొందుతూమరొకరు మృతి
వెల్దండ: మండలంలోని కొట్ర సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొమ్ముల సాయి(28) వెల్దండలోని యెన్నమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. కారు రోడ్డుపై ఆపిన డీసీఎంను ఢీకొన్న ప్రమాదంలో ఇనుప చువ్వలు గుచ్చుకొని 8 నెలల చిన్నారి తేజశ్రీ అక్కడికక్కడే మృతిచెందగా.. సాయి, ఆయన భార్య శిరీష తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాయి మృతిచెందగా ఆయన భార్య శిరీష ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై సాయి సోదరుడు కొమ్ముల ప్రభాకర్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ కల్వకోలు బాలస్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సాయి, ఆయన కుమార్తె తేజశ్రీ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.