
క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ
అమరచింత: ఆట మధ్యలో ఏర్పడిన చిన్న వివాదం ఓ ప్రాణం తీసింది. క్రికెట్ మ్యాచ్‌లో గొడవపడి రెండు గ్రామాల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో... తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి.. మండంలోని ధర్మపురం గ్రామానికి చెందిన యువకులతో పాటు సమీప గ్రామం నాగల్‌కడ్మూర్ యువకులు కలిసి మూడు రోజుల కిందట క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో ఇరు గ్రామాల యువకుల మధ్య ఆట విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నాగల్‌కడ్మూర్‌కు చెందిన యువకులు దాడిలో ఆంజనేయులు(32) తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య మహేశ్వరి తన భర్తను ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం ఆంజనేయులు మృతదేహంను ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫిర్యాదులో పేర్కొన్న నిందితులు సురేందర్‌రెడ్డి, బన్నీ, రవి, వెంకటేష్, తిరుమలేష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శివకుమార్ వెల్లడించారు.
● మృతుడు ఆంజనేయులు కుటుంబాన్ని న్యా యం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమా ండ్ చేయడంతో నాగల్‌కడ్మూర్ గ్రామ పెద్దలు శు క్రవారం ధర్మపురం గ్రామానికి చెందిన వ్యక్తుల తో చర్చించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండడంతో వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. నిందితుల ద్వారా రూ.12.70 లక్షలు ఇప్పించేందుకు ఒప్పందం చేశారు.
రెండు గ్రామాల యువకులమధ్య గొడవ
ఒక యువకుడికి తీవ్ర గాయాలు, చికిత్సపొందుతూ మృతి
ఐదుగురిపై కేసు నమోదు