
ఉరేసుకొని ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
● భార్యాభర్తల మధ్య జరిగిన
గొడవతో మనస్తాపం
జడ్చర్ల: సంసారం విషయంలో వచ్చిన ఓ చిన్న గొడవ ఉపాధ్యాయురాలి బలవన్మరణానికి దారి తీసిన ఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం తండాకు చెందిన ముడావత్ పూర్ణ (40) మండల పరిధిలోని నసరుల్లాబాద్‌లోని పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుంది. ఆమె భర్త రమావత్ బోప్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వారు ముగ్గురు పిల్లలతో కలిసి స్థానిక గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలు గురువారం గొడవ పడ్డారు. శుక్రవారం భర్త బోప్య యథావిధిగా విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ సాయివంశీ కాలనీలో నివాసం ఉంటున్న తన బావమరిది ముడావత్ గణేష్‌కు ఫోన్‌చేసి మీ అక్కతో వాగ్వాదం జరిగింది. ఇంటికి వెళ్లి విచారించమని చెప్పాడు. ఇంటికి వెళ్లిన గణేష్ తలుపు తీయకపోవడంతో తలుపు పగులగొట్టి చూడగా పూర్ణ బెడ్రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఉంది. గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇసీ్త్ర చేస్తుండగా
షార్ట్ సర్క్యూట్
● చికిత్స పొందుతూ మహిళ మృతి
మరికల్: దుస్తులను ఇసీ్త్ర చేస్తుండగా.. షార్ట్‌సర్క్యూట్ రావడంతో మహిళ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అప్పంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన సంజనోళ్ల అనంతమ్మ(59) ఇంట్లో దుస్తులను ఇసీ్త్ర చేస్తుండగా.. ఆకస్మాతుగా ఇసీ్త్ర పెట్టెకు షార్ట్ సర్క్యూట్ రావడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మరికల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొదుంతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుసినట్లు ఎస్‌ఐ రాము తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తే ఉన్నారు.
మతిస్థిమితం లేని మహిళ దాడిలో వృద్ధుడి మృతి
ఊర్కొండ: మతిస్థిమితం లేని మహిళ దాడిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని రాంరెడ్డిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన జమ్ముల లక్ష్మీదేవమ్మకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో భర్త ఇదివరకే వదిలిపెట్టడంతో ఆమె తల్లివద్దనే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు భర్త వద్దే హైదరాబాద్‌లో ఉంటున్నారు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన గుర్రంపల్లి రాములు(65)కావలికారు(వీఆర్‌ఏ)గా విధులు నిర్వహిస్తున్నాడు. కిరాణం షాపు వద్దకు వెళ్లి మహిళ ఇంటిముందు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా లక్ష్మీదేవమ్మ మాటలు కలిపి మాట్లాడుతూ.. వెంట తెచ్చుకున్న కట్టెతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే కల్వకుర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. శుక్రవారం ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ నాగార్జున పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్ తెలిపారు.
చేపల వేటకు
వెళ్లి వ్యక్తి మృతి
నవాబుపేట: చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాకర్‌జాల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కాకర్‌జాల్‌కు చెందిన గుర్రంపల్లి చెన్నయ్య(35) బుధవారం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెన్నయ్య భార్య స్వప్న ఉడిత్యాల్ శివారులో కూలి పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఉన్న చెన్నయ్య కూమార్తె తండ్రి ఇంటికి రాలేదని రాత్రి తన తల్లికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. చుట్టు పక్కల వెతకగా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో చెన్నయ్య శవం నీటిపై తేలడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ఇటిక్యాల: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవినాయక్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని చాగాపురానికి చెందిన గోల్ల శేఖర్(వీరేష్, 26) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. జూలై 28న తల్లి చిన్నక్కను మద్యం తాగడానికి డబ్బులు అడగ్గా ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శుక్రవారం మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఉరేసుకొని ఉపాధ్యాయురాలి ఆత్మహత్య