
ఎరువులు, యూరియా పట్టివేత
నారాయణపేట: నారాయణపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో యూరియా, వివిధ రకాల ఎరువుల బస్తాలు పట్టుబడ్డాయని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. నారాయణపేట నుంచి వివిధ ఫర్టిలైజర్ దుకాణాలలో యూరియా వివిధ రకాల ఎరువుల బస్తాలను కర్ణాటకకు చెందిన రైతులు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న సమయంలో జలాల్‌పూర్ చెక్‌పోస్టు దగ్గర వాహనాల తనిఖీల్లో రెండు కమాండర్లు, ఒక ఆటోలో మొత్తం 34 బస్తాలలో యూరియా ఇతర ఎరువులను పట్టుకొని పోలీస్‌స్టేషన్ తరలించామన్నారు. వారిని విచారించగా కర్ణాటక చెందిన కొంత మంది రైతులు నారాయణపేటలోని షాపులలో కొనుగోలు చేసి వ్యవసాయ పనుల నిమిత్తం తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎంఏఓ బాలదినాకర్, ఏఈఓ అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.