
అమ్మానాన్నకు వందనం
ప్రపంచాన్ని పరిచయం చేసి.. నడక నేర్పి.. పదాలకు పునాది వేసే మొదటి గురువులు అమ్మానాన్నలు. వారే ప్రత్యక్ష దైవం అనే విషయాన్ని విద్యార్థుల మదిలో పదిలంగా దాచుకునేలా.. విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలు కడిగి పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమాన్ని అమరచింతలో శుక్రవారం నిర్వహించారు. అమరచింత డీఎంఆర్‌ఎం పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తుండగా.. ఇందులో గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి 280 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇదిలాఉండగా, పిల్లలు ప్రాథమిక దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో శిబిరం నిర్వాహకులు తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని
చేపట్టారు. ఈమేరకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి పూలు చల్లి
వారి ఆశీర్వాదం పొందారు. – అమరిచింత