
అలంపూర్ ఆలయంలో చండీహోమాలు
అలంపూర్: ఐదో శక్తి పీఠమైన అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమాలు నిర్వహించారు. అమావాస్య, పౌర్ణమి, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో చండీహోమాలు నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు చండీహోమాల్లో పాల్గొన్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ పేర్కొన్నారు. చండీహోమాలు నిర్వహించిన భక్తులు శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం అందజేశారు.