
బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, పల్లకీసేవ వంటి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదేవిధంగా రాత్రి తెప్పతేరు కార్యక్రమాన్ని భక్తుల కోలాహం, మంగళవాయిద్యాలతో అర్చకులు అంగరంగ వైభవంగా చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.