
డీసీసీబీకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు డీసీసీబీ కేటగిరి–సీ నుంచి బీకి అప్‌గ్రేడ్ కావడంతోపాటు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి సమక్షంలో డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. కాగా, దీనికి కృషి చేసిన సీఈఓ పురుషోత్తంతోపాటు పాలకమండలి, పీఏసీఎస్ అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సిబ్బందికి విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.