
బీచుపల్లి క్షేత్రం.. భక్తజన సంద్రం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. నెల రోజులపాటు జరిగే స్వామివారి ఉత్సవాల్లో మొదటి శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. కొందరు భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో వెలసిన వివిధ దుకాణాలు కొనుగోలు దారులతో రద్దీగా కనిపించాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు.
వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాలు
మార్మోగిన అంజన్న నామస్మరణ