
సీబీఎస్‌ఈ ఫలితాల్లో మౌంట్‌బాసిల్ విజయదుందుభి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో మహబూబ్‌నగర్ మౌంట్‌బాసిల్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. పాఠశాల విద్యార్థులు ఎన్.సాయిశ్రీచరణ్ 492 మార్కులు సాధించి ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. చేతన్ 484, శ్రీనిత్య 480, వినయ్‌గౌడ్ 478, శివసాయిచరణ్ 477, సాయిచరణ్ 476 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చంద్రకళా వెంకటయ్య మాట్లాడుతూ.. పాఠశాలలో వందశాతం ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అందుకు సహకరించిన తల్లిదండ్రులకు అభినందలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ శిరీష ప్రవీణ్, పూజిత మోహన్‌రెడ్డి, సుశాంత్‌కృష్ణ, ప్రిన్సిపాల్ సోమశేఖర్‌రెడ్డి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.