
సాక్షి, తాడేపల్లి: నేడు గౌతమ బుద్ధుడి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయమని వైఎస్ జగన్ కొనియాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని.. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు’ తెలిపారు.
విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు.#BuddhaPurnima
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025
