
'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్'ను కొన్ని అత్యవసర సమయాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ విత్‌డ్రా అనేది రిజెక్ట్ కాకుండా ఉండాలంటే.. కొన్ని నియమాలను పాటించాలి.

ఈపీఎఫ్ క్లెయిమ్ చేసేటప్పుడు.. పేరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ నెంబర్ వంటి వివరాలలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోవాలి.

ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తే.. రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు క్లెయిమ్ చేయడానికి ముందే.. అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకోవాలి. అంతే కాకుండా క్లెయిమ్ చేసే సమయంలోనే సరైన ఫారమ్ ఎంచుకోవాలి. తప్పు ఫారమ్ ఎంచుకుంటే ఈపీఎఫ్ రిజెక్ట్ అవుతుంది.

సరైన కారణాలు ఉంటేనే విత్‌డ్రా చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ వంటి కారణాలకు మాత్రమే ఫండ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.

క్లెయిమ్ చేసుకునే సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా?, లేదా? అనే విషయాలను ముందుగానే పరిశీలించుకోవాలి. IFSC కోడ్, అకౌంట్ నెంబర్ వంటివన్నీ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.