
నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా హైదరాబాద్ నగరం మరోసారి తన సాంకేతిక ప్రావీణ్యాన్ని చాటుకుంటోంది. 1998లో భారతదేశం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ రోజును గుర్తుంచుకుంటారు. ఈ పరీక్షల ఫలితంగా భారతదేశం అణు ఆయుధాలు కలిగిన ఆరో దేశంగా రూపాంతరం చెందింది. ఈ అణు పరీక్షల విజయాన్ని గుర్తిస్తూ ప్రతి ఏడాది మే 11న ఈ రోజును టెక్నాలజీ డే గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ప్రముఖ శాస్త్ర, సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు వివిధ కార్యక్రమాలు చేపట్టాయి.
పని తగ్గించి ఉత్పత్తి పెంచే సాధనాలు..
హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వేదికపై టెక్నాలజీ పరిణామక్రమంపై అవగాహనను కలిగి ఉన్నారు. క్రిటికల్ రివర్‌లో ఈ విజ్ఞానం అంతర్జాతీయ స్థాయి క్లయింట్లు ఆశించే నాణ్యతను అందించడానికి సహాయపడుతుంది. హైదరాబాద్ భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా ఎదుగుతోంది.
మా హైదరాబాద్ బృందం ఆటో–రీకన్సిలియేషన్స్, ఆటోమేటెడ్ చెక్, డేటా విజిబిలిటీని అందించే డాష్‌బోర్డ్‌లు వంటి ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించే వినూత్న ఏఐ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తుంది. మేన్యువల్ పనిని తగ్గిస్తూ, ఉత్పత్తిని వేగవంతం చేసే ఆటోమేషన్ డేటా సాధనాలను అభివృద్ధి చేస్తున్నాము.
డేటా ఖచ్ఛితత్వంతో ఫైనాన్స్ బృందాలకు సహాయపడే ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడంలో మా బృందం కీలక పాత్ర పోషించింది. ఈ సాధనాలను ఇప్పటికే ఎంటర్‌ప్రైజ్ క్లయింట్లు ఉపయోగిస్తున్నారు.
– అంజి మారం, క్రిటికల్ రివర్ సీఈఓ, వ్యవస్థాపకులు.
ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికత ఎలా విప్లవాత్మకంగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామంలో డ్రోన్ సాంకేతికత రక్షణ వ్యూహంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. భారత–పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఏర్పడిన ఇటీవలి ఉద్రిక్తతలు డ్రోన్ల అవసరాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ఇవి ఇకపై ఐచ్ఛికం కాదు, అత్యవసరం.
నేడు డ్రోన్లు గగనతల గమనిక, పక్కాగా సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది మన దళాలకు వేగవంతమైన, సమర్థవంతమైన స్పందనను అందించడమే కాక, మనుషుల ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతోంది. భారత్‌లో స్థానిక డ్రోన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం ‘ఆత్మనిర్భర్త’ అవసరాన్ని హైలైట్ చేస్తోంది. దేశాన్ని అధునాతన డ్రోన్ సాంకేతికత గ్లోబల్ హబ్‌గా దిశగా మలచడంలో ఇది కీలక అడుగు.
–ప్రేం కుమార్ విశ్లావత్, మారుత్ డ్రోన్స్ సీఈఓ, సహ–వ్యవస్థాపకులు.
(చదవండి: