వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక

May 16 2025 12:43 AM | Updated on May 16 2025 12:45 AM

పొలం గట్ల తయారీ

పంటలపై తీసుకోనే శ్రద్ధ పొలం గట్లు, మురుగు కాల్వలపై చూపించడం లేదు. వీటిలో వివిధ రకాలైన ఒయ్యారి భామ, మూల మాతంగి, నీరు గొబ్బి, గొంగల గరాకు, గరక రాకసి, తుంగ వంటి మొక్కలు పంటలతో పాటు పెరిగే వివిధ రకాలైన వ్యాధులు వచ్చేందుకు పురుగుల వ్యాప్తికి కారణమవుతాయి. వేసవిలోనే తప్పనిసరిగా పొలం గట్లు, మురుగు కాలువల్లో కలుపు లేకుండా చూసుకోవాలి.

విత్తనాల

ఎంపిక ముఖ్యం

తాలు గింజలు, సగం నిండని గింజలు, కలుపు విత్తనాలు వేరు చేసి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సర్టిఫైడ్‌ విత్తనం కాని, పరిశోధన స్థానాల నుంచి సేకరించిన విత్తనాలను తీసుకోవాలి. ఏ విత్తనమైన మొలక శాతం తెలుసుకోకుండా నారు పోయకూడదు. ఎంపిక చేసిన విత్తనాలను తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసిన 12 గంటల తర్వాతనే విత్తనాన్ని భూమిలో విత్తుకోవాలి.

అలంపూర్‌: వానాకాలం సీజన్‌లో పంట సాగు సకాలంలో జరగాలంటే ముందు నుంచే రైతులు ప్రణాళికలు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఇందుకు గాను రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనుల గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్‌ వివరించారు.

దుక్కులు దున్నడం..

ముందస్తు దుక్కులు దున్నడం వలన తొలకరి వర్షాలకు భూమి నీటిని పీల్చుకొని తేమ శాతం పెరగడానికి దోహదపడుతుంది. వాలుకు అడ్డంగా దున్నే దుక్కిలతో వర్షపు నీరు ఒకవైపు వెళ్లకుండా నేల కోతను ఆరికడుతుంది. తోటల్లో ఉండే మొండి జాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటికి ఊడి వస్తాయి. దీనికి తోడు నిద్రావస్థలో ఉన్న పలు కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పశువు పేడ, వర్మికం పోస్టులను పొలాలకు వేయాలి.

భూసార పరీక్షలు

భూమిలో పోషక విలువలు తగ్గిపోయి పంటల్లో సూక్ష్మపోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పోషకాలను పట్టి ఉంచే శక్తి, గాలి, నీరు చొచ్చుకొని వెళ్లే లక్షణం. మురుగు తీత మొదలైన గుణాలే కాకుండా రసాయనిక లక్షణాలైన ఉదజని సూచిక, లవణ పరిమాణం, లభ్య పోషకాలు చర్యల మొదలైనవి పెరుగుదల, దిగుబడిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో భూసార పరీక్షలు చేయించాలి. ఏడాదికి ఒకటి, రెండు పంటలు పండించే భూముల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రాల్లో అందజేయాలి. వారి సూచన మేరకు పంట సాగు చేసుకోవడం మంచిది.

పచ్చిరొట్ల పైర్ల సాగు

తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద మొదలగు పంటలను పండించి భూమిలో దున్నాలి. దీంతో ఎకరాకు 25–30 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. భూమి ఆరోగ్యంగా ఉంటుంది. జనుము, పల్లి పెసరలు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా ఉపయోగపడుతుంది.

పాడి–పంట

చౌడు భూములను బాగు చేసుకోవడం..

భూగర్భ జలాలను విరివిగా వాడటంతో నీటిలోని క్లోరైడ్‌ ద్వారా పొలాలు చౌడు భూములుగా మారుతాయి. భూసార పరీక్షలను అనుసరించి చౌడు భూములను వ్యవసాయ యోగ్య భూములుగా మార్చేందుకు వేసవి కాలం అనువైన సమయం. ఎండాకాలంలో నేలపైకి పొంగి ఉన్న ఉప్పు చౌడును పారలతో తొలగించాలి. మురుగు నీరు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని చదును చేసి దాదాపు 20–25 సెంట్ల మడులను విభజించి గట్టు వేయాలి. కారు చౌడు నేలలు ఎండినప్పుడు గడ్డపార వేసిన పెకలక రాయి వలే ఉంటుంది. తగినంత నీరు, తేమ ఉన్నప్పుడు మొత్తటి, చిక్కటి బురద తయారవుతుంది. ఇలాంటి నేలలను వేసవిలో బాగు చేసుకోవచ్చు.

వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక 1
1/2

వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక

వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక 2
2/2

వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement