
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడి
కొత్తపల్లి: లింగాల్ చేడ్ వాగునుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను కొత్తపల్లి గ్రామ శివారులో ఆపి తనిఖీ చేయగా, టిప్పర్ డ్రైవర్ ఎండీ షరీఫ్ ఆపకుండా ముందుకు వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లి రోడ్డు పక్కకు ఇసుకను అన్‌లోడ్ చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టిప్పర్ యజమాని ఎండీ మహబూబ్ బాషా, అతని కొడుకు ఖాదర్ వెంటనే అక్కడికి వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులను బూతులు తిడుతూ దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోకల్ మద్దూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని టిప్పర్‌ను, దాడికి పాల్పడిన ముగ్గురిని పట్టుకొని పోలీస్‌ష్టేషన్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఉద్యోగులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు