
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ నూతన కమిటీని మంగళవారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి, కో చైర్మన్లుగా రవికుమార్, నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్లు, నరేందర్, నారాయణయాదవ్, రవీందర్‌గౌడ్, సాయిలుగౌడ్, రామదాసు, వైస్ చైర్మన్లుగా దయానంద, శ్రీనివాస్‌రావు, అనంతప్ప, అదనపు కన్వీనర్‌గా మదన్‌మోహన్‌యాదవ్, డిప్యూటీ కన్వీనర్లుగా చంద్రనాయక్, సుధాకర్‌రెడ్డి, వరప్రసాద్, చంద్రకాంత్, తాయారు, ఫైనాన్స్ సెక్రటరీగా కృష్ణమోహన్, పబ్లిసిటీ సెక్రటరీగా శ్యాంసుందర్‌రెడ్డి, సెక్రటరీలుగా ప్రభాకర్, శ్రీనివాసులు, రామకృష్ణ, గంగార్, జ్ఞానేశ్వర్ ఎన్నికయ్యారు.