
‘పచ్చిరొట్ట’తో ప్రయోజనాలు
అలంపూర్: నేలల్లో పోషకాలు పెంచి ఆశించిన దిగుబడి సాధించడానికి రైతులు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. కానీ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట సాగుచేస్తే పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. గతంలో సాగుభూమిలో పశువుల ఎరువులు ఉపయోగించే వారమని, క్రమంగా పశు పోషణ తగ్గడంతో.. ప్రస్తుతం రైతులు రసాయన ఎరువుల వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం ద్వారా నేలల్లో సూక్ష్మ పోషకాలు నశించి, భూములు చౌడు బారి సత్తువ తగ్గిపోతుంది. దీని ప్రభావం పంట దిగుబడులపై పడుతుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, ఉలవ పైర్లును సాగుచేసి నిర్ణీత సమయంలో భూమిలో కలియ దున్నాలన్నారు.
ఉపయోగాలు.. లక్షణాలు
● పచ్చిరొట్టతో నేల గుల్లబారి భూమికి నీటిని, పోషకాలను నిల్వ చేసుకోనే శక్తినిస్తోంది.
● పంట వేర్లకు గాలి, నీరు, కావాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు అందుతాయి.
● నేలలో చౌడు, కలుపు మొక్కల
ఉధృతిని తగ్గిస్తుంది.
● నేల లోపలి పొరల్లో ఉండే పోషకాలు
పై పొరల్లోకి వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది.
● పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు
పెరుగుతాయి. వేరు వ్యవస్త వృద్ధి చెందుతుంది.
● నేల కోతను అరికడుతుంది. ఉష్ణోగ్రతలను
అదుపులో ఉంచుతుంది.
● పచ్చిరొట్ట మొక్కల వేరు బూడిపెల్లో రైజోబియం పెరిగి ఎక్కువ నత్రజని స్థిరీకరిస్తుంది.
యాజమాన్య పద్ధతులు
ఉదయజని ఎక్కువగా ఉన్న నేలల్లో పచ్చిరొట్ట పైరుగా జీలుగ మాత్రమే వేయాలి. జీలుగలో చౌడును హరించే శక్తి ఉంది. ఎర్రనేలల్లో, తేలిక నేలల్లో జనుము, అలసంద, పెసర, నల్లరేగడి నేలల్లో జీలుగ, పిల్లి పెసర వేసుకోవచ్చు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే నీటి వసతిని పరిగణలోకి తీసుకోని పచ్చిరొట్ట పెంచడం శ్రేయస్కరం.
పచ్చిరొట్ట పంట ఎకరానికి చల్లాల్సిన తయారయ్యే లభించే అనుకులమైన
విత్తనాలు పచ్చిరొట్ట నత్రజని నేలలు
జనుము 16 కిలోలు 10–15 టన్నులు 16–24 కిలోలు ముంపు నేలలు
జీలుగ 12 కిలోలు 8–10 టన్నులు 30–40 కిలోలు చౌడు నేలలు
పిల్లి పెసర 8 కిలోలు 4–5 టన్నులు 10–14 కిలోలు నల్లరేగడి నేలలు
పెసర 14 కిలోలు 4–5 టన్నులు 10–14 కిలోలు నల్లరేగడి నేలలు
అలసంద 16 కిలోలు 4–6 టన్నులు 16–20 కిలోలు తేలిక నేలలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పచ్చిరొట్టను కలియదున్నిన తర్వాత 2 వారాల్లో వరి నాట్లు వేస్తారు. అయితే తేలిక నేలల్లో మురుగు నీరు ఎక్కువగా పారే భూముల్లో వారం రోజుల్లో నాట్లు వేసుకోవచ్చు. మురుగు నీరు పోయే అవకాశం లేని భూముల్లో మూడు వారాలు నాట్లు వేయరాదు. ఎందుకంటే పచ్చిరొట్ట భూమిలో కుల్లినప్పుడు తయారయ్యే కొన్ని వాయువులు, ఆమ్లాలు అప్పుడే నాటిన వరి మొక్కకు హాని చేస్తాయి.