
యాదాద్రి భువనగిరి: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండకు వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులకు కొరవడిన రవాణా సౌకర్యంతో పాటు, భద్రతా సిబ్బంది వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో దైవ దర్శనం కోసం భక్తులు యాదాద్రికి పోటెత్తుతున్నారు. దర్శన సమయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఈ సమయంలో భక్తుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి తోడు భక్తుల రద్దీకి తగ్గట్లు రవాణ సౌకర్యం లేదని, దైవదర్శనంలో భక్తులు వాగ్వాదినికి దిగుతున్నా పోలీసు సిబ్బంది పట్టించుకోవడం లేదు.
దీనికి తోడు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపడంలో అధికారుల విఫలమవుతున్నట్లు సమాచారం.బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోవాలా దోపిడీ ఎక్కువైందని, తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.