
ధాన్యం మొలకెత్తింది..
ఐదు ట్రాక్టర్ల ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. 20 రోజులుగా ధాన్యాన్ని కొనడం లేదు. ప్రతి రోజు ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాస్తున్నాను. వర్షానికి తడిసి దాదాపు ఒక ట్రాక్టర్ ధాన్యం మొలకెత్తింది. దీంతో నేను తీవ్రంగా నష్టపోయాను. ఏ అధికారి, ప్రజాప్రతినిధి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంత దారుణం ఎక్కడా లేదు.
– సాయిలు, రైతు, కావేరమ్మపేట
పట్టించుకునే వారే లేరు..
ఎంతో కష్టపడి పండిచిన ధాన్యాన్ని అమ్ముదామని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే పట్టించుకునే వారే లేరు. కొనుగోలు చేయాలంటూ బతిమాలుతున్నా లాభం లేదు. దాదాపు 50 బస్తాల ధాన్యం కేంద్రానికి తీసుకువచ్చాను. ప్రతి రోజు ఆరబెట్టడం, కుప్పగట్టడం, కుప్ప వద్ద పడుకోవడం తప్పడం లేదు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి.
– నర్సింహ, రైతు, కావేరమ్మపేట
●

ధాన్యం మొలకెత్తింది..