
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి
కొత్తకోట రూరల్: రోడ్డుపక్కన ఆగివున్న డీసీఎంను బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున కొత్తకోట సమీపంలో జాతీయ రహదారి 44పై చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా ముత్కూర్ గ్రామానికి చెందిన దూదేకుల అల్లాబకాష్ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో నివాసం ఉంటున్నాడు. ఈయన కుమారుడు దూదేకుల ఇబ్రహీం (29) హైదరాబాద్‌లోనే ప్రైవేట్ జాబ్ చేస్తుండేవాడు. స్వగ్రామంలో పని నిమిత్తం ఇబ్రహీం తన బైక్‌పై శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున ఇబ్రహీం కొత్తకోట సమీపంలో హైవే పై ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి అల్లాబకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని
మహిళ శవం లభ్యం
మాగనూర్ (మక్తల్): మక్తల్ మండలంలోని నారాయణపేట రోడ్డులో గల కాటన్ మిల్లు సమీపంలో సంగంబండ లెఫ్ట్ కెనాల్‌లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు మక్తల్ ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. మహిళ శవం కాల్వలో పడి సుమారు రెండు, మూడు రోజులై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. శవం కుళ్లిపోయిన దశలో ఉందన్నారు. మహిళ వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చన్నారు. అటువైపు వెళ్తున్న వారి సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి కుళ్లిపోయిన మహిళ శవాన్ని కాల్వలో నుంచి పైకి తీసుకొచ్చామని, శరీరంపై గులాబీ రంగు జాకెట్, నల్ల రంగు లంగ, మెడలో మూడు తాయత్తులు ఉన్నాయన్నారు. ఈ ఆనవాళ్లతో ఎవరికై నా సమాచారం ఉంటే మక్తల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
జమ్ములమ్మ
ఆభరణాలు చోరీ
శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, భక్తుల వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జమ్ములమ్మ ఆలయంలో ప్రవేశించి అమ్మవారి కిరీటం, నగలు, వెండి ఆ భరణాలు చోరీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గత కొంతకాలంగా హుండీలు పగులగొట్టి అందులోని నగదు, తాళాలు పగులగొ ట్టి ఆలయాల్లో విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచి గ్రా మం వెలుపల ఉన్న ఆలయాలకు రక్షణ కల్పించి భవిష్యత్‌లో ఆలయాల్లో చోరీలు జరగకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.