
‘ఆర్‌అండ్‌ఆర్’ పెంపుపై త్వరలో శుభవార్త
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంపునకు సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఆర్‌అండ్‌ఆర్ పెంపునకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్థికశాఖలో ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, ఆమోదం పొందిన వెంటనే పరిహారం పెంపునకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.40 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరామన్నారు. రిజర్వాయర్ పనులతో పాటు కాల్వల నిర్మాణపనులను కూడా వెంటనే చేపట్టాలని ఇందుకు సంబంధిచి టెండర్లు పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. కోడ్గల్, బైరంపల్లి, వాడ్యాల గ్రామాల పరిధిలో దుందుభీ వాగుపై చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని కోరామని పేర్కొన్నారు.