మామిడి.. మాగించే పద్ధతులు | - | Sakshi
Sakshi News home page

మామిడి.. మాగించే పద్ధతులు

May 12 2025 12:40 AM | Updated on May 12 2025 12:40 AM

మామిడ

మామిడి.. మాగించే పద్ధతులు

అలంపూర్‌ : పండ్లు అన్నింటిలో రారాజు మామిడి పండు. మామిడిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే మామిడిని పండ్లకు రాజుగా గుర్తిస్తారు. ఇందులో విటమిన్‌–సీ 76 శాతం, విటమిన్‌–ఏ 25 శాతం, విటమిన్‌–బీ6 11 శాతం, ఫైబర్‌(పిచు) 9 శాతం, రాగి 9 శాతం పొటాషియం 7 శాతం, మెగ్నీషీయం 4 శాతం ఉంటుంది. వేసవి కాలంలో మామిడికి అధిక డిమాండ్‌, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుండడంతో వాటిని మాగించే పద్ధతులు, కోత కోసే సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్‌ రైతులకు సూచిస్తున్నారు.

ఇలా మాగించడం మేలు

మార్కెట్‌లోకి పంచదార, కలప వంటి రకాలు ముందుగా వస్తాయి. పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసాల రకాలు తర్వాత అందుబాటులోకి వస్తాయి.ఆ తర్వాత బేనిషా, నీలం, బెంగుళూరు(తోతపరి, కలెక్టర్‌) రకాలు మార్కెట్‌లోకి వస్తాయి. ముందుగా వచ్చే పండ్లకు నాణ్యత ఉండదు. కార్బెట్‌ను ఉపయోగించి రంగును తెప్పించి విక్రయిస్తారు. అయితే చెట్టుపై నుంచి కోసిన పండ్లను సాధారణ పద్ధతిలో మాగించడం వల్ల మంచి రుచిని కలిగి ఉంటాయి. పండ్లను ఇలా మాగించడానికి ఒక గదిలో గడ్డి లేదా వరిగడ్డి పరచి వాటిపై కాయలు పేర్చి మళ్లీ గడ్డిని కప్పాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే కాయలు మాగుతాయి. ఇక పండ్లకు మంచి రంగును తెప్పించడానికి ఇథైల్‌ను ఉపయోగించవచ్చును. ఇది కెమికల్‌ కాదు. ఒక హార్మోన్‌. లీటర్‌ నీటికి 1 ఎంఎల్‌ నుంచి 1.8 ఎంఎల్‌ను ఉపయోగించి కాయలన్నీంటికీ సమానంగా రంగును తెప్పించి మాగపెట్టవచ్చును. ఇథైల్‌ను వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద కలిపి కాయలను 5 నిమిషాలు ముంచి తీసి ఆరబెట్టినా మంచి రంగు వస్తాయి. మామిడి పండ్లను చెక్కపెట్టల్లో కాకుండా సీఎఫ్‌బీ పెట్టెల్లో ఉంచి రవాణ చేయడం ఉత్తమం. 5–10 కిలోల వరకు పెట్టేల్లో ఉంచి దూర ప్రాంతాలకు రవాణ చేయడం వలన పండ్లు దెబ్బతినవు.

కాల్షియం కార్బైట్‌తో మాగించడం వలన..!

కొంత మంది రైతులు, వ్యాపారులు కాయలను మాగపెట్టడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. కాల్షియం కార్బైట్‌ను అధికంగా వినియోగించి సరిగ్గా పక్వానికి రాని కాయలను కృత్రిమంగా రంగు తెప్పించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా మాగబెట్టినవి తినడం వలన ఆరోగ్యానికి హానికి కలిస్తాయి.

పాడి–పంట

ఇథైల్‌ వాడకం శ్రేయస్కరం..

మామిడి కాయలను మాగించడానికి ఇథైల్‌ వాడకం శ్రేయస్కరం. దీన్ని ఉపయోగించడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇది పండుకు తీపిదనంతో పాటు మంచి సువాసనను ఇస్తోంది. ఇథైల్‌ వాడకంతో మామిడి కాయాల్లో ఇథీలిన్‌ వాయువు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల రైతులు కార్బెడ్‌ ఉపయోగించకుండా ఇలా మాగపెడితే రైతుకు మంచి ధర లభిస్తోంది.

గ్రేడింగ్‌ విధానం : కాయాలను గ్రేడింగ్‌ చేయడం ద్వారా అవసరమైన సైజు (పరిమాణం), రంగు, బరువును బట్టి వేరు చేసి విక్రయిస్తే మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఆవిరి (వేపర్‌ ట్రీట్‌మెంట్‌) ద్వారా కాయలను శుభ్రం చేసి విక్రయించినా అధిక ధర ల భిస్తుంది. 200–250 గ్రాములు ఉన్న వాటిని ఒక గ్రే డ్‌గా, 300–350 బరువు ఉన్న వాటిని ఇంకో గ్రేడ్‌గా విడగొట్టి విక్రయిస్తే మంచి లాభాలు పొందవచ్చు.

మామిడి.. మాగించే పద్ధతులు 1
1/2

మామిడి.. మాగించే పద్ధతులు

మామిడి.. మాగించే పద్ధతులు 2
2/2

మామిడి.. మాగించే పద్ధతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement