
నేటి నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు
అలంపూర్: మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉర్సు ఉత్సవాలకు షా–అలీ పహిల్వాన్ దర్గాలు ముస్తాబు అవుతున్నాయి. పట్టణంలో వెలిసిన షా–అలీ–పహిల్వాన్ సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండటంతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధికారికంగా జరిగే ఈ ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు.
23 వరకు ఉత్సవాలు..
షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు నాలుగు రోజుల పా టు జరగనున్నాయి. ఈ నెల 20న రాత్రి గంధోత్సవం ఉంటుంది. రాత్రి సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయం గంధం తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక ప్రార్ధనల అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి గంధంను సర్ ముబారక్ దర్గాకు భక్తజనసందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. సర్ ముబారక్ దర్గాలో గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. చివరగా ధడ్ ముబారక్ దర్గాలకు గంధంను తీసుకెళ్లి ప్రార్ధనలు చేయడం ఆనవాయితీ. 21న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు జరగనున్నాయి. 22న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తీలు నిర్వహిస్తారు. పెద్ద కిస్తీపోటీలను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. 23న ప్రత్యేక ఉత్సవాలతో ముగుస్తాయి.
రేపు దర్గాలలో గంధోత్సవం
21 చిన్న కిస్తీలు, 22న పెద్ద కిస్తీలు

నేటి నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉత్సవాలు