
ఇంట్రా టూ డే లీగ్‌లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్‌కు భారీ ఆధిక్యం
● డేవిడ్ క్రిపాల్ డబుల్, షాదాబ్ సెంచరీలు
సమర్థ స్కూల్ మైదానంలో మహబూబ్‌నగర్–జడ్చర్ల మధ్య జరగిన టూడే లీగ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన జడ్చర్ల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయిది. జట్టులో సంజయ్ 70, కేతన్ కుమార్ 32 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్ ముఖిత్ 15 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు షాదాబ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 50 ఓవర్లలో 420 పరుగుల భారీ స్కోర్ చేసి 255 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ రాయ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 13 సిక్స్‌లు, 16 ఫోర్లతో 220 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ షాదాబ్ అహ్మద్ 72 బంతుల్లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 270 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. నేడు (మంగళవారం) రెండో రోజు మ్యాచ్ కొనసాగనుంది.
మహబూబ్‌నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారుల కోసం మొదటిసారిగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్‌లు ప్రారంభించిందని, ఈ టోర్నీల్లో క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ సోమవారం ప్రారంభమైంది. రాజశేఖర్ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లలో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్‌సీఏ టోర్నమెంట్‌లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామని అన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లు ప్రారంభించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్

ఇంట్రా టూ డే లీగ్‌లో ప్రతిభ చాటాలి

ఇంట్రా టూ డే లీగ్‌లో ప్రతిభ చాటాలి

ఇంట్రా టూ డే లీగ్‌లో ప్రతిభ చాటాలి