
కొనసాగుతున్న అంజన్న బ్రహ్మోత్సవాలు
ఇటిక్యాల: ఎర్రవల్లి మండలం బీచుపల్లిలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు మంగళవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం, చౌకిసేవ, బలిహరణం తదితర పూజలు చేశారు. రాత్రి ప్రభోత్సవం కనులపండువగా సాగింది. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మట్టి కుండల్లో ప్రత్యేక నైవేద్యం తయారుచేసి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పలువురు భక్తులు ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన దుకాణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. ఏటా మే నెలలో నాలుగు శనివారాల పాటు జాతర ఘనంగా నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుగండా ఆలయ ఈఓ రామన్‌గౌడ్, పాలకమండలి సభ్యులు అన్ని వసతులు కల్పించారు.

కొనసాగుతున్న అంజన్న బ్రహ్మోత్సవాలు