
అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆదర్శనగర్‌లోని దివ్యాంగుల కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఈ కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని, వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. పాఠశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హౌసింగ్‌బోర్డు కాలనీలో నిర్మించిన పోచమ్మతల్లి ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు.
పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణ లో, అలాగే క్లాక్‌టవర్ వద్ద ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్లతో పాటు వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్–షాపులను ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీ పరీక్షల కోసం స్థానిక అంబేడ్కర్ కళాభవన్‌లో శిక్షణ తీసుకుంటున్న ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రానున్న పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో స్థిరపడాలని యువతకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, నాయకులు హన్మంతు, శివశంకర్, ఎం.రాజు, జె.చంద్రశేఖర్, కావలి కాశీం, బేదురి యాదయ్య, తిరుపతయ్య, ఫయాజ్, శ్రీనివాస్‌యాదవ్, గుండా మనోహర్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.