
అండర్ –19, 23 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
జడ్చర్ల టౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్ –19, 23 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జట్టు కోసం బుధవారం స్థానిక సేడియం మైదానంలో ఎంపిక నిర్వహించారు. ఎంపికలకు జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 60మంది హాజరయ్యారు. ఎంపిక కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత ప్రారంభించి ప్రసంగించారు. క్రీడాకారులు తమ ప్రతిభను వెలికి తీసి జట్టుకు ఎంపిక కావటంతో పాటు టోర్నీలో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బి.రవిశంకర్, కాల్వరాంరెడ్డి, అశోక్‌యాదవ్, కౌన్సిలర్లు సతీష్, ఉమాశంకర్‌గౌడ్, ఎండీసీఏ పరిశీలకులు మన్నాన్‌నియర్, కోచ్‌లు మోయిన్, మహేష్‌లు పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంటికి కన్నం
మహబూబ్‌నగర్ క్రైం: తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని న్యూమోతీనగర్‌కు చెందిన మంజుల కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 10న ఇంటికి తాళం వేసి గ్రామంలో జాతర ఉంటే వెళ్లారు. అయితే బుధవారం ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ ద్వారా మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం ఇవ్వగా బాధితురాలు మంజుల ఇంటికి వచ్చి చూసుకోగా బీరువాలో ఉన్న 16 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టరాదని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా నుంచి 60మంది హాజరు

అండర్ –19, 23 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపిక

అండర్ –19, 23 బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపిక