
మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో అవతలి వాళ్లు ఎలా వస్తున్నా రన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరబాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకొస్తోంది. దాని వెనక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తోంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించి స్కూటర్ నడుపుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తూ ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

केरल के कोझिकोड का ये वीडियो आपको विचलित कर देगा, मौत आई और छूकर निकल गई।
ढलान होने की वजह से ट्रक पीछे लुढ़क गया और स्कूटी सवार महिला पीछे थी, वो ट्रक की चपेट में आ गई। महिला का बचना किसी चमत्कार से कम नहीं था। pic.twitter.com/QvSjORDb0g— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 16, 2025
ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరివేసింది. దీంతో రెప్ప పాటులో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోని అగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం , మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని సిడబ్ల్యుఆర్‌డిఎం సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? డ్రైవింగ్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి బ్రో... అని మరికొందరు కమెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!