
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా మీదుకు నారాయణపేట పర్యటన వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ విజయేందిర మొక్కను అందజేసీ స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి మహావృక్షం ఫొటోను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, ఆర్‌డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం, డీటీ దేవేందర్, ఆర్‌ఐలు నర్సింగ్, సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.